top of page

అందాల నెరజాణ


'Andala Nerajana' New Telugu Kavitha Written By Lakshminageswara Rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి




తలకు నీళ్లోసుకొని

కురులారబెట్టుకుని

వయ్యారంగా వస్తున్న

నా అందాల నెరజాణ!


నీ కాలి అందియలు

ఘల్లు ఘల్లు మన

తడిసిన చీరలో నీ అందాలు

నా మనసు నూరడించే!


చల్లచల్లని పైరుగాలికి

నీ నునుమెత్తని చీర కొంగు రెపరెపలాడే

నిన్ను మలచిన ఆ బ్రహ్మదేవుడే నివ్వెర పోగా

ఆఅతిలోక సౌందర్యం నీ సొంతమే గదా!


నిన్ను చూసిన వసంత కోకిలలు

కమ్మని పాటలుపాడగా

చిలిపి ఊహలు నీ కోసం

నామదిలో మెలగగా!


ఆ నవ మన్మధుడికే కంటి మీద

కునుకు కరువాయనే

నేనెంత వాడను నీ మనసు కోరగా

కలహంస లా నడిచి రావే నా నాట్యమయూరీ!


విశ్వనాథ వారి కిన్నెరసాని

బాపు గారి ఒంపుల వయ్యారి చిత్రమై

రవివర్మకే అందని

ఒకే ఒక అందానివా ఓ ప్రియా!


నీ పసుపు రంగు పట్టు చీర,

ప్రకృతి మనకు ఇచ్చిన మధుపర్కం

మనమిద్దరం వివాహ బంధంలో

కరిగిపోదుమా ప్రియా!

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

��������

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

కొండపల్లి మట్టి బతుకులు

నల్ల కుక్క

బ్రతుకు నాటకం

జీవిత పరమార్థం

క్యాష్ బాక్స్

శివోహం

కలియుగ దేవుళ్ళు

తలనీలాలు

చెక్క కంచం

ఆఖరి కోరిక

అంతిమ వాంఛ

పనికిరాని పట్టభద్రుడు

ఓ మానవతా మేలుకో!

భవబంధాలు

కమ్మని కల

చీకటి వెలుగులు

వెండి కంచం

రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


50 views0 comments
bottom of page