top of page

అనిరుధ్ అనే నేను..

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Anirudh Ane Nenu' New Telugu Story By Ramakuru Lakshmi Mani

రచన: రామకూరు లక్ష్మి మణి


“ఒరే మావా.. కొట్టు కట్టేసేయ్యకూడదూ.. అలా పోయొద్దాం కాసేపు..”

ఫ్రెండ్ హరి ఒకటే నస పెడుతున్నాడు..

“ఒరేయ్ నీకెన్ని సార్లు చెప్పానురా.. తొమ్మిది గంటలయితేనే గాని షట్టర్ దించనని.. అయినా పోరా.. ఇంటికి పో.. వెళ్లి చదువు కో, లేదా పడుకో.. రాత్రిపూట షికార్లేమిట్రా…”


“నీతో కాసేపు నడిస్తే కొన్ని మంచి విషయాలు తెలుస్తాయని

అడుగుతున్నారా.. నీతో మాట్లాడకపోతే నాకు తోచదని తెల్సు కదరా..”


హరి అక్కడే కూర్చుంటూ అన్నాడు.

వాళ్లిద్దరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్..ఒకే స్కూల్లో, ఒకే కాలేజ్ లో చదివారు. అనిరుధ్ చదువు ఆపేశాడు. హరి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు..

రోజులో ఒక్కసారైనా కలుసుకుంటారు.


“సర్లే పద.. ఇంకెవరూ కస్టమర్స్ వచ్చేట్లు లేరు.. పద కాసేపు వాకింగ్ చేసి నేను కూడా ఇంటికెడతా “ అంటూ షాప్ మూసేసి తాళం వేసాడు అనిరుధ్.


షాప్ అంటే అదేమీ పెద్ద షాప్ కాదు. ఒక చిన్న బడ్డీ కొట్టు టైప్.. ఆ ఊరంతటికి ఉన్నది ఒకే ఒక జనరల్ ఐటమ్స్ అమ్మే షాప్ .. అది

అనిరుధ్ నాలుగేళ్ళబట్టీ నడుపుతున్నాడు. ఆ ఊర్లో ఇంకొక చిన్న షాప్ ఉంది.. అది పచారీ సరుకులు అమ్మే షాప్.


అనిరుధ్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉండగా తండ్రి చనిపోతే, ఇల్లు గడవడం కోసం ఆ షాప్ పెట్టుకున్నాడు

ఇంటర్ పాసయ్యాక పై చదువులు చదివే స్థోమత లేక, చదువు ఆపేసి ఆ కొట్టు పెట్టుకున్నాడు.


న్యూస్ పేపర్స్, సిగరెట్ పాకెట్స్ లాంటివి జనరల్ ఐటమ్స్

అమ్ముతాడు.…

వారపత్రికలు, దినపత్రికలు చక్కగా కనబడేట్లుగా వెళ్లాడదీస్తూ ఉంటాడు…పిల్లలకోసం చాకలెట్స్, బిస్కెట్స్, లాలీపాప్ ల్లాంటివి,

పెద్దవాళ్లకి సిగరెట్స్, వక్కపొడి పాకెట్స్ లాంటివి ముందు వరుసలో పెద్ద ప్లాస్టిక్ డబ్బాల్లో పెడతాడు. వెనకాలొక టేబుల్ పెట్టి అక్కడ టీ తయారు చేసి ఉంచుతాడు.


పొద్దున్నే ఆరుగంటలకి వచ్చినవాడు మధ్యాహ్నం ఒంటిగంటకు మూసి, మళ్ళీ నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల వరకూ ఉంటాడు.. ఎవరికేది కావాలో ఇస్తూ వాళ్ళతో కబుర్లు చెబుతూంటాడు..

ఆ ఊరు మరీ పల్లెటూరు కాదు.. పట్నమూ కాదు…మధ్యస్తంగా ఉంటుంది.. ఆ ఊళ్ళో ఏభై ఏళ్ళు పైబడ్డ వాళ్ళు అందరూ ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్న వాళ్ళే..

తెలుగు, ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ రెండు, ఒక జూనియర్ కాలేజ్ ఉన్నాయి.. ఆ పై డిగ్రీ చదువుల కోసం అతి దగ్గర్లో ఉన్న జిల్లా కేంద్రం కి వెళ్లి చదువుకుంటారు.


