భువనా శతకము
- Sudarsana Rao Pochampalli

- Sep 13
- 9 min read
#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #BhuvanaSathakamu, #భువనాశతకము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #కందము

Bhuvana Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 13/09/2025
భువనా శతకము - తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
శ్రీ యను పదముతొ వ్రాయగ ---
ఘనమగు చరితము మనదగు భాషణ తెలుగని చెప్పగ తెలివితొ వ్రాసితి ఈ తెలుగు శతక సౌగంధ్యము వినగను, చదువను, వ్రాయను మరియును కంఠస్థము చేయగ అష్ఠోత్తర శత నీతి పద్యములు "కందము" నందు వ్రాసితిని మకుటము "భువనా" యని జూపితి --
పద్యములు నానా విధ భావము దెలుపగ అదియును పద్యపు లక్షణములు చదువగ దెలుసున్-
లోకము తీరును, పోకడ, తదనుగుణ విశ్లేషన జూపుచు వ్రాసితి -పిల్లలు, పెద్దలు, వృద్ధులు నిత్యము చదువగ లోకము పోకడ దెలియగ మనమును గ్రహించి నడువను ఉపయోగము గనుకను - అందరు జదివియు ఇందులొ తప్పొప్పులు జూప సవరించెద ముందుకు ఉపయోగమనన్.
మనదగు భాష తెలుగన అదియును సముద్రము కంటెను గొప్పన దానిని పండిత శ్రేష్టులు వివరించ గ్రాహ్యము గాగన్ ఈదుట రానివారికి ఈదుట నేర్చిన విధముగ "శతకము" చదువగ మరిమరి శతకముల జాడలు వెతుకెడి భావము కలుగును.
ఇక శతక సాహిత్యము మిన్న-
శతకానికి జీవమున్నది-మరణం లేదు-శతకము చదివి ఒంటబట్ట దానిని మరువరు-సర్వకాల సర్వావస్థల యందు శతకమే ఉదాహరణ- అందుకొర్కు అందరు తెలుగులో శతకాలు చదివి జ్ఞాపక ముంచుకొన శ్రేష్టము. ఇక శతకములో వ్రాసేవి--
1. భక్తి శతకము, 2. నీతి శతకము, 3. శృంగార శతకము, 4. వెదాంత శతకము, 5. చారిత్ర శతకము, 6. జీవిత చారిత్ర శతకము, 7. హాస్య శతకము, 8. స్వీయ చరిత్ర శతకము, 9. వాజ్యనిందా స్తుతి శతకము, 10. కథా శతకము, 11. సమస్యాత్మక శతకము, 12. నిఘంటు శతకము, 13. అనువాద శతకము, 14. అచ్చ తెలుగు శతకము, 15. చాటు శతకము, 16. మానవ స్తుతి శతకము --
శతకాలు వ్రాసేవారు చాలా మంది ఉంటారు-వారి వారి ఇచ్చాను సారము వ్రాస్తుంటారు-అందులో చందస్సు అవసరము-మకుటముండాలి-ఇంకా ఎన్నో నిబంధనలు ఉంటాయి. అందుకొరకే శతక సాహిత్య్ము మిన్న అని అంటారు--
{1} కందం--
శతకపు సాహితి అలవడ
బతుకున శుభముయు గలుగును భాగ్యము మీకున్
సతతము జీవిత ముండగ
శతకము జదువుము వదులక సహనము భువనా.
{2} శతకము లనగను వ్రాసిరి
హితమగు రీతిన ప్రజలకు ఇంపుగ నుండన్
బతుకుకు అద్దము అనిరన
శతకము జదువుడు వదులక సహనము భువనా.
{3} కందం--
పదిలము శతకము ఎవరికి
చదువను ఇచ్చిన మరువక శంకయు లేకను
చదివిన పుస్తక మటులనె
వదులక పొందుము దరుమము వదులక భువనా.
{4} కందం--
వెనుకటి రేపటి భావము
కనగను పద్యము కయికొను కాంచగ నుండన్
జనముకు తెలియగ అదియును
మనసున నిండును విడువక మరియది భువనా.
