ఏమిటీ జీవితం?
- Neeraja Prabhala

- Sep 20
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #EmiteeJeevitham, #ఏమిటీజీవితం

Emitee Jeevitham - New Telugu Poem Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 20/09/2025
ఏమిటీ జీవితం? - తెలుగు కవిత
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
ఏమిటీ జీవితం? ఎందుకీ ఆవేదన?
జీవనకలల ఆశలు అడియాశలేనా?
కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న జీవిత నౌక అద్దరికి చేరేనా?
కోరికల పుష్పాలతో ఊహల అల్లికల మాలలు కట్టి,
జీవనవాహినికి కంఠమాలగా అలంకరించి,
ఆశల పందిరిలో ఉంచి ముచ్చటగా మురిసిపోతిని.
అది ‘మూడునాళ్ల ముచ్చటాయె’ అని తెలిసి మూగబోయె నా మనసు.
ఆశ-నిరాశల ఊగిసలాటలో
సయ్యాటల ఓటమే మిగిలే.
ఎంత వగచినా ఏముంది?
కూసింత ఆదరణ, కొండంత ఆప్యాయతకై మది తపనపడె.
కనుచూపుమేరకూడా అది కానరాదని తెలిసె.
కాలము, ప్రాయము తిరిగి రాదు కదా!
దేనినీ మనము ఆపతరమా!
విధి లిఖితాన్ని మార్చ ఎవరి తరము?
మనోవ్యాధికి మందులేదు కదా!
నిరాశ, నిస్పృహలను పారద్రోలి,
మనోధైర్యాన్ని పెంపొందించుకుని,
అలుపెరుగని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి,
ఏకాకినై జీవనసౌధంలో విశ్రమిస్తూ,
ఈవిశాలవిశ్వంలో రేణువునై,
తుదకు వాయివులో లీనమవుతా!
ఒంటరిగా భువికేగితిని.
ఒంటరై దివికేగుతాను.
ఇదే జీవితం - ఇంతే జీవితం.
జీవిత సత్యమిదే!

-నీరజ హరి ప్రభల




Comments