top of page
Original.png

ఏం బతుకులో!

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #EmBathukulo, #ఏంబతుకులో, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Em Bathukulo - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 28/12/2025

ఏం బతుకులో - తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

అదో పెద్ద పెళ్ళి ఫంక్షన్ హాల్. పెళ్ళి బ్రహ్మాండంగా జరుగుతోంది.. 


"హలో వనజ.. ! ఎన్ని సంవత్సరాలకి కలిసామే!"


"హలో గిరిజ.. ! నిజమే మనం కలిసి ఎన్నో సంవత్సరాలు అయ్యిందే.. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ హోదా కూడా వచ్చేసిందిగా. పెళ్ళికి ముందే హ్యాపీ గా కలుసుకునేవాళ్లం. పెళ్ళైన తర్వాత నువ్వొక చోట, నేనొక చోట. మళ్ళీ ఇలా పెన్షన్ తీసుకునే వయసులో కలిసాము.. పిల్లల్ని పెంచడంతోనే జీవితం అంతా అయిపోయింది. ఇప్పుడు మనవల వొంతు.. వాళ్ళని చూడాలంట"- అంది వనజ.

 

"ఏమిటే.. ఎలా ఉన్నావు? ఎంత కౌంట్?" అడిగింది గిరిజ.

 

"వయసు సెవెంటీ.. మందుల కౌంట్ రోజుకు ఇరవై" చెప్పింది వనజ.


"నేనే నయం. వయసు సెవెంటీ వన్.. కౌంట్ పది. నీకంటే నేనే ఆరోగ్యంగా ఉన్నానే. అయినా ఏం ప్రయోజం.. ఒక్కలమే ఇక్కడ.. పిల్లలేమో అక్కడ. మంచి ఫుడ్ వండుకుని తినే ఓపిక ఉన్నా.. పక్కనెవరూ లేరు.. ఒంటరి జీవితం అయిపోయిందే.. ఏం బతుకులో!" అంది గిరిజ. 


"అవును మరి.. పెళ్ళైన నాలుగు రోజుల నుంచే.. భర్తని అది కొను, ఇది కొను, ఆ చీర కొను, ఆ నగ కొను, విల్లా కొను.. ఇలా వేధిస్తే, హార్ట్ బ్రేక్ అయి, తొందరగా పోతారుగా మగవారు"


"నాకూ అలానే జరిగింది. ఇప్పుడు ఆ చీరలు, నగలు ఉన్నా.. ఇవ్వడానికి, అమ్ముకోడానికి తప్పితే, కట్టుకోవడానికి, పెట్టుకోడానికి అర్హత ఎక్కడ?" 


"నీకే కాదు.. లోకంలో చాలా మంది మగవాళ్ళకి చావు ఇలానే వస్తోంది. మన ఆడవారికి ఒంటరితనమే గతి" 

"ఏమిటో ఇక్కడ మీ దర్శనం.. ? ఇంతకీ నువ్వు ఎవరికి బంధువు?" అడిగింది గిరిజ. 


"ఎవరికోనా.. నా మొహం! నా కోడలు నన్ను ఫంక్షన్ కి వెళ్ళమని ఆర్డర్ వేసింది. నువ్వో.. మరి?"


ముందు నువ్వు చెప్పు వనజ.. 


"మా అబ్బాయికి అమెరికా వెళ్ళాలని పిచ్చి. కానీ ఎప్పుడూ అవకాశం రాలేదు. ఏం చేస్తాడు? వాళ్ళ కాలేజీలో అమ్మాయి, కొంచం నల్లగా ఉన్నా.. అమెరికా లో పనిచేస్తుందంటే, ఆమెను పెళ్ళి చేసుకుని ఫ్లైట్ ఎక్కేసాడు.. "


"అయితే అక్కడ ఇద్దరూ రిచ్ గా బతుకుతున్నారుగా.. మరి నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండు.. " అంది గిరిజ. 


