'Nene Indian' - New Telugu Story Written By Pitta Gopi
'నేనే ఇండియన్' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
ఈ కాలంలో భారతదేశంలో భారత భూభాగ రక్షణ బలమైన సైనిక వ్యవస్థ తో కూడుకున్నదని, భారత భూభాగం పై అక్రమంగా అడుగుపెట్టాలన్నా.. ఆక్రమించుకోవాలన్న నూటికి నూరు శాతం శత్రు దేశాలు ఆలోచనలో పడతాయి.
అంతటి సైనిక బలం మన దేశం సొంతం.
కొన్ని పెద్ద దేశాల కంటే మన సైనిక సంఖ్య, ఆయుధ సంపత్తి తక్కువే అయినా మన దేశం జోలికి రావాలంటే భయపడే దేశాలు ఉన్నాయంటే కారణం భారతదేశంలో ఒక్కో సైనికుడు పది నుండి ఇరవై మంది శత్రు సైనికులను ఆయుధం లేకుండా కొట్టగలిగే బలం మన సైనికులకు ఉంది కాబట్టి.
ఇకపోతే కొందరు ముష్కరుల దొంగచాటు దాడుల్లో రోజు వందల సంఖ్యలో మన సైనికులు నేల రాలుతూనే ఉంటున్నారు.
భారతదేశంలో గత కొంతకాలంగా ఉగ్రదాడులు, ముష్కరులు పన్నాగాలు వాళ్ళు చేసే దాడులు తగ్గిపోయాయి.
కారణం ఏంటంటే గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుండి భారత సైనిక ఇంటిల్జెంట్, నిఘా వర్గాలకు ఉగ్ర దాడులు, చొరబాట్లు విషయాలు పక్కా సమాచారం వస్తుండటం.
ఎప్పటిలాగే మరో గుర్తు తెలియని నంబర్ నుండి భారత ఆర్మీ వర్గాలకు ఫోన్..
"కాశ్మీర్ లో కుప్వారా లో ఉగ్రమూకలు చొరబాటుకు ప్రయత్నం చేస్తున్నారు" అని.
వెంటనే కొంతమంది సైనిక బలగం అక్కడికి వెళ్ళి గాలించగా బారీ సొరంగం బయటపడింది.
ఇంకో రోజు పుల్వామా లో ఆర్మీ వాహనాలు పై దాడి జరిగే అవకాశం ఉందంటు సమాచారం అందగా ముందస్తు జాగ్రత్తగా మరో సైన్యం ను రంగంలోకి దింపి దాడి అడ్డుకోవటమే కాక ఉగ్రవాదులు ను పట్టుకున్నారు సైనికులు.
చివరగా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో డిల్లీలో ఎర్రకోటపై దాడికి ప్రణాళికలు వేశారని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు రాగా ఎర్రకోటకు భారిగా సైనిక మొహారింపులు, నిఘా వర్గాలు మాటువేసి దాడిని భగ్నం చేసి ఆయుధాలు, పేలుడు సామగ్రి ఉగ్రవాదులను పట్టుకున్నారు.
అయితే ఇంతటి విలువైన సమాచారం గుర్తు తెలియని నంబర్ల నుండి రావటంతో సైనిక వర్గాలు ఫోన్ చేసే వ్యక్తి ని పట్టుకోవాలని నిఘా పెట్టాయి.
వాళ్ళు అతన్ని పట్టుకునేందుకు. కొన్ని రోజులు పట్టగా ఆ సమయంలో కూడా మరో నాలుగైదు భారి ఉగ్రదాడులను, చొరబాట్లను గుర్తు తెలియని నంబర్ సమాచారం తో నిలువరించగల్గారు మన సైనికులు.
చివరకు అసలు ఇది ఇళ్ళేనా అనిపించే ఓ చిన్న పూరి గుడిసెలో గుర్తు తెలియని వ్యక్తిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు
అతను ఇచ్చేది మంచి సమాచారమే అయినా.. గుర్తు తెలియని నంబర్లు నుండి ఫోన్ చేస్తుండటంతో ఉగ్రవాదిగానే పొరబడి చావకొట్టి మరీ అదుపులోకి తీసుకున్నారు సైనికులు.
అతను బలిష్టమైన వ్యక్తి. గుబురుగా గడ్డం ఉంది. ఎంత అడిగినా ఏ సమాధానం చెప్పక నోరు మెదపకపోవటంతో గట్టిగా కొట్టారు.
చివరకు పై అధికారుల సూచనలతో అతను ఉండే ఇంటిని పరిశీలించారు.
చూసేందుకు ఫూరి గుడిసె అయినా అత్యాధునిక టెక్నాలజీ సెన్సార్ లతో కూడిన నెట్వర్క్, సిగ్నలింగ్ వ్యవస్థ, కంప్యూటర్ లు లాప్టాప్ లు, వందల కొద్దీ సిమ్ కార్డులు, ఒక డైరీని చూశారు. స్వాధీనం చేసుకున్నారు.
ముందుగా ఆ డైరీని ఓపెన్ చేయగా తొలి పేజీలో లవ్ ఇండియన్ ఆర్మీ అని వ్రాసి ఉంది. పేజీ కి కుడిగా ఆర్మీ డ్రెస్ తో ఒక పాస్పోర్ట్ సైజు ఫొటో 2016అని, ఎడమ పక్క అదే వ్యక్తి పారా కమాండో డ్రెస్ తో 2021 అని ఉంది.