{5} కందం--
కందము నందున పద్యము
సుందర మగుటయు కనగను సూకము వోలెన్
ఎందరు జదివిన అర్థము
మందము అయినను జనముయు మరువరు భువనా.
{6} కందం--
పొందిక తోడను పద్యము
కందము నందున లిఖించ కవికుల తిలకుల్
డెందము నందున తృప్తితొ
అందము కవితకు కలుగను అరుసమె భువనా.
{7} కందం--
శతకము లెన్నియు వ్రాసిన
మతలబు దెలియగ శతకము మాధుర్యమనన్
బతుకుకు ఆదా రమవను
శతకపు సాహితి మనిషికి సాయమె భువనా.
{8} కందం--
అచ్చపు తేనియ అనగను
మెచ్చను జనముయు శతకము మేలని తలచిన్
ముచ్చట పడెడరు భావము
అచ్చెరు వందెడి విధముగ అందను భువనా.
{9} కందం--
వేషము భాషయు నేర్చిన
భూషన మనచును తెలుగును భువిలో నిల్పన్
భేషుగ పలుకుము తెలుగులొ
దోషము గాదది శతకము ధోరణి భువనా.
{10} కందం--
భావము తెలుపగ శతకము
నావగ నడుపుము నిజమన నరునకు దెలియన్
చేవతొ తెలియగ మనిషియు
పావన మనుచును వరముగ ప్రాప్తను భువనా.
{11} కందం--
శతకము వ్రాయను భక్తితొ
మతలబు నెరుగగ గుడులలొ మమతతొ బోవన్
సతతము పూజలు జేయుచు
హితమును గోరగ ప్రణుతన ఇదియను భువనా.
{12} కందం--
నీతులు ఎన్నియు జెప్పిన
జాతికి తెలిసెడి పదములె జయమగు జూడన్
నూతన మార్గము శతకమె
చేతన మొందుతు దెలుపను చేరును భువనా.
{13} కందం--
శృంగారమనుచు వ్రాసిన
అంగీకృతమును జనముకు అదియును నిజమే
భంగము లేనగు పదములు
శృంగారచరిత శతకము శృంగమె భువనా.
{14} కందం--
వేదము జూపుచు శతకము
సోదన కుండను రచనలు సొగసును బోలన్
వాదన అనకను ప్రజలు
శ్రీధర భావము అనుచును సివమగు భువనా.
{15} కందం--
చరితము జూపెడి శతకము
మరిమరి జదువను చరితము మదికిని ఎక్కన్
దొరలును రాజులు వెనుకట
మరువని ప్రేమతొ జనమన మాన్యులు భువనా.
{16} కందం--
జీవిత చరితపు శతకము
భావము తెలుపుతు రచనలు బాగుగ నుండన్
హావము భావము జూడగ
దేవుని నమ్ముచు కనకను దేహిలు భువనా.
{17} కందం--
హాస్యము జూపెడి శతకము
హాస్యము కనినను అదియును హాయిగ నుండన్
హాస్యము ఇంకను అధికము
హాస్యపు చరితయు మరుగగు అదియన భువనా.
{18} కందం--
వినగను వ్రాసిన వారికి
తనదగు చరితపు శతకము తన్మయ మొందన్
జనముకు దెలియగ అదియును
వినుచును సంతస పడగను విధియను భువనా.
{19} కందం--
వ్యాజ్యము జేసిన కృష్ణుని
పూజ్యము జేయుచు గిరిధర పూర్థిగ నీవున్
వ్యాజ్యము మరువక తరవుము
పూజ్యుడ వగుచును సుడియని పూర్తిగ భువనా.
{20} కందం--
పెద్దలు వద్దని జెప్పిన
పెద్దల భావము వినుచును ప్రేమతొ మానన్
పెడ్డలు శతకము జూపుచు
హద్దుతొ ఉండుటె తగునన హాయగు భువనా.
{21} కందం--
చిక్కులు ఎన్నియు ఉన్నను
దిక్కులు జూడక సమస్య దిద్దుచు ఉండన్
దక్కును నీకును శ్రేయము
మక్కువ గొల్పెడి శతకపు మాటన భువనా.