"ఏం రిచ్చో.. ! ఏం బతుకులో! మొగుడు, పెళ్ళాం ఇద్దరూ ఉద్యోగాలే. ఉరుకులు పరుగుల జీవితం. వండుకోవడానికి టైం లేదంట. ఫ్రిజ్ లో తిండి మగ్గబెట్టుకుని, అవే వేడి చేసుకునే వారమంతా అదే తినడం. ఒక పూజ లేదు, పండగ లేదు. అర్దరాత్రి తినడము, తాగడము. కొడుకుకి అప్పుడే షుగర్ 300, కోడలికి 250. ఇద్దరూ మందుల మీదే. మనవలు ఎప్పుడూ ఆ పిజ్జాలు, బర్గరే లోకం"


"మరి నువ్వూ అక్కడికే వెళ్ళొచ్చుగా చక్కగా.. "


"వంట చెయ్యడానికి, మనవలను చూసుకోవడానికి రమ్మనారు. అక్కడ అలా బతకడం ఇష్టం లేక, మీ ఏడుపు ఏదో మీరు ఏడవండి.. రానని చెప్పేసాను. మీరు అక్కడే ఉంటే, ఇక్కడకు రాకపోతే మాత్రం, నా అన్ని ఫంక్షన్ కి వెళ్ళాలి" అని ఆర్డర్ వేసింది మా కోడలు.”


" అంతా బాగానే ఉందిగా" అంది గిరిజ 


"ఇక్కడే అసలు ట్విస్ట్! కోడలు ఎప్పుడో గానీ ఇండియాకు రాదంట, ఆ అమ్మాయి ఎప్పుడో గానీ మా ఊరు అసలే రాదు. ఈలోపు ఆమె తరపున ఫంక్షన్ అన్నింటికీ నేను అటెండ్ అవ్వాలంట. అయి, తను లేని లోటు తీర్చాలంట.. తన గొప్పలన్నీ అందరికీ పిలిచి మరీ చెప్పాలంట. ఇక్కడ నాకు ఎవరు తెలియదు.. ఇలా మెడలో బోర్డు వేసుకుని అందరిని పరిచయం చేసుకుంటూ.. నా కోడలి గొప్పలు చెప్పాలి. ఏం చేస్తాం? ఏం బతుకులో!"

"ఫోన్ లు కూడా సరిగ్గా లేని కాలం మరి.. తన గురించి అందరికీ తెలియాలని మీ కోడలి ఏర్పాటు కాబోలు! ఇంతకీ ఆ బోర్డులో ఏముంది? కాస్త తిప్పు"


"నేను వనజ.. అమెరికా కోడలికి అత్తగారిని.. నన్ను అడగండి!"


"ఇది చూసి పలకరించినవారికి, మా కోడలి గొప్పలు చెప్పాలి.. ఏం బతుకులో"


"బాగుందే నీ కథ.. " నవ్వుతూ అంది గిరిజ 


"మరి నీ కథ చెప్పు"


"నీకు ఇంగ్లీష్ మాట్లాడం రాదు బామ్మ.. నువ్వు మా ఇంటికి రాకు" అని నా అమెరికా మనవడు ఆర్డర్ వేసాడు.


"నీ మనవడు చిన్నవాడు కదా.. అది ప్రేమ కావొచ్చు"


"అది ప్రేమ కాదులే. అమెరికాలో ఉంటారు కొడుకు కోడలు. నా మనవాడు చిన్నవాడైనా, చేతిలో ఎప్పుడూ గన్ ఉంటుంది.. ఇక్కడకు వస్తే, కాల్చేస్తా అని నన్ను బెదిరించాడు. వాళ్ళ స్కూల్ పరిసరాలలో అప్పుడప్పుడు చిన్న చిన్న కాల్పులు గట్రా చేస్తుంటాడు. అప్పటినుంచి అక్కడికి వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నా. ఇక్కడే ఉంటూ, ఎప్పుడో ఫోన్ లో మాట్లాడుకోవడమే.. అంతే!"


"ఎలా ఉన్నారో ఈరోజుల్లో కొడుకులు, కోడళ్ళు. మనవల జనరేషన్ అయితే ఇంకా దారుణం.. ఏం బతుకులో!" అంది వనజ.


"నిజమే.. ! నేను కూడా అప్పుడప్పుడు నీలాగే ఇలా ఫంక్షన్ అటెండ్ అవుతాను.. నీలాగా మెడలో బోర్డు వేసుకొని మాత్రం కాదులే" అని నవ్వుతూ అంది గిరిజ. 

***********


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page