top of page

దివ్వి దివ్వి దీపావళి

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #దివ్విదివ్విదీపావళి, #మళ్లీవచ్చేనాగులచవితి, #DivviDivviDeepavali, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

దివ్వి దివ్వి దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి 

చిక్కటి చక్కటి సరదా కథ


Divvi Divvi Deepavali - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao 

Published In manatelugukathalu.com On 16/09/2025

దివ్వి దివ్వి దీపావళి - తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

ఈమధ్య ఆ వీధిలోకి కొత్తగా వచ్చారు సుందరి, సుబ్బా రావు. విషయం ఏమిటి అంటే.. భర్త సుబ్బారావు పిసినారి. అయినా ఏం పర్వా లేదు. భార్య సుందరి కూడా మహా పిసినారి. వాళ్లకు పిల్లలే కాదు జల్లలు కూడా లేరు.. కానీ ఒక కొత్త ‘రాణికలర్’ మోపెడ్ ఉంది. 


పోయినేడు దీపావళి కి ఏం జరిగింది అంటే.. ఇద్దరూ కలిసి చక్కగా ప్లాన్ వేశారు.. పర్యావరణ పరిరక్షణ ప్లస్సు అనవసరపు ఖర్చు అరికట్టడం.. ప్లస్ ప్లస్ ప్రమాదాల బారి నుండి రక్షణ.. ఈ 3 పాయింట్లను బేస్ చేసుకుని.. ఆ సంవత్సరం మందులు కాల్చకుండా.. దీపావళి పండుగ హాయిగా గడిపే విధంగా ఒక చక్కటి ప్లాన్ వేసుకున్నారు. 


 ఆ ప్లాన్ యొక్క సారాంశం ఏమిటండీ బాబు అంటే.. వాళ్ళు ఉండే వీధిలో ఈ చివరి నుండి ఆ చివరికి మోపెడ్ మీద నాలుగు సార్లు తిరగాలి.. అది కూడా.. సరిగ్గా రాత్రి ఏడు నుండి ఎనిమిది మధ్య.. అంటే వీధిలో జనం అందరూ మందుసామాగ్రి ఫుల్లుగా కాలుస్తున్నప్పుడు! 


దాంతో మందుసామాగ్రి.. అనగా బాణాసంచా చేతులతో స్వయంగా కాల్చిన సరదా తీరుతుంది.. ప్లస్ చెవులతో స్వయంగా విన్న శబ్దాల హోరు దక్కుతుంది.. 


అంతే! అలాంటి చక్కని ఆలోచన కలగడంతో వాళ్లు ఇద్దరు ఎగిరి గంతులు వేశారు, భలే భలే ఆలోచన అనుకుంటూ.. 


అలా ఎగిరెగిరి గంతులు వేయడంతో నెత్తి పై భాగంలో ఉన్న చెక్క తగిలి ఇద్దరి నెత్తిలు బొప్పి కట్టాయి. 


అయినా బాధ పడలేదు. ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా సాయంత్రం వాళ్ళు అనుభవించే దీపావళి రంగురంగుల కాకరపువ్వత్తులు, మతాబులు, చిచ్చు బుడ్లు, సీమటపాకాయ్ ల మహదానందం ముందు ఈ నెత్తి బొప్పి కట్టడం లాంటి అతి చిన్న బాధాకరమైన విషయం కనుమరుగైపోయింది. అంతే కాదు కాలు ఫ్రాక్చర్ అయినా కూడా రాత్రి పొందబోయే మహదానందం ముందు ఈ చర్మం చిట్లడం, రక్తం కారడం, నెత్తిబొప్పి కట్టడం వంటివి అతి చిన్న సూక్ష్మ విషయాలు అన్నమాట.. వాళ్ల దృష్టిలో. 


***


సాయంత్రం సరిగ్గా ఏడు గంటలు అయ్యింది. 


సుందరి సుబ్బారావు లు.. బయటకు వచ్చి తమ కొత్త రాణి కలర్ మోపెడ్ తీసుకొని ఆ వీధిలో ఆ చివరి నుండి ఈ చివరికి స్లో గా బండి నడపడం మొదలుపె ట్టారు. దాంతో ఆపరేషన్ దీపావళి మొదలైంది. 


పిల్లలు చిచ్చుబుడ్లు వెలిగించే చోట సరదాగా దిగి చూడాలి అనిపిస్తే.. సుబ్బారావు బండి ఆపు చేసి.. స్టాండ్ వేసి ఫోను మాట్లాడుకుంటూన్నట్టు జేబులోంచి తీసి చెవి దగ్గర పెట్టుకుని మరో చేత్తో తల గోక్కుంటూ.. అవతల వాళ్ళ మాటలు వినపడనట్టు సెల్ ఫోన్ అటూ ఇటూ తిప్పుతూ.. భార్యను అందంగా ముత్యాలు వెద జల్లే ఆ చిచ్చుబుడ్లు చూడమంటూ సైగ చేసేవాడు. 