{22} కందం --
చెప్పగ నిఘంటు శతకము
తప్పుగ వ్రాయక వివరము తగినటు ఉండన్
ఒప్పగు జూడను భాషయు
ముప్పన లేకయు ప్రజకును ముదమన భువనా.
{23} కందం--
అనువాదమనుచు వ్రాయగ
జనముకు దెలిసెడి విధమన సరియగు శతకం
వినగను అర్థము దెలియగ
మనకది ఆనందమనుచు మరువరు భువనా.
{24} కందం--
తెలుగను భాషను దెలుపను
తెలుగులొ వ్రాయుట సహజము తెలుపగ నుండన్
తెలుగను శతకము జదువగ
తెలువదు ఏడను వెతుకగ తేజము భువనా.
{25} కందం--
చాటువు పద్యము వ్రాసిన
నోటితొ పొగడిక కనగను నొసటను హాస్యం
మూటలు గట్టియు ఇచ్చుచు
చాటుగ మూటలొ శిలలన సరియా భువనా.
{26} కందం--
మానవు లందరు ఒకటని
మానవ స్తుతియును యనగను మహిలో గొప్పే
దానము ధర్మము జేసెడి
మానవ చరితము కనగను మంచిదె భువనా.
{27} కందం--
శతకము లెన్నియు వ్రాసిన
బతుకున కర్థము దెలియగ భాగ్యము నీకున్
హితమగు భావన లెన్నియొ
సతతము తెలియగ వసించు సరియన భువనా.
{28} కందం--
పండితు డనగను పాల్కురి
పండిత శ్రేణిలొ వృషాధి పనెడును శతకం
మెండుగ రచనన మొదలిడె
ఉండెడు విధముగ తొలుతగ ఉండను భువనా.
{29} కందం--
గొంగళి పురుగున బుట్టెడు
రంగుల మారుచు కనగను రయముగ ఉండన్
చెంగున తేనెను దినుచును
రంగుల సీతా కొకనుచు అందురు భువనా.
{30} కందం. —
యువకులు పిల్లల కెపుడును
వివరము చెప్పగ వినుడిక విజయము జెందన్
ప్రవయుడు పెద్దలు గనపడ
జవనము తోడను నిలుచొన జాగ్రత భువనా
{31} కందం--
సీతయు రాముడు లక్ష్మన్
బ్రాతయు శత్రజ్ఞ భరతు భాగ్యము తోడన్
మాతలు ముగ్గురు ఉండగ
చేతన పొందుచు పుడమెలె చెలిమితొ భువనా.
{32} కందం—
ఎక్కడొ గుడినను ఉండగ
చక్కని పాలగు జలధిన చాయగ ఉంటివొ
దిక్కుగ దీనుల మదినన
చొక్కపు స్వర్గము దిషణమొ చోద్యమె భువనా.
{33} కందం--
పిల్లల భవితయు జూడగ
తల్లివి పాలే శరణము తాగగ బలమున్
తల్లివి పాలును లేకను
పిల్లల సుస్థత చెడగను పిమ్మటి భువనా.
{34} కందం--
తగినటు రుచియన దెలువగ
జగమున పాలను ఒసగెడి జననిని దలువన్
మొగమున కళయన కనపడు
యుగములు గడిచిన పయస్సె యుక్తము భువనా.
{35} కందం--
చింపిరి గుడ్డలు దేహము
కంపుగ ఉండను కసురక కనికర ముంచిన్
సొంపగు బట్టలు సొమ్మును
ఇంపుగ ఈయను సరిగను ఉండును భువనా.
{36} కందం--
పుట్టెడు బిడ్డను ఊహతొ
పుట్టగ బిడ్డయొ పురుషుడొ పున్నమి లాగన్
పెట్టగ బిడ్డకు కుళ్ళా
దట్టము గుండెడి విధముగ దబ్బున భువనా.
{37} కందం--
దాసుడు దండము బెట్టను
చూసుతు ఊర్కొన దనికుని చూపున కనగన్
హాసమె కనబడు జూడగ
దాసుడె గొప్పని తలయుట ధర్మము భువనా.
{38} కందం--
వేదము తొమ్మిది ఐనను
వేదము నాల్గుగ విభజన భేదము జూపన్
సాధువు వ్యాసుడు దలచెన్
మోదము తోడను జనులకు మోదమె భువనా.
