top of page
Original.png

చివరికి మిగిలింది

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #ChivarikiMigilindi, #చివరికిమిగిలింది, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు


Chivariki Migilindi - New Telugu Story Written By Veereswara Rao Moola

Published In manatelugukathalu.com On 20/07/2025

చివరికి మిగిలింది - తెలుగు కథ

రచన: వీరేశ్వర రావు మూల

పని.. పని.. పని.. పగలు పని, రాత్రి పని, మధ్యాహ్నం పని. పనిలేని దినం ఎక్కడ ఉంది? ఆదివారం అరుదైన వారం అయిపోయింది. ఇరవై నాలుగు గంటలు, ఏడురోజులు, 365 రోజులు అంతా పని. పనినుండి విముక్తి ఎప్పుడో?


ఇది మహీధర్ పరిస్థితి. 


అతను సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడ సెలవు దొరకడం కష్టం. 


డబ్బులు దొరుకుతాయి అక్కడ. ఆ డబ్బుని అనుభవించడానికి సమయం దొరకదు. 


ఎప్పుడు సెలవు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాడు. 


అతను పగలు పిల్లలు నిద్రలేవకుండా వెళ్లిపోతాడు. 


వాళ్ళు నిద్రపోయాక ఇంటికి వస్తాడు. 


నాన్నని ఫోటోలో తప్పి ఇంట్లో చూడడం కష్టం గానే ఉంది పిల్లలకి. 


ఆరోజు మహీధర్ ఇంట్లో.. 


 *******


"ఇది ఇల్లా లేక సత్రమా? పెళ్ళయ్యితే ఏదో మొగుడితో షికార్లు, సినిమాలు అనుకున్నా కానీ ఇలా జాతకం తిరగబడి మొగుడి వైపు బంధువులకు వండి వడ్డించటాలతో సరిపోతోంది. ఈ సంసారం చెయ్యడం కన్నా హిమాలయాలకు పోయి తపస్సు చేసుకోవడం నయం" అంది మహీధర్ భార్య వసుంధర. 


"నేను కూడా రానా హిమాలయాలకి" అన్నాడు మహీధర్,


"రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పనట్లు మీరెందుకు?"


"నీకు చలివేస్తే రగ్గు కప్పడానికి"


"హు! మీ నాన్నగారి తోడల్లుడి కొడుకు ఈ వారమైనా కదులుతాడా? వాడికి బయట తిండి పడదట. 

. అన్నీ ఇంట్లో చెయ్యాలి ఛస్తున్నా. మీరూ ఆఫీసులో కావరం పెట్టారు" అంటూ చేతిలో ఉన్న గ్లాసు విసిరికొట్టింది. 


ఆ గ్లాను క్రింద పడకుండా క్యాచ్ పట్టుకు న్నాడు మహీధర్. 


'చిన్నప్పటి క్రికెట్ ప్రాక్టీసు ఇలా ఉపయోగవ డుతోంది' అనుకున్నాడు. 


"అయినా నా వైపు బంధువుల్ని విమర్శిస్తావు? నీ వైపు బంధువులు తక్కువ తిన్నారా? లాస్ట్ మంత్ రాజమండ్రి వెడుతున్నప్పుడు మీ నాన్న అదే మా మామగారు ఆయన మేనత్త మనవడు నేను ఎక్కిన కంపార్ట్మెంట్లోకి చొరబడి "బావగారూ! ఇక్కడ ఉన్నారా? చిన్న ఎడ్జస్ట్మెంట్" అంటూ నా బెర్త్లో ఆయన బంధువుని పడుకోబెట్టాడు. రాత్రంతా శవ జాగరణ చేసేవాడిలా ఆ దగ్గుతున్న ముసలాడి దగ్గర కూర్చున్నాను. ఇదీ మీ వైపు బంధువుల వరస" అంటూ వివరించారు మహీధర్. 


వీళ్ల సంభాషణ జరుగుతుండగా మహీధర్ సుపుత్రుడు అవినాష్ వాళ్ల అమ్మని అడిగాడు. 


“అమ్మా కోతినుండి మనుష్యులు వచ్చారని డార్విన్ చెప్పాడట నిజమేనా?”


