top of page
Original.png

శ్రీ మాతే నమః శతకము

#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, SriMatheNamahaSathakamu, #శ్రీమాతేనమఃశతకము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #శార్దూలము

ree

Sri Mathe Namaha Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 20/09/2025

శ్రీ మాతే నమః శతకము - తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి

 

 నామాట


నేను ఇంతవరకు ఇరువది శతకములు రెండు సహస్రములు ఏబది వరకు కథలు, నవలలు ఇంకా కొన్ని కవితలు వ్రాయడము జరిగింది.

ప్రకృతిలో తల్లి ప్రేమ మించినదేది లేదు- ఆమె త్యాగ మూర్తి.తన సంతానము కొరకు ఎంతైనా పోరాడే పుణ్య మూర్తి- అందుకొరకే తల్లి చూపే ప్రేమానురాగాలు నా ఈ "శ్రీ మాతే నమః" అను శతకములో చూప బడినది.

తల్లి జన్మ నిచ్చుటయే గాక సంతాన అభివృద్ధికి, విద్యా బుద్ధులు, వినయ విధేయతలు, దాతృత్వ భావము, ప్రేమానురాగాలు ఇత్యాది సకల సలక్షణ గుణముల పొందుటే గాక సమాజములో గొప్పగా నిలువాలను తలంపుతో తీర్చి దిద్దే ప్రయత్నము చేస్తూ ఉంటుంది. ఇసుమంతైన స్వార్థ చింతన లేనిదీ ప్రపంచములో తల్లి ఒక్కటే.

తల్లి అంటే కనబడే దైవం. ఆ తల్లి గురించి ఎంత చెప్పినా అది అర్ణవ మంత విశాలమైంది. ఇందులో నాకు తోచిన నేను అనుభవించిన విషయాలనే పొందుపరచి వ్రాయడము జరిగంది. పాఠకులు ఈ శతకము ఆసాంతము ఓపికతో చదివి వారి వారి అమూల్యమైన అభిప్రాయాలు తెలుప కోరుతాను.


 పోచంపల్లి సుదర్శన రావు


1.) తల్లీనిన్ను మనంబు దల్చి సతతం త్రాణంబు నేగోరనా

యుల్లంబందున నిల్చి నీవు దయతో యుండంగ నాకింకనీ

చల్లంగుండెడు పెక్కు దృక్కు గనగం చాలింక నాకేమినీ

వల్లంగల్గెడి పెక్కు సౌఖ్య మనగం వందింతు మాతే నమః


2.) ప్రేమంబందగ బెంచి నన్ను నిరతం బ్రేమించి నేబెర్గగా సేమంగుండను నేర్పు నేర్పి సతతం సేవించ నీవుండగా

నోమాతా నిను నేను దైవ సమముం నోరార బూజించనే

ఓమాతా విను మింక నాదు మదికిం ఊతేను మాతేనమః


3.) నాదేరూపము ఐన నీవు మదిలో నారాట మేదేని నీ హోదాయందున తగ్గు నంటు కనకన్ ఓమాత నీవుండ నీ