{39} కందం--
కులపతి వశిష్ట యనగను
బలమన పదియగు దశశతి పంక్తుల కెపుడున్
తలచియు భోజన మనగను
ఎలమితొ వితరణ తగునని ఎరుగును భువనా.
{40} కందం--
చెప్పెడి బాధలు కొన్నియు
చెప్పని భాధలు కనగను చేదుగ ఉండన్
చెప్పెడి చెప్పని బాధలు
చెప్పక నిలుచును అవియును శేషము భువనా.
{41} కందం--
భారము బరించి శబలను
కోరగ మునియుగు వశిష్ట కోపము జూపన్
నేరము జేసియు మిత్రుడు
ధీరత తోడను తపసుతొ దీప్తనె భువనా.
{42} కందం--
వృద్దుల నెప్పుడు జూడుము
బద్దక మనకను జరఠుడు బలిమితొ గోరన్
శ్రద్దగ అడిగిన వస్తువు
మద్ధతు తెలుపుతు ఒసుగగ మంచిదె భువనా.
{43} కందం--
అమృతము మన్నది జూడక
అమృతము అనగను మధురము అందరు అనగన్
అమృతము భావము కనుచును
అమృతము రూపము కనకను అదియా భువనా.
{44} కందం--
అలసట లేకయు నింగిన
అలసట కలుగను అవనిన ఆదరు వనుచున్
పులుగన వ్రాలును ఎగురును
ఇలలో కలవన పులుగులె ఇంపన భువనా.
{45} కందం--
తల్లిది గర్భము నుండియు
పిల్లలు బుట్టును యదియును ప్రియమగు రీతిన్
తల్లియు స్వర్గము అనుచును
చల్లని భావము కనగను చతురిమ భువనా.
{46} కందం--
అయ్యకు అమ్మకు తోడుగ
కయ్యము బెట్టక కొడుకుయు కాంచగ కొమరిన్
నెయ్యము సేయుచు పనులతొ
పొయ్యిన బియ్యము ఉడుకును పొంగుచు భువనా.
{47} కందం--
వామన మూర్తిని జూచుచు
సేమమ బ్రాహ్మణ వరదుడ సేవలు జేయన్
నీమన సొప్పగ బలియును
మేముయు ఉంటిమి వరములు మేధతొ భువనా.
{48} కందం--
వలదిక మాటను మరువుము
బలమగు విష్ణువు బలినిక బాధలు బెట్టన్
సులువుగ రూపము మార్చెను
జలముతొ మూడుయు అడుగులె జయమని భువనా.
{49} కందం--
ఇచ్చిన మాటను నేనును
ఖచ్చిత మనగను నిలిపెద కలలో నైనన్
వచ్చిన వాదును విష్ణన
మెచ్చుచు దానము అనగను మేలగు భువనా.
{50} కందం--
పున్నమి వెన్నెల లాంటిది
చిన్నది బుట్టగ నిలయము చిగురులు గుప్పన్
చెన్నుగ ఆటలు ఆడను
కన్నులు రెండుయు సరిపడు కాంచగ భువనా.
{51} కందం--
మామా అల్లుడి జూచితి
హేమా హేమిలు లయినను అతనితొ పొటీకి
మోమాటమనగ జూడను
సామా న్యుడగును ఎకిలిన సాధువు భువనా.
{52} కందం--
వరములు ఈయదు లక్ష్మియు
వరములు అడుగుతు అపచితి వాసిగ జేయన్
వరమన నిత్యము తినునది
ధరుమము తోడను అరుగుటె ధన్యము భువనా.
{53} కందం--
పోతన వ్రాసిన వితరిణి
చేతన తోడను కనగను చెప్పను భావం
చూతము అనకను మనిషియు
సాతికి మాటన ఇడుకొన సాధనె భువనా.
{54} కందము
విశ్వామి త్రు భావమనగ
విశ్వము నందున జనముకు విజయము జెందన్
విశ్వము గాయ త్రిమర్మం
విశ్వపు చూపుతొ జదువను వినయమె భువనా.
