top of page

కలియుగ దేవుళ్ళు


'Kaliyuga Devullu' written by Lakshminageswara Rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


"ఏవండీ ! నేను' వైభవ వెంకటేశ్వర స్వామి' కోవెలకు వెళ్తున్నా, సాయంత్రం మీరు కూడా వస్తారా ?ఎందుకంటే ఇవాళ 'గోదాదేవి కల్యాణం 'చాలా బాగా చేస్తున్నారు, మీ ఆఫీస్ పని అయిపోయాక వెళ్దాం రండి! ఆ దేవదేవుడి కళ్యాణం కనులారా చూసి తరిద్దాం! మనకు 'ఏడు సంవత్సరాలు' అయినా సంతానం కలగటం లేదు, ఈరోజు చాలా మంచి రోజు, మనసారా ఆ దేవ దంపతుల ఆశీర్వాదం తీసుకుంటే మన కోరిక నెరవేరుతుంది!" అంటూ ఏకబిగిన ఉద్వేగంగా చెప్తున్న భార్య 'మందాకిని ని చూస్తూ, "అలాగే లే , సాయంత్రం కల్లా నువ్వు రెడీగా ఉండు!" అంటూ వెళ్ళిపోతున్న భర్త 'అరవిందుని 'ఆనందంగా చూస్తూ లోపలకి వెళ్లి ,వంట పనిలో మునిగిపోయింది మందాకిని.

