top of page

అశ్వ మేధం ఎపిసోడ్ 10


'Aswamedham - Episode - 10' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy

'అశ్వ మేధం - ఎపిసోడ్ - 10' తెలుగు ధారావాహిక

రచన : గన్నవరపు నరసింహ మూర్తి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


చరణ్ ఒక లా గ్రాడ్యుయేట్. ఢిల్లీలో జరిగే ఒక కోర్స్ కి అటెండ్ అవుతాడు. అక్కడ అతనికి సౌదామిని అనే యువతి పరిచయం అవుతుంది. ఇంటికి తిరిగి వచ్చిన చరణ్ ని శాంతి అనే యువతి కలిసి న్యాయ సహాయాన్ని అభ్యర్థిస్తుంది.


సుక్కు అనే గిరిజనుడు చనిపోయిన సంఘటనను తన భర్త చైతన్య వీడియో తీసాడనీ, ఆ కోపంతో పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారనీ చెబుతుంది ఆమె. చరణ్, కేస్ వేయడంతో చైతన్యను కోర్ట్ లో హాజరుపరుస్తారు పోలీసులు. అతను బెయిల్ పై బయటకు వస్తాడు.


చరణ్ ఇంట్లో విహారి ఫోటో చూస్తుంది సౌదామిని. అతడు తన స్నేహితురాలు దీపను మోసం చేసాడని చెబుతుంది. విహరితో తన పరిచయం గురించి సౌదామినికి వివరిస్తాడు చరణ్.


సౌదామినిని తాను పనిచేసే కంపెనీ లో చేరమంటాడు చరణ్. అలాగే చేరుతుంది సౌదామిని.


జాతీయ హరిత ట్రిబ్యునల్ సెక్రటరీ రాఘవన్ ని ఎవరో హత్య చేస్తారు. ఆ సంఘటనను చూసిన దీప ను కూడా చంపాలని ప్రయత్నిస్తారు. రాఘవన్ హంతకుల చిత్రాలు గీస్తుంది దీప. పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ఫోటోలను గుర్తు పడుతుంది. రాఘవన్ హత్యకేసు విచారణలో చరణ్ బాగా వాదిస్తాడు.

దీప తండ్రి పరమేశ్వరం గారిని కలుస్తాడు చరణ్. దీప, విహరిలకు పెళ్లి చెయ్యమని కోరుతాడు.



ఇక అశ్వ మేధం ఎపిసోడ్ 10 చదవండి..


వారం రోజుల తరువాత రాఘవన్ హత్య కేసు మళ్లీ మొదలైంది.


పబ్లిక్ ప్రాసిక్యూటర్ సన్యాసిరావు ఒక సీల్డ్ కవర్ కోర్టుకి సమర్పిస్తూ "డిఫెన్స్ వారు ఆరోపించడం వల్ల పోలీసుశాఖ చక్రపాణి పై ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. దాన్ని ఏఎస్పీ స్థాయి అధికారికి అప్పచెప్పింది; ఈ సీల్డ్ కవర్ లో వున్నది అతనిచ్చిన రిపోర్ట్; ఆ రిపోర్టు ప్రకారం ఇద్దరు నేరస్తులను బీహార్ నుంచి ఒక కేసు విషయమై ఇక్కడకు తీసుకురావడం జరిగింది కానీ వాళ్ళు హత్య జరిగిన సమయంలో లాకప్పులో ఉండటం వల్ల వాళ్ళు హత్య చేసే అవకాశం లేదు. కాకపోతే సాక్షి దీప తాను ప్రత్యక్షంగా చూసాను అని కేసులో చెప్పడంవల్ల వాళ్లను ముద్దాయిలుగా పేర్కొనటం జరిగింది. ఆ మర్నాడు వాళ్ళని వదలి పెట్టడం జరిగింది. మా పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి వారిని బీహార్ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది.


