top of page

సైనైడ్ - ఎపిసోడ్ 1

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Cyanide Episode 1' New Telugu Web Series


Written By Lakshmi Nageswara Rao Velpuri


రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి కొత్త ధారావాహిక 'సైనైడ్' ప్రారంభం

విశాఖపట్నం లోని అతిపెద్ద బిజీ సెంటర్లో ఒక పేరుగాంచిన నాలుగు అంతస్తుల ఏసీ మాల్ ఉంది. అందులో దగ్గర దగ్గర 50 షాపులు ఉన్నాయి. పొద్దున పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అత్యంత రద్దీగా ఉండే ఈ మాల్ లో మొత్తం ఎస్కలేటర్ లు ప్రతిక్షణం పైకి - కిందకి జనాలని తీసుకువెళుతూ, ఆ మాల్ కి కొత్తగా వచ్చిన వారిని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతాయి.


చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన యాత్రికులు కూడా మొదట ఆర్కే బీచ్, రుషికొండ లాంటి పర్యాటక ప్రాంతాలలో సముద్రపు ఒడ్డున ఆనందించి, ఆ తర్వాత ముఖ్యంగా హోటల్స్, సినిమా హాల్స్ ఉన్న ఈ ఏసీ మాల్ కు వచ్చి తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటారు.


అసలే దసరా పండుగ రోజులు.. ఆ సెంట్రల్ ఏసి మాల్ జనాలతో కిక్కిరిసిపోయింది.

చిన్న పిల్లల గోల.


యుక్తవయసులోని వారు తమ అందచందాలతో, ఓర చూపులతో కుర్రకారు మతిని పోగొట్టేస్తున్నారు.


ఆ రోజు ఎందుకో మాల్ అంతా మూసేసి ఉంది. అక్కడకు వచ్చిన జనాలు ఆశ్చర్యంతో “ఏమైంది సార్! అంతమంది పోలీసులు ఉన్నారు? ఈ మాల్ చూడడానికి చాలాదూరం నుంచి వచ్చాము” అంటూ అక్కడ కాపలా కాస్తున్న పోలీసులను వేధిస్తున్నారు.


అంతలో అక్కడికి వచ్చిన పోలీస్ సూపరింటెండెంట్ మైక్ లో “ఇవాళ నుంచి వారం రోజుల పాటు ఈ మాల్ తెరవకూడదు” అని చెప్పగానే, ఎంతో నిరాశకు గురయి, కారణం తెలియని జనాలు తిరిగి వెళ్ళిపోయారు.


అదే రోజు ప్రెస్ మీట్ లో పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ “నిన్న రాత్రి మాల్ కు వచ్చిన ఒక వ్యక్తి హత్యకు గురై ఎస్కలేటర్ క్రింద భాగం లో పడి ఉన్నారు. ఆయన పేరు శేఖర్ అని, ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని ఆయన ఐడి కార్డు ద్వారా తెలుసుకున్నాము. ఆ మృతుని కుటుంబ వివరాలు, ఉద్యోగ విషయాలపై ఆరా తీస్తున్నాము. మాకు తెలిసిన వివరాలను బట్టి ఆయన ఢిల్లీలో DRDO office లోని అత్యంత సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్ అని, చాలా మంచి వాడు అని, తన సొంత ఊరు విశాఖపట్నం అని, నెల రోజుల పాటు కుటుంబంతో పాటు వచ్చాడని తెలిసింది.


ఇంతకు మించి వివరాలు మాకు పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే తెలుస్తాయి. అసలు హంతకుడి జాడ లేక, అన్ని విధాలా మేము ప్రయత్నిస్తున్నాము. థాంక్యూ” అంటూ ముగించారు . పత్రికా విలేకరులు ఇంకా చాలా ప్రశ్నలతో వెంబడిస్తున్నా, పోలీస్ కమిషనర్ గారు హడావిడిగా వెళ్ళిపోయారు.


ఆ తర్వాత శేఖర్ భార్య రేణుక టీవీలో, న్యూస్ పేపర్లలో తన భర్త హత్య గావించ బడడం అన్న వార్తలు వినడం, చూడడం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేయడం తో నిజంగా పచ్చి బాలింత అయిన రేణుక ఎంతో మనో వ్యధ తో కుప్పకూలిపోయింది.