{55} కందం--
వరియను పద్ధతి మనిషికి
సరిగను తిండిని దొరుకగ సాయము జేయన్
మురెపెము తోడను వరినిక
ధరణిన పండించ నదియు ధర్మమె భువనా.
{56} కందం--
తోచిన పనియన జేయుచు
యాచిత మనగను బతుకగ హాయిగ నుండన్
దోచిన సొత్తుతొ బతుకుట
యాచన కన్నను పిశునము అదియన భువనా.
{57} కందం--
దుడుకని కొడుకుల బిడ్డల
పడునని తిట్టుగ అదియును పడకను వారున్
దడువక చేతురు చెడుపుగ
విడువక వారిని తెలివన విందురు భువనా.
{58} కందం--
వరముల నొసగెడి లక్ష్మిని
ధరణిన ఇంతులు బగితని ధర్మము తోడన్
మరువక కొల్తురు సింధుజ
నిరతము మానవ జనుమకు నీటన భువనా.
{59} కందం--
వచ్చెను మనకును అధిపతి
ముచ్చట పడగను అతడును ముదముతొ పనులన్
మచ్చను లేకను సేయను
కచ్చిత మనగను కినుకన కంబువు భువనా.
{60} కందం
జారుడు బండను ఎక్కుచు
జారగ క్రిందను మరలను జారుడు బండన్
చేరుదు రనగను ఆటయె
జారుతు దిగుచును కపటము జాద్యము భువనా.
{61} కందం--
రవిజుని దానము జూసిన
దివమును మెచ్చెడు విధముగ దివమను భావం
సవితయు వరమని హయుడును
రవిజుని మొక్కుచు కవచము రయముగ భువనా.
రవిజుడు=కర్ణుడూ, దానము=దానము చేయు, జూసిన=చూడగా, దివమును=స్వర్గము, మెచ్చెడు=మెచ్చగా, విధము=పద్ధతి, దివమను= స్వర్గము, భావం=ఆలోచన, సవిత=సూర్యుడు, వరమని=ఇచ్చినదని, హయుడును=ఇంద్రుడు, రవిజుని= కర్ణుని, మొక్కుచు=మొక్కి, కవచము=చెవులకుండే ఆభరణము, రయముగ=తొందరగా.
{62} కందం--
రాజుగ ఉండియు రంతను
రాజుయు రాజ్యము వదులుచు రయముతొ పోవన్
రాజుగ లేనని తిండన
మోజుగ దొరుకక వితరణ మోజనె భువనా.
{63} కందం--
మంచియు చెడుయును రెండును
ఎంచుచు సృష్టించె ప్రభువు ఏలన జూడన్
మంచితొ కార్యము సిద్ధన
ఎంచగ చెడుపుతొ శిథిలము ఎరుగగ భువనా.
{64} కందం---
శిభియను రాజుయు దీనుల
కభయము నిస్తును పదతిని కాయను మదిలో
రభసయు లేకన్ గ్రద్దకు
సభలో తనతొడ చిదుముచు సత్రము భువనా.
{65} కందం--
అద్ధము నందున ముఖమన
ముద్ధుగ నుండను కనగను ముదముతొ జూడన్
వృద్ధుల కాలము రాగను
ముద్ధగు మోముయు ముసలిగ మురిపెమ భువనా..
{66} కందం--
మేడిది పండును గనగను
చూడగ తినుటకు శుభమని చుచ్చా వదలన్
పాడుగ పురుగుల మయమై
వేడుక నాశము ఫలముయు వెంగలి భువనా
{67} కందం --
దప్పియు గొన్నను జలధియు
ఒప్పున దాహము ముగించ ఒనరగ నుండన్
ఉప్పన తాగరు ఎవరును
అప్పుయు అటులనె అగుణము అడుగకు భువనా.
{68} కందం--
ఓపిక తోడను పరుగిడు
ఓపిక లేకను పరుగిడ ఓపకు ఎపుడున్
రేపుయు మాపుయు దిన్నను
చూపను అరకము విడువుము చూడను భువనా.
{69} కందం--
కంచపు వడ్డన బాయెను
మంచిగ తినగను నియతము మాయము ఆయెన్
ఉంచిన పళ్ళెము నందున
మించక బెట్టను తినగను మితమే భువనా.
