top of page

చిత్త విప్లవము


'Chittha Viplavamu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'చిత్త విప్లవము' తెలుగు కథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి


మనుషులు బాగనే ఉన్నా ఒక్కొక్కప్పుడు మతిభ్రమించడము జరుగుతుంది. దానికి కారణాలు చాలా ఉంటాయి. పూర్వీకులుకు ఎవరికో ఉన్మాదము ఉండడము. మెదడు మీద భారమయ్యె అతిగ చదువులో జ్ఞాన ముపయోగించుట. అనుకున్న పనులు నెరవేరక పోవుట. అహం దెబ్బ తినేటట్లు కుటుంబ సభ్యులు వ్యవహరించుట. ఏదేని ప్రమాదానికి గురి అగుట ఇత్యాది కారణాలు కోకొల్లలు. ఆ ఉన్మాద పరంపరే నీలాంబర్ కొడుకుకు పంచ భూత్ అని నామకరణము చేశాడు.


నీలాంబర్ కు ఆస్తికి లోటు లేదు. పిసినారి తనమూ లేదు. కూర్చొని తినే యంత ఆస్తి. అప్పుడప్పుటు దానధర్మాలు చేస్తుంటాడు. భార్య పావని. పేదింటినుండి వచ్చిన ఇల్లాలు. అప్పుడప్పుడు భార్యతరఫు వారికి కూడా ఆర్థిక సహాయము చేస్తుంటాడు నీలాంబర్.


కొడుకుకు పంచభూత్ కు తెలివితేటలు అధికము. చాలా బాగా చదివి చదివి బుర్ర వేడెక్కిందో ఏమో ఉన్మాద ఛాయలు క్రమ్ముకుంటాయి.


తండ్రి నీలాంబర్ గాని తల్లి పావని గాని ఆ ఉన్మాద ఛాయలు పూర్వీకుల పోలిక కావచ్చు అనుకొని తేలికగా భావించి ఆదిలోనే ఉపచారము చేయించ పూనుకొనలేదు. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు.

కాలము గడుస్తున్నకొద్ది పంచభూత్ కు ఉన్మాదము పెరుగుతూ ఉంటుంది. ఒకనాడ ఒక బిచ్చగత్తె బజారులో పంచభూత్ ను చూసి “అయ్య.. ఒక రూపాయి ధర్మం చేయి బాబూ నీకు పున్నెముంటుంది” అనగానే ఒకరూపాయి దానం చేస్తాడు పంచభూత్.


కొంత సేపటికి ఇంటికొచ్చి “అమ్మా! నాకు పుణ్యమొచ్చింది. ఒక బిచ్చపామె దీవించింది” అంటాడు పంచభూత్.


తల్లికి అనుమానం అధికమయి భర్త నీలాంబర్తో చెబుతుంది “మన అబ్బాయి వాలకము చూస్తె పిచ్చే ముదిరినట్టుందండి” అంటుంది వ్యాకులతతో.


భర్త నీలాంబర్ ఇక లాభము లేదని వైద్యులకు చూపిస్తాడు కొడుకు పంచభూత్ ను. వైద్యుడు పంచభూత్ ను బాగా పరిశీలించి “ఇప్పటికే జాప్యము చేశారు. ఇంకా తాత్సారము చేస్తే ఇక పిచ్చాసుపత్రే శరణ్యము” అంటాడు.


దానికి జడిసిపోతారు నీలాంబర్, పావని. కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ఉన్న ఒక్క కొడుకు ఉన్మాది అవుతుంటె.


ఇంక నయము సంబంధాలు వస్తుంటె తొందరపడి పెళ్ళి చేయక పోవుడే నయమయింది. కోలుకున్నదాక ఆ తలంపు మానుకోవడమే ఉత్తమము అనుకుంటారు నీలాంబర్, పావని.


పిచ్చాసుపత్రి తప్ప పిచ్చికి ఎక్కడెక్కడ పేరు మోసిన వైద్యులున్నరో అన్ని చోట్లా వీళ్ళకే పిచ్చి లేచినట్లు కొడుకును వెంటబెట్టుకొని తిరుగుతారు.


తిరుగగా తిరుగగా ఉపచార ప్రభావము నాలుగేళ్ళకు నయమౌతుంది. అప్పుడు అనుకుంటారు భార్యా భర్తలు అలక్ష్యము చేయడమే ఈ పరిస్తితి కి కారణము ఇకముందు దేనికైన ఇలాంటి తాత్సారమున కొడిగట్ట కూడదు అనుకుంటూ.


