బాబోయ్ దెయ్యం
- Mohana Krishna Tata
- Apr 29
- 3 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Baboi Dayyam, #బాబోయ్ దెయ్యం, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #కొసమెరుపు

Baboi Dayyam - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 29/04/2025
బాబోయ్ దెయ్యం - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అది ఏప్రిల్ నెల. తెలిసిన వాళ్ళ పెళ్ళికి అమ్మ నాన్నకు వెళ్లడం కుదరక.. నన్ను పంపించారు. తప్పక ఓకే అన్నాను. నేనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్.. బెంగుళూరు నుంచి వచ్చి వారం కూడా కాలేదు. సిటీ కూడా అంతగా తెలియదు. గూగుల్ మ్యాప్ ఉందనే ధీమాతో, కార్ లో ఒక్కడినే పెళ్ళికి బయల్దేరాను.
సాయంత్రం పెళ్ళికి బయల్దేరాను. పెళ్లి బాగా జరిగింది. అప్పటికే రాత్రి అయిపోయింది. మర్నాడు బయలుదేరమని అక్కడ అందరూ చెప్పినా.. మర్నాడు ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం తో రాత్రి కార్ లో ఇంటి దారి పట్టాను.
నల్లటి చీకటి, ఎక్కడా అలికిడి లేని అడవి దారి వాతావరణం. ఉన్నట్టుండి, గాలి చల్లగా వీయడం స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ లో వర్షం ఎప్పుడు పడుతుందో ఈ మధ్య తెలియడం లేదు. కొంతసేపటికి చినుకులు మొదలయి.. పెద్ద వర్షం పడుతోంది. దారి కనిపించట్లేదు.. కార్ కూడా కదలనని మొరాయించింది. చుట్టూ చూసాను.. దూరాన ఒక్కటే ఇల్లు కనిపించింది.
ఏం చేస్తాం.. ? తప్పక అటుపక్క వెళ్ళాను. ఈలోపు పెళ్లిలో ఎవరో అనుకున్న మాటలు గుర్తొచ్చాయి..
"ఆ అడవి మార్గాన ఉన్న ఇంట్లో దెయ్యం ఉందంట.. ఈ మధ్య రాత్రయితే వింత అరుపులు చేస్తుందని అక్కడ అంతా అనుకోవడం గుర్తొచ్చింది. కొంపదీసి ఆ ఇల్లు ఇది కాదు కదా.. ! అనుకుంటుండగానే ఇల్లు దగ్గరకి వచ్చేసాను. ధైర్యం తెచ్చుకుని ఇంటి తలుపు కొట్టాను. చాలా సార్లు కొట్టిన తర్వాత, తలుపు మెల్లగా ఓపెన్ అయ్యింది. ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది.
ఆమె వేషం చూసి కొంచం భయంతో "బయట వర్షం పడుతోంది.. లోపలికి రావొచ్చా.. ?" అని అడిగేశాను
"నేనంటే భయం లేదా.. ? " అని గంభీరమైన గొంతులో అంది ఆమె
"ఎందుకు.. ? మీరు అందమైన అమ్మాయే కదా.. "
"రండి.. ఇదిగో టవల్ తో తల తుడుచుకోండి. నేను మేడ మీద రూమ్ లో ఉంటాను. నన్ను ఎవరు డిస్టర్బ్ చెయ్యకూడదు.. చేస్తే చాలా కోపం వస్తుంది.. అప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు.. " అంటూ కోపంగా నాకేసి చూసింది..
నాకు చాలా భయం వేసింది.. ఆ పెళ్ళి లో మాటలే గుర్తొచ్చాయి.. 'ఒక గంట అయ్యాక వెళ్ళిపోతే సరి.. ఆ అమ్మాయి ఎలాగో పైన ఉంది గా.. ' అనుకున్నాను. తల తుడుచుకుని, టేబుల్ మీద ఉన్న ఆపిల్ తింటున్నాను. ఈ లోపు మేడ మీద నుంచి పెద్ద శబ్దం, అరుపులు.
ఏం జరుగుతోందో అన్న కుతూహలం ఆపుకోలేక, మేడమీదకు మెల్లగా వెళ్లాను. వెళ్లి చూస్తే.. గదంతా రక్తం, ఎక్కడ చూసినా ఎముకలు. ఒక పది మందిని తినేసిందేమో అన్న ఆనవాలు ఉన్నాయి అక్కడ. ఆ అమ్మాయి నా వైపు కోపంగా చూసింది. కోర పళ్ళుతో గట్టిగ అరుస్తూ.. నోరంతా రక్తంతో ఎర్రగా ఉంది. నన్ను పట్టుకోవడానికి నా వైపుగా వస్తోంది. బాబోయ్ దెయ్యం అంటూ ఒక దూకుతో మేడ మీద నుంచి కింద పడ్డాను. వెనుకకు చూడకుండా బయటకు ఒకటే పరుగు. అదృష్టం కొద్ది బతికాను.. లేకపోతే, దెయ్యానికి లేట్ నైట్ డిన్నర్ అయిపోయేవాడిని.
బయటకు వస్తున్న నాకు.. అమ్మ నుంచి ఫోన్ వచ్చింది..
మేడ మీంచి దెయ్యం కార్ దగ్గరకు వచ్చి.. తన గోళ్ళతో నన్ను పట్టుకుని లాక్కుని ఇంట్లోకి లాక్కుని పోతోంది..
"నన్ను ఏమీ చెయ్యకు ప్లీజ్.. ! నువ్వు దెయ్యమని ఎవరికీ చెప్పను. నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు.. " అని వేడుకున్నాను
"నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను.. నేను అందంగా ఉన్నానని అన్నావుగా.. " అంటూ లాక్కుంటూ పోతోంది దెయ్యం
అమ్మ ఫోన్ లో ఏదో చెబుతోంది.. "నీకు చెప్పడం మరచాను.. మీ మావయ్య ఫామ్ హౌస్ దారిలో ఒకటి ఉంది.. వర్షం లో తడవకు.. అక్కడకు వెళ్ళు.. నీ మరదలకి యాక్టింగ్ పిచ్చి.. ఏదో దెయ్యం రిహార్సల్స్ చేసుకుంటుంది అక్కడ.. చూసి చెప్పు ఎలా చేసిందో?"
"ఏం బావా భయపడ్డావా.. ?"ఎలా ఉంది నా యాక్టింగ్.. ?" అంటూ నోట్లో ఉన్న ఎర్ర రంగుని బయటకు ఉమ్మేసింది
"బాగా చేసింది అమ్మా.. ! కొంచం ఉంటే, నా గుండె ఆగిపోయేంతగా.. " అంటూ ఫోన్ పెట్టేసి ఊపిరి పీల్చుకున్నాను
*******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comentarios