పాదాలంటను మ్రొక్క నాదు మదికిన్ పాపంబు బోనుండు నో

లేదేదీ గన దల్లి మించి భువిలో లేశంబు మాతేనమః


4.)భాషాయోషగ నాకు నీవు రహితో భావంబు లెన్నోను యే

దోషాలే గన కుండ నేర్ప నదియే దోవెంతొ జూపంగ యా

భాషామాంబను వేడ నాకు జదువే భాగ్యంబు గల్గించ నే

భాషాపట్టును బొంది తెంతొ అదియూ భాగ్యంబె మాతేనమః


5.)ఆయాసంబును ఎంతొ నోర్చి మదిలో ఆనంద భాగ్యంబుగా

కాయంబందున బుట్ట బోవు సుతులన్ గానంగ వీక్షించు యో

పీయూషంబును బ్రేమ నీయు జననీ పీథంబు గ్రోలంగ యా

ఊయాలూగెడు నూత్న బిడ్డ గనగన్ ఊహించు మాతేనమః


6.)భూరిక్కందున తల్లి ప్రేమె సుఖమున్ బూరించ గల్గంగ ఆ

భారంబంతయు తాను మోసి సుతులన్ భాగ్యంగ జూడంగ నా

నారీరత్నమె గాద జూడ సతతం న్యాయంబు దల్వంగ యా

పోరంతన్ దను తృప్తి తోడ ప్రసువే పోషించు మాతేనమః


7.)శక్యంబెందును గాన కున్న జననే శక్యంబు దాబొంది దా

లౌక్యంబెంతయొ జూప నుండు సుతులన్ రౌద్రంబు లేకుండ నో

ఐక్యంబున్ గని స్నేహ ప్రేమ లధికం ఐయుండ గానంగ నే

లౌక్యంబన్నను దెల్సి బత్క ప్రసువే లౌక్యంబు మాతేనమః


8.)కూలీనాలియు జేయ కష్ట మనుచుం గుందంగ బోబోదు తా

కూలీజేయుచు బిడ్డ లందు సుఖముం గూర్చంగ దల్లేను దా

చాలీచాలని కూలి తృప్తి దలువం జాలంగ మాతేను దా

కూలీమన్షయి నింక సంతు గనుచుం కూర్మేను మాతేనమః


9.)కార్యంబేదియు దల్వ తల్లి పదముల్ కళ్ళద్ది మ్రొక్కంగ యా

కార్యంబంతయు జేయ నుండ నదియే కార్యంబు సిద్ధించు నే

కార్యంబైనను తల్లి దండ్రి మనమున్ గల్గించు నీడేర గా

కార్యంబెంతయు యున్న తల్లి దయయే గావించు మాతేనమః


10.)ఏతల్లైనను దాను దల్చు సతతం ఎర్గంగ సంతంత ఏ

వేతల్ ఐనను గానకుండ ముదమున్ వెల్గంగ నుండంగ దా

ఊతంబున్ నిక జూపనుండి సుతులన్ ఊహించు నెంతేనొ నో

హేతీనోలెను కాన నుండ మనసే హేమంబు మాతేనమః


11.)నందంతున్ గని తల్లి ఎంతొ మదిలో నానంద ముప్పొంగ నా

అందంబున్ మది దల్చి కొడ్కు వదనం ఆత్రేయు బోలంగ యా

అందంబున్ కడు ప్రీతి గొల్ప జననే అంకంబు జేర్చంగ నా

కందెంతో నిక జూచు తల్లి ముఖమే కానంగ మాతేనమః


12.)ఓమాతా నిను దల్చి నేను సతతం ఓంకార చిత్తంబు తో

ప్రేమంబున్ నిక గోరి నీదు వలనన్ పేయంబు గ్రోలంగ నే

సేమంబున్ గన నుంటి నీదు పదముల్ సేవించ నిత్యంబు యే

క్షామంబున్ గన మింక నీదు దయతో క్షాంతందు మాతేనమః


13.)తల్లేనింకను బిడ్డ లందు అధికం త్రాణంబు తాగోరగా

ముల్లేలవ్వియె గాన నుండ మదికిన్ ముప్పొద్దు ఆప్రేమయే

మళ్ళీమళ్ళి యు ప్రీతి గాన నదియే మంత్రంబు గానంగ నా

తల్లేనుండగ లోక మంత వెలుగే ధ్వాంతారి మాతేనమః


14.)సారంగం బున మాత దల్చు సుతులన్ సంతోష పెట్టంగ దా

భారంబం బని దల్వ బోక మదికిన్ భాగ్యంబు అంటింక దా

పోరంతం బడ తన్వి తోడ సుతులన్ పొంకంగ జూడంగ నో 

సారంగం బున నిల్వ దిట్ట తనమున్ సౌఖ్యంబె మాతేనమః


15.)అమ్మాయంటును బల్క నెంతొ మనసుం ఆనంద మొందంగ నా

అమ్మేనింకను జాస్తి ప్రీతి గలుగం ఆధార ముండంగ నే

కమ్మంగుండెడి బువ్వ బెట్ట మదికిం గల్గింక మోదంబు నో

అమ్మాయంటును నోట బిల్వ మదికిం ఆహ్లాద మాతేనమః


16.)ఏతల్లీ అన జూడ నుండ సుతులం ఎంతోను ప్రేమంబు తో

ప్రీతంటున్ గను చుండు జూడ సతతం ప్రీతేను బొందంగ తా

నేతంటంటును దల్వ బోక సుతులే నెంతోను ప్రీతంటు యా

మాతంటేనిక గర్వ మొంద మదికిం మాతేను మాతేనమః


17.)కుక్షింజూచును తల్లి బిడ్డ గనుచుం కూడెంతొ బెట్టింక నే

భక్షించంగను దృప్తి తోడ గడుపుం బాగుండ జూచింక దా

లక్షించుం దను నెత్తు కుంటు శిశువుం లాలించు తన్వొంది దా

వీక్షించుం దన శిశ్వు దప్ప కనదే విశ్వంబు మాతేనమః


18.)మూడంటే నన శక్తి రూప మనగం ముఖ్యంబు గానంగ యా

మూడంటే నన ఇఛ్చ జ్ఞాన క్రియయుం మూడేను లోకంబు యా

మూడింటే నిక తల్లి నిల్చు సుతులం మున్ముందు జ్ఞానంబు తో

చూడంగం దన సంతు సర్వ విధముల్ శుభ్రంగ మాతేనమః 


19.)ఇల్లాలం టెను తోడు నిల్చు బతుకం ఇబ్బంది లేకుండ యా

తల్లేమో నిక బిడ్డ లందు గనగం దన్వొంది బ్రేమంబు తో

చల్లంగం గను శ్వాస ధ్యాస నెపుడుం సంసార బంధంబు తో

తల్లేనుం గద జన్మ నిచ్చి గనగం త్రాణంబు మాతేనమః


20.)ఆలుంబిడ్డలు తోడు యున్న మదికిం అమ్మేను ప్రేమంబు తో

జాలంటుం గను కష్ట నష్ట సమయం జాగ్రత్త దాదెల్పు నే

కాలంబైనను తల్లి యేను సతతం కానంగ యోగంబు తో

నేలందుండెడి లేఖ తల్లి యనగం నెమ్మేను మాతేనమః


21.) విడ్డూరం బన తల్లి సేవ యనకం విశ్వాస హీనంబు దా నడ్డేమిం గన కుండ సంతు శుభముం నచ్చంగ అమ్మేను దా