{70} కందం--
అన్నము తినుటకు కూర్చొన
అన్నము తోడుగ అధికము హరితక కాయల్
తిన్నను జీర్ణము అగునటు
దన్నుగ దినగను అదియును ధర్మము భువనా.
{71} కందం--
పండిత శ్రేణిలొ గార్గియె
పండితు లందరు పొగుడగ పందెము నందున్
పండితు లందరి యందున
పండిత వెలుగులు తొణుకగ పరువడి భువనా.
{72} కందం--
గుండెకు పోటులు వచ్చెడి
గండము నేడన యువతకు కారణ మనగన్
తిండిలొ జాగ్రత లేకను
బండా రిచ్చియు తినగను బరువగు భువనా.
{73} కందం--
అన్నము అనగను నలువని
అన్నము పెట్టుము తినగను అదియును మేలున్
అన్నము చెడకను కనుమిక
అన్నము కొరకై మనుషులు ఆత్రము భువనా.
{74} కందం--
చదువుల కబ్బము అయినను
చదువుతు కమతము ఘటించ సాహస మొందిన్
వదులక భామలు వరియును
సదనపు కూరలు ఫలముల సాగగ భువనా.
{75} కందం--
శుభ్రత ముఖ్యము మనిషికి
శుభ్రము కనకను తినినను శుభముయు గాకన్
సుభ్రత లేకను వ్యాధన
శుభ్రత ఉంటెనె జనముయు శుచియను భువనా.
{76} కందం--
బలముగ ఉండను త్రుప్తని
బలముగ లేనగు మనిషితొ భాధన యనకన్
బలమగు ఏనుగు కైనను
బలముగ లేనగు కపిశము బాధయె భువనా.
{77} కందం--
చుక్కల నైనను చక్కగ
లెక్కలు పెడుతను అనుచును రేషము అనకన్
లెక్కల బూనిన తప్పగు
లెక్కలు బెట్టరు ఎవరును లేశము భువనా.
{78} కందం--
బతుకున నాన్నకు అమ్మకు
సతతము నవ్వెడి ప్రవరమె సరియగు నెపుడున్
హితముగ నవ్వుచు పనియన
రతనము లనగను తమకదె రాజీ భువనా.
{79} కందం--
నాలుక తోడుగ దంతము
పాలుయు పంచుక నములను పాదము మోపన్
మేలుగ నమిలియు తినగను
మూలపు రాయిగ వపువన ముదమే భువనా.
నాలుక=జిహ్వ, తోడుగ=తోడుగ, దంతము=పళ్ళు, పాలుపంచుక =పాలుపంచుకోవడము, నములను=నమలడానికి, పాదము=అడుగు, మోపన్=పూనుకోగ, మేలుగ=ఇస్టంగ, నమిలి=నములుతూ, తినగన్=తినగా, మూలపురాయి=వజ్రము, వపునము=శరీరము, ముదము=ఇష్టంగా
{80} కందం--
దేశము ఏమయి పోయిన
నాశన మయినను తననును నలుగురు దిట్టన్
ఆశయు జావక ధాన్యము
ఈశుడు లేదన గరుజుయె ఇంకను భువనా.
{81} కందం--
పావకి లక్ష్మియు పార్వతి
సేవలొ బ్రహ్మయు హరియును సేవకు శార్గిన్
కావలె ననుచును కోరగ
సావియు తీరుగ ముదముతొ సమకొనె భువనా.
{82} కందం--
కూచము పెద్దది ఐనను
లోచన మనగను చికిబికి లోపము ఏమో
ఆచక వెంటను పడగను
తోచిన విధముగ వధించు త్రోవలొ భువనా.
{83} కందం--
మనిషికి యోచన ముఖ్యము
మనయును పరయును దరుమమె మనిషిగ జూడన్
ఘనముగ అందరి స్నేహము
వినగను మనిషియు తెలివగు విధమని భువనా.
{84} కందం--
లోకము నందున చీకటి
రాకయు పోకయు జరుగును రాతిరి యందే
చీకటి పోవను వెలుతురు
చేకొన నుండును పగలన చెప్పగ భువనా.