అలా ఏడు సంవత్సరముల నుంచి ఎన్ని వ్రతాలు, పూజలు చేసినా ఫలితం లేక సంతానలేమితో కృంగిపోతున్న ఆ దంపతులు, ఎంతో ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నా , పిల్లలు లేక మనస్థాపంతో కుంగిపోవడం అలవాటైపోయింది. అలా అరవింద్ కుటుంబ సభ్యులు, మందాకిని తల్లిదండ్రులు, వారానికి ఒక్కసారైనా ఏమైనా విశేషం ఉందా ?అని అడగటం, మరీ వారిని అశాంతికి గురి చేస్తుంది, ఏమైనా అరవింద్ మందాకిని ల అనురాగం ఎంతో బలమైంది కనుక, ఓపిగ్గా సమాధానాలు ఇస్తూ, ఉండండి! మా ప్రయత్నాలు మేము అన్ని విధాల చేస్తున్నాం, ఎన్నో పూజలు చేస్తున్నాము ,కాస్త ఓపిక పట్టండి మమ్మల్ని ఇలా ప్రతి వారం మీ మాటలతో మమ్మల్ని నిరాశ పరచకండి! అదే బెంగతో పాపం మందాకిని చిక్కి శల్యం అయిపోతున్నాది,అంటూ కాస్త కటువుగానే వారందరికీ జవాబు ఇచ్చాడు అరవింద్. అలా మరో సంవత్సరం గడిచేసరికి, ఓపిక నశించిన అరవిందు తల్లిదండ్రులు ఏరా! ఇంకా ఎన్నాళ్ళకి మాకు శుభవార్త చెప్తావు, నిజంగా మీకు పెళ్లి అయ్యి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటివరకు మనవడు, మనవరాలు పుడుతుందని, ఎంతో ఆశిస్తూ మన వంశానికి ఒక వారసులు వస్తారని కలలుగంటున్నా, నీ దగ్గర నుంచి ఎలాంటి జవాబు రాక, ఇంత ఆస్తి ,ఐశ్వర్యం అనాధల పాలు చేయలేక, మేము ఈ వృద్ధాప్యంలో బతుకుతున్నాము, కానీ ఇంకా ఎన్నాళ్ళు ఇలా బతకలేము, కోడలు చాలా మంచి పిల్ల కనుక ఆమెను ఒప్పించి, 'విడాకులు తీసుకో 'నీకు వేరే పెళ్లి చేసి ఆమె ద్వారా వచ్చే పిల్లలు, మన వంశ పేరు ప్రతిష్టలు కొనసాగిస్తారు, లేదా నీ మొండి పట్టుదల అలాగే ఉంటే, మేము చనిపోయే లోగ యావదాస్తిని 'అనాధాశ్రమాలు లకు ' కు రాసి చస్తాము, అంటూ తీవ్రంగా మాట్లాడే సరికి, అరవిందుకు నోట మాట రాక తల్లిదండ్రుల మాటలకు విసిగిపోయి, నాన్నగారు! నేను మందాకిని ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, పిల్లల కోసం ఆమెను వదిలి, వేరే పెళ్లి చేసుకోవడం నావల్ల కాదు, మీ 'ఆస్తి ,ఐశ్వర్యాలు నా ప్రేమకు సరికావు!! అయినా మన వంశం నిలబడాలంటే, కొన్నాళ్ల తర్వాత ఎవరినైనా దత్తత తీసుకుని పెంచుకుంటాం! అంతేకానీ మీరు ఇచ్చిన ఈ జన్మలో మరో పెళ్లి నేను చేసుకోను, అంటూ ఖరాఖండిగా, ఏకధాటిగా మాట్లాడుతున్న కొడుకును చూస్తూ,0 ఆ తల్లిదండ్రులు నివ్వెర పోయారు. 'చూసావా కాంతం! నీ కొడుకు మన వంశాన్ని, ఆస్తి ఐశ్వర్యాలను, అనాధల పాలు చేస్తున్నాడు, వాడికి చిల్లిగవ్వ దక్కనివ్వను, అంటూ కోపంతో, అరవింద్ తండ్రి తన కండువాను నేలకేసి కొట్టి లోపలికి వెళ్లిపోయారు ,అతని భార్య మాత్రం అటు భర్తకి చెప్పలేక ,కన్న కొడుకు కి నచ్చ చెప్పలేక సతమతమవుతూ తన కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ, అలాగే కిచెన్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇలాంటి విషయాలు భార్యకు తెలియకుండా జాగ్రత్త పడుతూ, చూడు మందారం !