దొడ్డంగం గను చుండు బిడ్డ లెపుడుం దోషంబు లేకుండ నే

వడ్డించుం రుచి యొప్పు కూర దినగం బాగుండ మాతేనమః


22.)కాలుంజేతులు గొట్టు కుంటు శిశువుం కవ్వించ జూడంగ నా

బాలుంజూసియు తల్లి బొందు ముదముం భాగ్యంబె జూడంగ యా

బాలుండింకను తల్లి తోడ నపుడుం బాగంటు నాడంగ దా

మేలంటుం గని తల్లి యింక నతనిం మెచ్చంగ మాతేనమః


23.)ముల్లేలేమియు ఈయ కున్న దమకుం మున్ముందు తల్లేను యా

ముల్లేదో యన జూపు నింక కనగం ముఖ్యంబు మాతేను దా

చల్లంగం యన నుండ నెప్డు ఎలమే చాలింక యామాట దా

ఉల్లంబందున నిల్పి ఇంట ఎపుడుం ఉండంగ మాతేనమః


24.)కాలాలెంతయు మార నున్న బుడమిం గానంగ అమ్మేను యే

కాలంబైనను దాను బిడ్డ లనగం క్షాంతందు క్షేమంగ దా

నాలంబం బయి బిడ్డ లందు సతతం నాకంబు యోగంబు తో

జాలెంతో గని కొడ్కు బిడ్డ లనగం జాగ్రత్తె మాతేనమః


25.)అంగంబం దున బుట్ట కొడ్కు తనకుం ఆధర్వు గాకున్న దా

మింగంబో వను మెత్కు లేక సుతుకుం మింగంగ బెట్టంగ నే

భంగంబుం గన బోదు తల్లి సుతుకుం భారంబు గానీదు యా

భంగంబం తయు దాను మోయు సతతం భావంబె మాతేనమః


26.)అమ్మాయంటును బిల్వ తల్లి సుతులం ఆత్రంగ జూడంగ నా

అమ్మేనింకను కొడ్కు లందు రహితో ఆత్రంగ దావచ్చు నా

అమ్మేనుం మది నందు క్షోభ గలుగం ఆసించు సేమంబు నా

అమ్మే నింకను చిత్త మందు దలుచుం ఆయంబు మాతేనమః


27.)అమ్మేనుం మన పృథ్వి వేల్పు కనగం అమ్మేను నుండంగ యే

అమ్మందుం గన ప్రేమ పాళ్ళె అధికం ఆయమ్మె రక్షించు యే

కొమ్మేనిం ఘన ముండు కొడ్కు అయినం కొండంత ధైర్యంబు తో

అమ్మేనుం దన సంతు మేలు గనుచుం అత్రంగ మాతేనమః


28.)ముగ్గుర్నే మది యందు అమ్మ లనకం ముఖ్యంబు అమ్మేను యా

ముగ్గుర్నీ యిక దల్వు ముందు మదినిం ముందుంగ మీయమ్మ నే

తగ్గంబోకుము తల్లి మర్వ సతతం తానేను నీయందు దా

నుగ్గుంబెట్టుట జోల పాట లనుచుం నూపంగ మాతేనమః


29.)ఆకూపారము కన్న అమ్మ కనగం అందంద మవ్వంగ నా

ఆకూపారము యెన్న నద్ది పుడమిం అందంగ కానంగ యా

ఆకూపారము గాన ఉప్పు అధికం అందుండు జూడంగ యే

ఆకూపారము కన్న అమ్మ కనగం ఔన్నత్య మాతేనమః


30.) లోకంబందున తల్లి యేను దనయుం లోపంబు లేకుండ దా

చీకాకుం మది జెంద కుండ సుఖమం జీవించు మార్గంబు యీ

లోకంబందున అమ్మె జూపు ఎరుగం లోపంబు లేకుండ ఆ

లోకించంగను దల్లె గాన ఎరుగం లొల్లేది మాతేనమః


31.)శ్రేష్ఠంబిచ్చియు బెంచి తల్లి సుతులం శ్రేయంబు దాగోరి దా 

శ్రేష్ఠంబొందగ గాంచు చుండు కొమరుం శ్రేయస్సు బ్రాప్తించ యే

గోష్ఠింజూడగ సంతు నెంతొ ఘనతం గొల్వంగ సంసత్తు యా

శ్రేష్ఠంబుం గని దాను యెంతొ మురియం శ్రేయంబె మాతేనమః


32.)తల్లేనెంతనొ తాల్మి నేర్పు పలుకుం తప్పేది లేకుండ యా

తల్లేనుం రహి తోడ బెట్టు రుచులం దానొండి కమ్మంగ యా

తల్లేనుం లలి తాను బడ్తు సుతులం తానంబు జేయించు యా