కానీ దురదృష్టవశాత్తు అక్కడ పోలీసులు వాళ్ళని విడిచిపెట్టడంతో వారిని పట్టుకోవడానికి సమయం పడుతోంది. అయినా సరే వారం రోజుల్లో వారిని పట్టుకొని కోర్టువారి ముందు హాజరు పరుస్తాం” అని చెప్పాడు;


వెంటనే చరణ్ లేచి " యువరానర్... ప్రభుత్వ ప్లీడర్ గారు హత్య జరిగిన సమయంలో విక్రమసింగ్, రాంసింగ్ లిద్దరూ లాకప్పు రూమ్ లోనే ఉన్నట్లు చెబుతున్నారు. కానీ సాక్షి దీపగారు మాత్రం వాళ్ళను తాను చూసానని చెబుతున్నారు. ఒక వేళ నిజంగా వాళ్ళు లాకప్పులోనే ఉంటే దీప వాళ్ళ చిత్రాలను ఎలా చిత్రించింది? ఆమె వాళ్ళనెప్పుడు చూడలేదు;పోలీసులు చెబుతున్నట్లు వాళ్ళు హత్య చెయ్యకపోతే వాళ్ళని ముద్దాయిలుగా ఎందుకు చెబుతున్నారు? అప్పుడు వాళ్ళని పట్టుకొని హాజరుపర్చడం వల్ల ఉపయోగ ఏంటి? అంటే ఈకేసులో ప్రభుత్వం సరిగ్గా విచారించలేదని తెలుస్తోంది.


ఒకవేళ ప్రభుత్వ వాదన ప్రకారం వాళ్ళిద్దరూ ముద్దాయిలు కాకపోతే మరి హంతకులెవ్వరు? కేసు పురోగతి, స్టేషన్ రిపోర్ట్ ఎందుకివ్వలేదు? ఏదైన ఈ కేసులో చక్రపాణిని విచారిస్తే చాలా విషయాలు తెలుస్తాయని నాభావన. కాబట్టి కోర్టు వారు చక్రపాణి సి.ఐ. గారిని ఇంటరాగేషన్ చెయ్యడానికి అనుమతివ్వమని కోరుతున్నాను.” అన్నాడు చరణ్ కూర్చుంటూ..


“పెర్మిషన్ గ్రాంటెడ్” అన్నారు జడ్జి.


పది నిముషాల తరువాత చక్రపాణి ని బోనులో ప్రవేశపెట్టారు;


అప్పుడు చరణ్ అతన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు;

"మీ పేరు”


“ చక్రపాణి"


మీరు ఆపోలీస్ స్టేషన్లో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు?


* సుమారు 3 సంవత్సరాల నుంచి ”


“ మీకిది వరకు విక్రమ్ సింగ్ , రామ్ సింగ్ లు తెలుసా?”


“ప్లీజ్.. డోంట్ బీ సిల్లీ.. వాళ్ళు నాకు తెలియడం ఏమిటి?”


" మరి వాళ్ళని అప్ప చెప్పమని బీహార్ ప్రభుత్వానికి ఎందుకు ఉత్తరం రాసారు?”


" రెండు సంవత్సరాల క్రితం వాళ్ల గేంగ్ వచ్చి మన రాష్ట్రంలో ఎన్నో దొంగతనాలు చేసింది. వాళ్లని చెడ్డీ గ్యాంగ్ లని అంటారు. వీళ్లు చాలా తెగింపు కలిగిన ముఠా; అవసరం అయితే ప్రాణాలు కూడా తీస్తారు. సుమారు రెండు నెలలు క్రితం ఈఊళ్లో ఓ ఇంట్లో దొంగతనం జరిగి ఆఇంటి యజమానిని రాడ్ తో కొట్టి చంపారు. ఆ దొంగతనం కేసులో వీళ్ళు అనుమానితులు; అందుకే వాళ్ళని పిలిపించాము.”


" మీరు సంతకం చేసి ఆలెటర్ని పంపారు. నిజానికి అంతర రాష్ట్రాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసినపుడు ఎస్పీ అధికారి సంతకం చేయ్యాలి. కానీ మీరు ఎందుకు దానిమీద సంతకం చేశారు? ఆఉత్తరం రాస్తున్నట్లు ఎస్పీ గారికి తెలుసా?”

“ సంతకం ఎవరిదన్నది ప్రాధాన్యత కాదు; ఆయన అనుమతితోనే రాసాను; “


"హత్య జరిగిన రోజు రాత్రి ఎస్సై సీతారామారావు గారిని మీరు ఎందుకు బయటకు పంపవలసి వచ్చింది?"


"ఆ సమయంలో స్టేషన్లో ఇంకెవ్వరూ లేరు. అందుకు పంపవలసి వచ్చింది?"


" కానీ ఆ గొడవ జరిగిన స్తలం అతని పరిధి కిందకి రాదు; మరి అతన్ని ఎందుకు పంపారు?”


“ఒక్కోసారి ఎవరూ లేనపుడు తప్పక పంపిస్తాం”


“ అంటే హత్య జరిగిన సమయంలో మీరు ఒంటరిగా స్టేషన్లో ఉన్నారు. విక్రంసింగ్, రాంసింగ్ లిద్దరూ లాకప్పులో ఉన్నారు.. అంతేనా"?