"మీ నాన్న వైపు బంధువుల్ని చూస్తే నిజమని పిస్తుంది!"


 *******


ఆరోజు ఆఫీసులో మహీధర్ బాస్- వరదరాజన్ మహీధర్ కి కొత్త సెల్ 'సెల్ తంతునానేన కంఠే బద్నామి శుభగే' అంటూ బెల్ట్ ఉన్న సెల్ ని మహీ ధర్ మెడలో వేశాడు. 


"చూడు మహీ సెల్ని ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకోవలెను. దీనిని కేవలం కంపెనీ ప్రయోజనములకే ఉపయోగించవలెను. ఇతరులకు ఇవ్వ రాదు. భార్యకిచ్చి 'ఆయన ఇంట్లోలేరండీ' అని ఎప్పుడూ చెప్పించడం వంటి చిల్లర చిట్కాలు ఉపయోగించరాదు. అర్ధరాత్రి అయినా సెల్ ఫోన్ మ్రోగినప్పుడు విసుగు ప్రదర్శించకుండా ఓపికగా జవాబు ఇవ్వవ లెను" అని ఉపదేశం చేశాడు వరదరాజన్,


సెల్ తీసుకున్న అరగంట తర్వాత మహీధర్ కస్టమర్ ని కలవడానికి వెళ్ళాడు. 


అక్కడ కస్టమర్ లేడు. 


లిబర్టీ దగ్గర కూల్ డ్రింక్ త్రాగుతూ బాస్ కి సెల్ ఫోన్ చేశాడు. 


“సార్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాను. కస్టమరికి ఫోన్ చేస్తే ముంబాయ్ వెళ్ళా రని చెప్పారు. రేపు మార్నింగ్ డైరెక్టుగా ఆఫీసుకు "


"అలాగా! ముందు త్రాగుతున్న కూల్డ్రింక్ పూర్తిచేసి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నా నా దగ్గరికి రా. ఇద్దరమూ వేరే కస్టమర్ దగ్గరికి వెడదాం" అన్నాడు వరదరాజన్,


"నేను కూల్డ్రింక్ తాగుతున్నట్లు సెల్ఫోన్లో మాట్లాడుతున్న మీకెలా తెలుసు?"


"అదేమరి. తలెత్తి రెడ్ సిగ్నల్ అంటే నీకు వది అడుగుల దూరంలో ఉన్న నీలంరంగు మారుతి కారు చూడు" అని చెప్పాడు వరదరాజన్. 


ఎదురుగా నీలంరంగు మారుతీకారులో వరద రాజన్ నవ్వుతూ కనబడ్డాడు. 


'నువ్వు ఈ టైంలో ఇక్కడ తగలడాలా!' అని తిట్టుకుంటూ వరదరాజన్ దగ్గరికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి కస్టమర్ దగ్గరకు వెళ్లారు. రాత్రి పన్నెండయ్యింది. రాత్రి రెండుగంటలకి ఇంటికి చేరాడు మహీధర్,


సోఫాలోనే కూలబడ్డాడు. 


తెల్లవారుజాము నాలుగుగంటలకి మళ్లీ సెల్ మ్రోగింది. 


'సెల్ వల్ల జీవితం హెల్ అయిపోయింది' అను కుని ఆవలిస్తూ 'హలో' అన్నాడు. 


"నేను వరదని. మనం బ్యాలెన్స్ షీట్లో డెబిట్ సైడ్ 2500డాలర్లు వేశామా లేక 5200 వేశామా? చెప్పు త్వరగా"


'డెబిట్, క్రెడిట్ చెప్పాలి! ఇప్పటివరకూ అవే కదా కుస్తీపట్టాం. నీ వల్ల నాజీవితంలో ఆనందం డెబిట్ అయ్యింది' అని మనస్సులో అనుకుని 2500 అని చెప్పి సెల్ ఆఫ్ చేశాడు మహీధర్. 


" వస్తారా? పిల్లాడి స్కూలుకి వెళ్ళాలి" అంది వసుంధర


"ప్రయత్నిస్తాను" అన్నాడు మహీధర్. 