తల్లేనుం బడి కంపు బుద్ధి జదువం దాల్మెంతొ మాతేనమః


33.)భాషాయోషకు మ్రొక్కి బాగ జదువం భాషెంతొ నేర్వంగ యే

దోషాలుం గన కుండ నుండ మదికిం దోచంగ బాగేను యే

ఆషామాషిగ యెంచ కుండ సతతం ఆనంద ముప్పొంగ నా

భాషాయోషయె తల్లి వోలె యనగం భాగ్యంబె మాతేనమః


34.)పక్షీపశ్వుయు సంతు యందు అమితం భావంబు జూపంగ నే

రక్షించం గను నెంతొ ప్రీతి దెలుపం రట్టేమి లేకుండ దా

కుక్షింనింపను పక్షి బోయి నెచటో కూడేదొ దేనుండ యా

పక్షింబోలియు పశ్వు దూడ కొరకుం పాట్లేను మాతేనమః


35.)ఇంటంతిండికి లేక ఎంతొ కుదులం ఇల్లాలు దానెంతొ నో

కంటంనీరును నిండ బాధ పడుచుం కాసంత తిండేదొ యా

జంటేమో దిన కుండ సంతు కొరకుం సాధించి దేవంగ యా

తంటంబాసిన తీరు సంతు దినగం దన్వెంతొ మాతేనమః


36.)సంతానం బును బొంది తల్లి యవగం సంతోష మొందంగ దా

నెంతోనుం గుడు లందు మ్రొక్కి తుదకుం నెగ్గంగ దానెంతొ యా

సంతోషం బును బట్ట లేక సుతునిం సాదంగ ప్రేమంబు తో

నెంతోనుం మది నందు తృప్తి గలుగం నెయ్యంబె మాతేనమః


37.)విశ్వంబంతయు తల్లి రూపె కనగన్ విశ్వాస మొందంగ నీ

విశ్వంబంతయు నిండి యున్న సకలం విశ్వాస భావంబు తో

విశ్వంబందున ధాత్రి గాన అమితం విశ్వాస పాత్రంబె ఈ 

విశ్వంబే గన అంబ యుండు తలమే వీకంబు మాతేనమః


38.)అందంబన్ దున అమ్మ మోమె కనగన్ ఆహాన దెంతోను ఆ

నందంగం గన నుండు దల్వ సుతులుం నహ్లాద మొందంగ యా

అందంబెంతను యేడ గూడ కనగన్ ఆకూత దెల్పంగ దా

మొందంగం అను భూతి యేను అనగం మోదంబు మాతేనమః


39.)భూభారం బును మోయ తల్లి పొడతో భూమంత దానిల్చి యా

భూభారం బన సంతు గాంచు జననే భూమంత నిండంగ యా

భూభారం బిక సంతు మోయ మురియుం భూమంత కాండంబు తో

నేభారం బన కుండ నుండ పుడమిన్ నేతెంచె మాతేనమః


40.)సంతోషంబునె జూచు తల్లి సుతులం సంతృప్తి జెందంగ దా

నెంతోనుం సుఖ పెట్ట జూచు నెపుడుం నేదేని అడ్డంకి యా

సంతోషంబుకు రాక నుండ గనగన్ సవ్యంగ వారుండ యే

కొంతోనుం మది కింక కష్ట మనకన్ గోరేను మాతే నమః


41.)అందంబందున దిబ్బ యున్న కనకన్ అంగంబు హీనంబు యే

మందంగం గన నున్న బాధ అనకన్ మాతేను ఆపత్య మే

అందంబంటును బిడ్డ లందు నధికం ఆబంధ జూపంగ దా

నెందుంగానను తృప్తి యేను అనుచుం నెమ్మేను మాతేనమః


42.)బాలుండైనను బిడ్డ యైన కలుగం భాగ్యంబు అంటుండు దా

మేలుంబొందను దైవ ఇఛ్చ అనుచుం మేలేను ఏదైన యా

మేలుంమర్వక వేల్పు గొల్వ మదికిం మేలేను సంతెంతొ యా

మేలుంబొందియు సౌఖ్య మంద జననే మేలంటు మాతేనమః


43.)నందంతిన్ గని తల్లి జాస్తి మురియన్ నందంబు బోల్చంగ యా

నందంతిన్ కడు ప్రేమ జూపి మిగులన్ నందంగ దాజూచు యా

నందంబున్ నిక నేడ గాన మనగన్ నాబిడ్డ ధాత్రేయి లో

నెందెందున్ గన దొర్క బోదు అనుచున్ నెయ్యంబె మాతేనమః