నువ్వు ఎన్ని పూజలు చేసినా కాదనను, మనకి ఈ సంవత్సరం లో పిల్లలు పుట్టకపోతే అనాధాశ్రమం లో ఒక్క బంగారు పాపను, దత్తత తీసుకొని అల్లారుముద్దుగా పెంచుకుందాం, నువ్వు ఎలాంటి నిరాశ నిస్పృహలతో, మనసు బాధ పెట్టుకోకు, అంటూ అనుక్షణం భార్యని ఒదారుస్తూ, భార్యకు అండగా నిలుస్తూ 'అచంచలమైన విశ్వాసం, అపరిమితమైన అనురాగం, కురిపిస్తూ, భార్యను బంగారం లా చూసుకుంటున్నాడు అరవింద్. అనుకున్నట్లుగానే పవిత్రంగా స్నానం చేసి, సాయంత్రం పూజా వస్తువులతో ,"శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి" ఆలయానికి వెళ్లి,' 'శ్రీనివాస గోదాదేవి కల్యాణ వైభోగం 'నిర్వహిస్తున్న వేదిక మీద కూర్చుని, అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివార్లను కొలిచి, తమకు పండంటి బిడ్డలను కలిగించమని మనసారా కోరుకుంటూ, ఎంతో తృప్తిగా ఇంటికి వచ్చారు అరవింద్ మందాకిని లు. ఆరోజు అరవింద్ తన ఆఫీసు పనిలో మునిగిపోతూ, లంచ్ టైం లో బయటకు వచ్చి, ఒక హోటల్ దగ్గర కారు ఆపుతున్న సమయంలో, తన భార్య మరొక పొడుగాటి అందమైన వ్యక్తితో కబుర్లు ఆడుకుంటూ, నవ్వుతూ ఆ పక్కగా ఉన్న నర్సింగ్ హోమ్ నుంచి బయటకు రావడం, చూసి అవాక్కయి ఏమీ మాట్లాడకుండా, ఆ చిగురించిన అనుమానం క్రమక్రమంగా అరవింద్ మనసును కల్మషం చేస్తునే ఉంది, ఎన్నోసార్లు వాళ్ళిద్దరినీ అలా చూసినా, అనుమానం పెనుభూతం అయి తను ఎంతోగా ప్రేమించిన భార్య ప్రవర్తన అర్థం కాక, ఎదుటపడి అడగలేక ,సతమతమవుతూ ఉండగా, తన భార్య మాత్రం ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉండడం, కనీసం తనతో ఆ వ్యక్తి గురించి చెప్పకపోవడం, ఇవన్నీ తలచుకుని అవమాన భారంతో భార్యమీద ఎన్నడూ లేనంత చిరాకు పడటం, సాయంత్రం పూట ఒక్కడే కూర్చుని మందు కొడుతూ, తన దారిన తను ఉండటం చేస్తున్నాడు అరవింద్. . ఆ మరుసటిరోజు కూడా వారిద్దరినీ కారులో వెళుతుండటం చూసాడు, కోపం తట్టుకోలేక ఇంటికి వచ్చి 'పెగ్గు మీద పెగ్గు కొడుతూ 'ఉండగా, మందాకిని వంట ఇంట్లో పనిచేస్తున్న సమయంలో' ల్యాండ్ లైన్ 'ఫోన్ మోగే సరికి, అప్పటికే ముందు నషా లో ఉన్న అరవింద్ ఫోన్ ఎత్తే సరికి 'హలో తయారై ఉన్నావా? నేను వచ్చేస్తున్నాను! నువ్వు కింద కి వచ్చేయ్ టైం అయిపోతుంది, అన్న ఒక మగ కంఠం విని హతాశుడై పోయాడు అరవింద్. ఏమి జవాబు ఇవ్వకుండానే ఫోను పెట్టేసాడు, ఇంతలో కారు 'హారన్ పదే పదే మోగడంతో భార్య మందాకిని కిందకి చూస్తూ 'వచ్చేస్తున్నాను !అంటూ చెప్పి తయారయ్యింది, ఇక ఆ సమయంలో లో భార్య ప్రవర్తన అసలు నచ్చక, మరికొంచెం మందు తాగేసరికి ,విపరీతమైన మత్తుతో అలాగే మంచం మీద పడుకుండిపోయాడు అరవింద్ . కొంచెం తెలివి వచ్చి చూసేసరికి అరవింద్ భార్య మందాకిని ఇంట్లో లేకపోవడం, చూసి తన అనుమానం నిజమే అయినందుకు ,అసహనంతో ఊగి పోతూ, త్రాగుతున్న్' విస్కీ బాటిల్ ' ని 'బలంగా నేలకేసి కొట్టి ఛీ! వెధవ బతుకు, ఇక నేను బతకలేను, అనుకుంటూ తనలో తానే తిట్టుకుంటూ, మళ్లీ మగతలో కి వెళ్ళిపోయాడు, అరవింద్. ఆ బెడ్ రూమ్ అంతా గాజు పెంకుల తో చిందరవందరగా ఉంది, ఆ తర్వాత మరో అరగంటలో ఎంతో సంతోషంగా మందాకిని ఇంటికి వచ్చి, భర్త బెడ్ రూమ్ లోకి వెళ్లి ఏవండీ, ఏవండీ? అంటూ లేపే సరికి, అసలే కోపంతో ఉన్న అరవింద్ ఒక్క ఉదుటన లేచి' ఛీ ,నీ మొహం నాకు చూపించకు, నీ అసలు రూపం బయటపడింది, ఇక నువ్వు నా జీవితంలోకి రాకు పో! అంటూ ఒక్క ఉదుటన భార్య మందాకిని నీ బలంగా తోశాడు, ఆ పెనుగులాటలో అనుకోని సంఘటనకు మందాకిని, దభాలున కింద పడింది,అంతే భార్య వెల్లకిలా పడి పోవడం చూసి మత్తు వదిలిపోయింది అరవింద్ కి ,పరుగు పరుగున వెళ్లి 'లే మందారం లే 'తప్పై పోయింది, నన్ను క్షమించు !