అనుకోకుండా ఒక రోజు
- Addanki Lakshmi
- Sep 20
- 4 min read
#తెలుగుకథలు, #అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #AnukokundaOkaRoju, #అనుకోకుండాఒకరోజు

Anukokunda Oka Roju - New Telugu Story Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 20/09/2025
అనుకోకుండా ఒక రోజు - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"అమ్మగారు, అనాధాశ్రమానికి డొనేషన్ ఇవ్వండి" అంటూ నలుగురు మనుషులు వచ్చారు.
వీధి గుమ్మంలో ఉన్న మా ఆవిడకి వెంటనే కోపం వచ్చింది.
" పని పాట లేదు మీకు అస్తమానం ఎవరో ఒకరు డొనేషన్లకు వస్తుంటారు, వెళ్ళండి” అంటూ విసుక్కుంది.
హాల్లో టీవీ చూస్తున్న నాకు ఈ మాటలు వినిపించాయి.
"పద్మ.. ఇలా రా" అంటూ కేకేశాను.
"అబ్బబ్బ! ఈ డొనేషన్ వాళ్ళు చంపేస్తున్నారండి!" అంటూ విసుక్కుంటూ లోపలికి వచ్చింది.
పరుసు తీసి అందులోంచి 200 రూపాయలు
పద్మకిచ్చి “వెళ్లి ఆ డొనేషన్ వాళ్ళకి ఇవ్వు” అన్నాను.
అంతే! నా భార్య పద్మ అవాక్కైపోయి చూస్తోంది.
"వెళ్ళు, వాళ్ళు వెళ్లిపోతారు" అంటూ హెచ్చరించాను.
గబగబా వెళ్లి వాళ్లకి 200 రూపాయలు ఇచ్చింది అందులో ఒక ఆయన “మీ పేరు ఏమిటి చెప్పండి” అన్నాడు.
"మా ఆయన పేరు మూర్తి. రాసుకోండి" అని చెప్పింది.
వాళ్లు డబ్బు తీసుకుని సంతోషంగా వెళ్లిపోయారు.
లోపలికి వచ్చిన పద్మ "వీళ్ళందర్నీ నమ్మకూడదండి దొంగ వేషాలు =" అంది.
"పర్వాలేదులే పద్మ. మనం కూడా అప్పుడప్పుడు దానం చేయాలి కదా పేద వాళ్ళకి" అన్నాను నేను.
ఈసారి పద్మ ఆశ్చర్యపోయింది.
"అదేమిటి? మీరే కదా చెప్తారు ఎవరికీ నయా పైసా ఇవ్వద్దని, అందరూ మోసం చేస్తారని"
"లేదులే, అందరూ అట్లా మోసం చేయరు" అన్నాను నేను.
"ఏమో బాబు, ఎవరికైనా పది రూపాయలు దానం చేయండి అంటే నా మీద మండిపడతారు" పద్మ విసుక్కుంటూ లోపలికి వెళ్ళింది.
నిజంగానే నేను ఒక్క నయాపైసా పోనివ్వను, నా దృష్టిలో అందరూ మోసగాళ్లని. బీదవాళ్లకు కూడా నయా పైసా వేయను. కనీసం జాలి సానుభూతి దయ కూడా చూపను.
ఎన్నో సంవత్సరాలు అలాగే గడిపాను.
ఇప్పుడు నాలో కొంచెం మార్పు వచ్చింది. ఈ విషయం పద్మ కి ఇంకా తెలియదు.
నాలో కాస్త మానవత్వం, మంచితనం చోటు చేసుకుంది.
అందుకే ఈ మార్పు.
నా జీవితంలో ఈ మధ్య జరిగిన ఒక సంఘటన నాలో మానవత్వాన్ని నింపింది.ఒక్కసారి నాకా సంఘటన గుర్తు వచ్చింది. అప్పుడప్పుడు పక్కనున్న పట్నం వెళ్లి వస్తాను ఆఫీస్ పని మీద. వచ్చేటప్పుడు దారిలో పిల్లలకి పెద్ద వాళ్లకి ఏం కావాలో కనిపిస్తే తీసుకొస్తాను.