44.)విద్యాగంధము అంట నుండ కొమరున్ విద్యందు ప్రావీణ్య మా

విద్యాదేవియె నీయ నుండు అనుచున్ విద్యేను నేర్వంగ నా

విద్యాబుద్ధులు కొడ్కు నేర్వ ముదమున్ విజ్ఞాన వంతుంగనా

విద్యాదేవికి మ్రొక్క బూను జననే విశ్వంబు మాతే నమః


45.)ఆకొన్నంతనె కూడు బెట్ట దలచున్ అమ్మేను జూడంగ దా

నాకొన్నన్ సుతు లందు బ్రేమ మొదటన్ నానంద మొందంగ దా

చేకొన్నంతనె బెట్ట బూను తినగన్ సేమంబు దానెర్గి వా

రాకొన్నంతనె ఆల సించ గనకన్ రంఘస్సు మాతేనమః


46.)కాలాలెన్నియు మార తల్లి పెరిమే కాలంబు తగ్గంగ యే

మూలంబందున చూడ లేరు ఎరుగన్ ముఖ్యంగ ప్రేమేను యే

కాలంబందును తల్లి తండ్రి సుతులన్ గాంచంగ నుండంగ యే

కాలంబైనను చిన్న పెద్ద కనకన్ గారాబె మాతేనమః


47.)ఉన్మాదైనను తల్లి గాను సుతులన్ ఊర్కోక ప్రేమంబు దా

సన్మార్గంబున దేవ బూను సతతం సంతాప మొందంగ దా

జన్మంతన్ సుతు లందె బాధ్య తనుచున్ జాలొంది సంతందు యా

ఉన్మాదంబును తగ్గ జూచు నిరతం ఉర్వందు మాతేనమః


48.)దుష్టుండైనటు వంటి కొడ్కు గనుచున్ దుఃఖంబు దాజెంది యా

స్రష్టందిట్టును దల్లి కష్ట పడుచున్ సర్వంక షుండెందు కీ

కష్టంగల్గను నాకు ఇచ్చె ననుచున్ కంజాతు నిష్టూర మా

దుష్టుంజూచుచు బల్కు జాలి పడుచున్ దుగ్ధొంది మాతే నమః 


49.)భూమం మందున తల్లి సంతు నతిగన్ భూపాలు చందంబు దా

సేమంబొందను బెంచ జూచు నెపుడున్ సేగేది రాకుండ దా

నోమెంతోనిక సేయ బూను సుతులున్ నొందంగ క్షేమంబు నే

యామంబైనను బుద్ధి తోడ మెలగన్ యత్నించు మాతేనమః


50,)తల్లిన్నిత్యము భక్తి గొల్వ జననే తానెంతొ తృప్తొంది యా

తల్లేనింకను కొడ్కు సేవ దలువన్ దానింగ ఆత్మందు యే

ముల్లేమింకను దాను ఈయ దలువన్ ముఖ్యంబు గాదంటు యా

తల్లేనింకను జ్ఞాన వంతు గలుగన్ తన్వొందు మాతేనమః


51.)భావంబందున దల్లి దల్చు సుతులున్ భాగ్యంబు గేహంబు యా

భావంబే మది నిండ నింక దనకున్ బ్రాణేశు ఊహందు యా

భావంబే యిక యింట నెంతొ ముదమున్ భావంబు నిండంగ యా

దైవంబెంతయొ మేలు జేసె కనకన్ దైన్యంబు మాతేనమః


52.)అంతర్యా మిడె సంతు నాకు అనుచున్ అమ్మేను దానెంతొ యా

అంతర్యామిని దల్చు చుండు సుతులన్ ఆరోగ్య భాగ్యంబు యా

అంతర్యామియె దిక్కు అంటు మదిలో ఆరాట మైతేను దా

నెంతన్నం విడ కుండ నుండు జననే నేలందు మాతేనమః


53 సంతోషంబున తల్లి యుండు సమయం సంతేను భావించ యా

సంతోషంబును గల్గ నెంచి నదియున్ సంప్రాప్త మొందంగ యా

మెంతోమేలను చింత లేక మదికిన్ మేల్గాంచు భావంబు యా

సంతోషం బున దృప్తి జెందు విధమున్ సంతేను మాతే నమః


54.)ముల్లోకంబుల నైన జూడ మదికిన్ ముఖ్యంబు అమ్మేను దా

నుల్లాసంబుగ నుండ నెంచ సుతులున్ నుద్యోగ మేదేని యే

హల్లోహాలులు గాక యుండి సతతం హాయంటు నుండంగ నే

తల్లైనం తన కెంతొ తృప్తి అనుచున్ తాదాత్మ్య మాతే నమః.