 


*******


"చూడు మహీ! కొన్నాళ్ళు వర్క్ ఫ్రెషర్ ఉంటుంది. తర్వాత నువ్వు ఐదుగంటలకే పోవచ్చు" చెప్పాడు వరదరాజన్. 


"కొన్నాళ్ళు వర్క్ ఫ్రెషర్ వుంటుంది. తర్వాత నువ్వు దానికి అలవాటుపడి పోతావు అంతే కదా "

 అన్నాడు విసుగ్గా మహీధర్,. 

"నీలోనూ హ్యూమర్ ఉంది" అన్నాడు పాన్ నములుతూ వరదరాజన్,


'నీలోనూ ఉంది పెద్ద హేమర్. పని గురించి, శ్రద్ధ గురించి, వినయం గురించి, సెల్ని చార్ట్లో పెట్టమని చెప్పడం గురించి, బోలెడు క్లాసులు పీకుతావు. ' 


' సెలవు మాత్రం ఇవ్వవు' అని గొణుక్కున్నాడు మహీధర్. 


"ఏమిటి మహీ నీలో నువ్వు మాట్లాడుకుంటు న్నావు?"


"నీతో మాట్లాడ్డానికి ఏం లేదు కాబట్టి"


' "సరే తంబీ! సింగపూర్ ఫైల్ డీల్ చెయ్యి ఈరోజు" చెప్పి వెళ్ళిపోయాడు వరదరాజన్. 


పని పూర్తయ్యేటప్పటికి రాత్రి పదయ్యింది. భార్య చెప్పిన మాట గుర్తుకువచ్చింది. 


మర్నాటి ఉదయం. 


అరగంట తర్వాత మళ్లీ సెల్ మ్రోగింది. 


మళ్ళీ వరదే!


“నేను ఆఫీసులో నిద్రపోతున్నా. నువ్వు ఏడుగంటలకి వచ్చి నన్ను నిద్రలేపు" అని చెప్పాడు వరదరాజన్. 


 ******


ఉదయం ఆరున్నరకి ఆఫీసుకి వెడుతున్న మహీధర్ ని భార్య అడిగింది. 


“ఏమిటీ అప్పుడే బయల్దేరారు ఆఫీసుకేనా?"


"ఆఫీసుకే. వాడు వరదరాజన్. నా మొగుడు ఆఫీసులోనే పడుకున్నాడు. వెళ్ళి 'ఎలుగూ' వెలు గొచ్చింది అని సుప్రభాతం పాడాలి. అందుకే పోతున్నా" అన్నాడు మహీధర్. 


"చక్కగా ప్రక్కింటి మంగగారి మొగుడిని చూడండి. ఎప్పుడూ 'హోమియోపతి'లా ఇంట్లో ఉంటాడు"


"పనిలేదా?”


"ఉంది టీచర్ గా పనిచేస్తాడు. బోలెడు సెలవులు"


"టీచర్లకి సెలవులు ఎక్కువ. అందుకే పిల్లలు ఎక్కువ" అన్నాడు మహీధర్ వ్యంగ్యంగా,


"మీకన్నా నయం! సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారు. 


******



"అమ్మా, నాన్న మన ఇంటికి వస్తున్నారా?" అడిగాడు మహీధర్ కొడుకు భరణి. 


"అడుగు ఆ జీవినే! వస్తున్నారు" అంది వసుంధర విసుగ్గా. 


"జీవీ, టీవీ అంటున్నావు? విషయం ఏమిటి?" అడిగాడు మహీధర్. 


"నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు? నాకు మ్యాజిక్ ప్రైజ్ వచ్చింది" అన్నాడు భరణి. 


"అదే బాబూ! ఏదైనా మ్యాజిక్ చేసి మా బాస్ మనస్సు మార్చరా! సెలవు ఇస్తాడు" అన్నాడు. మహీధర్ కొడుకుని దగ్గరకు తీసుకుంటూ. 


"వరదకి ట్రాన్స్ఫర్ అవ్వదా?" అడిగింది వసుంధర. 