ఆ తర్వాత పోస్టుమార్టం అయిన శేఖర్ బాడీని నిశితంగా పరిశీలించిన డాక్టర్ రిపోర్టు చేస్తూ “సార్! ఇది ఖచ్చితంగా హత్య. ఏమాత్రము ఆత్మహత్య ప్రయత్నాలు జరగలేదు. గొంతు దగ్గర కొంచెం కమిలినట్లు ఉంది తప్ప, శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు. కాకపోతే శేఖర్ చనిపోయిన తర్వాత ఆ బాడీ ని కొంచెం దూరం ఎస్కలేటర్ పక్కనుంచి డ్రాగ్ చేసిన గుర్తులు ఉన్నాయి. శేఖర్ చనిపోయింది అత్యంత వేగంగా పనిచేసే సైనేడ్ క్యాప్సిల్ అని నిర్ధారిస్తున్నాను.


ఆ తరహా క్యాప్సిల్ ఎక్కువగా తీవ్రవాదులు, అత్యంత గోప్యంగా సంచరించే విదేశీ గూఢచారులు వాడుతూ ఉంటారు. వారి మెడలో ఒక లాకెట్ బిగించి ఉంటుంది. పైన చూడడానికి ఒక తాయత్తు లా ఉంటుంది. ఎక్కువగా టెర్రరిస్టులు తిరిగాడే ప్రాంతాలలో అనగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నగరాలలో ఆత్మాహుతి దాడులు జరపడానికి, ఒకవేళ దొరికితే ఇంకో ఛాన్స్ లేకుండా ప్రభుత్వానికి దొరకకుండా మెడలో ఉన్న ఆ సైనేడ్ క్యాప్సుల్ కొరికి మింగేస్తారు.


అంతే.. 3 నిమిషాలలో ప్రాణాలు పోతాయి. అలాంటి అదే రకమైన సైనేడ్ క్యాప్సిల్ శేఖర్ శరీరంలోకి ఎలా వచ్చింది? ఎవరు అతని చేత మింగించి చంపారో అంతుబట్టడం లేదు” అంటూ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పోస్టుమార్టం చేసిన డాక్టర్ గారు గుక్క తిప్పుకోకుండా చెప్పేసరికి అక్కడే ఉన్న పోలీస్ అధికారులంతా నిశ్చేష్టులై పోయారు.

ఆరోజు పోలీసు నేర విభాగం వారు అంతా సీసీ కెమెరా ఫుటేజీని ఫ్రేమ్ టు ఫ్రేమ్ పరిశీలించాక ఒక బక్కచిక్కిన పొడుగాటి జుట్టు ఉన్న వ్యక్తి కనీసం ఆరడుగులు పొడవుతో నిండుగా గడ్డంతో కొంచెం కుంటుకుంటూ నడుస్తున్న ఫోటోలు మసక మసక గా కనిపించాయి. తెలివైన హంతకుడు తన ముఖం కనబడనీయకుండా ఒక గళ్ళ రుమాలు కళ్ళు వరకు కప్పుకొని ఎవరన్నది తెలియనీయకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. శేఖర్ బాడీని ఎస్కలేటర్ వరకు లాగుతున్న దృశ్యం కనబడి ఒక క్లూ దొరకడంతో కాస్తంత సంతృప్తితో ఆ కోణంలో పరిశీలించ సాగారు.


ఎన్నో విధాలుగా సమయం గడుస్తున్నా పోలీసువారికి ఎలాంటి ఆచూకీ దొరకక శేఖర్ ఆఫీస్ డి ఆర్ డి ఓ లో కూడా ఎన్నో విషయాలు సేకరించారు. ఎలాంటి అనుమానం ఉన్న వ్యక్తులు రాలేదని, ఆయన చాలా ముక్త స్వభావం ఉన్నవాడని తెలిసింది. ఆ తర్వాత శేఖర్ భార్య రేణుక ను కలిసి వివరాలు సేకరించడానికి ప్రయత్నించినా ఎలాంటి ఆధారాలు లేక తల్లడిల్లిపోయారు పోలీసులు. ఆ సెంట్రల్ ఏసీ మాల్ కు జాగిలాలను తీసుకువచ్చి ప్రయత్నించినా ఆ మాల్ గేట్ బయట మధురవాడ వైపు వెళుతున్న రోడ్డులో కొంత దూరం వచ్చి ఆగి పోయే సరికి హంతకుడి ఆచూకీ కోసం విశాఖపట్నం లోని అత్యంత ప్రముఖమైన మధురవాడ, ఆనందపురం, తగరపువలస పరిసరాలలో గాలింపు చేపట్టారు.


(సశేషం : హంతకుడి ఆచూకీ కోసం సి బి సి ఐ డి కల్పించుకోవాల్సిన అవసరం ఉందా? అన్న వివరాలు రెండవ భాగంలో చదవండి)

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

��������

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


53 views0 comments
bottom of page