 55.)నిత్యంబుం దలి భక్తి తోడ గొలువన్ నిందేది లేకుండు దా

సత్యంబుం మది నిల్పి సంబు రమునన్ సాగంగ మేలుండు దా

ముత్యంబుం వలె తల్లి దల్చు ముదమున్ ముద్దాడ నుండంగ యా

సత్యంబుం గని మెల్గ నుండ మదికిన్ సంతృప్తి మాతే నమః


56.) విజ్ఞానంబును గల్గి మెల్గి విధులన్ వీక్షించ గానుండ యా

విజ్ఞానం బిక తోడు నిల్చి మదికిన్ విద్వేష భావంబు నే

విజ్ఞానం బెను తొల్గ జూచు సతతం వీకంబు బొందంగ యా

విజ్ఞానంబును వద్ల కున్న తలికిన్ వీరుండె మాతే నమః


57.)పెక్కుంగం సుతు లున్న తల్లి మమతన్ బెంచంగ యుండంగ దా

పెక్కుంగం మది బాధ యేది అనకన్ పెంచంగ జూడంగ దా

దక్కంగం గను మాన సంబు తనివిన్ దాక్షిణ్య భావంబు దా

చక్కంగం మది గాను చుండు సుతులన్ సంప్రీతి మాతే నమః


58.ఉగ్గంటుం దలి బెట్టు బిడ్డ తినగన్ ఊకొట్టు చుండంగ దా

తగ్గంగం గని దీసి పాత్ర యచటన్ దాజేయు శుభ్రంబు వా

డుగ్గుంనో టన తృవ్వ నంటు ఉముచన్ డుండుంబు శబ్ధంబు నీ

లగ్గంబుం ఇక తప్ప దంటు సుతునిన్ లాలించు మాతే నమః


59.)కక్ష్యంబందున బిడ్డ నెక్క కసరన్ కానంగ లేకుండు దా

కక్ష్యంబందున బిడ్డ నెంతొ ఎలమిన్ కల్గంగ దల్లేను యా

లక్ష్యంబెంతయొ గాన నెత్తు కొనుచున్ లాలించు ప్రేమంబు తో

లక్ష్యంబెంతయొ నెక్కొ నుండ పయసున్ లక్షించు మాతే నమః


60.)అందంబెందును జూడ కుండ సుతుకున్ ఆనంద మొందేను యే

అందంబన్నను ఎర్గ కుండు మమతన్ అందంగ జూస్తుండు దా

బంధంబంతయు ప్రేమ పాశ మనుచున్ బంధించ మాతేను యా

అందంబంతను గాన నుండు ముదమున్ ఆటాడ మాతే నమః


61.)దేవుండే తన కోర్కె దీర్చ సుతులన్ దేహంబు గల్గించె యా

దేవుండే నిక దిక్కు యంటు తలియున్ దేవుణ్ణి ప్రార్తంచు యా

దేవుండే గను సంతు కీర్తి గలుగన్ దేశంబు లన్నింట యా

దేవుండే దమ ఇంటి వేల్పు యనగన్ దెల్వంగ మాతే నమః


62.)నందంతుండును బుట్టి బెర్గ సుతుకున్ నందంతు గోరంగ నా

నందంబెంతయొ గల్గ తల్లి మురియున్ నానంద మొందంగ యా

బంధంబెంతయొ చూడ ముచ్చ టనగన్ భాగ్యంబె గానంగ దా

పొందంగం అతి సౌఖ్య మంటు దనివిన్ పొందంగ మాతే నమః


63.)అందంబంటెను బుత్ర పౌత్ర సుఖముల్ ఆనంద మీయంగ యా

అందంబెంతయొ గాన నుండ మదికిన్ అందించు సౌఖ్యంబు లే

దెందంటుం సుఖ మంటు జూడ మనుమల్ దెల్పంగ భాగ్యంబె యే

బంధంబంతట గాన రాదు తలికిన్ భావ్యంబు మాతే నమః


64.)పప్పన్నంబును బెట్టి తల్లి సుతులన్ పట్టింపు లేకుండ నే

చప్పంగుంటెనె దిన్న శక్తి గలుగన్ చాల్న్యంత మెక్కంగ యా

పప్పన్నంబెను దిన్న గొప్ప పురుషుల్ ప్రాపంచ ప్రఖ్యాతి తో

మెప్పుంబొందుచు నుంద్రు అంటు దెలుపున్ మేలంటు మాతే నమః


65.)బాధంటేనన దెల్వ కుండ సుతులన్ బాగ్యంగ బెంచంగ యా

బాధంటే నన తల్లి దండ్రి సమమున్ భారంబు మోయంగ యా

బాధంటే నన పిల్ల లందు కనగన్ భావ్యంబు గాదంటు యే

బాధంటే నిక దల్వ కుండ నెపుడున్ భాగ్యంబె మాతే నమః


66.) రాముండైనను కృష్ణు డైన తలియున్ రాగంబు బెంచంగ యా

రాముండే నన లోక మందు నయమున్ రాజ్యంబు నేలంగ నా

రాముండేనన తల్లి ప్రేమ గనగన్ రాజిల్లె రాముండె బో

దేముండాయెను మాన వాళి పుడమిన్ దెల్వంగ మాతే నమః


67.)బాలారిష్టపు కాల మందు సుతులన్ బాగుండ జూస్తుండు దా

పేలాలంటును జేసి పెట్టు తినగన్ ప్రేమంబు తోనుంటు దా 

నేలాగుం గను మందు తల్లి తొలుతన్ నేర్చున్నవైద్యంబు చే

యాలంటుండును అక్క రంటు గనగన్ యద్దేని మాతే నమః


68.)అమ్మేనుండగ లోటు లేదు అవనిన్ ఆనంద మంటేను యా

అమ్మేనుం గల జీవి కెర్క అదియున్ ఆరోగ్య భాగ్యంబు యా

అమ్మేనుండగ బత్కు భార మనకన్ అమ్మేను జూస్తుండ యా

అమ్మేనుండను తోష మంటె దెలియున్ హాయంటు మాతే నమః