“ అవును.. అంతే”


మరి ఈహత్య ప్రత్యక్షంగా చూసిన సాక్షి దీపగారు మాత్రం వాళ్ళిద్దర్నీ హత్య చేస్తుండగా తాను చూసానని చెబుతోంది;”


“ అది పూర్తిగా తప్పు.. ఆసమయమంలో వాళ్ళు లాకప్పులో ఉంటే హత్య ఎలా చేస్తారు. ఇది శుద్ధ అబద్ధం.. అయినా రాత్రి 11 గంటల సమయంలో అక్కడ పెద్దగా లైటింగ్ ఉండదు. వాళ్లిద్దరినీ అంత కరెక్టగా ఆవిడ ఎలా చూడగలిగింది? ఇదివరకు వాళ్లని ఆవిడ ఎప్పుడైనా చూసి ఉంటే తప్పా ఆ సమయంలో వాళ్లని గుర్తించడం కష్టం.. ఇది కావాలని చెబుతున్నట్లుగా ఉంది.” అన్నాడు చక్రపాణి.


" అసలు పోలీసుశాఖ విక్రంసింగ్, రాంసింగ్ ఫోటోలను విడుదల చేయకుండానే దీప గారు వారిద్దరి చిత్రాలను గీసి పోలీసు స్టేషన్లో సమర్పించారు. ఆవిషయాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారాం ద్వారా రూఢీ చేసుకోవచ్చు. ఆమె వాళ్ళని గుర్తుకు పట్టకపోతే వాళ్ళ చిత్రాలను ఎలా గీసింది?. ఆచిత్రాలను తీసుకెళ్ళి మీకంట్రోల్ రూమ్ లోని ఎస్సై బలరాం గారికి చూపిస్తే ఆయనే వీళ్ళిద్దరి ఫోటోలు చూపించాడు. అది కూడా వాళ్ళిచ్చిన వాజ్మాలంలో ఉంది.


కాబట్టి మీవాదన తప్పు. 9.30 దాకా వాళ్ళు లాకప్పులో ఉండటం నిజం. కానీ ఎస్సై సీతారామారావ్ గారిని కావాలనే మీరు బయటకు పంపించి ఆ తరువాత వాళ్ళిద్దరినీ మీరే స్వయంగా బయటకు పంపించి ఆహత్య జరిగేలా చూసారు. ఇది ముమ్మాటికి నిజం." అని చరణ్ చెప్పాడు;


వెంటనే ప్రభుత్వ ప్రాసిక్యూటర్ సన్యాసిరావు లేచి నిలబడి " అబ్జెక్షన్ యువరానర్.. హత్య ఎలా జరిగిందో ఒక కధలా వ్రాసుకొని ఇక్కడ చెబుతున్నారు డిఫెన్స్ లాయర్ గారు. ఇంకా కేసు ఇన్వస్టిగేషన్ స్థాయిలోనే ఉన్నపుడు అలా జరిగిందని ఎలా చెప్పగలుగుతున్నారు. కేవలం సాక్షి వాజ్మాలంతోనే కేసు పూర్వాపరాలు తేలిస్తే ఇంకా పోలీసులెందుకు.?పరిశోధన ఎందుకు? అతను కోర్టుని తప్పుదారి పట్టిస్తున్నాడు” అన్నాడు గట్టిగా.

"అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్"... అన్నారు జడ్జి గారు;


" థ్యాంక్స్ యువరానర్! ఈకేసులో ఆసలైన కీలకమైన సాక్షి దీపని ప్రవేశపెట్టమని కోర్టు వారిని కోరుతున్నాను” అని చరణ్ జడ్జి గారిని కోరగానే అతని కోరికను కోర్టువారు సమ్మతించారు.


కొంచెం సేపటికి దీప బోనులోకి వచ్చింది.


" మేడం ఆరోజు ఏంజరిగింది? అంతరాత్రి పూట మీరెందుకు ఆజంక్షన్ దగ్గరికి వెళ్లారు?”.