అందుకే అన్నారు పెద్దలు ఆలస్యం అమృతం విషం అని. ఏ జన్మ పుణ్యమో పూర్తిగా ముదురక ముందే మేల్కొని ఈ నాలుగేండ్లు ఉపచారము చేయించడము జరిగింది. అని నిట్టూరుస్తారు భార్యా భర్తలు.


ఆ బిచ్చగత్తె ఎవరోకాని ఆమె దీవన మనకు అక్కరొచ్చింది. ఒక్క రూపాయి మన పంచభూత్ దానము చేసిన కారణాన. దేవుడున్నాడు అనడానికి ఇదే నిదర్శనము అనుకొంటారు దంపతులు. ఊళ్ళో కట్టే గుడికి చందా తనదే సింహ భాగమని చెల్లిస్తాడు నీలాంబర్.


అది మొదలు నీలాంబర్, పావని, పంచభూత్ ముగ్గురు తరచు పుణ్య క్షేత్రాలు దర్శిచుకుంటారు ఎంతో భక్తి ప్రపత్తులతో.


ఒకనాడు యాదగిరి లక్ష్మినరసింహ స్వామిని దర్శించ వరుసలో నిలబడగా ఒక పెళ్ళి కాని అమ్మాయి వీళ్ళకు ముందర నిలుచుంటది, వాళ్ళ అమ్మా నాన్నలతొ. ఆనాడు భక్తులు అధికంగా రావడము చే వరుసలో ఉన్నవారు మెల్లె మెల్లెగా జరుగడము చూసి ఆ అమ్మాయి విసుగుతొ అటు ఇటూ చూస్తుంది తల త్రిప్పుతూ. పంచభూత్ తదేకంగా ఆమె వైపే చూడసాగాడు. ఆ అమ్మాయి కూడా విసుగు వంకతో పదేపదే పంచభూత్ వైపు చూడసాగింది.


తల్లిదండ్రి ఇది గమనిస్తూ ఉంటారు. దేవుణ్ణి దర్శించుకునే వరకు ఇదే వరుస. ఎట్టకేలకు దైవ దర్శనము చేసుకొని మొక్కులేవో మొక్కుకొని ప్రసాదము కొనడానికి వరుసలో నిలుచుంటారు ముగ్గురు. ఆ ముగ్గురుకూడా వీళ్ళకు ముందరగా నిలుచొని ప్రసాదము కొంటారు.


ఆ అమ్మాయి ప్రసాదము రెండు చేతులలో పట్టుకొని పరధ్యాన్నంగ ఇటూ అటూ చొస్తుంటె ఆ ప్రసాదము కాస్త కోతి అందుక పోతుంది. దానికి ఆ అమ్మాయి మళ్ళీ వెనుకకు పోయి ప్రసాదము కొనుక్కోవాలె కాని వెనుక చాంతాడంత వరుస.


పంచభూత్ ప్రసాదము కొనబోతుటె “ఏమండి.. దయచేసి మాకూ మూడు లడ్డూలు, మూడు గారెలు, పులిహోర తీసుకుంటరా.. పున్నెముంటుంది” అని అడుగుతుంది అమ్మాయి.


“సరె ఇవ్వండి చూస్తాను. మీ పున్నెములో నాకు సగం” అంటాడు చిలిపిగా పంచభూత్.


“మొత్తం పున్నెం మీకే. ప్రసాదం మాత్రం మాకు ఇయ్యండి” అంటుంది అదే చిలిపిగా అమ్మాయి.


పంచభూత్ తలిదండ్రులు వేరే ధ్యాస లేనట్లు గా వీళ్ళ కదలికలే చూస్తూ ఉంటారు. ఎట్లయితేనేమి పంచభూత్ తమకు ఆ అమ్మాయికి ప్రసాదము కొని, తమది తల్లి కిస్తూ ఆ అమ్మాయి ప్రసాదము ఆమెకు ఇస్తూ “మీపేరేమిటి? ఎక్కడుంటారు..” అని అడుగుతాడు.


ఆ అమ్మాయి నవ్వుతూ “ముందు మీ పేరు చెప్పండి” అంటుంది గడుసుగా.