69.)రాజ్యంబందున గోరు తల్లి సుతులున్ రాజ్యంబు నేలంగ యా

రాజ్యంబందున దాను నిల్వ దలచున్ రాణించ సేమంబు యా

రాజ్యంబంతను ఏల సూను డనగన్ రంజిల్లు చుండంగ యే

భోజ్యంబంటెను గోర దింక మనసున్ భోగించ మాతే నమః


70.)ప్రాణంబందున తీపి లేక తనకున్ ప్రాణంబు సూనుండె దా

ప్రాణంబుం మది నింక దల్చు ననగన్ ప్రాప్తించు ప్రేమంబె యే

కోణంబుం గన నుండ ప్రేమ యనగన్ కోల్పోక నుంటుండ దా

త్రాణంబుం మది దల్చు దల్లి ఎపుడున్ ధర్మంబు మాతే నమః


71.) వేదంబుంనన జద్వ కున్న దెలియున్ భేదంబు జద్వందు యా

వేదంబొందను జూచు చుండు దనయుల్ వేగంబు జద్వంగ దా

బాధెంతో నన చెందు చుండు దలియున్ భాగ్యంగ నుండంగ యా

వేదంబుం యన జద్వి జ్ఞాన మరయన్ పేరొంద మాతే నమః


72.)భానుండుం దన తీక్ష్ణ ధామ మనగన్ భారంగ జూపంగ యా

భానుండుం దన దిక్కు మార్చు వరకున్ భారంగ నూహించి దా

సూనుండుం బని చేయ నుండ గనుచున్ సూచించు మాతేను దా

పోనుండం వల దంటు నాపు బనికిన్ ప్రోథంబు మాతే నమః


73.)కానంగం సుతు డెప్పు డేని సుఖమున్ గల్గంగ నుండంగ దా

ప్రాణంబంతయు తృప్తి గల్గి తలియున్ ప్రాప్తించు సౌఖ్యంబు తో 

దానంబెంతయొ జేయు చుండు నదియున్ ధర్మంబు అంటుండు యా

దానంబే తమ యింట సౌఖ్య మనగన్ తారాడు మాతే నమః


74.)భారంబేదియు మోయ నీక తనకున్ భారంబు గానుండ యా

భారంబంతయు తాను మోయు తలియున్ భాగ్యంబు గానంచు యా

భారంబంతయు తాము మోయ సుతులున్ భాగ్యంబు అంటుండ యే

భారంబుం ఇక యెర్గ కుంద్రు ఎవరున్ పంటందు మాతే నమః


75.)తల్లంటే ఇల దైవ మేను తనయుల్ దామెంతొ కీర్తించ నా

తల్లంటే జగ మందు సర్వ జనులున్ తాదాత్మ్య బొందంగ నా

తల్లంటే కన యెంతొ సర్వ సుఖముల్ ధాత్రేయి నందుండ యా

తల్లంటే ఇల లోనె స్వర్గ సుఖముల్ దక్కంగ మాతే నమః


76.)తల్లుండంగను పిల్ల లందు అతిగన్ త్రాణంబు భావంబు యా

తల్లుండంగనె ప్రేమ పాశ మనగన్ తాదాత్మ్య మొందంగ యా

తల్లేయింకను కాను చుండు సుతులన్ దానెంతొ తన్వొంది యా

తల్లేలేకను పృథ్వి నందు నలకల్ తారాడు మాతే నమః


77.)భాషాయోషను భక్తి గొల్చి చదువుల్ భాగ్యంబు బొందంగ యా

భాషాయోషను నిత్తె దల్చి సుతులున్ భాష్యంబు జద్వంగ యా

భాషాయోషయె మెచ్చ పెక్కు చదువుల్ భారంబు గాకుండు దా

నాషామాషిగ దల్వ కుండ తలియున్ నంపంగ మాతే నమః


78.)మోసంబెంతయు నేర్వ కుండ సుతులన్ మోదంబు బెంచంగ దా

శాసించుం ఇక నేర్వ మంచి గుణముల్ శానాగ బొందంగ యే

మోసంబుం దరి జేర కుండ తలియున్ మోమాట బోదింక దా

నాసించిం దన సంతు బెంచు ప్రతిభన్ నార్జించ మాతే నమః


79.)నారీలోకము గాన నుండ దమకున్ నానంద మంటేను యా

శారీరంబున నొక్క సంతు గలుగన్ శాంతించ దామింక యే

భారీగుండెడు కోర్కె కోర మనుచున్ భాగ్యంబు సంతేను గా

వారేయింకను బత్కు కాంక్ష యనుచున్ భావించు మాతే నమః


80.)సారంగంబున తల్లి గోరు తనయుల్ సావాస దోషంబు వా

రేరంగంబున నెర్గ కుండ బెరుగన్ రేయందు మాపందు వా

రారంగంబున బుద్ధి గల్గి ఎపుడున్ రాజిల్ల పోరాడి యా

భారంబంతయు తల్లి స్వస్తి యనుచున్ భాగ్యంగ మాతే నమః


81.)అత్యంతంగను నెమ్మి బంచి సుతులన్ అగ్రంగ నిల్చుండ దా

నిత్యంబెంతయు ఇక్కు పాటు పడుచున్ నిక్కంబు తల్లేను దా

నత్యంతంగను సంతు యందు మదికిన్ నానంద మొందంగ యా

సత్యంబంటెను తల్లి బిడ్డ లనగన్ సౌలభ్య మాతే నమః


82.)తామేగొప్పని కొడ్కు బిడ్డ లనగన్ తల్లింక వారించు ఓ

రామాగానుము నాదు బిడ్డ లనగన్ రాద్ధంత మేదేని దా

మేమాత్రంబును జేయ కుండు నటులన్ మేలొంద నుండంగ యో 

రామాదీవన లీయ గోరు సుతులన్ రక్షించ మాతే నమః


83.)బుగ్గందుం తలి ముద్దు పెట్టు కొనుచున్ బుడ్డోడి జూస్తుండు దా