మరి వీళ్ళకు స్వయంగా ఆ ఆనందం పొందడం కుదరదు కదండీ అందుకన్న మాట. ఆవిడ మొగుడు చెప్పి నట్లు తూచా కాదు ఏది తప్పకుండా చేసి ఆ మహదా నందం పొందేది. 


అక్కడ పని పూర్తయ్యాక.. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ అమ్మాయిలు అంటించిన విష్ణుచక్రాలు చూడడం కోసం.. అవి విరజిమ్మే.. వెలుతురులు ఆస్వాదించడం కోసం.. మళ్లీ బండి ఆపు చేసి.. 


భార్యను చీర కుచ్చిళ్ళు.. పైట చెంగు సరి చేసుకుంటు న్నట్లు నటించమని.. కన్ను గీటి చెప్పేవాడు


ఆమె అలాగే చేసేది.. 


అలా రకరకాల ప్రయోగ ప్రయత్నాలు చేసుకుంటూ.. ఆ వీధిలో తమ నటన ఎవరికీ అనుమానం రాకుండా అలా అటు ఇటు రెండు సార్లు తిరిగేసరికి వాళ్ల మనసులకు చాలా గొప్ప ఆనందం కలిగిన ఫీలింగ్ అయితే వచ్చింది కానీ ఆ వీధిలో జనం కు మొత్తానికి పెద్ద అను మానం వచ్చేసింది. 


వెంటనే ఒక కొంటె కుర్రాడు విషయమేమిటండీ అని సుందరి సుబ్బారావు ను ప్రశ్నించారు. 


అయితే సుందరి సుబ్బారావు నవ్వేస్తూ ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు ఆ కుర్రాడికి. 


దాంతో ఆ వీధిలో జనం అందరికీ జాలి వేసి.. 

"మోపెడ్ పక్కనపెట్టి.. మందులు మేము ఇస్తాము సరదాగా మాతో కాల్చుకోండి " అన్నారు. 


చాలా ఆనందపడి ఎగిరి గంతులు వేయాలి అనుకున్నారు సుందరి సుబ్బారావు లు.. కాని ఉదయం ఇంటి దగ్గర అలా చేయడం వల్ల తమ నెత్తిలకు కట్టిన బొప్పి లు గుర్తుకొచ్చి అలా చేయడం మానేశారు. 


వెంటనే వాళ్ళు చెప్పినట్టు మోపెడ్.. కాస్తంత దూరం గా పక్కన పెట్టి ఆ వీధిలో జనం అందరూ కాలుస్తున్న దీపావళి సామాగ్రి అందాలను శబ్దాలను ఒంగి ఒంగి చూస్తూ తెగ ఆనంద పడిపోతూ సంబరపడిపోతున్నారు. 


''మీరు కూడా కాల్చుకోండి.'' అంటూ ఆ పక్క ఈ పక్క వాళ్ళు ఇచ్చిన మతాబులు కాల్చి తెగ ఎంజాయ్ చేశారు.. సుందరి సుబ్బారావు లు. 


అంతా బాగానే జరిగింది.. అరటిపండు.. తొక్క తీయకుండా తిన్నంత ఆనందంగా ఉంది. కొబ్బరి బొండం పగల గొట్టకుండా కొబ్బరినీళ్లు తాగినంత చక్కగా ఉంది. 


 అలా అలా గంట మహదానందం తర్వాత సుందరి సుబ్బారావు లు బయల్దేరుదాం అనుకునేసరికి.. 


''సార్.. ఇంతసేపు ఉన్నారు.. ఇంకొక్క 5 నిమిషాలు ఉండండి.. ఎందుకంటే 5000 సౌండ్ వచ్చే సీమ టపా కాయ్ కాల్చుతున్నాం.. చాలా ఖరీదు పైగా చాలా బ్రహ్మాండంగా పేలుతుంది.. శివకాశి నుండి డైరెక్టుగా కొరియర్ ద్వారా రప్పించాము.. సరదాగా అది చూసి వెళ్ళండి ".. అని కోరారు.. 


సుందరి సుబ్బారావు లు ఆ వీధిలోవాళ్ళ అనన్య సామాన్యమైన ప్రేమకు, అవ్యాజమైన అభిమానానికి, ఇంకా రకరకాలుగా వర్ణించడం కుదరని ఆప్యాయత కు.. చాలా చాలా ఆనందించారు. !!! ఉబ్బి తబ్బిపై పోదాం అనుకున్నారు. కానీ ఆ సంతోషంలో బుడగలా ఉబ్బిపోయి ఉబ్బిపోయి బెలూన్ లా పేలిపోతామేమో అని భయమేసి ఆ కార్యక్రమం కాస్త పోస్ట్ పోన్ చేశారు. 


ఒక కుర్రాడు సీమటపాకాయ 5000 పొడుగ్గా పేర్చి అంటించాడు.. 


'' dham dham dham dham dham dham dham dham '' ఇంగ్లీషు సినిమాలో ఫైటింగ్ సన్నివేశాలు జరిగినట్టు.. 