అతని పేరు విశ్వాస్ (ఆంధ్రప్రదేశ్ వాసి డిల్లీలోనే మాకం. ) 2015లో కఠోర సైనిక శిక్షణ అనంతరం 2016నుండి ఐదేళ్ల పాటు భారత ఆర్మీ లో పనిచేసి శత్రువులు గుండెల్లో గుబులు రేకెత్తించాడు.
"భారత సైనికులు కు కండబలం ఎక్కవే కానీ.. వారి కండబలానికి రెండు తూటాలు చాలు" అనే శత్రు సైన్యానికి
" రెండు తూటాలకు నేలకూలే వాడు నా దేశంలోనే ఇంకా ఎవడు పుట్టలేదురా" అంటూ మాటలతోనే భయపెట్టే ధీశాలి.
తాను పని చేసే దగ్గర ఏ దాడులు జరగవు. ఎందుకంటే ఆ ప్రాంతంలో విశ్వాస్ ఉన్నాడు అతనితో పెట్టుకుంటే పని జరగకుండానే ప్రాణాలు పోతాయని శత్రువులకు బాగా తెలుసు.
అంతటి గొప్ప బలమైన సైనికుడు విశ్వాస్. కేవలం తానొక్కడే కాక తనతో పని చేసే ప్రతి ఒక్క సైనికుడికి తనలాగే తయారు చేయటంతో భారత సైన్యం బలంగా మారింది.
ఈ దశలో ఎన్నో అవార్డులు అందుకుని పారా కమాండో గా నియామించబడ్డాడు. అక్కడ కూడా రెండేళ్ళు పాటు మెరుపు వేగంతో పని చేశాడు.
అతని కారణంగా భారత సైనికులు మరణాలు దాదాపు సగం తగ్గిపోయాయి. సైనికులు అందరూ విశ్వాస్ కి ఎంతో గౌరవిస్తారు.
ఇలా ఉండగా ఒకనాడు విశ్వాస్ కి ఓ సస్పెన్షన్ కాగితం అందింది. అది చూసి షాక్ అయ్యి పై అదికారులును అడగ్గా ఆ కాగితం నిజమేనని తేలింది.
ఇక్కడ బాధ పడాల్సిన విషయం ఏంటంటే.. దేశం కోసం ఎప్పటికైనా చావక తప్పదు. అందుకే తన కోసం తన వారు ఎందుకు బాధ పడాలని అసలు పెళ్ళే చేసుకోలేదు. తల్లిదండ్రులు చిన్నప్పుడే కోల్పోయిన విశ్వాస్ నా అనేవారు లేక దేశ ప్రజలే నా వాళ్ళు, వారికోసమే పని చేస్తా అంటూ ఒక్క రోజు కూడా లీవ్ పెట్టలేదు.
డైరీని మూసేసి గుర్తు పట్టలేనంతగా ఉన్న విశ్వాస్ ని లేపి
" రేయ్.. చెప్పరా ఎవరు నువ్వు.. ఈ డైరీ నీ వద్దకు ఎలా వచ్చింది" అడిగారు సైనికులు.
మెల్లగా కళ్ళు తెరిచి పౌరషంతో నిలబడి
"నేనే ఇండియన్, నా పేరు విశ్వాస్.. విశ్వాస్ మిత్రా” అంటూ
తన కుడి కాలి బూటుని నేలకు గట్టిగా తన్ని చెప్తాడు.
తేరుకున్న సైనికులు అతనికి సెల్యూట్ చేస్తారు.
వెంటనే కొంతమంది సైనికులు బయటకు పరుగులు తీసి మంచినీళ్ళు, సెలైన్, సోఫా, ఫ్యాన్ మొదలైనవి తెచ్చి విశ్వాస్ కి సవర్యలు చేస్తారు.
అనంతరం అతనికి స్నానం చేయించి జుట్టు, గడ్డం కత్తిరించి ఒకప్పటి సైనికుడిలా తయారు చేసి పై అదికారులు కు సమాచారం అందించగా వాళ్ళు తెలివిగా ఆలోచించి అతనితో మాట్లాడుతారు.
"ప్రభుత్వం ఆదేశాలు మేరకే విశ్వాస్ ని సస్పెండ్ చేసినట్లు, విశ్వాస్ భారత సైనిక వ్యవస్థ కు వెన్నెముక అని తెలిసినా.. తప్పలే"దంది.
"కారణాలు లేకుండా సస్పెన్షన్ కి గురయినా.. ఆర్మీ పై, దేశ ప్రజలపై ప్రేమతో తాను సైనికులకు విలువైన సమాచారం అందిస్తూ ఇంతకాలం ఎవరికి తెలియకుండా ఉండటం దురదృష్టం అని, నిజమైన ఇండియన్ విశ్వాశేనని
గౌరవ వందనం చేసి విశ్వాస్ ని తన పనిని తాను చేసుకోవచ్చని, ఉద్యోగం లో లేకపోయినా తాను ఎప్పుడు భారత సైనికుడిగానే మేం కీర్తిస్తా"మని చెప్పి వైద్యం అందాక పంపిస్తారు ఆర్మీ అదికారులు.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments