top of page

అతి గొప్పోడు


#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #AthiGoppodu, #అతిగొప్పోడు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Athi Goppodu - New Telugu Story Written By BVD Prasada Rao

Published In manatelugukathalu.com On 22/12/2024

అతి గొప్పోడు - తెలుగు కథ

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



వెంకట్రావ్ ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. నెలకు 20 వేలు జీతం.

వెంకట్రావ్ భార్య సురేఖ. గృహిణి. వీరి ఏకైక సంతానం.. ప్రమోద్. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అతడికి మెడిషన్ చదవాలని తొలుత నుండి కోరిక. అందుకై ఎన్నెన్నో కలలు కన్నాడు.. కంటున్నాడు.


కొడుకు కోరిక ఎఱిగిన వెంకట్రావ్ అందుకు సిద్ధమవుతున్నాడు. ప్రమోద్ టెన్తులో చేరినప్పుడే తన మెడిషన్ చదువు కోరికను వెల్లడించాడు. అది మొదలు వెంకట్రావ్ అందుకై ప్రతి నెల 5 వేలు చొప్పున కూడ తీస్తున్నాడు ఓ బ్యాంక్ అకౌంటున.


ఖర్చులు కుదించుకుంటూ ప్రతి నెల మిగిలిన 15 వేలుతో కుటుంబాన్ని తోసుకు వస్తున్నాడు వెంకట్రావ్. అందుకు సురేఖ కూడా సానుకూలంగా సహకరిస్తూ వస్తోంది.


ఒక్కొక్క మారు కొడుకుకై అదనం ఖర్చు పెట్టవలసి వస్తే వెంకట్రావ్ వెనుకాడడం లేదు కూడా. ఒక్కొక్క మారు ఒంటి పూటల తిళ్లకైనా ఆ భార్యాభర్తలు మొగ్గేవారే తప్పా.. కొడుకుకు అసహనం.. అసౌకర్యం కలిగించే వారు కాదు.

ఇలా సాగిపోతున్న వారి కుటుంబంన ఓ రోజున ఆకస్మికంగా ఓ చిచ్చు పొడ చూపింది.


ఆ రోజున.. వెంకట్రావ్ సైకిల్ కి ఓ లారీ విసురుగా గుద్దేసింది.

వెంకట్రావ్ చనిపోయాడు. భర్త ఉద్యోగంకై ప్రాకులాడింది సురేఖ. 

వెంకట్రావ్ పని చేసిన ఆ ప్రైవేటు కంపెనీ వారు ససేమిరా అనేసారు. సురేఖ పదవ తరగతి పూర్తి చేయలేదన్న కారణం వారు సూటిగా ఎత్తి చూపించారు. 


ప్రమోద్ ఇంటర్మీడియట్ సెకెండియర్ లో ఉన్నాడు. తన కలలు కల్లలు అనుకున్నాడు. తల్లి గందికను గమనించాడు.

తల్లి చెంతన కూర్చొని.. "అమ్మా. నేను చదువు ఆపేస్తాను. నాన్న జాబులో చేరుతాను." చెప్పాడు.


సురేఖ హైరాన పడుతోంది.

తల్లిని సముదాయిస్తుంటాడు ప్రమోద్.


"లేదురా బాబూ.. నువ్వు డాక్టర్ వి కావాలి. తొందర వద్దు." అంటోంది సురేఖ.


"అమ్మా.. నాన్న కూడతీసిందాంతో చేరినా... గట్టి రేంక్ తెచ్చుకున్నా.. నా చదువు కొనసాగడం దుర్లభం." నచ్చచెప్పే రీతిన మాట్లాడుతున్నాడు ప్రమోద్.


సురేఖ ఏమీ తేల్చుకోలేకపోతోంది.

సురేఖ.. వెంకట్రావ్ లది పెద్దలనెదిరించిన ప్రేమ పెళ్లి. దాంతో ఇరు వైపు పెద్దల సహకారం ఈ కుటుంబంకి ఎప్పుడో మృగ్యమైపోయింది.


ప్రమోద్ పుట్టిన కబురు తెలిపినా.. ఆ పెద్దలు స్పందించ లేదు. అలాగే కనీసం వెంకట్రావ్ చావు కబురు పెట్టినా వాళ్లు ఇటు కళ్లు తిప్పలేదు. కనికరం లేని కఠినత్వపు మనుషులు లేరనుకోలేం.. వీళ్ల పెద్దల్ని ఎఱిగితే.


"నాకు టైలరింగ్ తెలుసు. కుట్టు మిషన్ ఒకటి కొనుక్కుందాం. నేను నిరంతరం పని చేస్తాను." చెప్పుతోంది సురేఖ.


ప్రమోద్ నవ్వేడు. "చాల్లే. ఇప్పటి ఫ్యాషన్స్ ని నువ్వు ఏమందుకోగలవు. కుదరని పని." అనేసాడు.


సురేఖ తంటాలవుతోంది.

"నాన్న కూడా నువ్వు కుట్టడం ఇష్ట పడేవారు కాదుగా." గుర్తుచేసాడు ప్రమోద్.


ఆ వెంబడే..

"నిజమే. నాన్న కూడా నువ్వు డాక్టర్ కావాలని కలలు కన్నాడుగా." పుసుక్కున అనేసింది సురేఖ.


ప్రమోద్ గందరగోళమయ్యాడు.

"కావచ్చు. కానీ కుదరనప్పుడు ఏం చేస్తాం. అన్నీ అనుకున్నట్టు కాకపోచ్చుగా." అన్నాడు.


కొడుకు ఉసూరు పడడం సురేఖకు తెలుస్తోంది. అలానే ఏమీ చేయలేని స్థితినీ మరుగు పర్చలేక పోతోంది.


"అమ్మా.. యాపన చేస్తే.. నాన్న కంపెనీ వాళ్లూ ఖాతరు చేయరు. అందుకే కాలం గడవక ముందే వాళ్ల ముందు నా ప్రతిపాదన పెడతాను. నా చదువుకు తగ్గ పనిని కోరుతాను." చివరాఖరులా తేల్చేసాడు ప్రమోద్.


బేలగా ఉండిపోతోంది సురేఖ.

ప్రమోద్ తన చదువు పత్రాలతో వెంకట్రావ్ పని చేసిన ప్రైవేటు కంపెనీ వారిని కలిసాడు. జాబ్ కై విన్నవించుకున్నాడు.

వాళ్లు కిందా మీద పెట్టి.. అఖరికి క్లాస్ ఫోర్ జాబ్ చూపారు.

ఆ జాబ్ లో చేరిపోయాడు ప్రమోద్. కానీ పరీక్షలప్పుడు పర్మిషన్స్ తో పరీక్షలు రాసాడు. ప్రమోద్ ఇంటర్మీడియట్ పూర్తిచేయగలిగాడు. ఉద్యోగంలో కాస్త ప్రమోషన్ పొందాడు.


ప్రమోద్ కలలకు ఫుల్స్టాప్ పెట్టేసేక.. చేరిన ఉద్యోగంలో మంచి పట్టుకే పంతంతో అందిన పనిని కొనసాగిస్తున్నాడు.

వెంకట్రావ్ కూడ తీసిన ఆ 5 వేలు చొప్పున మొత్తంని తన జీతంలోని కొద్ది మొత్తంతో పెంచు తున్నాడు ప్రమోద్.

అది ఎఱిగిన సురేఖ తెగ సంతసిస్తోంది.

కాలం గిర్రున తిరిగేస్తోంది.


ఓ రోజున సురేఖ సడన్ గా హరీ అన్ది.


అప్పటికే ప్రమోద్ ఓ ఆమెకు భర్తయ్యాడు. ఓ బిడ్డకు తండ్రయ్యాడు.


ఆ బిడ్డ ఎదుగుతున్నాడు. వాడిలో వెంకట్రావ్ పోలికలు ఉన్నాయనుకుంటూ.. తనకి తండ్రే తిరిగి పుట్టాడునుకుంటున్నాడు ప్రమోద్.


"నాన్నా ఏం చదువుతావు. నీ కలలు ఏంటి నాన్నా." టెన్తు పరీక్షలు రాసిన తన కొడుకును అడిగాడు ప్రమోద్.


"కలలు ఎందుకు నాన్నా. జరిగేది జరగనీ." తన కొడుకు జవాబిచ్చాడు.


ప్రమోద్ బిక్కచచ్చి పోలేదు.. అలా అని హుషారు కాలేదు.

 కానీ తన కొడుకు.. తన కంటె.. తన నాన్న కంటె.. 'అతి గొప్పోడు'గా అతడికి తోస్తోంది ఆ క్షణంన.


***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










Comments


bottom of page