చరిత్రలో నీకో పేజీ

'Charithralo Niko Peji' New Telugu Story
Written By Pitta Gopi
'చరిత్రలో నీకో పేజీ' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ముప్పై ఏళ్ళ ఒక ప్రభుత్వ ఉపాద్యాయుడు గురవయ్య మాష్టారు పరిక్ష పేపర్లతో ఎప్పటిలాగే తరగతి గదిలోకి ప్రవేశించగానే విద్యార్థులు అందరూ లేచి నమస్కరిస్తారు.
మాష్టారు వాళ్ళని కూర్చోమని చెప్పి
"ఒరేయ్ పిల్లలు.. నిన్న పెట్టిన పరిక్షలో కొందరికే మంచి మార్కులు వచ్చాయి. అందరికీ వచ్చినప్పుడే కదరా నేను ఆనందంగా ఉండేది" అంటూ.. పరీక్ష పేపర్లు ను చూస్తూ..
“శ్రావణి”.. అని పిలువగా ఆమె వస్తుంది.
"అబ్బా.. ! చూడండిరా.. రోజు అల్లరి చేస్తుంది కానీ తనవే అందరి కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. అలా ఉండాలి రా పిల్లలు అంటే..”
"ఆ నెక్ట్స్.. రవి..”
రవి వస్తాడు.
"ఒరేయ్ రవి.. ఎందుకు నీ మార్కులు తగ్గాయి.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివితే మంచి మార్కులు వస్తాయి” అంటూ రవి చేతిని తన బెత్తం తో దూరంగా పెట్టి దెబ్బలు తినటానికి రెడీ అయ్యాక చాలా దెబ్బలు కొడతాడు.
తర్వాత తలదించుకుని రవి తన సీట్లో కూర్చుంటాడు.
గతంలో కంటే కూడా రవి నిబద్ధత ను చూస్తాడు మాష్టారు.
"ఆ నెక్ట్స్.. మధు..”
మధు వస్తాడు.
“ఒరేయ్ మధు.. రవి కంటే రెండు మార్కులు తక్కువ వచ్చాయి. పర్వాలేదు కానీ.. ఇంకా బాగా చదవాలి " అని రెండు దెబ్బలు కొట్టగానే మాష్టారు వైపు కోపంతో చూస్తాడు.
అలా చూస్తూనే చఠుక్కున బయటకు వెళ్తాడు. మాష్టారు తో పాటు పిల్లలు అందరూ ఆశ్చర్యపోతారు.
ఇంతలో బయట ఏవో కేకలు వినపడుతూ.. అవి కాస్తా దగ్గర అవుతుంటాయి.
మధు తన తల్లిదండ్రులను తీసుకుని వస్తాడు. మధు తల్లి చేతిలో కత్తి ఉంది.
మధు తండ్రి కోపంతో "ఏరా.. నా కొడుకు మీద చెయ్యి వేస్తావా.. ఎంత ధైర్యం రా నీకు".. అంటూ మీద పడతాడు.
గురవయ్య మాష్టారు కొంచెం భయపడుతూ
"మరెప్పుడు కొట్టనండి..” అని ప్రాధేయపడతాడు, వెనక్కి తగ్గుతాడు.
అయినా ఆగకుండా మధు తల్లి చేతిలో కత్తి తీసుకుని చూపిస్తూ.. "ఇంకోసారి నా కొడుకు జోలికి వస్తే.. నరుకుతా " అని అంటూ.. మధుని తీసుకుని వెళ్ళిపోతారు. కానీ.. మాష్టారు బాధతో కూలబడగా.. విద్యార్థుల సవర్యలతో కోలుకుంటాడు.
కొన్ని సంవత్సరాలు గడిచాక..
నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు పై సైకిల్ తో గురవయ్య మాష్టారు వెళ్తుండగా.. ఒక యువకుడు బైక్ మీద వస్తూ ఆ సైకిల్ కి అడ్డు పెడతాడు.
"బాబు.. నీ దారిన నువ్వు వెళ్ళకుండా నాకు అడ్డంగా రావటం భావ్యమా".. అంటాడు మాష్టారు.
ఆ యువకుడు బైక్ దిగి వచ్చి మాష్టారు కు పాదాభివందనం చేస్తాడు.
ఆశ్చర్యం తో మాష్టారు "ఎవరు బాబు నువ్వు..” అంటాడు.
"నేను మాష్టారు.. రవిని. చిన్నప్పుడు మార్కులు తక్కువ వచ్చాయని బెత్తం దెబ్బలు తినేవాడిని కదా.. ఆ దెబ్బలు ఈ రోజు నన్ను బ్యాంకు మేనేజర్ ని చేశాయి మాష్టారు” అంటాడు.
"అవునా.. చాలా సంతోషం బాబు" అన్నాడు మాష్టారు.
"ఆ మాష్టారు.. మీరు ఈ సైకిల్ ని ఇక్కడ పడేయండి. మీకోసం మంచి టూ వీలర్ తీసుకుంటాను" అన్నాడు రవి.
"బాబు.. అలాంటివి ఆశిస్తూ.. ఏనాడు నేను చదువు చెప్పలేదు" అంటాడు మాష్టారు.
"రైటే కానీ.. ఉపాద్యాయులపై ప్రేమ లేకపోతే.. మేం చదివిన చదువు కు, మేం చేసే ఉద్యోగాలకు ఏం విలువ ఉంటుంది చెప్పండి" అని ప్రశ్నిస్తాడు.
ఇంతలో వాళ్ళ మధ్యలోంచి ఇద్దరు బిచ్చగాళ్ల చేతులు చాస్తారు.
లేదు పొమ్మంటాడు మాష్టారు.
వాళ్ళు వెళ్తుండగా.. రవి వాళ్ళని గుర్తు పట్టి వెనక్కి పిలుస్తాడు.
"మీరు మధు తల్లిదండ్రులు కదా! ఈ గెటప్ ఏం”టని ప్రశ్నిస్తాడు.
‘అవున’ని చెప్పి “చదువు అబ్బలేదు, చెడు అలవాట్లు కు బానిసై మా ఆస్తులు తీసుకుని మమ్మల్ని తరిమేశాడు” అంటారు.
"ఏంటీ చదువు అబ్బలేదా..
మార్కులు తక్కువ వచ్చాయని రెండు దెబ్బలు కొడితే.. దైవ సమానులైన ఉపాద్యాయులు పై కత్తి ఎత్తిన పాపం ఊరికే పోతుందనుకున్నారా.. ఇదిగో ఇతన్ని చూడండి”..
గురవయ్య మాష్టారు ని చూపిస్తూ..
“మీరు కత్తి ఎత్తి బెదించిన దైవమూర్తి ఇతనే" అని చూపిస్తాడు.
వాళ్ళు క్షమించండని మాష్టారు కాళ్ళు పై పడతారు.
"ఆయన క్షమిస్తే కర్మ క్షమిస్తుందా..
బడిలో పిల్లలకు తల్లి, తండ్రి, స్నేహితుడు అన్ని గురువే. ఏం చేస్తే.. పిల్లలు చదువుతారో.. ఏం చేస్తే.. పిల్లల భవిష్యత్ బాగుంటుందో.. వాళ్ళకి తెలిసినట్లు ఎవరికి తెలియదు. అలాంటి వారిపై కత్తి ఎత్తిన పాపం ఎన్ని జన్మలకు అయినా పోదు. వెళ్ళండి" అని కోపంతో అరుస్తాడు.
మరలా శాంతించి బాధతో పిలిచి తన పర్స్ లో డబ్బులు తీసి మాస్టర్ చేతికి ఇచ్చి
"మాష్టారు. ఈ డబ్బులను మీ చేతితో వాళ్ళకి ఇవ్వండి " ఆంటాడు.
మాష్టారు వాటిని మధు తల్లిదండ్రులు కు ఇచ్చి పంపుతాడు.
మాష్టారు కళ్ళజోడు తీసి కళ్ళనుండి వచ్చేందుకు సిద్దంగా ఉన్న కన్నీటి ని తుడుచుకుని
"బాబు రవి.. నీ తర్వాత చాలామంది పిల్లలు కు చదువు చెప్పాను కానీ.. నీలాంటి విద్యార్థిని ఎప్పుడూ చూడలేదు. నా మనసులో నీకంటు పేజీని లిఖించుకున్నావు. పిల్లాపాపలతో సంతోషంగా ఉండ”ని దీవించి ముందుకు వెళ్తాడు గురవయ్య మాష్టారు.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
https://www.manatelugukathalu.com/profile/gopi/profile
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం.