top of page

బాధలోనే బ్రతుకు సుఖం


'Badhalone Brathuku Sukham' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 11/11/2023

'బాధలోనే బ్రతుకు సుఖం' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


బీద జనులారా బాధ పడకండి

బాధలోనే మీ బ్రతుకు సుఖమండి

ఆకలే లేకుంటె అన్నమెట్లొచ్చు

బాధలే లేకుంటె బ్రతుకు తెలుసెట్లు


పెద్ద చిన్నన్నల విధము

బుద్ధిగా దెలిసేది

బీద సాదల జనమె

వాదాలు లేక

దయయు ప్రేమయు మీకు

దగ్గరీ చుట్టాలు

క్షమ దమములె మీకు

క్షేమ మార్గాలు


సూర్య చంద్రులె మీకు

సాటి పనివారు

పుట్టినూరే మీకు

పుణ్య తీర్థంబు

కట్టుబాటులె మీకు

గిట్టు న్యాయంబు

చెట్టు చేమలె మీ

చెంత చెలికాండ్రు


మట్టిలో ఎన్ని

మహిమలున్నాయో

గట్టి మనసు మీది

మానవతపు విలువలున్నాయి

కాయ కష్టము జేసి

కలిమి లేములు దెలిసి

మోయ లేనీ బ్రతుకైన

మోసుకుంటెళుతారు


కలిమి గలిగితె

మీ మనసు మైలబడి పోవు

కాల మహిమకు మీ

మనసు కట్టుబడిపోవు

నేలనుండీ మనసు

నింగికెగిరేను

జాలి యతయు మీ

మనసు జార విడిచేను.

బీద జనులారా బాధ పడకండి

బాధలోనే మీ బ్రతుకు సుఖమండి.

-------------------------

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


29 views0 comments

Comments


bottom of page