{85} కందం--
జలదము పోటీ పడునన
వెలుతురు ఆపను మిహిరుడి వేగెడు భావం
మిలమిల మెరిచెడి కాంతిని
జలదము ఆపును జనముకు జయమన భువనా.
{86} కందం--
గొప్పని తలువకు మనమున
గొప్పగ మార్చను తలువుము గొదగొద లేకన్
చెప్పగ అగ్నిభ మైనను
చెప్పగ కాల్చుట వలెనన క్షేమము భువనా
{87} కందం--
మునియగు శ్రుంగియు శాపము
జనకుడు జావగ తనయుడు జనమే జయుడున్
వినుచును తక్షక వధయని
అనుచును యాగము దలచెను ఆత్రతొ భువనా.
{88} కందం--
తల్లిది గర్భము నందున
చల్లగ తొమ్మిది నెలలన సాగుచు ఉండన్
మెల్లగ అవనిన పడగను
చల్లని మాతయె కనునిక చక్కగ భువనా.
{89} కందం--
చలియును ఎండయు వానయు
తలువగ బాధయు అయినను తప్పుయు గాదున్
బలముగ ఉంటెనె జీవికి
పొలములొ పంటలు ఫలములె పొరలును భువనా.
{90} కందం--
ముగ్గురు దేవత లైనను
తగ్గక ముదముతొ హొయలని తారక నేత్రుల్
మొగ్గగ ఇష్టము యనుచును
సిగ్గుతొ మెరిసెడి తమకును శివమని భువనా.
{91} కందం--
పాలకు ఏడ్చెడి బాలల
ఆలన లేకయు పయస్సు అధముల కనగన్
కాలము ఇదియని తలచియు
బాలలు మాడగ తమకది భాగ్యమ భువనా.
{92} కందం----
చదువుకు అంతము లేదన
చదువుము మరిమరి చదువగ చతురత గలుగన్
చదువుట వలనన జ్ఞానము
వదులదు నిన్నుయు ప్రజలకు వ్యాహృతి భువనా.
{93} కందం--
పాల్కురికనగను కవియన
మేల్కొని వ్రాసెను శతకము మేలగు రీతిన్
నాల్కల నడుమను ఆడగ
కోల్కొన తెలుగుయె కవికిని కోణము భువనా.
{94} కందం--
గుడికిని బడికిని విరళము
సడలక ఈయను అదియును సమ్మత మనగన్
గుడిలో వచ్చిన సొమ్మును
బడికిని బడుగుల కుశలము బాగని భువనా.
{95} కందం--
మగువయు మగడును సంతును
జగమున బెంచుచు చదువులు చదువగ జూచియు
తగవులు లేకను పెళ్ళన
సుగమగు యశమన మనకిక స్రుక్కే భువనా.
{96} కందం--
బలమగు భావము లేకను
బలుపుతొ రాష్ట్రము నిలుపెడి భావము కాగన్
కలములొ ద్రవముయు లేనటు
మలినము అగునన ప్రభుతయు మార్పుయె భువనా.
{97} కందం--
అరటిది తొడయును గలుగను
ధరణిన భామకు నిజమగు ధర్మము అనుచున్
నిరతము అరటినె జూచుచు
విరహపు మనిషియు దిగులును వీడును భువనా.
{98} కందం--
మెడయును తొడయును చేతులు
విడిగను కాళ్ళుయు బలముయు వదులగ జూడన్
విడువరు ప్రాణము ఎపుడును
ఇడికలొ బ్రతుకుటె తగునని ఇంపుగ భువనా.
{99} కందం--
అమ్మకు అయ్యకు అన్నము
కమ్మని కూరతొ తళియను కదిగియు పెట్టన్
సమ్మత మొందుచు తినుచును
ఇమ్మహి కోడలు కొడుకుయు ఇంపన భువనా
{100} కందం--
ఇడికము సలిలము తేజము
జడియగు వర్షము దివముయు జగమని తలయన్
విడువని వనరులు దక్కను
కుడువగ మనిషికి కొదవన కుదురదు భువనా.
{101} కందం--
పగలును రాతిరి మరియును
జగమున రెండుగ కనగను జయముయు యశమున్
మగయును ఆడయు అటులనె
రగడన లేకయు బతుకుయు రథముయు భువనా.
