top of page

భవబంధాలు


'Bhavabandhalu' written by Lakshminageswara rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

'పురుషోత్తం' గారిది ఆరోజు 'రిటైర్మెంట్ ఫంక్షన్ '. ఎంతో ఇష్టంగా భావిభారత పౌరులను తీర్చిదిద్ది, హెడ్మాస్టర్ పదవి నుండి వైదొలుగుతున్న రోజు. ఆరోజు సభాముఖంగా ఎన్నో ప్రశంసలు అందుకుంటూ తన భార్య కళ్ళలో కనబడుతున్న గర్వం చూస్తూ, ఎన్నో వేలమంది విద్యార్థుల భవిష్యత్తును తన చేతుల మీదగా తీర్చిదిద్ది, 30 ఏళ్ల పాటు తన ఉపాధ్యాయ వృత్తిని తన 'ఆత్మ గా' భావిస్తూ ,తనకు ఇంతటి గౌరవ ప్రతిష్టలు ప్రసాదించిన ఆ భగవంతునికి వేనోళ్ళ కృతజ్ఞతలు చెప్పి, తన సహచరుల అభినందనలతో, పూలదండలతో పురుషోత్తం మాస్టారు, ఆయన భార్య సుభద్ర, కొడుకు, కూతురు సమేతంగా సభకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్పి ఆ ఆనందాన్ని తన మనసులో భద్రపరచుకొన్నారు" హెడ్మాస్టర్ పురుషోత్తం గారు."

కాలం " బ్రేక్ లేని కారు లాగా వేగంగా దూసుకుపోతోంది"! తెలియకుండానే ఐదేళ్లు ఎంతో ఆనందంగా విశ్రాంతి తీసుకుంటూ, గడప సాగారు పురుషోత్తం గారు, ఒక మంచి ఇల్లు కట్టి , కూతురికి తగిన సంబంధం చూసి పెళ్లి చేసి , తనకు ఉన్నదంతా పిల్లల పేర్ల మీద పెట్టి ఎంతో హాయిగా, ప్రయోజకుడు అయిన కొడుకు ప్రవీణ్ , కోడలు కావ్య వారి పిల్లల బాగోగులు చూసుకుంటూ, కాలం గడపసాగారు ' పురుషోత్తం గారు ఆయన భార్య సుభద్ర.'

' కాలం ఎల్లకాలం ఒకలా ఉండదు, ఎందుకంటే ఆయన భార్య సుభద్ర అనారోగ్య పాలు ఆవ్వడం ఒక్కసారి పురుషోత్తం గారు కుటుంబంలో అలజడి రేగింది, ఆ చికాకులు ఆస్తమాను తల్లిని ఆసుపత్రికి తీసుకు వెళ్లడం ,నాన్నగారి చాదస్తం, కొడుకు ప్రవీణ్ కి, కోడలు కావ్య కి అప్పుడప్పుడు సహనం కోల్పోయి, వారి నిర్లక్ష్యం, పెద్దరికానికి కూసంత విలువ ఇవ్వకుండా, పురుషోత్తం గారు ఏదైనా తెలియక కొడుకుని అడిగినా "నాన్నగారు, మీ చాదస్తం ఆపండి! మీకు ఏమీ తెలియదు! నేను అమ్మని అందరి డాక్టర్లకు చూపించా, ఏం పర్వాలేదు, మందులు వాడుతూ ఉండమన్నారు, మీరు కూడా నన్ను విసిగించక, అమ్మ రూమ్ లోనే ఉంటూ, సమయానికి మందులు ఇవ్వండి, మీ కోడలికి ఇంట్లో పనులు, పిల్లల చదువులు, అసలు తీరిక లేకుండా ఉంది! అన్న కొడుకు మాటలు వింటూ, తను బాధపడుతూ, భార్యను సముదాయిస్తూ, కొడుకు కోడలు నిర్లక్ష్యం వారి ప్రవర్తన అనూహ్యంగా మారిపోవడం భరించలేక, మనోవేదనతో 'పురుషోత్తం గారి భార్య సుభద్ర ' కాలం చేశారు.

