top of page
Original_edited.jpg

అనుమానము - ఆస్థి 

Updated: Jul 31, 2024


ree

'Anumanam - Asthi' - New Telugu Story Written By Peddada Sathyanarayana   

Published In manatelugukathalu.com On 18/07/2024

'అనుమానము - ఆస్థితెలుగు కథ 

రచన: పెద్దాడ సత్యనారాయణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



అనసూయకి అనుమానము ఆస్థి లాంటిది. అనుమానము లేకపొతే మొగుడు కొంగు చివరినుంచి జారిపోతాడని నమ్ముతుంది. అనసూయ పెళ్లి కాని క్రితము తమపక్క ఇంట్లో ప్రశాంతి సమ్మోహన రావు దంపతులు ఉండేవారు. ప్రశాంతికి భర్త అంటే చాల నమ్మకము. సమ్మోహనరావు ఉన్న ఊర్లోనే రెండు మంచాల మీద (రెండోభార్య) స్వారీ చేసేవాడు. రెండు సంవత్సరాలు తర్వాత నిజము తెలుసుకొన్న ప్రశాంతి భర్తకి విడాకులిచ్చింది. 


 అనసూయ ఉద్యోగము నెలలో రెండుసార్లు టూర్లు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగము. ఎప్పటిలాగానే టూర్ కి వెళ్లే ముందర భర్త కి జాగ్రత్తలు చెప్పి రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చింది. భోజనాలు ముగించిన పిదప బెడ్ రూమ్ లో కి వెళ్లి దుప్పటి మార్చబోతుంది. 


“అంతే! తలగడ క్రింద గాజులు చూసి, “ఏమండీ?” అని గట్టిగా అరుస్తుంది. 


“ఏమి అయింది?” అని కంగారుగా వచ్చి తలగడ కింద గాజులు చూసి అయోమయముగా అనసూయని చూస్తాడు. 


“ఎన్నాళ్ల నుంచి జరుగుతోంది భాగోతము” అంటుంది.


“నాకేమి తెలియదు” అంటాడు రమణ. 

మారు మాట్లాడకుండా సూట్ కేసు లో బట్టలు సర్దు కొని పుట్టింటికి వెళ్లి పోతుంది. రమణ రెండురోజులు చూసి అనసూయ దగ్గరకి వెళ్లి నచ్చ చెప్పి తీసుకు వద్దామని నిర్దారించుకొని నిద్రపోతాడు. మరుసటి రోజు రాత్రి హోటల్ నుంచి భోజనము తెప్పించుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగితే తలుపు తీస్తాడు.


“తప్పుకోండి” అని అనసూయ సూట్ కేసు రమణకిచ్చి “నన్ను క్షమించండి” అని ఇద్దరికి భోజనము వడ్డించి అసలు విషయము చెప్తుంది. 


“మీకు గుర్తు ఉందనుకుంటా, పోయిన వారము మా అక్కయ్య కూతురు రమ్య మన ఇంటి దగ్గర స్కూల్ లో బ్యాంకు పరీక్ష రాసి, మన ఇంట్లో రెస్ట్ తీసుకుంది. తన గాజులు తలగడ క్రింద మరియు పేపర్లు అలమార్లో పెట్టి వెళ్లి పోయింది. మధ్యాన్నము నాకు ఫోన్ చేసి చెప్పింది’ అంది అనసూయ.


రమణ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. 

 

 --------------------------------------------------------------------------------------------------------------------------

పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు   నా  నమస్కారములు.

పేరు: పెద్దాడ సత్యనారాయణ   B .A  విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్                                                               

డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్   

విద్యాభ్యాసము సికింద్రాబాద్                                                                    

సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి  4 కధలు 1 నాటిక                                                

వ్యాసాలకి పారితోషికం  మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.                                            

సంఘసేవ:  గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి   మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page