“ ఆరోజు నేను నా స్నేహితురాల్ని రైల్వేస్టేషన్లో కలవటానికి వెళ్లేను. ఆమెతో మాట్లాడి నేను ఆటోలో యూనివర్సిటీ కి వెళ్తున్న సమయంలో ఆ దారుణ హత్యని చూసాను. ఒక కారుని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్ పై వచ్చి గట్టిగా ఢీకొనడం, ఆకారు డ్రైవర్ గాయపడటంతో కిందకు పడిపోవడం, అది డివైడర్ని ఢీ కొనడం, ఆతరువాత ఆ ఇద్దరు వ్యక్తులు పరుగున వచ్చి ఆవ్యక్తిని కత్తులతో పొడిచి పారిపోవడాన్ని నేను అతి దగ్గరగా అంటే ఓ 20 అడుగుల దూరం నుంచి చూసాను.


అప్పుడక్కడ లైటింగ్ బాగా ఉండటంతో వాళ్లిద్దర్నీ స్పష్టానంగా చూడగలిగాను; నా సెల్ ఫోన్ లో ఫోటో తీద్దామనుకున్న సమయంలోనే వాళ్ళు మాయమయ్యారు. అందుకే వాళ్ళరూపం నామెదడులో నిక్షిప్తమైంది. ఇంటికి వెళ్లిన తరువాత వాళ్ళ చిత్రాలు గీసాను" అంటూ తను వేసిన చిత్రాలను చరణ్ కి అందిచ్చింది. చరణ్ వాటిని కోర్టుకి సమర్పించాడు.


"దట్సాల్ యువరానర్! ఈకేసులో అన్ని విషయాలు బయటకు వచ్చాయి అనే అనుకుంటున్నాను. ఆ రిపోర్ట్ బయటకు రాకూడదని రాఘవన్ని వాళ్ళు బెదిరించారు. ఆకంపెనీ యాజమాన్యం తమ కాంట్రాక్ట్ రద్దువుతున్న భయముతో అతన్ని భయపెట్టింది. కానీ అతను నిజాయితీ పరుడైన ఆఫీసర్ కాబట్టి వాళ్ళ మాట వినలేదు. అపుడు ఆ యాజమాన్యంలోని ఓ కీలక వ్యక్తి... సాంబశివరావు.. డైరక్టర్..


అతను సర్కిల్ ఇన్ స్పెక్టర్ చక్రపాణి సహాయం తీసుకొని ఈ హత్యకు పథక రచన చేశాడు;. చక్రపాణి ఇటువంటి కేసులు డీల్ చెయ్యడంలో బాగా సిద్ధహస్తుడు.. అతను ఈ క్రూర హంతకులు విక్రంసింగ్, రాంసింగ్ ల వల్లే ఈహత్య చేయించవచ్చని తెలిసీ బీహార్ నుంచి రప్పించి వాళ్ల చేత రాఘవన్ని హత్య చేయించాడు.


కాబట్టి పోలీసులు చక్రపాణి అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఆనేరస్తుల కాల్ వివరాలు నేను సేకరించాను. అందులో వాళ్లు చక్రపాణిగారి తో మాట్లాడినట్లు కాల్స్ వివరాల్లో ఉన్నాయి. హత్య జరిగిన రోజుకి వారం రోజులు ముందు వాళ్లతో పలు దఫాలు చక్రపాణి గారు మాట్లాడిన వివరాలు ఇందులో ఉ న్నాయి. కాకపోతే చక్రపాణి గారు తన అఫీషియల్ పోలీసు ఫోన్లో కాకుండా ఇంకొక తన స్వంత నెంబరు నుంచి మాట్లాడారు.

కాబట్టి ఈహత్యని చేయించింది. చక్రపాణి మరియు సాంబశివరావ్... కోర్టువారు వీటిన్నింటినీ పరిశీలించి తగు తీర్పునిస్తారని కోరుతున్నాను.” అంటూ తన వాదనలు ముగించాడు చరణ్;


వెంటనే మళ్లీ లేచి “యువరానర్.. ఇంకొక ముఖ్య విషయం మరచి పోయాను.. దీప తాను హత్యను చూసానని పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తే ఆ ఫోన్ని అందుకున్నది కూడా చక్రపాణి గారే.. అందుకే ఆమర్నాడు రాత్రి ఆమె మీద హత్యా ప్రయత్నం జరిగింది. అందుకే మేము ఈకేసుని దాఖలు చేయాల్సి వచ్చింది. కాబట్టి కోర్టువారు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూన్నాను” అంటూ కూర్చుండిపోయాడు చరణ్;


కేసులో వాదనలు ముగిసాయి. సాయంత్రం మూడు గంటలకి కోర్టు తన తీర్పు వెలువరించింది; ఈ రాఘవన్ హత్య కేసులో సర్కిల్ ఇనస్పెక్టర్ చక్రపాణికి సంబంధం ఉన్నట్లు డిఫెన్స్ వారు చేసిన వాదనతో కోర్టు పూర్తిగా ఏకీభవిస్తోంది . అందుకు సరియైన సాక్ష్యాలను ప్రవేశపెట్టిన డిఫెన్స్ లాయర్ చరణ్ ని కోర్టు ప్రత్యేకంగా అభినందిస్తోంది;


