top of page

సైనైడ్ - ఎపిసోడ్ 2

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Cyanide Episode 2' New Telugu Web Series


Written By Lakshmi Nageswara Rao Velpuri


రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ధారావాహిక 'సైనైడ్' రెండవ భాగం


గత ఎపిసోడ్ లో

విశాఖపట్నం లోని ఒక మాల్ లో ఎస్కలేటర్ కింద ఒక శవం దొరుకుతుంది.

ఆ శవం ఒక ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగిదిగా గుర్తిస్తారు పోలీసులు.

పోస్టుమార్టం చేసిన డాక్టర్ లు అతను సైనైడ్ తో చంపబడ్డాడని నిర్ధారిస్తారు.


ఇక సైనైడ్ రెండవ భాగం చదవండి.


అదే సమయంలో పోలీస్ శాఖ వారు విశాఖపట్నం లోని మెయిన్ రోడ్ లో ఉన్న పెద్ద హోటల్స్, బిజీ ట్రాఫిక్ జంక్షన్స్ - NAD జంక్షన్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్,పెందుర్తి మధురవాడ జంక్షన్.. అన్నిచోట్ల సీసీ ఫుటేజ్ ఆధారంగా హంతకుడి ఊహా ముఖచిత్రం అంటించి ఆచూకీ చెప్పిన వారికి భారీ బహుమానం ప్రకటించారు.


అసలు ఎందుకు ఒక మామూలు హత్య గురించి మొత్తం వైజాగ్ పోలీస్ ఫోర్స్ వెతుకుతుంది అంటే అది హత్యకు గురైన విధానం. ఒక సాధారణ వ్యక్తిని సైనేడ్ క్యాప్సిల్ తో అంత మొందించడం! అది అంతర్జాతీయంగా నిషేధించబడిన మందు కావడం వలన, అది కూడా అత్యవసర పరిస్థితులలో టెర్రరిస్టులు, ఆత్మాహుతి దాడులకు పాల్పడేవారు చివరి క్షణంలో పోలీసులకు, దొరకకుండా తమకు తామే హత్య చేసుకోవడానికి ఉపయోగపడే ప్రమాదకరమైన సైనైడ్ క్యాప్సూల్. అందులోనూ దేశంలో అత్యంత సుందరమైన, ప్రశాంతమైన విశాఖపట్నం సిటీ లో మొట్టమొదటిసారి జరగడంతో దేశమంతా కలకలం రేగింది.


ఈ విధమైన హత్య మన దేశంలోని ప్రథమం. కాబట్టి, ఢిల్లీలో ఉన్న హోం మినిస్ట్రీ కూడా నిఘా విభాగంలో అత్యంత చురుకైన సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్ - ఆంధ్ర ప్రాంతానికి చెందిన క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారిని ఈ కేస్ కోసం నియమించింది.

ప్రత్యేక కేటగిరీ తో ఈ కేసు విషయాలు పరిశోధించడానికి, విశాఖపట్నంలో నెల రోజుల పాటు ఉండాలని హోం మినిస్ట్రీ ఆర్డర్ ఇవ్వడంతో, ఆయన విశాఖపట్నం బయలుదేరారు.


రాజశేఖర్ గారు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ లోనే చదువుకున్న వారు కాబట్టి, అక్కడి వాతావరణం, సముద్రపు అందాలు, ఎన్నటికీ మరచిపోలేని అనుభవాలు. ఆయన చాలా కాలం తర్వాత ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చారు.


ఆయన రాగానే పోలీస్ కమిషనర్ గారు అత్యంత గౌరవంతో ఆహ్వానించారు.


“సార్! మీరు మన ప్రాంతానికి చెందిన ఐపీఎస్ క్యాడర్ అధికారి కావడం మాకు ఎంతో గౌరవం. ముఖ్యంగా అత్యంత కీలకమైన హత్య కేసు ఒక కొలిక్కి రాక, అనేక ప్రయత్నాలు మీదట కూడా ఎక్కడా హంతకుడి జాడ తెలియక హోమ్ మినిస్ట్రీ కి లెటర్ పంపించాను. ఎందుకంటే ఒక సాధారణ హత్య కేసులో ఎంతో నిషేధించబడిన, అది కూడా ముఖ్యంగా తీవ్రవాదులు, ఆత్మాహుతి దాడులు, చేసే వారు వాడే సైనైడ్ క్యాప్సూల్ ఈ హత్యలో వాడడం జరిగింది.


అవి ముఖ్యంగా , తీవ్రవాద సంస్థల దగ్గరే ఉంటాయి. ఈ శేఖర్ అనబడే వ్యక్తి హత్య కోసం అలాంటి నిషేధించబడిన మందు వాడడం జరిగింది. మన దేశంలోనే ఈ తరహా హత్య ప్రప్రథమం. మా ప్రయత్నాలు ఫలించక, హంతకుడి జాడే కనపడక, అప్పుడే నెల రోజులు అయింది. అందువల్ల మిమ్మల్ని పంపించారు” అంటూ పోలీస్ కమిషనర్ గారు వివరించారు.

ఎంతో ఓపికగా విన్న రాజశేఖర్ గారు తన కోసం వచ్చిన స్ట్రాంగ్ కాఫీ తాగుతూ “ఓకే సార్ ! నేను ఒక వారం రోజులపాటు అన్ని పరిశీలిస్తాను. ముఖ్యంగా పోస్టుమార్టం చేసిన డాక్టర్ను నన్ను కలవమనండి”! అంటూ బడలికగా లేచి, విఐపి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కి వెళ్లిపోయారు.


