top of page

దొంగ మొగుడు'Donga Mogudu' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 10/03/2024

'దొంగ మొగుడు' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్"అన్నా.. ! నీకు ఆడపిల్ల పుట్టింది.. "


"ఏమిటి చెల్లీ.. ! ఆడపిల్లా.. ?"


"అదేమిటి అన్నా.. ? అలా డీలా పడిపోయావు.. ?"


"ఈ దొంగకు యువదొంగ పుడతాడు అనుకున్నాను చెల్లీ.. 

నువ్వైనా.. ఒక దొంగ కొడుకుని కనవే.. చెల్లీ.. ! నా చిట్టి తల్లిని ఇచ్చి పెళ్ళి చేస్తాను.. " అన్నాడు భీముడు.. 


"ఏమో లే అన్నా.. ! నీ బావ కుడా నీలాగే ఉండాలని చెప్పి.. ఒక గజ దొంగ కి ఇచ్చి నాకు పెళ్ళి చేసావు. ఎప్పుడూ.. రాత్రి ఇంట్లో ఉండడు.. నీకు అల్లుడు సంగతి ఏమో మరి.. !" అంది చెల్లి. 


భీముడికి చిన్నప్పుడు చదువు అబ్బలేదు. వాళ్ళ నాన్న ఒక ఘరానా దొంగ. స్కూల్ కి చదువుకోమని పంపిస్తే, బడిలో ఉన్న పుస్తకాలు, పెన్సిల్స్ అన్నీ కొట్టుకొచ్చేవాడు భీముడు. దొంగ కడుపున దొంగే కదా పుట్టేదని.. చదువు మానిపించేసి.. కొడుకుకి దొంగతనం లో డిగ్రీ చేయించాడు. రోజు రోజుకు ఎదుగుతున్న కొడుకుని చూసి.. తండ్రి గర్వపడ్డాడు. చిల్లర దొంగ నుంచి.. గజ దొంగ స్టాయి కి ఎదిగాడు భీముడు. 


'ఒక తండ్రిగా నాకు ఇంకేమిటి కావాలని.. ' అనుకుని భీముడి తండ్రి రిటైర్ అయ్యాడు. పెన్షన్ లేని జీవితం.. ఏం చేస్తాడు? ఇంట్లోనే ఉంటూ.. అప్పుడప్పుడు చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేసుకుంటూ.. కాలం వెళ్ళదీసేవాడు.. 


భీముడిది ఇప్పుడు తిరుగులేని హస్తవాసి. చెయ్యి వేసేడంటే చాలు.. ఎలాంటి తాళం అయినా ఓపెన్ అవాల్సిందే. కూతురిని బాగా చదివించాలన్న భీముడి కోరికా ఫలించలేదు. అరా కొరా చదువుతో ఆపేసింది అమ్మాయి మంగ. తల్లి గారాబం చేత.. ఇంట్లోనే ఉండి.. ఇంటిపని, వంట పని చూసుకునేది. మంగ వయసుకు వచ్చే నాటికి ఆమె తల్లి మరణించింది. 


అప్పటినుంచి ఇంట్లోనే ఉంటూ, తండ్రికి వండి పెడుతుంది మంగ. కాలక్షేపానికి సినిమా సీడీ లు తెమ్మని నాన్నని అడిగేది. 'మన వృత్తి కి సంబంధించిన సినిమాలు చూస్తాను నాన్నా' అని చెప్పి.. ఒక రోజు 'దొంగ' సినిమా, ఆ తరువాత దొంగలకి దొంగ, గజదొంగ, జేబుదొంగ, మంచిదొంగ.. రోజుకొక దొంగ సినిమా సీడీ తెమ్మని అడిగేది మంగ. కూతురి ఏది అడిగితే అది ఇవ్వడం తప్ప తిట్టింది ఎప్పుడూ లేదు భీముడు. చిన్నతనంలో కొండ మీద కోతిని తెమ్మంటే, కొండెక్కి కోతిని తెచ్చాడు భీముడు. 'ఆవకాయ పెట్టాలి.. మామిడి తోటలో కాయలు తీసుకురా నాన్నా.. !' అంటే.. రాత్రికి రాత్రి వెళ్లి తోటంతా దోచేసి తెచ్చాడు భీముడు. 


ఒంటరి ఆడపిల్లని పెంచడం నా వల్ల కాదు. అసలే.. పెద్ద దొంగతనాలకి ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుందో తెలియదు.. అమ్మాయిని ఒకరి ఇంట్లోనూ ఉంచలేను, కాబట్టి పెళ్ళి చేసేయాలని అనుకున్నాడు భీముడు. 


"నీకు ఎలాంటి మొగుడు కావాలో బాగా ఆలోచించుకుని చెప్పు తల్లీ.. నా బాధ్యత తీరిపోతుంది.. "


"అలాగే నాన్నా.. !" అంది మంగ


"నేను బయటకు పోతున్నాను.. వచ్చేటప్పుడు ఏ సీడీని తెమ్మంటావు చెప్పు.. ?"