"ఆ అదృష్టంలేదు. అన్ని బ్రాంచీలలో చేసి చివరికి హైదరాబాద్ వచ్చాడు వరదరాజన్. వైస్ ప్రెసిడెంట్ కి దగ్గర బంధువు కాబట్టి హైదరాబాద్లో స్థిరంగా ఉంటాడు. ఉన్నన్నాళ్లు నన్ను పీక్కు తింటాడు"


"పోనీ మీరు ట్రాన్సఫర్ పెట్టుకోండి" అంది వసుంధర. 


"వరద రికమెంట్ చెయ్యడు కదా!"


" జ్వరమని చెప్పి ఒక్క రోజు సెలవు తీసుకోండి. 

సరదాగా ఎక్కడికైనా వెడదాం" అంది వసుంధర

" నీకు తెలీదు వసూ! వాడు వరద ఆఫీసులోనే టాబ్లెట్లు, ధర్మామీ టర్ ఏర్పాటుచేశాడు. ఈ సమస్యని కాలమే 

పరిష్కరించాలి"


 ********


రెండు నెలలు గడిచాయి. రోజూ ఆఫీస్ నుండి లేట్ గా 

వస్తున్నాడు మహీధర్.. భర్త సెలవు

గురించి మర్చిపోయింది వసుంధర. 


ఆరోజు జరిగింది అనూహ్య సంఘటన. 


మహీధర్ ఆఫీసుకి వెడుతుంటే సెల్ మోగింది. 


కొలీగ్ కమలాకర్ చెప్పాడు వరదరాజన్ ముందు రాత్రి హార్ట్ ఎటాక్ తో పోయాడని. అందరూ స్మశానానికి పోతున్నారని. 


మహీధరికి ఎందుకో తెలీదు కానీ మనస్సంతా పెద్ద రిలీఫ్ అనిపించింది. 


"కాలు బెణికి బాత్రూంలో పడిపోయా! నేను స్మశానానికి రాలేకపోవచ్చు. ఆ విషయం వి. పితో చెప్పు" అని కొలీగ్ కమలాకర్తో చెప్పాడు. 


వెళ్ళి ఆనందంతో భార్యను తిప్పేశాడు. ఆరోజు తనకు నచ్చిన విధంగా ఉన్నాడు. పిల్లల్ని సినిమాకి తీసుకువెళ్లాడు. 


భార్యతో ఖరీదైన రెస్టారెంట్ కి వెళ్లాడు. 'సెలవు దొరికింది' అనుకున్నాడు. 


"సెలవు పెట్టారా?” అడిగింది భార్య. 


"సెలవు దొరికింది" అని చెప్పాడు. "ఇక సెలవులు దొరుకుతాయి" అని మనస్సులో అనుకున్నాడు. 


***


నెల తర్వాత!


వి. పి మహీధర్ని అభినందించాడు. 


"కంగ్రాచ్యులేషన్స్ మహీధర్. నీకు జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. కారు కూడా ఇస్తారు. సాలరీ పెరుగుతుంది. అప్పుడప్పుడు ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి. దీనికి కారణం ఎవరో తెలుసా?”


"ఎవరు సార్! నేను నమ్మలేకపోతున్నా" ఆనం దాశ్చర్యాలతో అన్నాడు మహీధర్. 


"ఇంకెవరు? నీ బాస్ వరదరాజన్, ఆయనే నీ పేరు గట్టిగా రికమెండ్ చేశాడు. నీలా పనిచేసే వాళ్లు అరుదని చెప్పాడు. అసలు వారంరోజుల క్రితమే రావాలి ఆర్డర్. ఆయన సడెన్గా పోవడంతో రికమెండేషన్ లెటర్ ఆయన టేబుల్ మీద ఉండిపోయింది. పార్టీ ఇవ్వాలి" స్థాఫంతా వచ్చి అభినందిస్తున్నారు. ఒక్కసారి మహీధర్ మనస్సు అపరాధ భావనతో నిండిపోయింది. 


ఆయన పోయినప్పుడు కనీసం చూడడానికి వెళ్ళలేదు. పోతూ చాలా మేలు చేశాడు. ఏడాదికి ముందే ప్రమోషన్ ఇప్పించాడు. 


సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page