బాగున్నాను
- Mohana Krishna Tata
- 2 days ago
- 4 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Bagunnanu, #బాగున్నాను, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Bagunnanu - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 16/08/2025
బాగున్నాను - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"హలో శ్యామ్! ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం కలిసి చాలా సంవత్సరాలు అయింది కదూ. ఎప్పుడో చదువుకునే రోజుల్లో ఒకటిగా ఉండేవాళ్ళం.. "
"ఏం చెప్పాలో తెలియదు.. ఏదో ఉన్నాను.. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు?" అని నీరసంగా అడిగాడు శ్యామ్.
"చాలా నీరసంగా చెబుతున్నారు. మీరు ఏమిటి.. ? నువ్వు అను. నేనా.. ! అబ్బో.. సూపర్ గా ఉన్నాను" జవాబిచ్చాడు రామ్.
"ఇంతకీ నువ్వు ఎవరి వైపు.. ? ఆడపెళ్లివారా? మగపెళ్లివారా?"
"నా ఖర్మ కాలి.. నా అకౌంట్ లో రెండూ పడ్డాయి.. దగ్గర సంబంధం" అన్నాడు శ్యామ్.
"అయితే.. డబుల్ బెనిఫిట్స్ అన్నమాట!.. "
"ఇంతకీ.. నువ్వు?" అడిగాడు శ్యామ్.
"నేనా.. ముందు మా ఆవిడకి మొగుడని.. ఆమె తరపు ఫంక్షన్ కి వచ్చినవాడిని.. " అన్నాడు రామ్.
"మీరు చాలా చమత్కారంగా మాట్లాడుతారే"
"నీ గురించి ఎక్కువ ఏమీ చెప్పట్లేదు.. మొహమాటం పడుతున్నట్టున్నావు శ్యామ్. మనకి స్పెషల్ గా సిట్టింగ్ ఒకటి ఉంది.. మేడపైన రూమ్ లో.. " అన్నాడు రామ్.
"ఏమిటో అది?"
"మరీ అమాయకంగా అడగకండీ శ్యామ్. అదే, గాజు బాటిల్ లో అమృతం మనకోసం అక్కడ స్టాక్ పెట్టి ఉంచాడు పెళ్లి కొడుకు.. పాపం ఇదే ఇతని లాస్ట్ పార్టీ కదా"
"నాకు అస్సలు అలవాటే లేదు.. "
"నీ మాటలబట్టి చూస్తే.. నువ్వు భార్యాబాధితుల సంఘానికి ప్రెసిడెంట్ లాగ ఉన్నావే.. నీకు అలవాటులేకపోవడమా?"
"అంటే.. చిన్న చిన్నగా తాగను.. నా బాధకి ఎక్కువ తాగితే, పెళ్ళాం రెండు మొట్టికాయలు ఇస్తుంది" అన్నాడు శ్యామ్.
"నువ్వు కచ్చితంగా బాటిల్ ఎత్తాల్సిందే.. నీ గురించి అంతా చెప్పాల్సిందే.. "
"మన ఇద్దరమూ సెపరేట్ గా సిట్టింగ్ వేద్దాము నైట్ కి. అప్పుడు నా గురించి అంతా చెబుతాను.. " అన్నాడు శ్యామ్ మెల్లగా.
ఆ రోజు రాత్రి.. మొదటి రౌండ్ అయిన తర్వాత మొదలు పెట్టాడు శ్యామ్..
"మా ఆవిడకు ఫంక్షన్ పిచ్చి ఎక్కువ. ఎప్పుడు ఎవరు ఫంక్షన్ కి పిలుస్తారా అని చూస్తుంది.. అప్పటివరకు నన్ను పీల్చి కొనుకున్న బట్టలు, నగలు అలంకరించుకోవడానికి. ఒకవేళ మూఢం వచ్చిందో నా పని అంతే.. మా ఆవిడ ఇంక నా మీద విరుచుకుపడిపోతుంది.
ఈ సంవత్సరం అసలే మూఢం ఎక్కువ. మా ఆవిడకు కొన్న చీరలు, నగలు అన్నీ వేసుకోవడానికి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఏమీ లేవు. ఆ మూఢం ఏకంగా ఆరు నెలలు వచ్చింది. ఆమె ఒకటే గోల.. కొత్త చీరలు ఎప్పుడు కట్టుకోవాలి, అందరికీ ఎలా చూపించాలి అని. అందుకే గెట్ టుగెదర్ అరేంజ్ చెయ్యమని చెప్పింది.. వారానికి ఒకసారి. దానికి అందరిని ఇన్వైట్ చెయ్యాలంట. నాకు మళ్ళీ అదో ఖర్చు. ఆ ఫంక్షన్ కోసం కొత్త చీరలు, నగలు వేసుకుని అందరికీ గొప్పగా చెబుతుంది. నాకేమో బీపీ బిల్లు తో పాటే పరిగెడుతుంది. ఏం చేస్తాం? ఆరు నెలల తర్వాత ఇప్పుడే వచ్చిన మొదటి పెళ్లి ఇది”.
"అయితే ఇప్పుడు హ్యాపీ గా?"
"ఏమిటి హ్యాపీ?"