వీధి వీధంతా అల్లరి చిల్లర అయిపోయింది.. గోల గగ్గోలు అయిపోయింది.. ఇంటి మెట్లు పక్కన పెట్టిన కొన్ని కొన్ని వస్తువులు అయితే శబ్దాలకి జారి కిందప డ్డాయి.. వీధి అరుగు మీద ఆదమరచి ఉన్న ముసల ముక్కీ మంచం మీద నుంచి జారి పడ్డారు.. వేడి టపా కాయలు కొన్ని అరుగుల మీద పెట్టిన సైకిల్ టైర్లుకు తగిలి అవికూడా బరష్టు అయ్యాయి!!!


మొత్తానికి అది ఒక సరదా పండుగ లాగే జరిగింది. 


బ్రహ్మాండంగా 5000 సౌండ్ లు సుస్పష్టంగా వినబ డ్డాయి. సుందరి సుబ్బారావు ఆ శబ్దాన్ని లెక్క పెట్టినట్టు కరెక్ట్ గా ఐదువేల సార్లు పేలినట్లు.. అవి తమ కర్ణభేరి లను సంతోషం కలిగించినట్లు ఆనందించి వారందరికీ థ్యాంక్స్ చెప్పి.. కొంచెం దూరంగా పెట్టిన.. తమ సరి కొత్త రాణి కలర్ మోపెడ్ నిలబెట్టిన ప్రాంతానికి వచ్చారు. 


ఈ శబ్దాలకు కిందకు జారి పడ్డ.. వాళ్ల సరికొత్త రాణి కలర్ మోపెడ్ ను పైకి లేపి స్టార్ట్ చేశారు. ఒక దెబ్బకు బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యింది.. మహదానందంగా ఇద్దరు బండి ఎక్కుదాం అనుకున్నారు. 


అంతే ఇంకో రెండు "ఢం.. ఢం" శబ్దాలు వినపడ్డాయి వాళ్లకు అతి దగ్గరలో.. తమ మోపెడ్ రెండు గాలి టైర్ల ప్రాంతంలో. 


"5000 సౌండ్లలో "కాలకుండా" ఉండిపోయిన మిగిలిన, ''రెండు" టపాకాయల శబ్దం అనుకున్నారు మొట్టమొదట, ఆ వీధిలోని జనం అందరూ. వాళ్లతో పాటు సుoదరి సుబ్బారావు కూడా సేమ్ డిటో అలాగే అనుకున్నారు. 


ధర్మంగా అయితే ఎవరైనా అలాగే అనుకుంటారు. 


కానీ.. 


మన సుందరి సుబ్బారావు లు తమ సరికొత్త రాణి కలర్ మోపెడ్ రెండు టైర్ల వైపు చుసుకుంటూ.. మోపెడ్ నడిపించుకుంటూ వెళ్లడం తప్పించి డ్రైవ్ చేసుకుంటూ స్పీడ్ గా వెళ్లడం కుదరదని.. అది అసంభవమని నిర్ణయించుకొని దిగాలు పడిన ముఖాలుతో తప్పని పరిస్థితిలో మోపెడ్ నడిపించుకుంటూ వెళ్లడం మొదలుపెట్టారు 


అదిచూసి.. ఏం జరిగిందో అర్థం చేసుకున్నారు ఆ వీధి లోని జనం అంతా. వాళ్లకు నవ్వాలో ఏడవాలో తెలియ లేదు.. 


సుందరి సుబ్బారావు మాత్రం ఖచ్చితంగా నవ్వులాంటి ఏడుపుతో బండి పట్టుకొని నీరసంగా.. ఇంతకు ముందు పేలిన, కర్ణభేరిలో ఇంకా మోగుతున్న ఆ సీమటపా కాయ్ శబ్దాలను మరొకసారి నెమరు వేసుకుంటున్నట్టు లెక్కపెట్టుకుంటూ ఐదువేల సౌండులకు బదులు ఐదువేల రెండు సౌండ్ లు ఎలా వచ్చాయి అబ్బా.. శివకాశి వాళ్లకు లెక్కలు తెలియవా.. అబ్బో అబ్బో.. అబ్బోఅబ్బో.. అనుకుంటూ.. నడుస్తున్నారు!!


ఆ మిగిలిన రెండు సౌండ్లు తమ సరికొత్త రాణి కలర్ మోపెడ్ టైర్లు ఆ సీమటపాకాయ వేడి తగలడంద్వారా పేలగా వచ్చిన శబ్దం అని అర్థం అవుతున్నా అలా సర్ది చెప్పుకోలేక పోతున్నారు మనసుకు. 


''అబ్బో అబ్బో.. శివకాశి వాళ్లు 5000 కు బదులు అయిదు వేల రెండు టపాకాయలు పెట్టినట్టున్నారు మరీ అంత లెక్కలు తెలియకపోతే ఎట్లా?'' అను కుంటూ బండి నడిపించుకుంటూ వెళ్తేనే వాళ్ళకి ఆహ్లాదంగా ఉంది మరి. 


*******

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree



ree


ree

రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






Comments


bottom of page