వెంటనే చక్రపాణిని అదుపులోనికి తీసుకొని మిగతా ముద్దాయిలిద్దర్ని కూడా అరెస్టు చెయ్యమనీ , ఈకేసుతో సంబంధంఉన్న మైనింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీ డైరెక్టర్నీ కూడా అదుపులోనికి తీసుకొని విచారించాలనీ పోలీసులను ఆదేశిస్తున్నాము. ఈకేసు తదుపరి విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేస్తున్నాను" అంటూ తన తీర్పుని చదివి వినిపించారు జడ్జిగారు;


ఆతరువాత సంఘటనలన్నీ త్వరత్వరగా చోటుచేసుకున్నాయి.


పోలీసులు చక్రపాణిని, సాంబశివరావులను అరెస్ట్ చేసింది. అతని ద్వారా వివరాలు సేకరించి అసలు హంతకులైన విక్రంసింగ్, రాంసింగ్ లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచడం జరిగింది. ఆకేసులో సంబంధం ఉండటం వల్ల చక్రపాణి ని సస్పెండ్ చెయ్యడం జరిగింది.


కేసులో సమర్ధమైన వాదనలు వినిపించిన చరణ్ ని విహారి, దీప, సౌదామిని అభినందించారు.


"విహారి! ఈకేసులో నాకన్నా సౌదామిని ని అభినందించాలి. ఆమె బీహార్ వెళ్లి నానా కష్టాలు పడి విక్రంసింగ్, రాంసింగ్ వివరాలు, ఆఉత్తరం తేవడంతో కేసు ముందుకు వెళ్లడానికి బాగా ఉపయోగపడ్డాయి వాటి వల్లే మనం ఈ కేసుని గెలవడం జరిగింది;" అని చెప్పాడు చరణ్;


వారం రోజుల తరువాత మైనింగ్ కేసులో కూడా వాదనలు మొదలయ్యాయి. అందులో హరిత ట్రిబ్యునల్ తన రిపోర్ట్ ని కోర్టుకి సమర్పించింది.


ఆరిపోర్ట్ లో బాక్సైట్ మైనింగ్ చుట్టు పక్కల గ్రామాల్లోని పర్యావరణానికి బాగా ముప్పుతెస్తుందనీ, తాగే నీటిని విషపూరిత చేస్తుందనీ, ప్రజలుకు కేన్సర్ వంటి ప్రమాదమైన రోగాల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ అందువల్ల ఈమైనింగ్ ప్రాజెక్టున ని కొనసాగించడం పర్యావరణానికి మంచిది కాదని సూచించింది.


దాంతో కోర్టు ఆకాంట్రాక్ట్ ని రద్దు చేసింది. ఆ మైనింగ్ ని మూసివేసి ఆప్రాంత రక్షణకు చర్యలు చేపట్టాలనీ, భవిష్యత్తులో కూడా జాతీయ హరిత ట్రిబ్యునల్, కోర్టులు అనుమతిలేనిదే ఈప్రాజెక్టుని చేపట్టరాదనీ కోర్టు ప్రభుత్వానికి సూచించింది.


ఆతీర్పుతో ఒక్కసారిగా పల్లెల్లో సంబరాలు మొదలయ్యాయి. పేపర్లన్నీ తీర్పు ప్రభుత్వానికి చెంపదెబ్బ అనీ సంపాదకీయాలు వ్రాసాయి. చరణ్ తో చాలా ఛానళ్లు ఇంటర్య్వూలు ప్రసారం చేసాయి.


అటువంటి సమయంలో ఒక ఘోరమైన విపత్తు ప్రపంచ దేశాలను కుదిపేసింది. మానవాళిని అతలాకుతలం చేసింది. ప్రపంచాని కి పెను సవాలు విసిరింది; అదే కరోనా వైరస్... చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కి చైనా మొదటిసారిగా ఈవైరస్ గురించి తెలియజేసింది.


చైనాతో సంబంధాలు ఉన్న యూరప్, అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నింటికీ ఈవైరస్ అత్యంత త్వరితంగా వ్యాపించింది.

=================================================================================

ఇంకా వుంది...

=================================================================================

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.



24 views0 comments
bottom of page