అందరూ అనిరుధ్ టీ కొట్టు ముందు ఉన్న బెంచీల మీద

కూర్చుంటారు. రైతులు కూడా సాయంత్రం పూట వచ్చి కూర్చుని హాయిగా పేపర్ చదువుకుంటూ పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉంటారు…


రోజూ వాళ్ళ చర్చ చుట్టి చుట్టి వచ్చి రాజకీయాలు, రాజకీయ నాయకుల దగ్గరకు వస్తుంది..

అనిరుధ్ వాళ్లకు టీ ఇస్తూ తను కూడా వాళ్ళతో మాట కలుపుతూ ఉంటాడు.

రోజూ లాగే ఆ రోజూ కూడా ప్రభుత్వాల అవినీతి గురించి, నేరాల గురించి మాట్లాడు కుంటున్నారు.


“నిన్న టీ . వి. లొ ఒక కలెక్టర్ గురించి చూపాడు. చాలా ఖచ్చితంగా ఉంటూ అందరి మెడలు వంచుతూందట..

లంచగొండితనం లేకుండా చేస్తోందట..” వెంకటేష్ అన్నాడు..


“అవును.. అలాంటివాళ్ళు ఉన్నారు.”. అన్నాడు సత్తెన్న.


“అసలు మన ప్రభుత్వం అలాంటి వాళ్ళతో ఏర్పడితే ఎంత

బాగుంటుందో కదా.. “ మాట కలిపాడు అనిరుధ్ టీ కప్పుల్లోకి పోస్తూ..

“అవునురా అబ్బాయ్.. అవినీతి లేని ప్రభుత్వం కావాలంటే అలాంటి వాళ్ళు కావాలి.. “ అన్నాడు సంజన్న.


“అవును సంజన్న బాబాయ్..మంచి సైటీస్ట్ ల్లో కొందర్ని, ప్రొఫెసర్స్ లొ రిటైర్ అయిన వాళ్ళల్లో కొందర్ని, మంచి నీతి మంతులైన జడ్జి లను, రిటైర్డ్ ఐ ఏ ఎస్ ఆఫీసర్స్ లొ కొందర్ని, పోలీస్ ఆఫీసర్స్ లో నీతిమంతులైన వారిని కొందర్ని ప్రతీ స్టేట్ లో వంద నుండి నూట ఏభై

వరకు సెలెక్ట్ చేసుకుని, ప్రతిపక్ష మనేది లేకుండా చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి.. శాసన సభల్లో అలాంటి వాళ్ళు ఉంటే మంచి పరిపాలన ఉంటుంది కదా..”


“ ప్రభుత్వం లో చదువు కున్నోళ్లు, నీతిమంతులు ఉండాలి. ఒకసారి రోడ్డు వేశారంటే పదేళ్ల వరకు ఆ కాంట్రాక్టర్ దే బాధ్యత అని అప్పజేబితే.. చచ్చినట్లు మంచి రోడ్లు వేస్తాడురా.. మన ఈ రోడ్డు చూడు నెల కాలేదు వేసి, ఎన్ని గుంతలు పడ్డాయో..” వెంకటేష్ అన్నాడు..


“అవును మావయ్యా.. అందుకే అంటున్నా, ప్రభుత్వం లో ఉన్నవాళ్లు నీతిమంతులయితే, కింద పనిచేసే అందరూ గడగడ లాడుతూ చేస్తారు అని.”


“చిన్నవాడి వయినా కరెక్ట్ అయిన మాట చెప్పావురా..” సత్తెన్న అనిరుధ్ భుజం చరుస్తూ అన్నాడు.


“మనం ఇలా చర్చలు పెట్టుకుంటూ కూర్చోడం కాదు కార్యాచరణ లోకి రావాలి.. “ అప్పుడే వచ్చిన హరి అన్నాడు.