ఆరోజు వస్తుంటే రోడ్డుమీద అరటిపళ్ళు అమ్ముకుంటూ కనిపించింది ఒక అమ్మాయి. సరే కొందాం అనుకుని కారు దూరంగా ఆపాను. ఎందుకంటే కారులోంచి దిగుతూ ఉంటే వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు కదా.. అది నా తెలివి..
నడుచుకుంటూ వెళ్ళి బేరం మొదలు పెట్టాను.
గెల 200 చెప్పింది. వంద రూపాయల నుంచి మొదలుపెట్టి ఎలాగో 120 కి ఫిక్స్ చేశాను.
“సాయంత్రం అయిపోతోంది. అందుకే తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాను దొర..” అంది.
మంచి గెల ఒకటి తీసుకుని, 120 రూ ఇచ్చేశాను. వీళ్లకి
బోలెడు లాభాలు వస్తాయని, పది రూపాయల సరుకు వంద రూపాయలకి అమ్ముకుంటారని నాకు మనస్సులో అసూయ.
బిజినెస్ వాళ్లని నమ్మేందుకు లేదని నా ఉద్దేశం.
ఇంతలో ఆ అమ్మాయి, ఎదురుగుండా చెట్ల మీద నున్న కోతుల, దగ్గరకి ఒక గెల పట్టుకుని వెళ్ళింది.
అవి కిందికి గెంతుకుంటూ వచ్చి ఆనందంగా తినేస్తున్నాయి.
నేను అలాగే చూస్తూ నిలబడ్డాను. ఆ అమ్మాయి సంతోషంగా వాటిని చూసి, ‘తినరా బుజ్జికన్నా తినండి’ అంటూ, మళ్ళీ వచ్చి తన పనిలో పడింది.
నాకు కుతూహలం ఆపుకోలేక, వెళ్ళి అడిగాను.. “ఏంటమ్మా ఒక గెలాంతా కోతులకు పెట్టేసావ్. అన్నీ తినేస్తున్నాయి. నీకు నష్టం కదా” అని అడిగా.
ఆ అమ్మాయి, “బాబు గారు.. నోరులేని జంతువులు కదండీ.. పాపం, వాటికి ఎవరు ఆహారం పెడతారు. ఈ కొండల్లో కోనల్లో తిరుగుతాయి. తిండి దొరకదు. పెట్టే వాళ్ళు ఎవరూ ఉండరు. మూగ జీవులను కాపాడడం మన ధర్మం కదండీ. కాలే కడుపు అందరిదీ ఒకటే బాబయ్యా..”
నాకు వెంటనే జ్ఞానోదయమైంది. నా ఆలోచనలు తలుచుకుంటే నాకే అసహ్యం అయింది. శ్రీ కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చేసిన జ్ఞానోదయం లాగా, నాకు ఆ పిల్ల చెప్పింది, గీత ప్రవచనం లాగా వినిపించింది.
వెంటనే నాలో ఉన్న కుత్సిత స్వభావానికి సిగ్గుపడ్డాను.
చిన్నపిల్ల.. దానికున్న పరిజ్ఞానం నాకు లేదు. ఆ గెల గురించి ఎంత బేరం చేశాను..
మనసంతా ఆవేదన అయింది. వెంటనే పర్సు తీసి300 రూ, ఇచ్చాను.
ఆ పిల్ల ఆశ్చర్యపోయింది. “ఇంతెందుకు బాబయ్యా వద్దు వద్దు” అంటూ సిగ్గు పడింది.
“పరవాలేదు తీసుకో. ఈ సారి మళ్ళీ ఎప్పుడైనా కోతులకి పెట్టినప్పుడు నా పేరు మీద అరటి పళ్ళు పెట్టు” అని చెప్పాను.
మనసు ఎంతో సంతృప్తిగా ఫీల్ అయ్యాను. కారు ఎక్కి ఇంటికి వచ్చా, ఒక మంచి పని చేశానని సంతోషముగా.
మంచి మనసుకి పేద గొప్ప చిన్నా పెద్ద తారతమ్యాలు ఉండవు. మంచితనం ఎవరి దగ్గర నుంచి అయినా సరే చూసి నేర్చుకోవాలి
అనుకోకుండా ఈ సంఘటనతో నాలో చాలా మార్పు వచ్చింది. మంచితనం మానవత్వం మేల్కొలిపింది ఆ పిల్ల.
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,
Comments