top of page
Original.png

అందమైన వల

#AndamainaVala, #అందమైనవల, #GorrepatiSreenu, #గొర్రెపాటిశ్రీను, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Andamaina Vala - New Telugu Story Written By - Gorrepati Sreenu

Published In manatelugukathalu.com On 21/07/2025

అందమైన వల - తెలుగు కథ

రచన: గొర్రెపాటి శ్రీను


"నగేష్"


తన పేరే పిలుస్తుంటే హడావుడిగా ఆఫీసర్ గారి క్యాబిన్ లోకి ప్రవేశించాడు. పులి ముందు నిలబడ్డ మేకలా.. ఉంది అతడి స్థితి. 


తన ఎదురుగా చండశాసనుడి లా అగుపిస్తున్న బాస్ వైపు భయాన్నంతా కళ్ళలో నింపుకొని చూస్తున్నాడు. 


"సార్ కోపం లో ఉన్నారు!జాగ్రత్త" ఉదయమే ప్యూన్ చెప్పిన మాటలు మరింత భయానికి కారణమవుతున్నాయి. 


"ఏమయ్య నగేష్!నేను చెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నావు. ఇంకా నిన్నటి లెక్కలు పూర్తవ్వలేదా? ఉదయానికల్లా రెడీ చేస్తానన్నావు?"


"సార్.. అదీ.. ఇప్పుడే అన్నీ వర్క్స్ కంప్లీట్ చేస్తాను. ఓ గంట సమయం ఇవ్వండి"


"నిన్న ఉదయం నుండి ఇదే పాట పాడుతున్నవ్ లే"


"అవును సార్ "


"అవును.. ఏం సమాధానం?" చింతనిప్పుల్లా ఉన్న బాస్ నయనాల్లోకి సూటిగా చూడలేక తలదించుకున్నాడు. 


"అవును.. అవును సార్"


"ఉఫూ.. "


"సార్.. ఓ వన్ అవర్లో.. అదే సార్. ఇప్పుడు సమయం పదవుతుందికదా.. మధ్యాన్నం రెండు గంటలకల్లా మీరు చెప్పిన పని, నిన్నటి లెక్కలన్నీ పూర్తి చేసుకుని వస్తాను" 


"అలాగే.. ఇక సమయాన్ని మాత్రం పెంచేది లేదు"


తల అడ్డంగా ఒకసారి, నిలువుగా ఒకసారి, అటూ ఇటూ ఒకసారి తిప్పి బయటకు వచ్చాడు. 


తను బయటకు వస్తుంటే అప్పుడే బాస్ రూం లోకి ప్రవేశిస్తుంది న్యూ జాయిండ్ కావేరి. 


వచ్చి నెల రోజులే అయినా అందరి మధ్య తగవులు పెట్టేస్తుంటే తనను అందరూ కయ్యాల కావేరి అని పిలుస్తున్నారు. 


ఎడమ కన్ను ఎందుకో ఒక్కసారి అదిరింది నగేష్ కి. 

జరగబోతున్న అనర్ధం అర్థమవుతుంది. 


'అంటే తనను బాస్ కోప్పడడానికి ఈ పిల్ల కారణమా.. 

తనపై ఉన్నవీ లేనివి ఎక్కించి ఏదైనా చెప్పి ఉంటుందా?' 

మనస్సులోనే ప్రశ్నించుకున్నాడు. 

అవుననే మనస్సు సమాధానం చెప్పింది. 

రుసరుసలాడుతూ కావేరి వైపు చూసాడు. 

కొద్ది క్షణాలే.. తమాయించుకున్నాడు. 


ఫేస్ ఫీలింగ్స్ మార్చుతూ వినయంగా కావేరి వైపు చూసాడు. 

'అద్గదీ అలా రా దారికి ' అనుకున్నట్లుగా కావేరి చూస్తుంటే.. ఎలా స్పందించాలో తెలియక పిచ్చినవ్వోటి నవ్వాడు. 

సాయంత్రం మిత్రులందరూ ఒక చోట మీట్ అయ్యారు. 

కావేరి కంటబడకుండా, బాస్ కి తెలియకుండా రహస్య మీటింగ్ ఏర్పరుచుకున్నారు. 