{102} కందం--
సాగర మంతటి మగువన
దాగిన గుణమును అలజడి ధారుణి యందున్
బాగుగ కనగను కష్టమె
సాగర లోతుయు మగువకు సరియగు భువనా.
{103} కందం--
మెడకును ముక్కుకు చెవులకు
కడకును నుదుటయు నడుముకు కానగ నుండన్
దడుపక కరభము కాలుయు
విడిగను బంగరు నగలను వెలదికి భువనా.
{104} కందం--
కదళపు వంధ్యగ ఒకరన
అదుపుతొ కాకము అశిశ్వి అనగను రెండున్
కుదురని బాటలొ ఒకరును
మదికిని అందరు వృషలిలు మాటన భువనా.
కదళము=అరటి, వంధ్య=గొడ్రాలు, ఒకరన=ఒకరు, అదుపుతొ=అదుపుచే, కాకము-కాకి, అశిశ్వి=గొడ్రాలు, అనగా=చూడగా, రెండున్=అనగా సంతానము రెండు మాత్రమే,
కుదురని=కూడని, బాట=త్రొవ, ఒకరును=ఒకరు, మదికిని=మరియాదకు, అందరు=అందరన, వృషలిల్= గొద్రాలు.
అనగా-ఒకా బిడ్డ ఉన్నా వారిని=కదళీ వంధ్య అని, ఇద్దరుంటె వారిని కాక వంధ్య అని అస్లే బిడ్డలు కనని వారిని వంధ్య అని అంటారు.
{105} కందం--
తల్లియు తప్పుయు జేయగ
పిల్లలు అదిగని తముయును పిసరుగ జేయన్
తల్లియు పిల్లలు తప్పన
లొల్లితొ ఇంటను జగడపు లొసుగులె భువనా.
{106} కందం--
అంతవ శాయికి మనసున
కొంతన బాధయు గలుగగ కోపము పడకన్
వింతగ అడవిలొ దాగిన
బొంతయు లేనగు మనిషిని బ్రోచును భువనా.
అంతవశాయి= మంగలిపనివాడు, మనమున=మనసులొ, కొంతన=కొద్దిగ, బాధ=దుఃఖము, కలుగగ=కలుగగ, కోపము=కినుక, పడకన్=పడకుండ, వింతగ=వింతగా, అడవిలొ=కాననములొ. దాగిన=దాక్కున్న, బొంత=కప్పుకునే గుడ్డ, లేనగు=లేకను, మనిషిని=మనిషిని, బ్రోచును=రక్షించును
{107} కందం--
మనముతొ పధ్యము నేర్చిన
ఘనమగు పద్యపు రచనలు గలుగగ నేర్పే
వినగను జనముకు ఇంపన
పనిబడి పధ్యము జదువను ప్రకృతన భువనా.
{108} కందం--
గురువుకు నమసము అనుటయు
మరువకు ఎపుడును మనసున మనిషివి గనుకన్
మరువకు తల్లికి తండ్రికి
ధరిణిన నిల్చిరి జతయన ధాతగ భువనా.
ప్రస్తావన--
నేను ఇదివరకు 24 శతకాలు {అందులో 2 వేయి పద్యముల సహస్రములు-1. అనఘా సహస్రము-{కందము} 2. ద్విపద సహస్రము {ద్విపదలో} -తరువాత ఎన్నో కథలు, రచనలు, గేయాలు వ్రాయడము జరిగింది-
ఇప్పుడు ఈ శతక సౌగంధ్యము అనగా "భువనా" శతకము -మీ ముందు ఉంచుతున్నాను-
శతకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఈయడానికి శతకానికి జన్మయే ఉంటది -మరణం-లేదు.
జనము జదివి కంటస్థము చేసుకున్నచో సర్వకాల సర్వావస్థల యందు ఉపయోగమే.
ఈ శతకానికి ముందు మాట వ్రాసిన మా కోడలు శ్రీమతి. సరోజ {డొచ్తెర్} కు అభినందనలు.
పోచంపల్లి సుదర్శన రావు {రచయిత}
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.




Comments