'పురుషోత్తం గారు ఒంటరి జీవితాన్ని అలవాటు చేసుకుంటు మౌనంగానే కాలం గడుపుతున్నారు, అప్పుడప్పుడు కొడుకు ప్రవీణ్ జాగ్రత్తలు చెప్తూ, "చూశారా నాన్న! అమ్మకి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బ్రతక లేదు, మీకు వయసుతో పాటు చాదస్తం కూడా పెరిగింది , సమయానికి భోజనం చేస్తూ మందులు వేసుకుంటూ , మీ రూమ్ లో కూర్చోండి! ఆస్తమాటు మీ కోడలిని అది కావాలి, ఇది కావాలి ,అని విసిగించకుండా, పెట్టింది తిని హాయిగా ఉండండి, నేను రాత్రి పగలు పని చేస్తే గాని గడవని కుటుంబం మనది, మీరు కట్టించిన 'ఇల్లు బ్యాంకు లోను' కట్టడానికి, పిల్లల స్కూలు ఫీజు, కట్టడానికి డబ్బులు సర్దుబాటు కాక చస్తున్నాను! అంటూ వారానికి ఒకసారి నాన్నగారికి క్లాసు ఇస్తాడు కన్నకొడుకు ప్రవీణ్ ! అన్నింటికీ మౌనమే ప్రధానాస్త్రంగా పోయిన భార్యను, చేసిన ఉద్యోగాన్ని , ఆ గత స్మృతులు తలుచుకుంటూ తన 85 ఏళ్ళ వయసులో ఒంటరిగానే కాలం గడపసాగారు, రిటైర్డ్ హెడ్మాస్టర్ పురుషోత్తం గారు.

ఎన్ని అవమానాల్ని భరించిన 'మాస్టారు గారు ఒక మహాముని' లా తనలో తనే మదనపడుతూ, 'ఓరి భగవంతుడా!! జీవితంలో ఎనభై ఐదు సంవత్సరముల వరకు ఎన్నో కష్ట సుఖాలు చవిచూసిన నేను ఈరోజు నీ దగ్గరికి తీసుకుపో! అని అర్థిస్తున్నాను, నావల్ల మరొకరు బాధపడకుండా నాకు త్వరలోన మోక్షం ప్రసాదించు,! తండ్రి అంటూ ఎన్నోమార్లు ఆ దేవుని వేడుకుంటున్నారు పురుషోత్తం గారు.

సరిగ్గా అదే సమయంలో 'కరోనా వ్యాధి 'ప్రబలి 'సెకండ్ వేవ్ 'ఘోరాతి ఘోరంగా, అంతటా వ్యాపిస్తూ మనుషుల ప్రాణాలు హరించుకుపోతుంది, ఒకపక్క 'ఆక్సిజన్ కొరత , హాస్పిటల్ బెడ్ కొరత, ప్రజలను నిలువునా దహించి వేస్తుంది. అదే సమయంలో పురుషోత్తం గారి కోడలు కావ్య , రెండు రోజుల నుంచి జ్వరం బారిన పడి భర్త ప్రవీణ్ 'antigen rapid' టెస్ట్ చేయిస్తే 'పాజిటివ్ ' వచ్చేసరికి గుండె గుభిల్లు మన్నది అందరి కుటుంబ సభ్యులకు, ఎందుకంటే ఇద్దరు పిల్లలు, ముసలి మామ గారు, ఒకపక్క భర్త ఉద్యోగం, ఏది ఆగిన సంసారం గడవదు, అన్న ఆలోచనలతో ప్రవీణ్ భార్య కావ్య ఆలోచనలు ఎలాగ ??అని తన తల్లిదండ్రులకు కబురు చేసింది, వారు కూడా 'అమ్మ !!ఈ సమయంలో మేము మీ ఇంటికి వచ్చి సాయం చేయలేము మీ భర్త అన్ని చూసుకోవాలి!! అంటూ అనేసరికి కళ్ళు తిరుగుతున్నoత పని అయింది కావ్యకి. వెంటనే ప్రవీణ్ తన ఆఫీసుకి సెలవు పెట్టి ,భార్యను ఒక రూమ్ లో ఉంచి, డాక్టర్ కన్సల్టేషన్ తో అన్ని మందులు కొని, సతమతమవుతున్న వేళ' పురుషోత్తం గారు "ఒరేయ్ ,ప్రవీణ్ నా ఈ ఒక్క మాట వినరా! నాకు పూర్తిగా వయసు అయిపోయింది ,నన్ను కరోనా ఏమీ చేయదు ,నేను నా కోడలు కి దగ్గరుండి సమయానికి మందులు ఇచ్చి, ఆవిరిపట్టి ,భోజనం తినిపించే పనులన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను, 'కోడలు కూడా నా కన్న కూతురు లాంటిది!! నేను నీ భార్యను పది రోజుల్లో బంగారం లా అప్ప చెప్తాను, 'నాకు ఏ మాత్రం కరోనా భయం లేదు, నువ్వు మాకు కావాల్సిన అన్నీ అమర్చి చూడు, అయినా నీకు వంట రాదు కదా!! నాకు అమ్మ అన్ని వంటలు నేర్పించింది ,నేను నీకు సలహా ఇస్తాను ఆ ప్రకారంగా వంట చేసి, నువ్వు తిని పిల్లలకు పెట్టి ,మీరు దూరంగా ఉంటూ, మా ఇద్దరికీ భోజనం సదుపాయం చేయు, అని ఎప్పుడూ లేనంతగా గట్టిగా చెప్తున్న నాన్నగారు మాటలు "శ్రీకృష్ణుడు ,అర్జునుడ కు బోధిస్తున్న 'భగవద్గీత 'వినబడింది ప్రవీణ్ కి."

