చేతిలో చేయివేసి
- Yasoda Gottiparthi

- Nov 7
- 2 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #ChethiloCheyivesi, #చేతిలోచేయివేసి, #TeluguStories, #తెలుగుకథలు

Chethilo Cheyivesi - New Telugu Story Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 07/11/2025
చేతిలో చేయివేసి - తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
అధికంగా డబ్బులు ఖర్చు పెట్టి, ఫీజులు కట్టి, పెద్ద పేరున్న కళాశాలలలో విద్యనభ్యసించి, ప్రత్యేక కోర్సుల కోసం ప్రయత్నం చేయమంటూ ప్రతినెలా డబ్బులు పంపిస్తుంటాడు మాధవయ్య.
“నాన్నా రమేష్!ఈ నెలలో నీకు పది వేల రూపాయలు నీ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను ఆన్లైన్లో. నీకు మెసేజ్ వస్తుంది, చూసుకో. పరీక్షలు అయిపోగానే ఏదైనా కోచింగ్‌లో జాయిన్ అవ్వు. నాకేమో ఈ చదువుల విషయం తెలియదాయే.”
“సరే నాన్న! నాకు కాలేజీకి టైం అయింది, వెళ్లాలి. తరువాత మాట్లాడుతా సరేనా?” అంటున్న కొడుకుతో, “కొద్దిగా సేపు నా మాటలు విను, ఎంత ఖర్చయినా సరే, పరీక్షలు అయిపోగానే ఇంటికి వచ్చే ప్రయత్నం చేయకు” అనగానే, “సరే నాన్నా, బై” అని ఫోన్ పెట్టేశాడు.
అదే ఊళ్ళో ప్రభుత్వ కళాశాలలో చదువుకునే వికాస్ ఫస్ట్ ర్యాంక్‌లో పాస్‌యి, పై చదువుల ప్రత్యేక శిక్షణ కోసం ప్రయత్నించసాగాడు. తండ్రికి డబ్బులు పంపే స్థోమత లేదు.
“చదివింది చాలు నాయనా, ఊళ్ళో నీ చదువుకు తగిన ఉద్యోగం చేసుకుంటూ నా కళ్ల ముందే ఉండు” అంటూ ఉత్తరాలు వ్రాస్తూనే ఉంటాడు వికాస్ తండ్రి — మాధవయ్యకు పాలేరుగా పనిచేస్తూ ఉన్నాడు.
“ప్రస్తుతం అన్ని ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ అవసరమవుతుంది. కావాలిస్తే మళ్లీ ఫీజు పంపిస్తాను. నీవు పై చదువుల కోసం శిక్షణ తీసుకో” అని పంపిన డబ్బులన్నీ వికాస్ చేతిలో పెట్టి, “ఆ పల్లెటూర్లో నేను చేసేదేమీ లేదు. నాకు పెద్ద ఉద్యోగంపై ఎక్కువ ఆశ లేదు. మా నాన్న సంపాదించిన ఆస్తి, డబ్బు చాలా ఉంది. వికాస్, నీకు పెద్ద ఉద్యోగం వచ్చేంత వరకు ఆర్థిక సహాయం చేస్తాను. నేను ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తాను” అంటున్న రమేష్‌తో —
“ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఎలా రమేష్? హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న నాకు డబ్బులు ఎలా వచ్చాయన్న అనుమానంతో ఆరా తీస్తే… వద్దు రమేష్. నేను ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకుని వచ్చిన డబ్బులతో శిక్షణ ఫీజులు కట్టుకుని రాత్రిపూట కళాశాలల్లో జాయిన్ అవుతాను.”
“బాగా కష్టపడి, ఇష్టపడి చదువుకునే మనస్తత్వం ఉన్న వాడివి. కానీ నేను చేసిన సహాయానికి నా విషయాలను ఎవరికీ తెలియనివ్వకు. మా నాన్నకు అసలే చెప్పకు. మా నాన్నకు నాపై నమ్మకం చాలా ఉంది. నా గురించి ఎవరిని అడుగడు.”
“నమ్మకమున్న చోట మోసం చేయకూడదు. అప్రయత్నంగా, ఉచితంగా నీ డబ్బులతో నేను చదువుకున్నా నాకు మనశ్శాంతి లభించదు. నీవు ఖాళీగా ఉన్నట్లయితే దురలవాట్లు చోటు చేసుకోవచ్చు. దానికి నేనే కారణమైన వాణ్ణి అవుతాను. నా చేతులారా మిత్రద్రోహం చేయలేను,” అని బాధగా అంటున్న వికాస్‌తో —
“నువ్వింతగా బాధపడుతున్నావు కావున నేను ‘లా’ చదువుతాను. నా తెలివి తేటలకు సరిపోతుంది. ఎక్కువగా కష్టపడకుండా ఏదో చెట్టు కింద ప్లీడర్‌లా పేరు తెచ్చుకోవచ్చు,” రమేష్ అలా అనేసరికి, చేతిలో చేయి వేసి ప్రమాణం చేయించుకుని, వికాస్ ఒప్పుకున్నందుకు సంతోషించాడు.
ఏ ఉద్యోగాన్ని సంపాదించాలన్నా, ఉద్యోగ రంగంలో పోటీతో పాటు స్పెషలైజేషన్ కోర్సులు చేసిన వ్యక్తులకు అవకాశాలున్నాయని తెలుసుకుని, అన్ని రంగాలకు చెందిన ఇంజనీర్లు, పారిశ్రామిక రసాయనిక వేత్తలు ఇలాంటివి అభ్యసిస్తుంటారు.
వికాస్ తనకు మాత్రం డిగ్రీ చదివిన అర్హతకు కష్టపడినా ఐఏఎస్ కావాలని, సంవత్సరం మొత్తం ఫీజు బిల్లుల రూపంలో చెల్లిస్తూ, స్నేహితుడు చేసిన సహాయానికి తగిన ప్రతిఫలం పొందాలని కష్టపడి పూర్తి చేశాడు.
“నేను ఈ చదువుతో సంపాదించిన ఉద్యోగం వల్ల నాకే కాకుండా సమాజ శ్రేయస్సుకూ ఉపయోగపడుతుంది.”
రెండవ సారి పరీక్షలో పాస్ అయ్యాడు. అనుకున్నట్టుగా పదవీ బాధ్యతలు చేపట్టి, మంచి స్నేహితులుగా ఇద్దరూ ఒకే పట్టణంలో తల్లి తండ్రి ఆశలను, ఆశయాలను నిలబెట్టారు.
శుభం.
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం




Comments