top of page

అపరంజి


'Aparanji' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'అపరంజి' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


అపరంజి బి. ఏ. చదువగానే ఇరువది యవ యేట నందకిశోర్ తో పెళ్ళి చేస్తారు తలిదండ్రులు- నందకిశోర్ అప్పటికే ప్రభుత్వోద్యోగి. పెళ్ళయి నాలుగేళ్ళకే ఇద్దరు కొడుకులు నీలమణి- కిరీటి పుడుతారు.


నందకిశోర్- అపరంజిలది అన్యోన్య దాంపత్యమనే చెప్పాలి.


నందకిశోర్ తండ్రి రామనాథం తల్లి వకుళా దేవి- వాళ్ళకు నందకిశోర్ కాక శ్రీధర్- ఫణిధర్ అను ఇద్దరు కొడుకులు చదువులు అయిపోయి ఉద్యోగాన్వేషణలో ఉంటారు -


కార్యాలయపు పనిమీద వారం రోజులకొరకు తిరుపతి పోవలసి వస్తది నందకిశోర్ కు- మేమూ తోడుగా వచ్చి దైవ దర్శనము చేసుకుంటాము అని తలిదండ్రులు నందకిశోర్ వెంట పయన మైతారు -- కార్యాలయపు పనిలో నందకిశోర్ ఉంటే తలిదండ్రులు రామనాథం- వకుళాదేవి దైవదర్శనం చేసుకుంటారు - తరువాత సమయము ఉన్నదిగదా అని అన్ని గుళ్ళు తిరుగుతారు ఓపికగా-


నందకిశోర్ కార్యాలయపు పని ముగియగానే ముగ్గురూ తిరుగు పయనమైతారు. దురదృష్టము వెంటాడి ముగ్గురు రైలు ప్రమాదములో చిక్కుతారు - రైలు మొత్తము మంటలంటుకొని ఎంతోమంది ఆకారము కూడా గుర్తుపట్ట లేనంత మాడి మశౌతారు. ఆ ప్రమాదములో ముగ్గురూ చనిపోయారని కుటుంబ సభ్యులకు సమాచారమిస్తారు రైల్వే అధికారులు.


అశనిపాతపు లాంటి వార్త విన్న అపరంజి- శ్రీధర్-ఫణిధర్ ఆర్తనాదాలు మిన్నంటుతాయి -


పసిపిల్లలు ఇద్దరు బిక్కముఖమేసి చూస్తుంటారు. వాళ్ళను ఓదార్చే వారు ఎవరూ లేరు -అపరంజి దిగ్భ్రాంతికి గురియై కళ్ళు తిరిగి పడి పోతుంది. ఏడ్చుకుంటూ ఉన్న మరుదులే డాక్టర్ను తీసుకవచ్చి చూయిస్తారు- ఆమె విభ్రాంతికి గురి అయింది ఒక గంటకు గాని తేరుకోదు అని ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళి పోతాడు డాక్టర్.


ఈ లోపల చుట్టుపక్కల వాళ్ళకు తెలిసి వీళ్ళ ఇంటికి వస్తారు- ఆరని జ్వాలలా అన్న దమ్ముల రోదన చూసి ఓదార్చే ప్రయత్నము చేస్తారు. ఈ లోగానే తేరుకున్న అపరంజి రోదనకు అంతుండదు- సముద్రములో రగులుకున్న బడబాగ్ని ఇంతకింతకు ఉదృతమైనట్టుగా పొంగుకొచ్చే ఆమె దు&ఖాన్ని ఆప ఎవరి తరము కాకుండా పో తుంది - తల్లికంటె పసిపిల్లల చూచే బాధపడుతుంటారు వచ్చినవారు- రెండు గంటల తరువాత అపరంజి తల్లి ఉష తండ్రి రఘురాం అన్న జయంత్ వస్తారు- వారిని చూడగానే అపరంజి రోదన ఝంఝామారుతం లా తోస్తది చూపరులకు-


తలిదండ్రుల తోబుట్టువు ఆవేదన ఇంతా అంతా కాదు. దుర్ఘటన జరిగిన తీరు-శవాలను కూడా తేలేని పరిస్థితి వాళ్ళను ఇంకా కృంగదీస్తది.


సాయంత్రానికి సద్దుమణిగి పోయే వారు పోయినా ఉన్నవారి కర్తవ్యము తప్పని వాళ్ళ అంత్యక్రియలే. గుండె రాయి చేసుకొని శ్రీధర్, ఫణిధర్లతో ముచ్చటిస్తాడు అపరంజి తండ్రి రఘురాం - మాకు ఏమీ తెలియదు మామయ్యా అంతా మీరే చూసుకోవాలి అంటారు అన్నదమ్ములు.


ఇక ఆ యింటిలో రఘురాం- ఉష జయంత్ లదే బాధ్యత గా పండ్రెండు రోజులు గడుస్తుంది. పదవనాడు హిందూ సంప్రదాయం అంటూ ఎవరో పెద్దమనిషి అపరంజిని విధవను చేయాలంటడు-క్షణము కూడా ఆలోచించకుండా శ్రీధర్, ఫణిధర్ అంటారు విధి మా వదినను పది రోజులకిందనే విధవను చేసింది- దయచేసి ఇంక ఎవరు ఆ కృష్ణాచారము గురించి నోరు విప్పినా మరియాదుండదు అని ఖరాఖండిగా గద్గద స్వరముతో అంటారు. చాదస్తులందరు నోరు మూసుకుంటారు.


మా వదిన పుట్టగానే దిష్టి బొట్టుతో ఆరంభమై - పెరుగుచున్నాకొద్ది బొట్టు గాజులు పూలు ఆమె పుట్టింట నుండి వచ్చినవే- ఇక పెళ్ళి నాడు మా అన్న ఇరువురి బాంధవ్య సూచకంగ మెడలో మంగళ సూత్రము కట్టడము జరిగింది- హరి హరాదులు వచ్చినా అవి తొలగింపజేసే అధికారము లేదు- మావదిన ఎప్పటి లాగే ఏ మార్పు లేకుండా ఉంటుంది అంటారు అన్నదమ్ములు ముక్త కంఠం తో- ఇక అందరూ కిమ్మనకుండా ఉంటారు.


ఎక్కడివాళ్ళు అక్కడికి పోయినంక ఇల్లంతా శూన్యముగా గోచరిస్తుంటది- ఇంటి పని వంట పని లో అపరంజికి కష్టము కలుగకుండా సింహ భాగము ఇద్దరన్నదమ్ము లు శ్రీధర్ - ఫణి ధరులే సహకరిస్తూ పిల్లల కూడా ఆడిస్తుంటారు.


ఇంట్లో ఆదాయ వనరులు కరువై భుక్తికి మార్గం ఆలోచించుచు ఉద్యోగములు దొరికే వరకు పిల్లలకు చదువు చెబుతూ కొంత గణిస్తుంటారు.


కళా విహీన మైన ఆ ఇంట్లో ఒక నాడు వేకువనే నందకిషోర్ ప్రత్యక్ష మైతాడు- అతన్ని చూచి అందరూ దిగ్భ్రాంతి చెందుతారు.


అతను వచ్చే వరకు అన్ని అలంకరణలతో ఉన్న అపరంజిని చూసి నివ్వెర పోతాడు నంద కిషోర్. అపరంజితో ఎక్కువ మాట్లాడకుండా తమ్ములకు చెబుతుంటాడు ప్రమాదమునుండి తప్పించుకున్నతీరు- ఆరునెలలు ఎక్కడ గడిపింది వివరంగా- ఆ విషయము చాలా ఉత్చుకతతో వింటున్నవారికి ఆశ్చర్యం కలిగిస్తుంది-


ఆరోజు తల్లి, తండ్రి తాను రైలు ఎక్కగానే మంచి నీళ్ళు తేవడానికి దిగి నీళ్ళు తెచ్చే లోపల రైల కదిలి వేగం పుంజుకుంటుంది. తాను పరిగెత్తుతూ రైలు పట్టాల పక్కకు పడిపోగా రైలు వెళ్ళి పోతుంది- తానుస్పృహ కోల్పోగా రైల్వే అధికారులు రైల్వే ఆస్పత్రిలో చేరుస్తారు. ఆస్పత్రిలో చేరగానే తను కోమాలోకి వెళ్ళి పొయానంటాడు. రైల్వే డాక్టర్లు పాపం ఎంతో శ్రద్ధ వహించి నన్ను పునర్జీవింప జేశారు-


రైల్ ప్రమాదము, తాను కోమాలో ఉన్న కాలము వాళ్ళు చెప్పితేనే తెలిసింది ఇప్పుడు మిమ్ముల చూడ గలుగుతున్నాను అని బోరున విలపించుతాడు నందకిశోర్. అందరు మరి ఒకసారి శోక సముద్రములో మునిగి పోతారు- ఇంతలో పిల్లలు లేవగానే వారిని గట్టిగా హత్తుకుంటాడు ఏడుస్తూ నందకిశోర్.


అంత దుఃఖము లో ఉండి కూడా తమ వదినను అనుమానంగా చూసీ చూడనట్టు వ్యవహరించడము శ్రీధర్ - ఫణిధర్ లకు మనుసుకు జుగుప్స కలిగిస్తుండి- ఇక ఆగకుండ అతని అనుమాన నివృత్తికై పదవనాడు సరిగిన సంఘటన యావత్తు వివరిస్తారు శ్రీధర్, ఫణిధర్-


ఇప్పుడు మాత్రము వదిన మాకు అమ్మస్థానము ఆక్రమించినదన్న ఆనందము కలిగి దుఃఖము నుండి ఉపశమనం కలుగుతున్నది అన్నయా అని ఏడుస్తారు శ్రీధర్- ఫణిధర్.


ఇల్లు గడువడానికి పిల్లలకు చదువు చెప్పుచున్నామని కూడా వివరిస్తారు. మా వదిన సార్థక నామధేయురాలు అంటారు.


అంతా విని మనుసులో పొడసూపిన అనుమాన నివృత్తితో అపరంజి చెంతకు చేరి చేతిని తిరగేసి ముద్దు పెట్టుకుంటాడు నందకిశోర్.


సమాప్తం.

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


32 views0 comments

Comments


bottom of page