"చాలా గ్యాప్ తర్వాత ఫంక్షన్ కాబట్టి.. మళ్ళీ అన్నీ కొత్తవి కొనాలని కండిషన్ పెట్టింది. పాతవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అంట. ఏం చేస్తాం.. మళ్ళీ అదో బిల్లు. నగలన్నీ మళ్ళీ అన్నీ కొత్తగా చేయించాను. వద్దు అంటే వినకుండా.. కొన్న నగలన్నీ పెట్టుకుని దారిలో వెళ్తుంటే, ఎవరో మీ నగలు చాలా బాగున్నాయి.. మీ సెలక్షన్ సూపర్.. ఎక్కడ కొన్నారు.. చూపిస్తారా? అని అడిగిన వెంటనే.. మొద్దు మొహం.. మురిసిపోయింది.. మొత్తం అన్నీ తీసి చూపించింది. వచ్చిన ఆ ఆడ దొంగలు, మూట కట్టుకుని పారిపోయారు.. మళ్ళీ ఫ్రెష్ గా అన్నీ కొన్నాను.
ఇప్పుడు ఈ ఫంక్షన్ లో రెండు పక్కల చుట్టరికం కదా. అందుకే డబుల్ చీరలు, డబుల్ నగలు కొన్నాను. పైగా.. గంటకొకసారి చీర మార్చాల్సి వస్తోందని ఎక్కడలేని ఆనంద పడిపోతోంది మా ఆవిడ.. "
"నువ్వు కూడా మీ ఆవిడ రూట్ లో వెళ్తే పోలేదు.. "
"మనకెందుకు బ్రదర్.. ఒక జీన్స్, రెండు షర్ట్స్ ఉంటే చాలు, . ఇక నగలంటావా? మహా అయితే ఒక చైన్, రెండు ఉంగరాలు. అవి కూడా, ఎప్పుడైనా బిల్ కట్టలేకపోతే పనుకోస్తాయి.. అందుకే, పెట్టుకుంటాను అంతే! ఇక నీ హ్యాపీ లైఫ్ గురించి వినాలని ఉంది.. చెప్పు!" అడిగాడు శ్యామ్.
"మా ఆవిడ ఇంకో వెరైటీ.. అన్నీ కొంటుంది. వేసుకునేది తక్కువ.. పంచేది ఎక్కువ.. "
"ఎందుకలా?"
మా ఆవిడ తాను ఒక పెద్ద సింగర్ అనే అనుకుంటుంది. కానీ ఏమీ రాదు. సింగర్ అయి గొప్ప సన్మానం చేయించుకోవాలని ఎంతో ఆశ పాపం. దానికోసం మొక్కని గుడి లేదు, దర్శించని స్వామీజీ లేడు.
అలాగే, ఒకరోజు పక్కింటావిడ మా ఆవిడకు.. ఊరిలోకి ఎవరో స్వామీజీ వచ్చారని చెప్పింది. అంతే కాదు.. ఆయన చెప్పింది చేస్తే, మూగవాడు కూడా ఘంటసాల లాగ పాటలు పాడతాడని పెద్ద టాక్ అని చెప్పింది. అంతే.. వెంటనే ఆ స్వామీజీని కలిసింది మా ఆవిడ..
"స్వామీజీ.. ! నా పేరు చిత్ర. నా పేరుకు తగ్గట్టే, నేను చిత్ర లాగ పెద్ద సింగర్ కావాలి. దానికోసం నన్ను అనుగ్రహించండి"
"చిత్రా.. ! నీకు నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా తగులుతోంది. అందుకే, నువ్వు ఒకసారి కట్టిన చీర మళ్ళీ కట్టకూడదు.. ఎవరికైనా దానం చెయ్యాలి. పెట్టిన నగ మళ్ళీ పెట్టకూడదు.. మార్చి కొత్తది తీసుకోవాలి. అప్పుడు నీ గొంతులో అంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.. నీ లైఫ్ లో కూడా గొప్ప చేంజ్ వస్తుంది. నీ కోరిక తీరుతుంది. "
అప్పటినుంచి.. తెల్లవారితే చాలు, మా ఇంటి ముందర పెద్ద క్యూ ఉంటుంది.. మా ఆవిడ కట్టి విడచిన చీరలకోసం. పొదుపుగా చీరలు కట్టవే అంటే వినదు.. గంటకొక చీర కడుతుంది. నేను ఎన్ని చీరలు కొనాలి చెప్పండి? నగలు ప్రతిసారి మార్చి కొత్తవి చేయించడానికి బోలెడు ఖర్చు. ఇప్పుడు పెళ్ళి అంటేనే గుండె దడ నాకు, పదినిముషాలకి ఒక పట్టుచీర.. గంటకు ఒక నగ. అర్ధం చేసుకో నా పరిస్థితి శ్యామ్. పైగా, ఎక్కడ మైక్ కనిపించినా తన పాట అందుకుంటుంది.. అందరి చేత తిట్టించుకుంటుంది. కొన్ని సార్లు నేను ఫైన్ కూడా కట్టాల్సి వచ్చింది ఆమె చేసిన సౌండ్ పొల్యూషన్ కి. ఇన్ని సంవత్సరాలైనా.. ఒక్క రాగం కూడా రాలేదు. వచ్చే జీతం చాలదు, ఉన్న ఆస్తి మాత్రం హారతి కర్పూరం లాగ కరిగిపోతోంది.. "
"మీది నా కన్నా పెద్ద సమస్యే.. మరి నవ్వుతూ ఎలా ఉంటున్నారు బ్రో?" అడిగాడు శ్యామ్
"మొగుడన్నాకా.. లైఫ్ ఇలాగే ఉంటాది బ్రో.. నవ్వేయ్యాలి అంతే.. ! నీదే పెద్ద ప్రాబ్లం అనుకుంటే ఎలా చెప్పు?"
"అంతే.. !"
"అందుకే, ఎవరు అడిగినా.. బాగున్నాను అనే చెప్పాలి మన లాంటివాళ్ళు.. సూపర్ అని చెప్పినా తప్పు లేదు" నవ్వుతూ అన్నాడు రామ్.
*******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comentários