ఆ మర్నాడు రాజశేఖర్ గారు తన రూమ్ లో కాఫీ తాగుతూ ఢిల్లీ హాట్ లైన్ లో మాట్లాడారు. తన జూనియర్ ఆఫీసర్స్ కి తను చేయు పనుల గురించి మాట్లాడి, అన్ని విషయాలు రికార్డు చేయమని చెప్పి, ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా వివరించారు. రిలాక్స్ గా బాల్కనీలో కూర్చుని పచ్చని లాన్ పరిశీలిస్తూ, అందులోనే రకరకాల రంగుల పువ్వులను చూస్తూ ప్రకృతి అందాన్ని అనుభవిస్తూ, తన చేతి వేళ్ళ మధ్యలో కాలిపోతున్న సిగరెట్ నిప్పు చేతికి అంటుకోగానే, ఉలిక్కిపడి మళ్లీ ఈ లోకం లోకి వచ్చారు.


అనుభవజ్ఞులైన ఐపీఎస్ క్యాడర్ వ్యక్తి కావడం వలన, ఎంతో డిసిప్లేన్ గా, సమయానికి తయారయి, బ్రేక్ ఫాస్ట్ టేబుల్ మీద ఉంచిన వేడి వేడి ఇడ్లీ సాంబారు, మరోపక్క ఒక వెండి బౌల్లో పెట్టిన ఆ సీజన్ కు చెందిన తాజా పళ్ళు తింటూ ఢిల్లీ గ్రీన్ పార్క్ లో ఉన్న తన భార్య వనజ కు ఫోన్ చేసి “గుడ్ మార్నింగ్! ఏం చేస్తున్నావ్? పిల్లలు కాలేజీ కి వెళ్ళారా?” అంటూ కుశల ప్రశ్నలు వేసి, “నేను రావడానికి సమయం పట్టేలా ఉంది, నువ్వు జాగ్రత్త, మన ఇంటిముందున్న సెక్యూరిటీ కి అంతా అలెర్ట్ గా ఉండమని చెప్పు, ఉంటా!” అంటూ ఫోన్ పెట్టేశారు.


మరొక కాల్ ఇన్స్పెక్టర్ గారికి చేసి “డాక్టర్ గారిని నన్ను పోలీస్ కమిషనరేట్ లో కలవమని చెప్పండి, నేను నేరుగా ఆఫీస్ కి వస్తున్నా.. అర్జంట్ ! అంటూ ఫోన్ పెట్టేశారు.

పోలీస్ కమిషనరేట్ లో రాజశేఖర్ గారు , పోలీసు సూపరింటెండెంట్ గారు, పోస్టుమార్టం చేసిన డాక్టర్ కిరణ్ గారు, కూర్చుని సీసీ ఫుటేజీని పరిశీలిస్తూ ఉండగా, “మే ఐ కమిన్..” అంటూ వచ్చిన విశాఖపట్నం కలెక్టర్ రవీంద్ర గారు రావడంతోనే, అందరూ లేచి నిలబడి నమస్కారాలు చేస్తూ, ఆయనను ఆహ్వానించారు.


కలెక్టర్ రవీంద్ర గారు మాట్లాడుతూ, “మిస్టర్ రాజశేఖర్! మీరు ఇక్కడికి రావడం మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. విశాఖపట్నం చరిత్రలో ఏనాడు లేనివిధంగా, ఒక హత్య కేసు గురించి దేశమంతా చర్చించుకుంటూ ఉంది. దీనివల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని హోం మినిస్ట్రీ చెప్పింది. అందుకే మిమ్మల్ని కలవడానికి అన్ని పనులు మానుకొని వచ్చాను. మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మా కలెక్టర్ ఆఫీస్ కి ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేకుండా రావచ్చు. మీకు సహాయ సహకారాలు అందించడం మా ధ్యేయం” అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి, అందరితో కలిసి మాట్లాడుతూ, కాఫీ తాగి వెనక్కి వెళ్లిపోయారు.


ఆ తర్వాత మీటింగ్ స్టార్ట్ చేశారు రాజశేఖర్ గారు. డాక్టర్ కిరణ్ గారిని ఉద్దేశిస్తూ, “సార్ ! మీరు ఈ హత్య కేసులో చాలా బాగా ఎనాలసిస్ చేశారు, దానికి మేము అభినందిస్తున్నాము. మీయొక్క పోస్టుమార్టం రిపోర్టు చదివాను. ఒక వ్యక్తి చేత సైనేడ్ క్యాప్సిల్స్ మింగించి హత్య చేయడం ఎంతవరకు సాధ్యం?


మా ఢిల్లీలోని ఫోర్సెనిక్ ల్యాబ్ కూడా, కేవలం ఈ హత్య 3 నిమిషాలలో మనిషి ప్రాణం తీసే, అత్యంత అరుదైన సైనేడ్ క్యాప్సూల్ వల్లే జరిగిందని నిర్ధారించింది. మీరు ముందుగా ఈ విషయం ఎలా కనుక్కున్నారు ?” అని ప్రశ్నించారు.


డాక్టర్ కిరణ్ గారు లేచి , అందరికీ నమస్కరిస్తూ “మిస్టర్ రాజశేఖర్ గారూ! నేను పరిశీలించిన విషయాన్ని క్లుప్తంగా చెబుతాను వినండి ! !” అంటూ చెప్పసాగారు.


సశేషం...

(డాక్టర్ కిరణ్ గారు శేఖర్ హత్య కేసులో సైనేడ్ ఉన్నదని, ఎలా నిర్ధారించారు? రాజశేఖర్ గారు తన ప్రయత్నాలు ఎలా మొదలు పెట్టారు? అన్న విషయం మూడవ భాగంలో చదవండి. )


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.



25 views0 comments
bottom of page