top of page
Original.png

ఆశల అమావాస్య

Updated: Feb 7

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #AsalaAmavasya, #ఆశల అమావాస్య

ree

Asala Amavasya - New Telugu Poem Written By - Bulusu Ravi Sarma

Published In manatelugukathalu.com On 31/01/2025

ఆశల అమావాస్య - తెలుగు కవిత

రచన: బులుసు రవి శర్మ


అమావాస్య ఆకాశం 

చీకటి గోడకి

ఆశల నక్షత్రాలు 

మినుకు మినుకు మంటూ

 వ్రేళ్ళాడు తున్నాయ్


ఇంటిముందు

చీకటిని ఒంటినిండా ములుముకున్న

చింత చెట్టు నిండా

ఆశల మిణుగురులు

మెరుస్తున్నాయి


శిధిలమైన పాక ముందు

నల్లటి కళ్ళాపి 

ఆశల చుక్కల ముగ్గు నవ్వుతోంది


చీకటితో పోరాడలేని దీపం

చివరి సంకేతంగా

ఆవిడ చేతిలో వున్న చాటకి 

నల్లరంగు పులిమింది


నక్షత్రాలు..

మిణుగురులు..

చుక్కలు.. 

చాటలో

బియ్యపు గింజలు..


ఆకాశంలా వున్న ఆమె 

కళ్ళలో ఒక్కలా

మెరుస్తున్నాయి


-బులుసు రవి శర్మ 




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page