ముప్పై మంది వర్క్ చేస్తున్న ఆఫీస్ గత నెల వరకు ప్రశాంతంగా సాగింది. నెల కాలంగా ఒకరంటే ఒకరికి పడి చావడం లేదు. కారణం.. అందరికీ అర్థమవుతున్నా కావేరి ని ఎదుర్కొనే ధైర్యం లేదు. 


చండశాసనుడైన బాస్ రాజేంద్రన్ గారు కావేరికి అండగా ఉండడమే ఇలా తమ మధ్య అనైక్యత, తగవులు అవుతున్నాయి. 


చాయ్ పైసలు ఎవరూ చెల్లించకపోయేసరికి ఉసూరుమంటూ 'ఇదో బొక్క ' అనుకుంటూ మనీ పే చేసాడు. 


కొందరైతే కాఫీలు కూడా తాగడం జరిగింది. 


డబ్బులు కట్టడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. 

పదిమంది ఆడవాళ్లు, పందొమ్మిది మంది మగవాళ్ళు తనతో కలిసి.. లెక్కకట్టి డబ్బులిచ్చాడు. 

ఇలా ఓ నాలుగైదు సార్లు మీటింగ్ పెడితే.. తన జేబుకు చిల్లే !

"సార్! మీటింగ్ ఎలా జరిగింది?" 


ఉదయమే అమాయకంగా అడుగుతున్న కావేరి వైపు ఫన్నీగా చూస్తూ "ఏ మీటింగ్!? " అడిగాడు మరింత అమాయకంగా అచ్చు బ్రహ్మానందం స్టైల్లో. 


"నగేష్ గారు! సార్ వచ్చాక తెలుస్తుందిలే"


"ఆయనకెలా తెలుస్తుంది"


"నేను చెబుతాను కదా!!"


"వామ్మో ఇంకేమైనా ఉందా !? అదంతా తూచ్"


"మరి ఆ మీటింగ్ కి నన్నెందుకు పిలవలేదు"


'ఓసి పిచ్చి మొహం దానా.. నిన్నెలా ఇక్కడి నుండి బయటకు గెంటేయాలా అన్నది కదా కాన్సెప్ట్' మనస్సులో అనుకోబోయి బయటకే అనేశాడు. 


"ఏంటి?" కళ్ళు పెద్దవి చేసి అడిగింది కావేరి. 


అసలే అందమైనది.. మరింత అందంగా అగుపిస్తుంటే కళ్ళు తిప్పుకోలేక పోయాడు. 

"సార్ వస్తున్నారు" కావేరి అంటుంటే.. 

నగేష్ గమ్మున తన సీట్ వైపు పరుగో.. పరుగు.. 


"మేడం.. బూస్ట్" మెల్లగా ప్యూన్ టేబుల్ పై కప్ పెడుతుంటే.. 

సన్నగా నవ్వుతూ కప్ లో ని బూస్ట్ తాగుతుంది. 


"బూస్ట్ కి పైసలెవరు ఇచ్చారు?" మెల్లగా అడిగింది ప్యూన్ ని. 


ప్యూన్ వేలు తన వైపు చూపుతుంటే ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు నగేష్. 


"నగేష్ సార్ మీకు బూస్ట్ ఇవ్వమని ప్యాకెట్ తెచ్చి ఇచ్చారు. అయిపోయే వరకు ఇస్తాను.. సరేనా?"


ముసి ముసి నవ్వులు నవ్వుతుంది కావేరి. 

*

"ఆ! ఏంటోయ్ నగేష్ ఆలస్యమయింది"


రిజిస్టర్లో సంతకం చేయడానికి క్యాబిన్ లోకి వచ్చిన నగేష్ ని ప్రశాంతంగా పలకరించాడు రాజేంద్రన్ గారు. 


"సార్! ఇంట్లో వంట ఆలస్యం అయింది"


"సర్లే.. " సరదాగా నవ్వుతున్న బాస్ లో ఉన్న సాఫ్ట్ కార్నర్ ఇప్పుడిప్పుడే చూస్తున్నాడు. 

'అంతా బూస్ట్ మహిమ' నవ్వుకుంటూ వెళుతున్న నగేష్.. 

.. నగేష్ ఎందుకు నవ్వుతున్నాడో బాస్ కి అర్థం కాలేదు. 

