'Bahiranga Sandesam' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 19/12/2023
'బహిరంగ సందేశం' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
ఈ సమాజంలో ఎంతోమంది పేదవాళ్ళు తమ బతుకు సాగక అనేక రకాల అవస్థలు పడుతు కాలం వెళ్ళదీస్తున్నారు. వారి బాధలు ఎవరికీ పట్టవు.
ఇంకా మద్యతరగతికి చెందిన వాళ్ళు కూడా ఉన్నా... వాళ్ళు పేదవాళ్ళు కాక ధనవంతులు కాకుండా చాలీచాలని వేతనాలతో తమ జీవితాలు నెట్టుకొస్తారు.
పై రెండు వర్గాలు వారు తమకు తాముగా బతుకుతారు. లేదా ఇతరుల పై ఆదారపడైనా బతుకుతారు కానీ.. ఈ సమాజంలో వీరి వలన నష్టపోవల్సిన వాళ్ళు కానీ.. మోసపోవల్సిన వాళ్ళు కానీ ఎవరు ఉండరు. ఒకరికి నష్టం చేయటం, మోసం చేయటం అనేది ఈ వర్గాల వారికి దాదాపు అనవసరం.
ఇక కొందరు ధనవంతులు, లక్షాదికారులు, కోటీశ్వరులు ఉంటారు వారిలో ఉంటుంది అసలైన మూర్ఖత్వం. అయితే అందరు అదే విధంగా ఉంటారు అని చెప్పలేం కానీ ఈ వర్గం వారు దాదాపు ఆ టైపే.
ధనం ఉందని ఆస్తులు ఉన్నాయని అహంకారంతో పదిమందిని తక్కువ చేసి చూడటం కొందరికి బాగా అలవాటు.
ఇంకొదరు అంత ధనం ఉండి కూడా పేదవారి కష్టాలు చూస్తు కనీసం సహాయం చేస్తామనే ఆలోచన లేనివారు చాలామంది ఉన్నారు.
అసలు ఈ లోకంలో పేదలే భూమికి కూడా భారం అంటారు కానీ.. ! అసలు భూమికి కూడా భారంగా ఉండేది ధనం ఉండి సహాయం చేయలేని ఈ ధనవంతులే. అలాంటివారు ఈ లోకంలో కోకొల్లలుగా ఉన్నారు.
గౌతమ్ మన దేశంలో దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న అందరి పేదలకు నిత్వవసర వస్తువులు తక్కువ ధరకు ఇస్తున్నానని ప్రకటించి తనకు గతంలో జరిగిన ఒక సంఘటనను పేదలందరికీ బహిరంగంగా తెలుపుతున్నాడు.
“అమెరికాకి చెందిన ఓ సాప్ట్వేర్ కంపెనీ.. చెన్నై విభాగంలో విధులు నిర్వర్తించాను. ఏడాదికి 20లక్షల వార్షిక వేతనం నాది. త్రిబుల్ బెడ్ రూం ఇంటికి ఓనర్ మరియు నా తండ్రి నుండి వచ్చిన పది ఎకరాల సువిశాల స్థలం, రెండు కార్ల షోరూంలు నా పేరు పై ఉన్నాయి. వీటితో నేను గర్వంగా బావించేవాడిని
ఎవరినీ లక్ష్యపెట్టేవాడిని కాదు. నాకు చాలా అహంకారం ఉండేది. రెండు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వాటిలో రెండు లక్షల రూపాయలకు క్రెడిట్ లిమిట్ ఉంది.
ఇక బోజనం విషయంలో ఆహారం రుచిగా లేకపోయినా ఇంకేమైనా తేడా వచ్చిన విసిరిపారేసే వాడిని. రకరకాల వంటకాలు లేకపోతే అసలు బోజనం చేసేవాడిని కాదు.
దుస్తులు, సూటు కోటు తప్పక ఉండాలి. అవి మంచిగా లేకపోతే ఇంట్లో పనివాళ్ళ పై రుసరుసలు పెట్టేవాడిని.
నేను ఎక్కడ ఉన్నా... మినరల్ వాటర్ నా వెనుక ఉండాల్సిందే. ఇంకో నీరు నాకు తెలియదు. ఎప్పటకప్పుడు మెడికల్ కిట్టు కూడా నా వెనుక ఉండే విలాసవంతమైన జీవితం.
ఎంతటి మనిషికైనా ఏదో ఒకరోజు నాశనం తప్పదు ఈ విషయంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని తేడా ఉండదు.
అచ్చం అదే నాకు జరిగి నడిరోడ్డున పడ్డాను.
ప్రకృతి ప్రకోపం కారణంగా నా ఆస్తులు, అంతస్థులను చివరకు కుటుంబ సభ్యులను సైతం పోగొట్టుకుని ఏకాకినైయ్యాను. ఎంతటి దారుణ పరిస్థితి అంటే.. !
రుచిగా లేదని ఆహారాన్ని విసిరేసే రోజుల నుండి సహయ బలగాలు విసిరే ఆహర పొట్లాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను.
సూటు కోటుతో పాటు దోమలే కంటపడని మేడల్లో నిద్ర నుంచి, బహిరంగంగా నేలపై పడుకునే పరిస్థితి.
మినరల్ వాటర్ తప్ప ఇంకే నీరు తాగని నేను గుక్కెడు మంచినీరు అందించే మహాత్ముడెక్కడా.. అని దీనంగా ఎదురుచూశాను.
అంత డబ్బు ఉండి అహంకారంతో జేబు నిండా పదిరూపాయల కాగితాలు నింపుకుని గుడిమెట్లు పై ఉన్న బిచ్చగాళ్ళకి ఇస్తు తెగ బిల్డప్ కొట్టే నేను, అదే గుడి మెట్లు వద్ద అడుక్కునైనా సంపాదించగల్గెలా తమకు తోచిన సహాయం చేసి ఉన్నంతలో తనకు మీతో కలిసిపోయేలా మీ పేదలందరు తనకు కొన్ని రోజులు బతుకునేర్పారు.
అవి కొన్నిరోజులే కావొచ్చు కానీ..
నాకు గొప్ప బతుకు పాఠం నేర్పాయి. నాలో అహంకారాన్ని బయటకు పంపాయి.
లోకంలో ధనవంతులై ఉండి పేదవాళ్ళకి సహాయం చేయకపోయినా.. ప్రతి పేదవాడు సేవాభావంతో తన తోటి మనిషికి ఉన్నంతలో సహాయం చేస్తాడని నాకు తెలిసేలా కళ్ళు తెరిపించారు.
నాకు ఆరోగ్యం బాలేకపోతే తమ డబ్బులు కూడకట్టుకుని వైద్యం చేయించారు.
అందుకే నేను మరలా పాత జీవితంలోకి వెళ్ళాక నా సంపాదనను నా ఆస్తిని పేదల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాను.
ఈరోజు నుంచి మీరే నా ఆనందం, నా బతుకు అని చెప్పాడు. అంతేనా.. తాను చనిపోతే తన ఆస్తి అంతస్తు ఏదైనా పేదలకే దక్కతుందని బహిరంగంగానే వెల్లడించి కాగితాలు పై సంతకం చేశాడు గౌతమ్. ఈ నిర్ణయం పై పేదలంతా హర్షం వ్యక్తం చేశారు. తమ బతుకులు కాస్త అయినా బాగుపడతాయని ఎంతో ఆనందించారు.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments