top of page

అత్తా ఒక అమ్మే


'Attha Oka Amme' - New Telugu Story Written By Sumathi Thaduri

'అత్తా ఒక అమ్మే' తెలుగు కథ

రచన: సుమతి తాడూరి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

పొద్దున్నే లేచి చలి మంట వేసుకొని కూచున్నాడు రామయ్య.


“సంక్రాంతి వెళ్లి రెండు మాసాలు అయింది. అయినా కూడా చలి ఏమాత్రం తగ్గలేదు, వెన్నులో వణుకు పుడుతుంది కదే” అంటూ తన ఇంటావిడ కమలమ్మ తో చెప్తున్నాడు.


కాని తన మాట వినకుండా , ఎదో సొంచాయిస్తోంది కమలమ్మ.


“ఏటైనాదే నీకు? నా పాటికి నీను ఎదో సెప్తుంటే , నీవు ఏమి వినకుండా ఏటి సెత్తున్నావే?” అంటూ కమలమ్మని తట్టాడు.


“ఏమి లేదయ్యా, మనకున్నది ఒక్కతే ఆడపిల్ల. ఎంతో కష్టపడి బిడ్డ పెళ్లి చేశాము. పెళ్లి అయ్యాక వస్తున్న మొదటి పండుగ ఈ ఉగాది పండుగ. కానీ ఇది చేదు పండుగ కదా.. కొత్త అల్లుడు ఇంటికి రావద్దు అంటారు కదా.. మొదటి పండుగ కి బిడ్డ పుట్టింటికి రాకుంట అయ్యింది కదా! అక్కడ ఎలా ఉందో ఏమో, వాళ్ళ అత్త మామ దానిని ఎలా చూసుకుంటున్నారో అని ఆలోసిత్తన అయ్యా” అంది కమలమ్మ.


“ఎందుకే అలా బాధ పడతావు? ఈ పండుగకి రాకపోతే ఏంటి.. ఇంకో పండగకి మనింటికి తీసుకొద్దాము. అయినా....

అక్కడ పద్ధతులు కూడా అలవాటు చేసుకోవాలి కదా! అత్త మామ అందరితో ఎలా కలసి పోవాలో, ఎలా ఉండాలో అన్ని నేర్చుకుంటుంది కదే! అయినా ఇప్పుడు మన బిడ్డ కి వాళ్లే అమ్మ అయ్యా అవుతారు. అక్కడే నూరేళ్లు కాపురం చేసుకోవాలె. మన ఇంటికి చుట్టం లెక్క ఏ ఏడాదికో వచ్చి పోతాది. నువ్విలా బాధ పడుతూ కూచుంటే , అక్కడ అది బాధపడతాది. నువ్వు మాత్రం నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు మీ అమ్మ, అయ్యా వదిలి రాలేదా? నాతో సంతోషం ఉందాలేదా? అయినా అత్త కూడా ఒక్కపుడు అమ్మే కదా , మన బిడ్డ నీ తన బిడ్డ లా చూసుకుంటూది” అన్నాడు రామయ్య.


“అవునయ్యా” అంటూ లేచి, “అన్నం తిందాము రా అయ్యా” అని చేతులు కడుక్కుంది కమ్మలమ్మ.


ఈలోపు ""రామయ్యా.. రామయ్యా! " అంటూ పిలుస్తూ వచ్చాడు ఉత్తరాలు వేసే సాంబయ్య బాబాయి.

“రా సాంబయ్యా! ఇలా వచ్చావు..? కుసో” అంటూ ముక్కాల పీట వేసాడు.


“అది.. నీ కూతురు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, అది ఇద్దాము అని వచ్చాను” అంటూ ఉత్తరం చూయించాడు,


ఆ ఉత్తరాన్ని చూడగానే రామయ్య, కమలమ్మల మొఖం సంతోషముతో నిండిపోయింది.


“ఏంటి సాంబయ్య బాబాయి.. మాకు చదువు రాదని తెలుసుకదా, నువ్వు చదివి చెప్పు బాబాయి” అని రామయ్య అన్నాడు.


“అందుకే కదా రామయ్య,, ఇంటి బయటే ఇవ్వవలసిన ఉత్తరాని, ఇంట్లోకి తీసుకొచ్చాను..” అంటూ ఉత్తరం చదివి.......


“అమ్మ, నేను ఈ ఉగాదికి నేను మన ఇంటికి రావ్వొద్దు కదా! అందుకే , నేను రాకుంటే మీరు బాధపడతారని, మా అత్తయ్య మామయ్య అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు మిమల్ని ఈ పండుగకి మా ఇంటికి రమన్ని చెప్పారు. తప్పకుండ రాండి, అమ్మ, నాన్న.. మీ కోసం ఎదురు చూస్తూంటాను.

ఇట్లు,

మీ కూతురు స్వప్న”


అని చదివి, “మీ కూతురు చాలా అదృష్టవంతురాలు. కోడలినే కాకుండ, కోడలి అమ్మ, నాన్న బాధ కూడా అర్ధం చేసుకున్నారు” అంటూ చెప్పి వెళ్ళిపోతాడు, ఉత్తరాల సాంబయ్య బాబాయి.


“చూశావా! నీ కూతురి గురించి బాధ పడ్డావు, నీ కూతురు ఎంత మంచి ఇంటికి కోడలిగా వెళ్లిందో..” అని రామయ్య అనగానే, “అవునయ్యా! ఇక నా కూతురి గురించి నాకు బాధ లేదు, అది ఇక్కడ ఇలా ఉందో అక్కడ అలాగే ఉంటుంది.

సరే కానీ తొందరగా ఇంత కూడు తిందాము రా, పెందలాడే లేచి బిడ్డ దగ్గరికి పోవాలే” అంది కమ్మలమ్మ.


తెల్లవారింది. ఇద్దరూ సంతోషముతో బిడ్డ దగ్గరికి వెళ్లారు.


శుభం


సుమతి తాడూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు :సుమతి తాడూరి

నా భర్త పేరు నాగరాజు, పురోహితం చేస్తాడు.


నాకు చిన్నపటి నుండి కథలంటే ఇష్టం, ఎందుకంటే అందుకు కారణం మా అమ్మ, రోజు పడుకునేటప్పుడు కథలు చెప్పేది, అలా నాతో పాటే నాలోని ఇష్టం కూడా పెరుగుతూ వచ్చింది ,చందమామ, భేతాళ, విక్రమార్క కథల బుక్స్ చదివేదాన్ని, అలా నాలోను సొంతముగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. 9 వ తరగతిలోనే కథలు రాయటం మొదలుపెట్టాను. కొన్ని కథలు, సీరియల్ రాశాను. కొన్ని ఆర్థిక ఇబ్బందులు/నాకు ఎవ్వరి సఫోర్ట్ లేకపోవడం, వలన ప్రచురణ కాలేదు.


కానీ నా భర్త నాకు ఫోన్ కొనిచ్చాక, రెండు కథలు రాశాను. నేను రచయిత్రి కావాలన్నదే నా జీవిత ఆశయం.



108 views0 comments

Comments


bottom of page