“ప్రతీ ఊళ్ళోను చైతన్యం తీసుకొచ్చి, అన్ని జిల్లాలలో కొంతమందిని కలిసి, మనం కొందర్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నుకుని ఉంచుకుందాం. ఈ సారి ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళని నిలబెట్టి గెలిచేట్టు చేసి, అసలు ఇంకొక పార్టీ అనేది లేకుండా చేసి ఒక్కటే ఒక్క

పార్టీగా ఏర్పడేట్లు చేద్దాం. “ అన్నాడు అక్కడే స్కూల్లో పనిచేస్తున్న సత్యరాజ్.


“మీరు చెప్పింది బాగుంది మాస్టారు.. ఆరునెలల్లో మొత్తం

రాష్ట్రమంతటా తిరుగుదాం.. మనం అనుకున్న వారిని నిలబెట్టి గెలిపించుకుందాం.. “ అన్నాడు హరి.


ప్రతీ గ్రామంలో, జిల్లాల్లో మొత్తం రాష్ట్రమంతటా మీటింగ్స్ పెట్టి అందర్నీ సమావేశ పరిచి చెప్పాలి. అందరికీ అర్ధమయ్యేట్లు చెబితే తప్పకుండా మన అభ్యర్థులను

గెలిపించుకోగలుగుతాం. మనం ఎంచుకున్న వారు కూడా మంచి పరిపాలన అందిస్తామని ప్రమాణ పత్రం రాసివ్వాలి, వాళ్ళు కనక ఏదన్న దారి తప్పరంటే వెంటనే వాళ్ళని దించేసి అధికారం మన ప్రజల చేతుల్లో పెట్టుకోవాలి.


“అబ్బాయ్ అనిరుధ్! నువ్వు కూడా మనం అనుకున్న లిస్ట్ లో ఉంటావు.. నీ ఆలోచనా విధానం చాలా బాగుంటుంది.” అన్నాడు సంజన్న.


“అయ్యో బాబాయ్..! నేనింకా చిన్నవాణ్ని “

“కాదురా.. నువ్వు అన్ని విధాలా తగిన వాడివి.. నీ నియమబద్ధత, ముక్కుసూటితనం తో అన్నీ చెయ్యగలవు.. ముందు ముందు నువ్వు ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందిరా.. సమాజానికి నీలాంటివాళ్ళు కావాలి.. “


హరి స్నేహితుడిని ప్రోత్సాహించాడు.

అనిరుధ్ అనే నేను.. అంటూ ప్రమాణ స్వీకారం చెయ్యాలి..ఇలా అంటూ ఒక చెయ్యి ముందుకు చాపి.. అనిరుధ్ వేపు చూసి అంటూంటే అందరూ తప్పట్లు కొట్టారు..


అన్ని రాష్ట్రాల్లో అలా చైతన్యం వచ్చి అందరూ అదే దిశగా అలోచించి, ముందుకు వెడితే తప్పకుండా మన పరి పాలనా పద్ధతి మారి సమాజం, దేశం కూడా బాగుపడతాయి.

వాళ్ళ కల నెరవేరాలని ఆశిద్దాం..

***శుభం ***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : నా పేరు రామకూరు లక్ష్మి మణి ( pen name ) అసలు పేరు--( official ) R.L.Manikyamba నేను ప్రభుత్వ హై స్కూల్ టీచర్ గా పనిచేసి పదమూడేళ్ళక్రితం రిటైర్ అయ్యాను. నా విద్యార్హతలు M A, MEd, M.phil నాకు చిన్నతనం నుండి తెలుగు సాహిత్యం అంటే మక్కువ. సంగీతం లో ప్రవేశం ఉన్నా దానిని కొనసాగించలేదు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో డ్రామా ఆర్టిస్ట్ గా సెలెక్ట్ అయ్యి కొన్ని నాటికలలో పాల్గొనడం జరిగింది. చిన్నప్పట్నుంచీ పుస్తకాలు చదవడం నా హాబీ..అడపాదడపా రాస్తూ వారపత్రికలకి పంపేదాన్ని. ముద్రితమయ్యాయి. గత రెండేళ్లుగా ప్రతిలిపి లో కధలు, ధారావాహికలు, వ్యాసాలు,కవితలు రాస్తున్నాను. నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు గెలుచుకోవడం జరిగింది.

*************


29 views1 comment

1 opmerking


shahnaz bathul
shahnaz bathul
28 jun. 2022

కథ చాలా బాగుంది మేడం.

Like
bottom of page