బుంగ మూతి - పుస్తకావిష్కరణ
- Patrayudu Kasi Viswanadham

- Jul 29
- 5 min read
#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #బుంగమూతి, #పుస్తకావిష్కరణ

Bunga Muthi - Book Unveiling ceremony By Patrayudu Kasi Viswanadham
Published In manatelugukathalu.com On 29/07/2025
బుంగ మూతి - పుస్తకావిష్కరణ
రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం
ఘనంగా ' బుంగ మూతి ' పుస్తకావిష్కరణ
************************
రచయిత పట్రాయుడు కాశీవిశ్వనాథం రాసిన ' బుంగ మూతి' పలుకుబడి కథల సంపుటిని బాల్యమిత్రురాలు శ్రీమతి అమరపిని కృష్ణవేణి(పిల్లా) వారి భర్త కీ. శే
అమరపిని నూకరాజు గారికి అంకితమిస్తూ ప్రచురించారు. ఈ రోజు విశాఖలోని వారి స్వగృహం లో బంధుమిత్రుల సమక్షంలో బుంగమూతి పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత శ్రీ కాశీవిశ్వనాథం పట్రాయుడు దంపతులను సన్మానించారు.
చొక్కాపు వారి చక్కనైన మాట
**************************
పట్రాయుడి ‘పలుకుబడుల కథలు’ తెలుగు భాషకు సౌందర్య మాలికలు !
బాల సాహితీ వేత్త కాశీ విశ్వనాధంను 'పట్రాయుడు' అంటేనే ప్రత్యేకంగా తెలుస్తుంది.
ఉన్నత విదావేత్త, ఉన్నత పాఠశాల సహాయకుడు, అరుదైన స్టాంపులు, కరెన్సీ నోట్లు పతాకాల సేకరణ కర్త అయినందున ఆయన్ని గుర్తించడం ఒక ఎత్తయితే-బాలసాహితీ రచయితగా ఎంతో ఎత్తుకి ఎదగడం మరో ఎత్తు!. అందుకే పట్రాయుడంటే పట్టలేనంత ఆనందం - కట్ట తెగిన అభిమానం. ఆయన రాసిన పలుకుబడుల కథలు, సామెతల కథలు చదివాక అది పదింతలు పెరిగింది నాకు !
మాటల్లో పొదుపును పాటించి బతుకు బాట కుదుపును నివారించేవి ‘పలుకుబడులు'- అవే జాతీయాలు. సంసృతి అభివృద్ధి అయ్యే క్రమంలో ప్రజలలో కొన్ని పలుకు బడులు పుట్టుకొస్తాయి. ఒక జాతి వాడుక వలన భాషలో చేర్చబడిన భావ ప్రకటనను జాతీయాలు.. పలుకు బడులు.. నానుడులు అంటారు. జాతీయాల ద్వారా భాషకి సౌందర్యం కలుగుతుంది.
పలుకు బడులు
**************
భారతీయ సంస్కృతిi మూలాల్లోకి వెళ్ళి శోధించి సాధించి వెలికి తీసి ఆ పలుకు బడులను కథలుగా పసివాళ్ళకి పరమాన్నపు గోరుముద్దలుగా అందించిన 'పట్రాయుడు' మామూలోడు కాదు సుమా!' అనిపిస్తుంది.
చదువు అటకెక్కింది, పానకంలో పుడక, గొడ్డలిపెట్టు, నిండుకుండ, నూతిలో కప్ప, నత్త నడక, నేలపాలు - వంటి 50 పలుకుబడుల కథలు ఊసులు చెపుతాయి. ఊహలు రేపుతాయి. ఒక విషయాన్ని అర్థవంతంగా, స్పష్టంగా, క్లుప్తంగా ఒక్క వాక్యంలో చెప్పే పలుకుబడులతో కథలల్లి చెప్పడం 'కత్తి మీద సామే! పిల్లలకి వ్యక్తిత్వవికాసాన్ని
''చాపకింద నీరు'లా అందించడమే.. పట్రా యుడి పట్టుదల. ఆకథల్ని 'కొండవీటి చాంతాడులా 'మసిపూస మారేడుకాయ’ చేయకుండా సంక్షిప్తంగా రాసి పిల్లల భవిష్యత్తుకి 'ఉడతా సాయం' చేయాలనేది కాశీ విశ్వనాథం ఆకాంక్ష!
అక్షరాలు పరిమళించే చోట ఆయన నివాసం. అక్షరాలు పరవశించే చోట ఆయన సహవాసం. అందుకే పట్రాయుడు మాటల కెరటాలతో దాగుడుమూతలాడతారు
ఆయన కథలు సరళమై, సుబోధకమై, సంక్షిప్తమై పాఠాలై బోధిస్తాయి. ఇబ్బందుల్ని గుణ పాఠాలై వారిస్తాయి.
అనాదిగా సజీవ ఆస్త్రం సనాతనం. మదిమదినా పరిణామ క్రమం. జన సమూహాన్ని నడిపించే చైతన్యం. జన జీవన సమాహారం సనాతనం. అలాంటి సనాతన సౌరభాన్ని కథలుగా అందించి సాహితీ సేవ చేస్తున్న పట్రాయుడు ధన్యజీవి.
కలతలు లేని కథలకు పొదుపు సోయగాన్ని చూపించి పలుకుబడులు, సామెతల కథలు భావి పౌరులతో చదివించడం తన బాధ్యతగా భావించారు పట్రాయుడు.
ఒక మంచి పుస్తకం లోకాన్ని తెలుపుతుంది నాకాన్ని చూపుతుంది. శోకాన్ని తరుముతుంది. లౌక్యాన్ని నేర్పుతుంది. వినోదం పంచుతుంది. వికాసం పెంచుతుంది. అజ్ఞానం బాపుతుంది. విజ్ఞానం నిలుపుతుంది.
బాల్యంలోనే భాషా పరిమళాలను పరిచయం చేయడానికి పట్రాయుడు పనికట్టుకొని పలుకుబడులు, సామెతల కథలు రాశారు. ఆచారాలు, సంప్రదాయాలు, విలువలు - అన్నిటిని బాలసాహిత్యమనే గొడుగు కిందకి తీసుకొచ్చి పిల్లల్లో భాషా వికాసానికి బ్రిడ్జివేస్తున్నారు.
పట్రాయుడి కొత్త పుస్తకం వాసనలో బాల్యం గుభాళిస్తోంది. చీకటి పడే సరికి అమ్మమ్మ కథల్లో దూరి నిద్ర పోయేవాళ్ళం.
ఇప్పటి పిల్లలు పట్రాయుడి పలుకుబడి కథలు, సామెతలు కథల పుస్తకాల్లోకి దూరి ఆ కథలు చదివి మానసికంగా మేల్కొనాలి.
కాలం ఎంత విలువైనదంటే. ఉన్నప్పుడు కనుక్కోలేం. లేనప్పుడు కొనుక్కోలేం. బాలసాహిత్యమూ అంతే! ముఖ్యంగా పట్రాయుడు కాశీవిశ్వనాధం సాహిత్యం.
సూదంటురాయిలాగ బాలలందరినీ, వారి ఆసక్తుల్నీ లాగేసే ఆకర్షణ శక్తి పట్రాయుడి రచనల్లో ఉంది. ఆ రచనల్ని చదవటానికి వెంటనే పుస్తకం లోకి ప్రవేశించండి. ఈ పుస్తకంలో 50 జాతీయాల కథలు ఉన్నాయి. ప్రతీ కథ చదివితీరాల్సిందే.
కేంద్రసాహిత్య అకాడమి పురస్రార గ్రహీత
చొక్కాపు వెంకటరమణ
అధ్యక్షులు, బాల సాహిత్య పరిషత్
***
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
Patrayudu kasi viswanadham
విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ.,
ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).
స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం
విజయనగరం జిల్లా.
నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట)
వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.
ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం
ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.
సేకరణలు:
**********
1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సంకలనాలు :
1.గురజాడ శతవర్ధంతి
కవితా సంకలనం లో
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని' సంకలనం లో
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
4.'రక్త బంధం',
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.
6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం' సంకలనం లో
7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో
10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో
11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో
13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.
🌷🌷🌷🌷🌷🌷🌷
బహుమతులు
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.
3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
బిరుదులు :
1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,
3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,
4.శతశ్లోక కంఠీరవ,
5.సూక్తిశ్రీ,
6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"
7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016
8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.
9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్ పురస్కారం 2017,
10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో
11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.
12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023
🌹🌹🌹🌹🌹🌹🌹
ముద్రించిన పుస్తకాలు :
1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),
2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).
3.*దేవునికో ఉత్తరం* బాలల కధా సంపుటి
4.*అద్భుతం* బాలల కథా సంపుటి
5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.
6.తాతయ్య కల బాలల కథా సంపుటి.
అముద్రితాలు
1*మౌనమేలనోయి* కథల సంపుటి
2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి
3*నీకోసం* భావ కవితా సంపుటి.
4చెట్టు కథలు
5 పేదరాశి పెద్దమ్మ కథలు
6 మృగరాజు సందేశం కథల సంపుటి
ఇష్టాలు
పిల్లలతో గడపడం
బాలసాహిత్య పఠనం
బాలసాహిత్య రచన
ప్రచురణలు
ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120, ప్రచురణ అయ్యాయి.
🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷












Comments