అని ఎంత కుదు పుతున్న భార్య లేవలేకపోవడం ఆమె నుంచి రక్తం ఏకధాటిగా కారు తుండటం చూసి నిర్ఘాంతపోయి, అయ్యో ,అయ్యో ఎంత పని చేశాను! అంటూ ఏడుస్తూ గాభరాగా ఏం చేయాలో తోచక, భార్యను చేతులతో పైకి ఎత్తి పట్టుకుని, అంతే వేగంగా తన కారులో కూర్చోబెట్టి, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకు వచ్చాడు అరవింద్. ఎమర్జెన్సీ కేసు కనుక వెంటవెంటనే డాక్టర్లు ఆమెని పరీక్ష చేసి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది సార్! గాజు ముక్కలు ఒంటినిండా దిగబడ్డాయి, అంటూ హడావిడిగా 'ఐసీయూలో కి' తీసుకు వెళ్ళి పోయారు, అరవింద్ అదే గాబరా తో డాక్టర్ల కాళ్లు పట్టుకుంటూ సార్! నా భార్య ని రక్షించండి, ఎంతైనా పర్వాలేదు, నా ఆస్తి అంత పోయినా పర్వాలేదు! అని అర్ధిస్తున్నా అరవింద ని చూస్తూ చూడండి! ఒక రకంగా చూస్తే ఆమె గర్భవతి, గాజు పెంకులు గుచ్చుకు పోయి, ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది! ఇది ఇప్పట్లో మేము ఏమీ చెప్పలేము, అంటూ డాక్టర్ 'ఇమీడియట్ సర్జరీకి 'ఏర్పాట్లు చేస్తున్నారు. అరవింద విషయం ఎవరికీ చెప్పలేక కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇద్దామన్న ఎలాంటి ప్రయోజనం ఉండదు, కనుక ఒంటరిగానే కాలుగాలిన పిల్లిలా 'ఆపరేషన్ థియేటర్ 'ముందే నేల మీద కూలబడిపోయాడు. అలా నర్సులు, డాక్టర్లు పది సార్లు పైకి వచ్చి, లోనికి వెళ్లి గాభరా పడుతున్న ఆ సమయంలో ఏమీ అర్థం కాక, మత్తు వదిలిన అరవింద్ చివరగా ఒక డాక్టర్ని పట్టుకుని, సార్! నా భార్య కుఎలా ఉంది ?ఆమె గర్భవతి అని చెప్పారు, ఆ విషయం కూడా నాకు తెలియదు ఆమె పరిస్థితి గురించి చెప్పండి, అంటూ చేతులు పట్టుకున్న అరవింద్, భుజం తడుతూ' డాక్టర్ పురుషోత్తం గారు వస్తున్నారు, కొంచెం ఓపిక పట్టండి !ఆమె గర్భం కూడా పోయింది, ఆమె ప్రాణాలు రక్షించడం కోసం' స్పెషలిస్టులు వస్తున్నారు, అని అనగానే' 9 డిగ్రీల సెల్సియస్ తో భూకంపం వచ్చినట్లు' నిలువునా వణికిపోయాడు అరవింద్. . అలా రాత్రంతా డాక్టర్లు అన్ని విధాల మందాకిని బ్రతికించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, అంతే అరవింద్ కు ఒక ఆలోచన వచ్చి, ఆ 'వైభవ వెంకటేశ్వర స్వామి' ఇక నాకు దిక్కు !అంటూ తెల్లవారుజామునే తెరిచిన ఆ కోవెల కి వెళ్లి, తన భార్య ప్రాణాలు కాపాడమని ప్రార్థించి !