“నాపేరు మనము బ్రతకడానికి ఆధార మైంది, మీరే తెలుసుకొండి” అంటూ “మరి మీపేరేమి” అని అడుగుతాడు.


ఆ అమ్మాయి బాగుగా ఆలోచిస్తున్నట్టు చెంపమీద వేలు పెట్టుకొని తన పేరు “నేను లేకుంటె జనజీవనము సాగదు” అంటుంది.


“ఐతె మీ పేరు లక్ష్మి. మరి నాపేరు చెప్పలేదు” అంటుంటె “దానికి కొంత సమయము పడుతుంది, నా కంటె పెద్దవారుకద” అని తన ఫోన్ నంబర్ ఇస్తుంది.


“మీ ఫోన్ నంబర్ కూడా ఇస్తె.. ఆత్రత ఉంటె మీరు ఫోన్ చెయ్యండి. ఆలస్యమైతె నేను ఫోన్ చేసి చెబుతాను” అని రివ్వున వెళ్ళి పోతుంది.


ఇది దైవ ఘటనో పరిచయాల పరమార్థమో అనుకుంటూ ‘పదర పంచభూత్ ‘అని ముగ్గురు ఇంటి దారి పడుతారు. ఇంటికి పోయిన వారం రోజులకు పంచ భూత్ ఆ లక్ష్మికి ముందుగా తానే ఫోన్ చేస్తాడు. కాకతాళీయంగ లక్ష్మి కూడ అప్పుడే ఫోన్ చేస్తుంది.


“మీకు నిండ నూట ఏబది సంవత్సరాల వయసు” అంటాడు నవ్వుతూ.


“మీ పేరు ప్రభావమా ఏమిటి నూట ఏబదికి పెంచేశారు” అని నవ్వుతూ అంటుంది లక్ష్మి. “మీ పేరు నాకు దొరికిందండి” అంటుంది.


“మరి చెప్పరేమి?” అంటాడు పంచభూత్.


“అదే.. పంచ భూతాలకు సంబంధించినది” అంటుంది లక్ష్మి.


“సరె.. మీరుండేదెక్కడ? మేము మాత్రము హైదరాబాదుకు దూరంగ ఒక పల్లెటూరులో ఉంటాము. చదువుకున్నది మాత్రము హైదరాబాదులో “అంటూ “ఇక మీవంతు” అంటాడు పంచభూత్.


“మేము హైదరాబాద్ లోని చిక్కడ్ పల్లిలోనండి ఉండేది” అంటుంది లక్ష్మి.


“నాకెందుకో గుడిలో మిమ్ముల చూడగానే మనసు పారేసుకున్నాను” అనగానే “అది నాకే దొరికింది” అంటాడు పంచభూత్.


“మాయింటికి భోజనానికి రండి. అప్పుడు రాబట్టుకుంటాను” అంటుంది లక్ష్మి.


పంచభూత్ తలిదండ్రులకు లక్ష్మికి తనకు జరిగిన సంభాషణ వివరించి “రేపు వాళ్ళింటికి భోజనానికి పోదాము” అంటడు.


తల్లిదండ్రి ఇదంతా అర్థం చేసుకొని సరె అంటారు. మరునాడు చిక్కడ్ పల్లిలోని లక్ష్మి ఉండే ఇంటికి చేరుతారు. లక్ష్మి తండ్రి పాంచజన్యం, తల్లి పారిజాత వీళ్ళను సాదరంగా ఆహ్వానిస్తారు.


ఆరుగురు ఒక్కదగ్గర కూర్చొని భోజనము చేస్తారు. లక్ష్మి పంచభూత్ ల పరిచయాలు, స్నేహభావము.. అటుపై వాళ్ళు ఒక్కటయ్యే ఆలోచన ఇరువర్గాలు సంభాషించుకొని ఒక అంగీకారానికి వస్తారు. అనుకున్నదే తడవుగా ఎక్కడైతె ఇరువురు కలిశారో అక్కడే వారి పెళ్ళి జరిపిస్తారు వారం రోజులకు.


అంతా ఆ భగవంతుని మాయ అని పంచభూత్ కు కొడుకు పుడితె లక్ష్మి నారసింహ అని పేరు పెట్టుకుంటామని మొక్కుకుంటారు.


సమాప్తం.

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.




31 views0 comments

Comments


bottom of page