top of page

అవలోకనము!!

Writer's picture: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Avalokanamu, #అవలోకనము


Avalokanamu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 02/01/2025

అవలోకనము - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


నాన్న మోయు భారము

అమ్మ చూపు త్యాగము

అర్ధం చేసుకొమ్ము

గురువు చెప్పు పాఠము


మనసున ఆనందము

మోమున దరహాసము

నాకెంతో ఇష్టము

మంచి వారి స్నేహము


మితిమీరిన కోపము

ఇతరులతో కలహము

రేపునోయ్! కలవరము

మానుటే! అవసరము


ఎదనిండా! ద్వేషము

మాటల్లో దోషము

తరిమికొడితే మేలు

పనికిరాని వాదము


దైనందిన ధ్యానము

వీలైతే మౌనము

పాటిస్తే మంచిది

చేకూర్చును శాంతము


ఆర్జిస్తే జ్ఞానము

తొలగును అజ్ఞానము

ఈ విషయం మరువకు

నిర్లక్ష్యం చేయకు


అతి పెద్ద ఆశయము

సాధింప నిశ్చయము

కలిగియున్న సాధ్యము

ఖరారగును విజయము


కోతల్లో పరిమితము

చేతల్లో  అధికము

చూపిస్తే లాభము

లేదంటే నష్టము



-గద్వాల సోమన్న



25 views0 comments

Opmerkingen


bottom of page