అప్పల నర్శకి దెయ్యం పట్టింది
- Patrayudu Kasi Viswanadham

- Mar 18, 2025
- 5 min read
#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #AppalaNarsakiDayyamPattindi, #అప్పలనర్శకిదెయ్యంపట్టింది, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Appala Narsaki Dayyam Pattindi - New Telugu Story Written By Patrayudu Kasi Viswanadham Published In manatelugukathalu.com On 18/03/2025
అప్పల నర్శకి దెయ్యం పట్టింది - తెలుగు కథ
రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఏటి సంగతి అప్పయ్యమ్మ ఇంటి కాడినుంచి తెగ జనం వత్తాన్నారు" అని అడిగింది సింహాచలం, ఏటికెళ్ళి వస్తున్న ఎల్లమ్మని.
"నిన్న రేతిరి నడుపూరి ఎంకడి కూతురు అప్పల్నర్సకి దెయ్యంపట్టినాదట. సూసి వత్తాన్నారు సిమ్మాచలమా." అంది ఎల్లమ్మ.
"ఇంతకీ ఆ దెయ్యం ఎవురంటావ్" అని ఆసక్తిగా అడిగింది సింహాచలం.
"ఏమో నాకూ తెలవదు! ఓ పాలి ఎల్లి సూసొద్దాం వత్తావేటి?." అంది ఎల్లమ్మ.
"పద బేగి ఎల్లొద్దాం. అటినుంచి వొచ్చి నూ మొక్కలకి గొప్పు ఆడించాలి" అనుకుంటూ ఇద్దరూ వెంకడి ఇంటికి బయలు దేరారు.
"ఇదివరకులా అడుగుతీసి అడుగెయ్యనేకపోతన్నానే. మునుకులు పట్లు ఒగ్గేసినాయి" అంది ఎల్లమ్మ నడవలేక బాధపడుతూ.
"అందరిదీ అదే కత. వయసైపోయాక అంతే" అంది సింహాచలం మూల్గుతూ.
ఇద్దరూ వెంకడి ఇంటికి చేరుకున్నారు. వెంకడి భార్య అప్పయ్యమ్మ కూతురిదగ్గర కూర్చుని బోరు బోరున విలపిస్తోంది.
వీరిద్దరిని చూసి.. "నర్సా, నేయే. సిమ్మంచలం బాప్పని సూడే" అని లేపినా ఉలుకూ లేక పలుకూ లేక శవం లా పడివుంది అప్పలనర్స.
"ఎల్లమ్మ సెప్పినాది నర్సకి బాగో నేదని. అసలేటైనాదేటి?" అని అడిగింది సింహాచలం తెలుసుకోవాలనే ఆసక్తితో.
"నిన్న ఏకావలే లేసి ఇంటికాడ పనులన్నీ సేసి, ఆ యెనక సల్దన్నం తిని ఈకడి నూ మొక్కలకి గొప్పు తవ్వడానికెల్లింది. మద్యాన్నాలు తిన్నాక, మెరక మూలకి పశువులు తోలుకెల్లింది. సాయంత్రం పంతులు గోరింటికాడ పనిసేసొచ్చి, ఆనక ఏటికెల్లి కడవతో నీల్లు తెచ్చినాది. ఆ తరువాత ఏటైనాదో పిచ్చి పిచ్చిగా అరవడం మొదలెట్టినాది. గిరగిరా తిరగేసి, గుడ్లు మిటకరించి సూసి, ఈరంగం ఎత్తిపోనాది.
పెంటీది, గోరీది ఈదులన్నీ పరుగులు తీసినాదట. ఎందరు అడ్డుకున్నా ఆగనేదట. ముగ్గురు మగోల్లని ఏమికాకుండా తోసేసినాదట" అంది అప్పయ్యమ్మ.
"దెయ్యానికి సానా బలముంటాది" అంది ఎల్లమ్మ తెలిసినదానిలా.
"ఇంతకీ ఏ దెయ్యం వోలిందో తెలిసినాదేటి" అని అడిగింది సింహాచలం.
"ఏటి సెప్పమంతావు నాను, మీ అన్న ఎల్లనేక ఇంటికాడే ఉన్నాము. జనాలు దాని ఎనకాల పరుగెత్తినారు. ఇంతలో కల్లం కాడినుంచి పెద అప్పలనాయుడు బావొచ్చినాడు ఆడికి దెయ్యాన్ని వొదల గొట్టడం బాగా తెలుసట. ఆడితోపాటు బుల్లడు, ఈకడు, డబ్బాలుగోడు, మంచం దండిగోడు అందరు కలిసి అమ్మిని పట్టుకున్నారట.
"నాను సెప్పినట్టు ఏప మండలతో సిదగొట్టండి. దెయ్యం దెబ్బకి దిగొత్తది" అని అప్పలనాయుడు బావ సెప్పగానే గొడ్డుని బాదినట్లు బాదీనారు.
ఒళ్ళు ఊనం సేసీనారు. అలా కొట్టుకుంటూ మా ఇంటికాడికి ఈడ్సుకొచ్చినారు. దానిని సూసి నాగుండె బద్దలైపోనాది.
ఆ మాయదారి దెయ్యం దీనిమీదే వాలాలా! ఎంత కట్టమొచ్చినాదో నాతల్లికి అని అనుకుంతూ ఉండగానే ఆరతి బిల్లలు కావాలని అప్పలనాయుడు బావ కేకేసినాడు. ఆరతి బిల్లలు ఇంట్లోనేక పొట్టి సావుకారి కొట్టుకాడ తెప్పించి యిచ్చినాను.
