top of page

అందిన సాయం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Andina Sayam' New Telugu Story By Ramakuru Lakshmi Mani

రచన: రామకూరు లక్ష్మి మణి



ఫోన్ రింగ్ అయింది.. చేతిలో ఉన్న ట్రైపాడ్ బోర్డు కింద పెట్టి ఫోన్ ఆన్ చేశాడు.

"ఆ స్నేహ.. చెప్పు.."

"ఏమిటీ.. ఇంకా ఇల్లు గుర్తుకు రాలేదా.."

"ఏం చెయ్యను.. నాకు మంచి స్పాట్ దొరకలేదు ఇప్పటిదాకా.. సరే సరే.. తర్వాత మాట్లాడతాను.. అక్కడేదో గుట్ట లాగా కనిపిస్తోంది అక్కడకు వెడుతున్నా"


"జాగ్రత్త మధు.. ఎక్కువ దూరం వెళ్లకు.. చీకటి పడకుండా ఇంటికి వచ్చేసేయ్.."


"అలాగే స్నేహ.. నువ్వేం భయపడకు" అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు మధుకర్.


మధుకర్ ఆర్టిస్ట్. బొమ్మలు వేస్తూంటాడు.. ఆలా బయటకు ప్రకృతి లోకి వచ్చేసి, మంచి స్పాట్ కనబడితే వెంటనే బొమ్మ స్కెచ్ వేసుకుని, తర్వాత రంగులద్దుతాడు..

అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఆర్ట్ అంటే ప్రాణం.. వీకెండ్ లో ఒకరోజు బయటకు వెళ్ళిపోతాడు..


కళ్ళకు నచ్చినది మనో ఫలకం లో ముద్రించుకుంటాడు.. అందుకోసం ఎంత దూరమైనా వెడతాడు. ఎదురుగా అతనికి కనబడే దృశ్యాలు నచ్చితే వెంటనే బొమ్మ గీసేస్తాడు…. అత్యంత అద్భుతమైన కళాత్మకంగా , సజీవ రూపాన్ని చూస్తున్నంత చక్కగా గీసి వాటికి రంగులద్దుతాడు.. ఆ రంగులు కూడా రియలిస్టిక్ ఉండి.. ఎదురుగా నిజంగా ఉన్నాయా అన్నంత సహజం గా అనిపిస్తాయి..


స్నేహకి అతని ఇంటరెస్ట్ తెలుసు..అందుకే ఏమనదు..

పెళ్లయిన కొత్తలో స్నేహని కూర్చోబెట్టి రకరకాల ప్రొఫైల్స్ లో పెయింటింగ్స్ వేశాడు. అవి ఎంత సహజంగా ఉన్నాయంటే స్నేహే ఎదురుగా కూర్చున్నట్లు ఉన్నాయి.. అప్పట్నించే అతని ఆర్ట్ కి ఫిదా అయిపోయింది స్నేహ.


స్నేహ కూడా ఒక కార్పొరేట్ స్కూల్లో టీచర్ గా చేస్తోంది. మంచి రైటర్.. కథలు, బ్లాగ్ లు రాసుకుంటూ ఉంటుంది వీక్ ఎండ్స్ లో.

మధుకర్ ఉన్న రెండురోజుల వీకెండ్ లో ఒకరోజు తమకోసం కేటాయిస్తాడు, రెండో రోజు అతని హాబీ కోసం కేటాయిస్తాడు..


తనకు నచ్చే స్పాట్ కనబడేంత వరకూ వెతుక్కుంటూ ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు ..ప్రయాణ అలసటని కూడా మర్చిపోతాడు.

కార్ లో బయలుదేరి ఒక చోట కారు ఆపుకుని చుట్టూ పరిసరాలు చూసి అక్కడ బాగుంటే ఆగిపోతాడు..


ఆరోజు చాలా దూరమే వచ్చేసాడు.

డ్రైవింగ్ అంటే ఇష్టపడతాడు.. అందుకే ఆలా వెడుతూ ఉంటే దూరమే తెలియలేదు….రిమోట్ పల్లెటూరు లాగా ఉంది..అక్కడ ఆగాడు..


చిన్న గుట్ట మాదిరి కనబడింది…తన సరంజామ అంతా సర్దుకున్నాడు అక్కడ.

చుట్టూ చూస్తూ కాసేపు గడిపాడు.. ఎండ నడినెత్తిన సుర్రు మంటోంది..

అప్పుడు కనపడిన దృశ్యం అతన్ని ఆకట్టుకుంది.. బాధగా కూడా అనిపించింది.. వెంటనే బొమ్మ స్కెచ్ గీసేసుకున్నాడు.


తర్వాత కలర్స్ తో నింపాడు.. చాలా సహజంగా అనిపిస్తోంది.. తాను వేసిన బొమ్మని మరొక్కసారి చూసుకుని తృప్తిపడి అన్నీ జాగ్రత్తగా సర్దేసుకుని ఇంటికి బయలుదేరాడు.

అతను చూసిన ఆ దృశ్యమే అతని కళ్ళముందు కనిపిస్తోంది..


ఇక ఆ మర్నాటి నుంచి మళ్ళీ ఆఫీస్ బిజీ లో పడి ఆ సంగతి మర్చిపోయాడు.. మళ్ళీ వీకెండ్ వచ్చింది.. శనివారం వచ్చింది. అప్పుడు గుర్తుకొచ్చింది..స్నేహ వెళ్ళంగానే తాను కూడా పొద్దున్నే బయలుదేరి మళ్ళీ అక్కడికే వెళ్ళాడు..


రెండు, మూడు గంటలు కూర్చున్నాక మళ్ళీ అదే దృశ్యం కనబడింది.. చూడంగానే ఒక్కసారి కళ్ళు చెమర్చాయి..ఆలా చాలా సేపు చూస్తూ కూర్చున్నాడు..


ఆ రోజు కూడా తన కుంచెకు పని చెప్పాడు..అదే బొమ్మని ఇంకొక యాంగిల్ లో వేశాడు.

తర్వాత తన సామాగ్రి అంతా సర్దేసుకుని కారులో బయలు దేరి కొంత దూరం వెళ్లి చూసాడు.. అక్కడన్నీ చిన్న బొమ్మరిళ్ళు మాదిరి చిన్న ఇళ్ళు, కొన్ని పాకలు ఉన్నాయి.. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ కనబడ్డారు.. మహా అయితే ఒక ఏభై ఇళ్ళు ఉంటాయేమో..


మధుకర్ తిరిగి వస్తూ ఒక ఆలోచన చేశాడు.

ఇంటికి వచ్చాక కూడా కొన్ని పెయింటింగ్స్ వేశాడు.. తను వేసిన పెయింటింగ్స్ అన్నీ కారులో పెట్టుకుని ఆఫీస్ కి తీసుకెళ్లాడు.


మధుకర్ పనిచేసే ఎమ్ ఎన్ సి ఒక పెద్ద బిల్డింగ్ లో ఉంది…ఆ బిల్డింగ్ ఎంట్రన్స్ లో తాను వేసిన పెయింటింగ్స్ అక్కడ డిస్ప్లే లో పెట్టాడు.. ప్రతీ పెయింటింగ్ దిగువ కార్నర్ లో తన ఫోన్ నంబర్ రాశాడు.


లోపలికి వచ్చే వాళ్లందరి దృష్టి వాటి మీద పడింది… కాసేపు ఆలా చూస్తూ ఉండిపోయారు. కొందరు మధుకర్ కి ఫోన్ చేశారు. చాలా బాగా వేశావు బొమ్మలు, చాలా రియాలిస్టిక్ గా ఉన్నాయని అతన్ని పొగిడారు.. క్లోజ్ ఫ్రెండ్స్ విషయం అడిగారు.. "ఎక్కడికెళ్ళావు.. ఎక్కడ కనబడింది ఆ దృశ్యం" అని అడిగారు.