"నాకు దొంగ మొగుడు కావాలి.. "


"అలాగే.. రాత్రి ఆ షాప్ లో సీడీ కొట్టుకుని వచ్చేస్తాను లే మంగ.. "


"మనిషిని ఎలాగ కొట్టుకొస్తావు నాన్న.. ! నిన్న నువ్వు అడిగినదానికి బాగా అలోచించి.. నాకు ఒక దొంగ మొగుడిగా కావాలి అంటున్నాను.. "


కూతురి ఏది అడిగినా.. తెచ్చే భీముడు ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. నా కూతురికి అన్నీ నా ఆలోచనలే.. ! ఇది ఎవరినైనా అడిగే విషయం కాదు. అలగనీ.. ఎవరూ నా కొడుకు దొంగా అని చెప్పుకోరు. తన చెల్లికీ.. కూతురు పుట్టింది.. ఆ ఆశా పోయింది. తనకి తెలిసిన దొంగలకి కొడుకులు ఉన్నారో లేదో.. ? ఒకవేళ ఉన్నా.. దొంగతనంలో ఉన్నారో లేదో తెలియదు.. అడగాలని కుడా అనిపించలేదు. 


దొంగలు తిరిగే చోట్లు అన్నింటికీ వెళ్లి వాకబు చేసాడు. పోలీస్ స్టేషన్ లో అంటించిన ఫోటోలు పరిశీలించాడు. రైల్వే స్టేషన్ లో, అన్ని చోట్ల అంటించిన ఫోటోలు చూసాడు. వాడిపోయిన వంకాయ ముఖాలే అందరివీ అనుకుని.. ఆశలు వదులుకున్నాడు. 


తోటి దొంగ స్నేహితుడు ఇచ్చిన సలహాని అనుసరించి.. పత్రికలో ఒక ప్రకటన ఇచ్చాడు. మూడు రోజుల తర్వాత.. ఇంటికి ఒక పోస్టల్ వ్యాన్ వచ్చింది. 


'ఇదేంటి.. నా ఇంటికి వస్తే.. పోలీస్ వ్యాన్ రావాలి కానీ.. ఇంటికి పోస్టల్ వ్యాన్ వచ్చింది ఏమిటి.. ?' అని అనుకున్నాడు భీముడు. వ్యాన్ లోంచి ఒక రెండు బస్తాల లెటర్స్ పడేసి వెళ్ళిపోయాడు వ్యాన్ లో మనిషి. మన ఊరు ఏమీ గొడ్డు పోలేదు.. దొంగలకేమీ లోటు లేదు.. అనుకుని.. ఉత్తరాలు చదవడం మొదలుపెట్టాడు. ఒక నెలకి మొత్తం అన్నీ ఉత్తరాలు చదివి.. కొంత మంది యువ దొంగలని సెలెక్ట్ చేసాడు. ఒక ముగ్గురిని మాత్రం తేల్చుకోలేకపోయాడు భీముడు.. 


"అమ్మాయి.. మంగా.. ! ఈ ముగ్గురిలో ఎవరు నచ్చారో చెప్పు.. నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను" అన్నాడు భీముడు.


"నీ ఇష్టం నాన్నా.. !"


"ఈ అబ్బాయి దొంగతనాలు యాభై, ఇతను నలభై, ఇతను తొంబై.. పైగా నాలుగు బిరుదులు కుడా ఉన్నాయి. చూడడానికి కుడా చాలా చక్కగా ఉన్నాడు. ఇతనిని రేపు పెళ్ళి చూపులకి రమ్మని చెబుతాను.. " అన్నాడు భీముడు. 


మర్నాడు పెళ్ళిచూపులకి వచ్చిన పెళ్ళికొడుకుని భీముడు పలకరించాడు.. 


"మీ ఊరిలో అందరూ కులాసా.. ?"


"ఇంట్లో అందరూ కులాసా.. మరి ఊరు విషయం ఎందుకు.. ?" అని ముఖం పెట్టాడు పెళ్ళికొడుకు.

 

"మన దొంగలు ఎప్పుడూ ఊరిలో అందరూ బాగుండాలని కోరుకోవాలి.. అప్పుడే మన చేతికి బోలెడంత పని.. ఇంతకీ ఎలా వచ్చారు బాబు.. ?"


"మా ఇంటి ఎదురుగా సైకిల్ ఖాళీగా ఉంటే, వేసుకుని వచ్చేసాము.. నేనూ, నాన్న.. "


"భలే అల్లుడు.. నా తర్వాత.. నా అల్లుడు నా అంతటి వాడు అవాలన్నదే నా కోరిక.. "


"తప్పకుండా మామా.. "


"స్వీట్స్ చాలా బాగున్నాయి.. మీ అమ్మాయిలాగే.. ఇంతకీ స్వీట్స్ ఎక్కడ కొన్నారు మామా.. ?"


"కొనడము మా ఇంటా వంటా లేదుగా.. ! కొట్టుకు వచ్చేయ్యడమే బాబు.. అంతే.. !"


"ఇంతకీ నేను నచ్చానా.. మంగ గారు.. ?"


"థియరీ లో ఓకే.. నెక్స్ట్ ప్రాక్టికల్ టెస్ట్ ఉంది.. "


"అంటే.. ఏం చెయ్యాలి.. ?" అడిగాడు పెళ్ళికొడుకు.

 

"నా ఎదురుగా.. దొరికిపోకుండా బ్యాంకు లో దొంగతనం చెయ్యాలి.. అప్పుడే మన పెళ్ళి.. " అంది మంగ నవ్వుతూ.. 

"అదెంత పని.. నాకు ఓకే.. ఈ లోపు మా పెళ్ళికి ముహూర్తం పెట్టించండి మామా.. " అన్నాడు పెళ్ళికొడుకు 


***********

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ123 views0 comments

Kommentarer


bottom of page