ఏటి సేత్తారా అని సూడబోతే ఇంకేటుంది.. కాల్లని ఇద్దరు సేతుల్ని ఇద్దరూ గట్టిగా అదిమి పట్టుకుని అమ్మి అరసేతుల్లో ఆరతి బిల్లలు ఎలిగించినారు. సేతులు కాలి మంటెడుతుంటే కొండ ఇరిగిపడినట్లు గగ్గోలెట్టినాది.
కాసేపటి తర్వాత దెయ్యం వొగ్గేసినాదని మాయదారి మంద ఎవులిల్లకి ఆల్లు ఎల్లిపోనారు. రేతిరంతా కంటిమీద కునుకు నేదు. మంట మంటని ఏడుస్తూనే ఉంది. ఈ యాల ఆలయ్య భూతాల సంకరయ్యని తీసుకొత్తానంటన్నాడు. ఆడికి నల్ల కోడి పెట్ట, ముంతకల్లు, నల్లజేకట్టుముక్క, నూట పదార్లు, ఇత్తే దెయ్యాన్ని వొదలగొడతాడట. నాకేటీ తోచనేదు. పిల్ల సూత్తే పచ్చినాగ పడిపోనాది".. అంది అప్పయ్యమ్మ దు:ఖం తో....
ఆ మర్నాడు గ్రామానికి ఎ.ఎన్.ఎం. వచ్చింది అప్పలనర్స పరిస్థితి చూసి నిర్ఘాంతపోయింది. నర్స తల్లిని మందలించింది.
“మీ మూర్ఖత్వం తో దెయ్యమని భూతమని నరకహింసలు పెట్టారు. ఆడకూతురని కూడా ఆలోచించలేదు.. ఆడపిల్ల కూలీనాలీ చేసి సంపాదించి మిమ్మల్ని పోషిస్తూ ఉంటే కష్టపడాల్సిన కొడుకు తిని ఊరు మీద తిరుగు తున్నాడు. ఈడొచ్చిన పిల్లకి పెళ్ళిచెయ్యాలని తలంపులేదు మీకు. కూతురు సుఖసంతోషాల గురించి తల్లిదండ్రులుగా మీరెప్పుడూ ఆలోచించలేదు. అందుకే అది అలా తయారయ్యింది. త్వరగా పట్నంలో డాక్టరుకి చూపించండి నయమౌతుంది” అంటూ కొన్ని మాత్రలను వాడమని ఇచ్చింది.
కొద్దిరోజుల తరువాత నర్సని పట్నంలో డాక్టరుకి చూపించారు అప్పయ్యమ్మ దంపతులు.
డాక్టరుగారు నర్సని అడిగి అన్ని విషయాలు తెలుసుకుని నర్సని గది బయట కూర్చోమన్నారు.
తల్లి దండ్రులిద్దరికీ ఇలా చెప్పసాగారు.
"దీనిని హిస్టీరియా అంటారు. ఇది ఎక్కువగా పెళ్ళికాని ఆడ పిల్లల్లోను, పెళ్ళి అయి ఆశించిన సుఖాన్ని భర్త నుంచి పొందని ఆడవాళ్ళలోను, ఒంటరి తనంతో బాధపడేవారిలో ఎక్కువగా ఈ లక్షణాలు కనపడతాయి.
ఇది ఒక మానసిక సమస్య. మందులు వాడటంతో పాటు తల్లిదండులుగా మీ బాధ్యతని తెలుసుకుంటే సమస్య పరిష్కారమౌతుంది" అని మందులు రాసిచ్చి పదిహేను రోజుల తర్వాత రమ్మన్నారు డాక్టరుగారు.
మందులు క్రమంతప్పకుండా వాడి డాక్టరుకి చూపించుకుంది. ఇప్పుడు అప్పల నర్స ఆరోగ్యంగానే కాదు మనసిచ్చిన వాడిని మనువాడటంతో ఆనందంగా ఉంది.
***
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
Patrayudu kasi viswanadham
విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ.,
ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).
స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం
విజయనగరం జిల్లా.
నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట)
వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.
ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం
ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.
సేకరణలు:
**********
1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సంకలనాలు :
1.గురజాడ శతవర్ధంతి
కవితా సంకలనం లో
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని' సంకలనం లో
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
4.'రక్త బంధం',
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.
6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం' సంకలనం లో
7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో
10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో
11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో
13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.
🌷🌷🌷🌷🌷🌷🌷
బహుమతులు
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.
3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
బిరుదులు :
1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,
3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,
4.శతశ్లోక కంఠీరవ,
5.సూక్తిశ్రీ,
6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"
7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016
8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.
9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్ పురస్కారం 2017,
10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో
11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.
12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023
🌹🌹🌹🌹🌹🌹🌹
ముద్రించిన పుస్తకాలు :
1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),
2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).
3.*దేవునికో ఉత్తరం* బాలల కధా సంపుటి
4.*అద్భుతం* బాలల కథా సంపుటి
5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.
6.తాతయ్య కల బాలల కథా సంపుటి.
అముద్రితాలు
1*మౌనమేలనోయి* కథల సంపుటి
2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి
3*నీకోసం* భావ కవితా సంపుటి.
4చెట్టు కథలు
5 పేదరాశి పెద్దమ్మ కథలు
6 మృగరాజు సందేశం కథల సంపుటి
ఇష్టాలు
పిల్లలతో గడపడం
బాలసాహిత్య పఠనం
బాలసాహిత్య రచన
ప్రచురణలు
ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120, ప్రచురణ అయ్యాయి.
🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷




Comments