"సిటీ కి నూట యాభై కిలోమీటర్స్ దూరంలో ఆ గిరిజన తండా ఉంది. నేను మంచి స్పాట్ కోసం వెతుకుతూంటే నాకా దృశ్యం కనబడింది. ఆ మహిళలు పిల్లల్ని చంకలో పెట్టుకుని, రెండు బిందెలు నెత్తి న పెట్టుకుని అయిదు కిలోమీటర్స్ దూరం వెడుతున్నారు నీటి కోసం.. ఆ దృశ్యం చూడంగానే గుండె గొంతుకలోకి వచ్చింది.ఎంత కష్టపడుతున్నారో పాపం ఆ ఆడవాళ్లు.. నేను అక్కడికెళ్లి విషయాలు తెలుసుకున్నాను.. ఎంత మందికి మొరపెట్టుకున్నా ఏ అధికారులూ, నేతలు వాళ్లకి బోర్ వెల్ వేయించడం గాని, మంచినీటి సరఫరా గానీ చేయించ లేదు. వాళ్ళ కష్టాలు చూసి నాకు బాధేసింది.. మనమేదయినా చెయ్యలేమా అనిపించింది"..


తను వేసిన పెయింటింగ్ లో ఆడవాళ్లు , చంకలో, చేతిలో పిల్లల్ని పట్టుకుని, తలమీద బిందెలు పట్టుకున్న దృశ్యాన్ని చూస్తున్న ఫ్రెండ్స్ తో అన్నాడు.

అతని మాటలకి కొంతమంది వెంటనే రియాక్ట్ అయ్యారు..


"మధుకర్, ఈ వీక్ ఎండ్ లో అక్కడికి వెడదాం.. అక్కడ పరిస్థితులు చూసి తప్పక సాయం చేద్దాం" అన్నారు.


అనుకున్నట్లుగానే కొంతమంది వెళ్లారు. బోర్ వేస్తే నీళ్లు పడే చోటు కోసం చూశారు.. వాటర్ డివైనర్ ని పిలిచి, ఎక్కడ వాటర్ పడే స్పాట్ ఉందో చూడమన్నారు. బోర్ తవ్వెందుకు ఏర్పాట్లు చేశారు. అందరూ కలిసి కొంత అమౌంట్ కలెక్ట్ చేశారు.

అంతే.. వాళ్ళ సంకల్పం గట్టిది..ఆ గంగమ్మ తల్లి ఆ ఊరు వాళ్ళని దీవించింది. వంద అడుగుల్లోనే ఉదృతంగా నీళ్లు పైకెగశాయి. అయిదు వందల అడుగుల వరకు తవ్వారు..

ఆ ఊరి ఆడవాళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. వారి ముఖాలు వెలిగిపోతున్నాయి మతాబుల మాదిరి.


వాళ్ళ నీటి కష్టాల్ని పోగొట్టిన ఆ యువతని వాళ్ళు దీవించారు..ఆ తర్వాత ఆ తండాలో ఆడవాళ్లు బిందెలు పుచ్చుకుని మైళ్ళ తరబడి వెళ్లే అవసరం రాలేదు.

యువత తల్చుకుంటే ఏమైనా చెయ్యగలరు..

ఊర్లో బోర్డ్స్ పెట్టారు అందరికీ కనబడేట్లుగా..


చుక్కా చుక్కా కలిస్తే సముద్రం

చేయి చేయి కలిస్తే ఆనందం

నీటిని వృధా చెయ్యద్దు..

భావితరాలకు కన్నీటిని ఇవ్వొద్దు.

***శుభం ***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : నా పేరు రామకూరు లక్ష్మి మణి ( pen name ) అసలు పేరు--( official ) R.L.Manikyamba నేను ప్రభుత్వ హై స్కూల్ టీచర్ గా పనిచేసి పదమూడేళ్ళక్రితం రిటైర్ అయ్యాను. నా విద్యార్హతలు M A, MEd, M.phil నాకు చిన్నతనం నుండి తెలుగు సాహిత్యం అంటే మక్కువ. సంగీతం లో ప్రవేశం ఉన్నా దానిని కొనసాగించలేదు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో డ్రామా ఆర్టిస్ట్ గా సెలెక్ట్ అయ్యి కొన్ని నాటికలలో పాల్గొనడం జరిగింది. చిన్నప్పట్నుంచీ పుస్తకాలు చదవడం నా హాబీ..అడపాదడపా రాస్తూ వారపత్రికలకి పంపేదాన్ని. ముద్రితమయ్యాయి. గత రెండేళ్లుగా ప్రతిలిపి లో కధలు, ధారావాహికలు, వ్యాసాలు,కవితలు రాస్తున్నాను. నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు గెలుచుకోవడం జరిగింది.






35 views1 comment
bottom of page