సైంటిఫిక్ హ్యాపీ మేనేజర్ శ్రీలేఖ - 2
- seetharamkumar mallavarapu
- 4 days ago
- 5 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #ScientificHappyManagerSrilekha,
#TeluguChildrenStories, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

శ్రీలేఖ:- సైంటిఫిక్ హ్యాపీ అభివృద్ధి మేనేజర్ - 2
Scientific Happy manager Srilekha - 2 - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 25/11/2025
సైంటిఫిక్ హ్యాపీ మేనేజర్ శ్రీలేఖ - 2 - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1)
మేఘన మరియు శ్రీలేఖ ప్రాణ స్నేహితులు.
ఇద్దరు అలా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు ప్రధాన రహదారి పక్కన ఉన్న పేవ్‌మెంట్ పై.. చెట్టాపట్టాలేసుకొని.
2)
అక్కడ పక్కనే ఉన్న బస్టాండ్‌లో బస్సు నెమ్మదిగా ఆగుతోంది. ఇంకా పూర్తిగా ఆగలేదు. ఒకడు బస్సు నడుస్తున్న దిశలో దిగాడు. అత్తడికి యేమీ కాలేదు. ఇంకొకడు బస్సు నడిచే వ్యతిరేక దిశలో దిగాడు. అతడు కాస్త తడ పడ్డాడు.. కిందికి పడ్డాడు.
మేఘన పక్కున నవ్వింది.
వెంటనే శ్రీలేఖ "ఇతరులు కష్టాల్లో, బాధలో ఉన్నప్పుడు నవ్వకూడదు", అని అలర్ట్ - అప్రమత్తం చేసింది మేఘన ను.
3)
"సారీ శ్రీ.. రెండో వ్యక్తి మాత్రమే కిందపడ్డాడు.. విధికి ఇంత పక్షపాతం ఉందా అని నవ్వు వచ్చింది.. అంతే", అన్నది మేఘన.
శ్రీలేఖ ఇలా జవాబు ఇచ్చింది సైంటిఫిక్ గా - శాస్త్రీయమైన రీతిలో,
"మేఘూ, ఇది మొమెంటం ఉదాహరణ.. భౌతిక శాస్త్రం లో వస్తుంది..
మొమెంటం = ద్రవ్యరాశి * వేగం.
Momentum = mass velocity (or mv).
బుస్సు మాస్ - ద్రవ్యరాశి - బరువు యెక్కువ కాబట్టి తక్కువ వేగంలో కూడా మొమెంటం (Momentum) యెక్కువ ఉంటుంది. అందుకే బుస్సు వెళ్ళే దిశలో దిగాలి.. లేకుంటే అస్థిరత పరిస్థితి వల్ల కింద పడతారు", అని.
స్నేహితురాలిని ఆశ్చర్యంగా చూసింది మేఘన!
3)
ఇద్దరూ అక్కడ పక్కన ఉన్న హోటల్ కెల్లారు టిఫిన్ తిందామని. హోటల్ లో టీవీలో ఏదో ప్రమాదం గురించి వార్తలు వస్తున్నాయి.
ఓక లారీ లేక ట్రక్ వేగంగా పోతూ ఆగి ఉన్న ఇంకో ట్రక్ - లారీ ను ఢీ కొట్టింది. ఆగి ఉన్న లారీకి యెక్కువ సొట్టలు కాలేదు కానీ.. వేగంగా వచ్చిన లారీ నుజ్జు నుజ్జు అయిపోయింది. డ్రైవర్ మరియు క్లీనర్ అప్రమత్తంతో.. ఆ క్షణంలో బయిటికి దూకి.. ప్రాణాలు కాపాడుకున్నారు.
4)
మేఘన ఆశ్చర్యంగా ఇలా అన్నది,
"అదేంటి ఒక లారీ మాత్రమే యెక్కువ నుజ్జు అయింది? ఇంకోదానికీ ఏమి కాలేదు.. రెండూ దాదాపు ఓకే సైజు కదా"?
శ్రీలేఖ ఇలా జవాబు ఇచ్చింది సైంటిఫిక్ గా - శాస్త్రీయమైన రీతిలో,
"మేఘూ, ఇది కూడా మొమెంటం (Momentum) ఉదాహరణ..
భౌతిక శాస్త్రం (Physics) ప్రకారం
..
వేగంగా వచ్చిన లారీకి velocity యెక్కువ, అందుకే మొమెంటమ్ యెక్కువ, అందుకే యెక్కువ దెబ్బ తిన్నది, యెక్కువ నుజ్జు అయింది
..