*

"మా ఇంట్లో ఫ్యాన్ బాగుచేయాలోయ్. పాడయి రెండు రోజులు అవుతుంది. ఎవరైనా ఎలక్ట్రిషన్ ఉంటే చూడు"


రాజేంద్రన్ గారి అభ్యర్థన మేరకు తనే ఎలక్ట్రీషన్ అవతారం ఎత్తి.. వారి ఇంటికి వెళ్ళాడు. 


రాజేంద్రన్ గారికి ఎడమ కన్ను అదిరింది. 


ఫ్యాన్ అయితే బాగైంది కానీ.. ఇంట్లో.. కావేరి తో సార్ వేసే ఫన్నీ అడల్ట్ జోక్స్ తెలిశాయి. 

*

ఆరోజు నుండి సమయం కోసం ఎదురు చూస్తున్న రాజేంద్రన్ గారి భార్య అలివేలు సడన్ గా ఓ రోజు ఆఫీస్ కి వచ్చింది. 

రాజేంద్రన్ గారు వెకిలి జోకులు వేస్తూ కావేరి దగ్గర నిలబడడం చూసింది. 


అమిత మేధావి అయిన రాజేంద్రన్ గారు ఇటీవల పని ధ్యాస తగ్గించి.. కావేరి మంత్రాన్ని పఠించడం.. అవసరం ఉన్నా లేకపోయినా తనను పిలవడం.. 

రోజు జరుగుతున్న తతంగం. 


ఇప్పుడు అలివేలు గారు చూడడం.. అంతే !

సీన్ ఒక్కసారిగా మారిపోయింది. 


ఇంట్లో ఏం జరిగిందో కానీ ఆలస్యంగా డ్యూటీకి వస్తున్నారు రాజేంద్రన్ గారు. 

*

ఓ నెల రోజుల తరువాత.. 

"సార్! మిమ్మల్నో.. మాట.. అడగ వచ్చా?" మెల్లమెల్లగా మాటలు కూడబలుక్కుంటూ అడుగుతున్న నగేష్ వైపు చూస్తూ.. 


"ఊ.. "అన్నాడు. 


"సార్! మీరు ఆఫీస్ కి ఎప్పుడూ త్వరగా వచ్చేవారు కదా ? ఆలస్యం అవుతుదేంటి?"


కళ్ళలో నిలిచిన కన్నీటి పొరని తుడుచుకున్నాడు. 

బాస్ ఏంటి కంటతడి పెట్టడమేంటి?

అయోమయంగా ఉంది నగేష్ కి. 


"ఇంట్లో వంట చేయాల్సి వస్తుందోయ్. మా ఆవిడ ఈ మధ్య చీటికీ.. మాటికీ.. అలుగుతుంది. తను అలిగినప్పుడల్లా వంట చేయాల్సి వస్తుంది. "


"సార్.. రోజు ఉదయం వంట చేస్తున్నట్లున్నారు.. "


"వా.. "

*

కొద్దిరోజుల్లోనే కావేరి కి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అందాయి. 

రాజేంద్రన్ గారే స్వయంగా ఆమెకు ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిసింది నగేష్ కి, ఆఫీస్ లోని వారందరికీ. 


తనకు వీడ్కోలు చెబుతూ అందరూ హాయిగా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. 


తన ఉపాయం ఫలించినందుకు సంతోషమనిపించింది నగెష్ కి. 


తన బాస్ సమస్య సంపూర్ణంగా పరిష్కారమవ్వలంటే.. 

మరోసారి తనే బాస్ ఇంటికి వెళ్ళాలి.. అనుకున్నాడు నగేష్. 


"సార్! కొత్త ఫ్యాన్ కొంటాను అన్నారు కదా, కొన్నప్పుడు చెప్పండి వచ్చి బిగిస్తాను.. "

అడగకుండానే ఆఫర్ ప్రకటించాడు నగేష్ సంబరంగా రాజేంద్రన్ గారికి. 


***


గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ree

రచయిత పరిచయం:

 గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .

తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు

ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.

చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)

వెలువరించిన పుస్తకాలు:

"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),

"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),

"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).

ప్రస్తుత నివాసం: హైదరాబాద్.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page