ఆ మాటలు విన్న కొడుకు ప్రవీణ్ నాన్నగారి ధైర్యానికి, ఆయన త్యాగానికి ప్రస్తుత పరిస్థితులలో' కరోనా మహమ్మారి 'కి భయపడకుండా ఉన్న ఒకే ఒక 'మహా మనిషి మా నాన్నగారు' అనుకొంటు ,అన్ని నాన్న గారు చెప్పినట్లు చేస్తూ, అన్నీ సమయానికి భార్య రూమ్ దగ్గర ఇద్దరికీ భోజనాలు పెడుతూ ,అన్ని అందిస్తూ, ఒకసారి ఇ గదిలోకి గదిలోకి మాస్కు పెట్టి చూస్తున్న సమయంలో నాన్నగారు కోడల్ని' కన్న కూతురిలా '!అన్ని అందిస్తూ ఎన్నెన్నో మంచి మంచి భక్తి కథలు చెబుతూ, మధ్య మధ్యలో మందులు వేస్తూ, ఒకటికి రెండు సార్లు ఆవిరి పడుతూ, ఒక మహా యజ్ఞం చేస్తున్న పురుషోత్తం గారు ,తన కోడలిని చూస్తున్న దృశ్యాలు, కన్న కొడుకు ప్రవీణ్ కి కంటనీరు తెప్పించింది, అయ్యో !నేను ఆ మహా మనిషిని ఎంత లాగా తిట్టాను, అయినా నా భార్యని, నా కుటుంబాన్ని తన ప్రాణానికి ప్రమాదమైన సరే భార్య ని బ్రతికిస్తున్న నాన్నగారి త్యాగాన్ని వేనోళ్ళ పొగుడుకుంటూ, భార్య కుదుట పడగానే ,ఎంతో ఆనందంతో మరింత ప్రేమగా ప్రవీణ్ తన తండ్రిని 'ప్రపంచంలోనే అత్యుత్తమ తండ్రి 'గా భావిస్తూ ,అన్ని విధాల తండ్రి సలహా తోనే సంసారం చక్క దిద్దుకున్నాడు ప్రవీణ్.

ఇంత భయంకరమైన' కరొనవ్యాధి' వచ్చి తన సొంత వాళ్లే దగ్గరికి రాకుండా, భయ పడుతున్న సమయంలో ,నేనున్నానంటూ 85 ఏళ్ల మావగారు, లేని శక్తి తెచ్చుకొని నా దగ్గరే ఉంటు నన్ను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటు,నన్ను కన్న కూతురు లా ఆప్యాయతతో, ఆ భయంకర వ్యాధి ఆయన చేసిన సేవలకు భయపడి పారిపోయి, నన్ను మళ్ళీ ఆరోగ్యవంతులు రాలిని చేశారు, "మావయ్య గారు, కాదు కాదు, నాకు కన్న తండ్రి కన్నా ఎక్కువే !!!!అనుకుంటూ కోడలు కావ్య ప్రతిరోజు దేవుని పూజ అయిన వెంటనే దగ్గరుండి మామ గారికి కాఫీ ఇచ్చి ,టిఫిన్ ఇచ్చి అనుక్షణం ఆయన కు సపర్యలు చేస్తూ, తర్వాతే తన భర్త, పిల్లలు కు అన్నీ అమర్చడం, ప్రతిరోజు పరిపాటి అయిపోయింది ,ఆమెకు ఎందుకో ఎత్తుగా గోడమీద ఉన్న' వెంకటేశ్వర స్వామి 'ముఖంలో తన మామ గారి ప్రతిబింబం కనిపిస్తూ, ఆ సమయంలో మామగారే తనకు దేవుడు�������� అన్న భావనతో ప్రవీణ్, కావ్యాల సంసారం హాయిగా పురుషోత్తం గారి సలహాలతో చల్లగా సాగిపోతుంది ఉంది.

"ఇక మాతృదేవోభవ "అన్న నానుడి నుంచి "పితృదేవోభవ "గా మారి ప్రతి ఒక్కరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, సహాయపడుతూ, ఈ ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకుని, సంసారం సాగించాలి. మన భవ బంధాలు ఎన్నడూ తెగి పోకుండా కలకాలం నిలవాలి అని ఆ దేవుణ్ణి ప్రార్ధిద్దాము.!!!!!


54 views0 comments

Comments


bottom of page