అట్నుంచి అలాగే తన ఇంటికి వెళ్లి చూడగా, తన బెడ్రూమ్ అంతా గాజు ముక్కలతో, రక్తపు మరకలతో ఉండడం, చూసి వెక్కీ వెక్కీ ఏడ్చాడు, ఆ సమయంలో తన తలగడ మీద ఉన్న ఒక ఉత్తరం కంటపడింది, పరిగెత్తుకెళ్లి ఉత్తరం తీసి చదవసాగాడు, "ప్రియమైన శ్రీవారికి! కి మీకు మంచి మధురమైన తేనె లాంటి కబురు చెప్దామని వచ్చాను, కానీ మీరు అప్పటికే మంచి నిద్దరలో మత్తుగా పడుకుని ఉన్నారు, ఎన్నిసార్లు లేపిన లేపినా లేవలేదు, ముఖ్యమైన విషయం ఏమంటే, మన జీవితాలలో వెలుగు నింపాడు ఆ 'వైభవ వెంకటేశ్వర స్వామి 'నేను నాలుగు నెలలుగా అనుమానంతోనే ఉన్నాను, వారం కిందట, నా పెద్దమ్మ కొడుకు' డాక్టర్ పురుషోత్తం 'అనుకోకుండా నన్ను నర్సింగ్ హోమ్ లో కలిశాడు, మా అన్నయ్య ' కేజీహెచ్ 'ఆస్పత్రిలో ఒక పెద్ద డాక్టర్ గా పోస్టింగ్ అయ్యి వచ్చాడు! నన్ను చూసి అరే! చెల్లి ఎలా ఉన్నావు? అంటూ ఆప్యాయంగా పలకరించి, రెండు మూడు సార్లు మన ఇంటికి కూడా వచ్చి, మిమ్మల్ని కలవాలని ప్రయత్నించిన, కుదరక ఈరోజు నన్ను దగ్గర ఉండి' kGH 'ఆస్పత్రికి తీసుకెళ్లి, అన్ని పరీక్షలు చేయించి, మనకు 'పాపో,బాబో! పుట్టబోతున్న రని, అనే విషయం నిర్ధారించి, ఎంతో సంతోషంగా మా అన్నయ్య నన్ను ఇంటి దగ్గర దింపి, వెళ్ళిపోయాడు, ఈ ఆదివారం మన ఇంటికి భోజనానికి వస్తానని చెప్పమన్నాడు, అందుకే నేను సాయంత్రం అన్నయ్యతో కలిసి ఆసుపత్రికి వెళ్లాను, ఈ లోపల మీరు లేస్తే కాఫీ పెట్టుకొని త్రాగండి! నేను గంటలో వచ్చేస్తాను, అన్నయ్య కార్లోనే వెళ్తున్నాను ఉంటాను. మీ మందారం.!! అలా భార్య రాసిన ఉత్తరం చదవగానే '100 సముద్రపు కెరటాలు, ఒక్కసారి తల మీద పడినట్లు' అనిపించి, అలాగే కింద కూర్చుండిపోయి,, 'నన్ను క్షమించు మందారం !సీతాదేవి లాంటి నిన్ను అనుమానించి, ఆ రాముడిలా నిన్ను కూడా వదిలేద్దాం! అని భావించి కోపంతో తోశాను, నీ ప్రాణాలు తీశాను, నా పాపానికి నిష్కృతి లేదు, అంటూ తన తలను గోడ కేసి బాదుకుంటూ రక్తం ఓడుతున్న పరిస్థితిలో మళ్లీ ఆసుపత్రి కి బయలుదేరి వెళ్ళాడు అరవింద్. అలా ఆసుపత్రి కి వచ్చేసరికి, అక్కడి నర్సులు అరవింద్ కు 'ఫస్ట్ ఎయిడ్ చేసి' డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్లారు, అక్కడే ఉన్న 'డాక్టర్ పురుషోత్తం గారు' మాట్లాడుతూ, బావగారు! మిమ్మల్ని కలవడం కుదరలేదు, అసలు ఇది ఎలా జరిగింది? మీకు చెల్లి 'గర్భవతి 'అన్న విషయం మీకు చెప్పే లోగానే ఈ అనర్థం జరిగింది! ఏమైనా ఆ దేవుడి దయ వల్ల ,ఇక్కడి డాక్టర్ల కృషి వల్ల ఆమె ప్రాణానికి ఎలాంటి హాని జరగలేదు, కానీ ఆమె గర్భం తీసివేయవలసి వచ్చింది, అని చెప్పగానే ,అరవింద్ కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది, పోనీలెండి డాక్టర్ నా భార్య నాకు దక్కింది, మీరు చేసిన వైద్యం వలన ఆ 'వైభవ వెంకటేశ్వర స్వామి' దయవలన నాకు సంతానం అక్కర్లేదు, నా భార్యే నాకు కావాలి, ఇంకో విషయం ఏమంటే ఈ కలియుగంలో "వైద్యులు ,దేవుళ్ళు ఇద్దరు" ప్రాణాలు కాపాడే: కలియుగ దేవుళ్ళు', మీకు మేము ఏమి ఇచ్చినా మా రుణం తీరదు! అంటూ భార్య మందాకిని తల రాస్తూ అనేసరికి ,మెల్లిగా కళ్ళు తెరిచిన భార్య మొదట భర్త ని చూసి, ఆ తర్వాత అన్నయ్య 'డాక్టర్ పురుషోత్తం గారిని' చూస్తూ మెల్లిగా నవ్వుతూ కృతజ్ఞతలు తెలిపింది. (ఈ కథలో తొందరపాటు నిర్ణయాలు, అనుమానాలు కుటుంబ వ్యవస్థను ఎలా కూలదొస్తాయో వివరించాను-లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి)

శుభం

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

133 views0 comments

Comments


bottom of page