![](https://static.wixstatic.com/media/acb93b_7cd87e393aa74d81a7b19a62f2d4504b~mv2.jpg/v1/fill/w_980,h_552,al_c,q_85,usm_0.66_1.00_0.01,enc_auto/acb93b_7cd87e393aa74d81a7b19a62f2d4504b~mv2.jpg)
'Breaking News' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 26/07/2024
'బ్రేకింగ్ న్యూస్' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కాలనీ లో ఉండే ముచ్చటైన జంట..మన పద్మ, పద్మనాభం. ఇద్దరి పేర్లలో పదాలు మ్యాచ్ అయినట్టు ..వారి అభిరుచులు మాత్రం అంతగా మ్యాచ్ అవలేదు.
"ఏమండీ..! మన టీవీ కొని అప్పుడే మూడు సంవత్సరాలు అయిపోయిందండీ..!ఈ దసరా ఆఫర్ లో వెంటనే మార్చేయాలి.."
"అప్పుడేనా.. పద్మ! ఇంకా ఎలా మెరిసిపోతోంది చూడు..ఎవరు చూసినా కొత్తదనే అనుకుంటారు..మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ 'ఈ కొత్త టీవీ ఎక్కడ కొన్నారని' అడిగాడు తెలుసా..!?"
"అది కాదండీ...! మొన్న ఎదురింటి పంకజం కొత్త టీవీ కొన్నాది..చూస్తుంటే, హాల్ లో గోడ మొత్తం పట్టేసింది.. పిలిచి మరీ చూపించింది. చాలా పెద్ద టీవీ అండి... వాళ్ళింట్లో అన్ని వస్తువులు అంతే అంటా..! రెండు మూడు సంవత్సరాలకే మార్చేస్తారంటా..!.."
"డబ్బులు ఎక్కువ ఉన్నాయేమో కనుక్కోరాదు..నాకు కుడా కొంచం అప్పు కావాలి..!"
"వాళ్ళు కుడా మన లాగే మిడిల్ క్లాసు..దేనికైనా టేస్ట్ ఉండాలి లెండి..!"
"టేస్ట్ కావాలంటే..కూర లో కొంచం ఎక్కువ మసాల వేసుకోవే...అంతే గాని టీవీ మార్చాలంటే ఎలా చెప్పు..?"
"చాల్లెండి.. మీ వెటకారం..!"
"మీ ఎదురింటి పంకజానికి...మరి మొగుడు పాతబడిపోలేదా..పాపం?
"ఏమిటా మాటలు..?"
"నేడో.. రేపో...విడాకులు ఇచ్చి...కొత్త మొగుడిని తెచ్చుకుంటుందేమో..చూడాలి.."
"టీవీ కొనాలని లేకపోతే, గమ్మున ఉండండి..కానీ ఈ వెటకారాలే వద్దు.." అంది పద్మ
"ఇదే వెటకారం..టీవీ కామెడీ షోలో చేస్తే మాత్రం..బాగా నవ్వుతావు..నేను చేస్తే మాత్రం, ఇలా అంటావే..!"
మర్నాడు...
" ఏమండీ..! ఏమండీ..! ఏమిటి ఆలోచించారు.. ?"
"దేని గురించో...? నేటి వార్తలు చదువుతున్నది నా శ్రీమతి పద్మ..స్టే ట్యూన్డ్..!.."
"టీవీ గురించే..ఈలోపు మీకు ఇంకో విషయం చెప్పాలి. పక్కింటి కాంతం..కొత్త సోఫా కొన్నాది..ఎంత బాగుందో! బుజ్జి గా ఉందండి...! కూర్చుంటే, లోపలికి అలా వెళ్ళిపోతాం..అంత మెత్తగా ఉందండి..!"
"ఆగు పద్మ..బ్రేక్ తీసుకుని..తర్వాత చదువు నీ బ్రేకింగ్ న్యూస్.."
"ఇంకో విషయం..ఎదురింటి మీనాక్షి కొన్న కొత్త చీరలు, పిలిచి మరీ చూపించింది. ఎంత అందంగా ఉన్నాయో! ఆవిడ..ఒకటి రెండు సార్లు చీరలు కట్టేసి..పాతవైపోయాయని ఎవరికో ఇచ్చేసి.. కొత్తవి తీసుకుంది!. నేనూ అలాగే చేస్తానండీ..!"
"నువ్వు చీరలు ఎక్కువ కడతావా అంటే.. ఎక్కువ ఆ నైటీ, నైట్ డ్రెస్ లోనే ఉంటావు. చీర కట్టావంటే..ఏదో పండుగా, ఫంక్షన్ అని అర్ధం చేసుకోవాలి. పైగా, చీర రేట్ కు డబుల్ రేట్ పెట్టి దాని జాకెట్టు కుట్టించి.. ఆ టైలర్ కు డబ్బులు పొయ్యడమే తప్ప ఏముంటుంది చెప్పు..! చాలు పద్మ!..రోజూ వార్తలు అన్నీ మోసుకొస్తావు..నీ కోసం ఒక న్యూస్ ఛానల్ ఓపెన్ చెయ్యాలి మరి!
నీకు ఒక విషయం చెప్పడం మరచాను పద్మ. మొన్న మా ఆఫీస్ లో హరి తో మాట్లాడుతుంటే...వాడు తన పెళ్ళి గురించి చెప్పాడు. మనల్ని తన పెళ్ళికి తప్పకుండా రావాలని పిలిచాడు.."
"అతనికి ముందే పెళ్ళి అయిపోయింది కదా..!" అడిగింది పద్మ
"అవును..పెళ్ళైన మూడు సంవత్సరాలకే పెళ్ళాం.. ఇది కావాలి, అది కావాలని విసిగిస్తూ ఉంటేనూ.. ఇంట్లో వస్తువులతో పాటు పెళ్ళాన్ని కుడా మార్చేశాడు. అందుకే..ఈ మళ్ళీ పెళ్ళి.." అన్నాడు పద్మనాభం
భర్త మాటలు విన్న పద్మ...మారు మాట్లాడకుండా గమ్మున ఉండిపోయింది..
************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
![](https://static.wixstatic.com/media/acb93b_9147f3217674494696f7459cafee01a0~mv2.jpg/v1/fill/w_204,h_308,al_c,q_80,enc_auto/acb93b_9147f3217674494696f7459cafee01a0~mv2.jpg)
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
@satya5120
• 11 hours ago
nice