నిలిచి ఉన్న లారీకి వేగం (velocity) సున్నా కాబట్టి దాని మొమెంటం కూడా సున్నా లేక తక్కువ, అందుకే తక్కువ దెబ్బ తిన్నది - తక్కువ
నుజ్జు అయింది.
మేఘన చకితంతో శ్రీలేఖను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ఇలా అన్నది, "నువ్వు సైంటిఫిక్ మేనేజర్.. You are an EXCELLENT scientific manager", అని.
హోటల్ లో ఉన్న వారు అందరూ చప్పట్లు కొట్టారు శ్రీలేఖ వివరణకు.
శ్రీలేఖ ఇలా ముగించింది..
"ఏదైనా వాహనాలు ఢీ కొట్టుకోకుండా లేక ప్రమాదం (ఢీ) యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి, మొమెంటం తగ్గించాలి..
అంటే మాస్ - బరువు లేక వేగము తగ్గించాలి.. లేక రెండును".
"వాహనం వేగము తగ్గిస్తే.. డ్రైవర్‌కు బండిపై - స్టీరింగ్ పైన.. యెక్కువ నియంత్రణ ఉంటుంది. బ్రేక్ వేస్తే బండి తేలికగా ఆగుతుంది బోల్తా పడకుండా.. రెండింతల లాభం.. అందరి ప్రాణాలకు రక్షణ"
"నిదానమే ప్రధానం".
ఈసారి హోటల్లో ఉన్నవారు అందరూ తిరిగి చప్పట్లు కొట్టారు చాలాసేపు.. శ్రీలేఖ పరిష్కారానికి.
---కథ సమాప్తం---
------ నీతి -----
1) అందరూ సైంటిఫిక్ సంతోషకరమైన అభివృద్ధి మేనేజర్.. Scientific HAPPY Development Manager లా ఆలోచించాలి.
2) కేవలము శాస్త్ర సంతోష పూరిత నిర్వహణ చేయాలి
3) ఆనంద దాయక పరిష్కారాల తీరులో నిర్వహణ చేయాలి.
4) అందరూ ఓ రోజు పోయేదే కదా.. తప్పులు యెంచడం, హాని చేయడం, బలి పశువులు చేయడం, త్రోయడం, నిందలు మోపడం, కష్టం - నష్టం ఇవ్వడం చేయకూడదు.
5) ప్రతి ఇల్లు, కార్యాలయం, సంస్ధ, ప్రాంతం, దేశం.. మొత్తం ప్రపంచం.. ఒక సంతోష పూరిత - స్నేహపూరిత - అనురాగ - ఆత్మీయ - అనుబంధం పూరీత.. జట్టు - బృందంగా మెలగాలి.. యెల్లప్పుడు.. అను క్షణం.. క్షణ క్షణం
(అందరిదీ ఒకే యెర్ర రక్తం.. అందుకే.. మనుషులంతా ఒకటే.. ఒకే కుటుంబం.. అని పెద్దలు యేనాడో చెప్పారు).
6)
పరిష్కారం:-
"ఏదైనా వాహనాలు ఢీ కొట్టుకోకుండా.. లేక.. ప్రమాదం (ఢీ) యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి, వాహనం - బండి యొక్క మొమెంటం తగ్గించాలి..
అంటే మాస్ - బరువు లేక వేగము తగ్గించాలి.. లేక రెండును".
"వాహనం వేగము తగ్గిస్తే.. డ్రైవర్‌కు బండిపై - స్టీరింగ్ పైన.. యెక్కువ నియంత్రణ ఉంటుంది. బ్రేక్ వేస్తే బండి తేలికగా ఆగుతుంది బోల్తా పడకుండా.. రెండింతల లాభం.. అందరి ప్రాణాలకు రక్షణ"
*నిదానమే ప్రధానం.
*నివారణ - నిరోధన ఉత్తమం.. చికిత్స కంటే
*
By driving any vehicle slowly,
..
i) A driver can have better control over the steering and the vehicle.
ii) Also, when the driver applies sudden brakes,
The vehicle can stop immediately WITHOUT turning down or becoming upside down.
iii) During a collision, if the vehicles are moving slowly (with lesser speed-velocity OR lesser load), the
impact of the vehicular collision will be LESSER.. BECAUSE..
momentum = mass * velocity.
IV) Slower-moving vehicles have a lower probability of accidents - collisions.
v) PREVENTION is better than CURE.
--- కథ - నీతి:- సమాప్తం ---
------ X X X -------- X X X ---------
------- నీతి - (చిన్న కథ) - సమాప్తం ----------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).




Comments