top of page

జై భారత్


'Jai Bharath' New Telugu Kavitha Written By Lakshminageswara Rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి




దేశమంటే మట్టి కాదోయ్

దేశమంటే మనుషులోయ్

ఒక్కడి కోసం అందరూ నిలచి అందరి కోసం ఒక్కడు నిలిచే

సంస్కారం మన భారతదేశానిదోయ్,

గురజాడ , శ్రీ శ్రీ ల అక్షరాలు అక్షర లక్షలోయ్


నిశి రాత్రులలో కంటికి రెప్పలా మంచు కొండలను దాటుకుంటూ

సరిహద్దులను రక్షిస్తూ, తన భార్యాబిడ్డలను మరచి,

దేశ రక్షణ కోసమే అహర్నిశలు పాటుపడుతున్న ఓ వీర సైనికుడా, నీకు జోహార్లు


జేబుల్లో పెట్టుకున్న భార్య బిడ్డల ఫోటోలు చూస్తూ,

నిద్రాహారాలు మాని దేశ రక్షణ కోసం తన జీవితమంతా ధారపోసే

అమరవీరులారా మీకు జోహార్లు.

ఒక ప్రక్క కరువు కాటకాలను అధిగమించి,

రైతన్నల కాయ కష్టం వలన సస్యశ్యామలమైన పంటలతో

ప్రతి భారతీయుడు గుండెలలో నిలిచిపోయే రెండు కళ్ళు మీరు

దేశ రక్షణకు వీర జవాను

పంటలు పండించే కర్షక రైతులు

మన దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు

దేశాధినేతల సమగ్ర పరిపాలన,

శాస్త్రవేత్తల క్రొంగొత్త ఆవిష్కరణ లు,

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులు,

కలియుగ దేవుళ్ళు మన జవానులు, మన రైతన్నలు

మన దేశ ప్రగతికి నిదర్శనాలు

భారతదేశ రక్షణలో వీర మరణం పొందిన అమర సైనికులకు, శ్రద్ధాంజలి ఘటిస్తూ,

వారి కుటుంబాలకు తోడునీడగా ఉందాము.

జై జవాన్ జై కిసాన్

భారతదేశానికి శ్రీరామరక్ష.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

��������

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

35 views0 comments

Comments


bottom of page