తగ్గంబోకను పెక్కు మార్లు తనయున్ దానింక ప్రేమంబు తో

సిగ్గుంజెందగ బాలు జూచి తనివిన్ సింగార మేజేసి నీ

లగ్గంబింకను చూడు కొడ్క అనుచున్ లాలించు మాతే నమః


84.)పర్వంబంటును పాయ సంబు తనయుల్ పానంబు సేయంగ దా

బర్వంటేమియు దల్వ కుండ ముదమున్ భాగ్యంబు అంటుండు దా

సర్వస్వంబుయు సంతు యంటు తలియున్ సంతోష మొందంగ దా

వెర్వంగం వ్యయ మంటు జూడ దయినన్ వేడ్కంటు మాతే నమః


85.)ఆకాశంబున చంద్రు జూపి సుతుడున్ ఆనంద ముప్పొంగ దా

బోకార్చంగను బూను కొడ్కు క్షుదయున్ బోరెంతొ బెట్టంగ దా

నాకాస్తం దిన నుండ దృప్తి యవగన్ నానంద మొందంగ దా

నాకాశం బన నంది నట్టు దలుచున్ నాతల్లి మాతే నమః


86.)భావావేశము లేక యుండ సుతులన్ భావంబు నందుండి దా

సేవాబావము దిక్కు మార్చు తలియున్ సేమంబు గానుండ నే

సావాసంబును కూడ దంటు దెలుపున్ సంభిన్న వృత్తుండు యే

భావంబైనను వద్దు అంటు దెలుపున్ భాగ్యంబు మాతే నమః


87.)గొప్పంగం దము జెప్పు కోను దలువన్ కోపించు తల్లేను యా

తప్పంటుం నిక జేయ వద్దు అనుచున్ తానెంతొ జెప్పంగ యా

తప్పింకం దము జేయ మంటు దనయుల్ తగ్గంగ యుంటుండ దా

చెప్పంగం విన నుండ తల్లి మనసున్ సేమంబె మాతే నమః


88.)దేశంబందున గాన నుండ మనకున్ దేవుండ్లు జాస్తేను యే

దేశంబుందున గాన తల్లి యనగన్ దెల్వంగ దేవుండె యే

మాశించంగను నుండ బోదు గనగన్ మాతేను జూడంగ దా

నాశించంగన ఒక్కటేను సుతులున్ నందించ మాతే నమః


89.)బాధేమైనను కొడ్కు బిడ్డ లనగన్ భాగ్యంబు అంటుండు దా

బాధేదైనను సంతు సేమ మనుచున్ భద్రంబె భావించు యా

రాధేయుండిని కుంతి యెంత మనసున్ రాగంబు ఉప్పొంగ దా

ప్రాధేయం బడు రీతి దల్చి తలియున్ ప్రార్థించు మాతే నమః


90.)బంగారంబును గోర బోదు తలియున్ భాగ్యంబు అంటేను యా

బంగారంబన కొడ్కు బిడ్డె అనగన్ భారీగ దల్వంగ యే

బంగారంబుయు సాటి రాదు అనుచున్ భాషించు తెల్లేను దా

పొంగారింకను పుత్ర పౌత్ర లనగన్ పోషించ మాతే నమః


91.)ఏదేశంబును ఏగ నుండ సుతులున్ ఎర్గంగ జెప్పేది దా

నాదేశంబెను గొప్ప దంటు దెలుపన్ నానంద మొందేది దా

నాదేశించిన తల్లి యేను పుడమిన్ నందంతు మెచ్చంగ మా

ప్రాదేశంబన సాటి రారు అనగన్ ప్రజ్ఞేను మాతే నమః



92.)ఆనందంబన దల్లి జెందు సుతులున్ ఆజ్ఞాను సారంబు దా

కానంగం సుత సూను లిర్వు రనగన్ గన్పించ ఐక్యంబు తో

పూనంగం గృహ మందు అన్ని పనులన్ పూరించ నుండంగ దా

నానందంబుకు హద్దు లేదు అనగన్ అమ్మేను మాతే నమః


93.)సూనుండెంతయొ సౌఖ్య మొంద తలియున్ జూస్తుండ దృప్తేను బో

దానుండంగను కొడ్కు బిడ్డ లనగన్ ధర్మంబు పాటించ గా

ఆనందంబని తన్వి తోడ గనగన్ ఆహ్లాద మంటుండు ఆ

శ్రీనాథుండెను రక్ష కుండు అనుచున్ జీవించు మాతే నమః


94.) ఏతల్లిం గన చంక నందు సుతుడిన్ ఎత్తంగ నుండంగ నే

యాతల్లింకను కొడ్కు దింపు టనగన్ యత్నించ బోకుండు నే

ఆతల్లిం గన నుండ ప్రీతి దలుచున్ అబ్బాయి చంకందు నే

మూతింముడ్చుచు చీర దడ్పి కులుకన్ ముద్దేను మాతే నమః


95.)స్వీకారంబయి పెక్కు కాల మవగన్ స్వీయంగ సంతంటు దా

సాకారంబును పొంద బోక సఖియున్ సంతాప మొందంగ దా

నాకాయస్తుడి మ్రొక్కు చుండు దనకున్ నందంతు నీయంగ దా

సాకారంబును జెంద సూను గనుచున్ సంప్రీతె మాతే నమః


96.)ప్రాణంబంటెను లెక్క లేదు తనకున్ బ్రాణంబు సూనుండె దా

ప్రాణంబెంతయొ బెట్టి పోష ణనుచున్ ప్రాయంబు దాకుండ దా

ప్రాణంబుం దన కుండు దాక సుతులన్ ప్రాణంగ జూస్తుండు దా

ప్రాణంబంతయు సూను వృద్ధి కొరకున్ ప్రాధాన్య మాతే నమః


97.)అన్నంబెక్కువ దిన్న దిష్టి యనుచున్ ఆతల్లి దీనంగ దా

అన్నంబెట్టుచు చూడ బోదు సుతులన్ ఆకాస్త మెక్కంగ దా

నెన్నండుం గన బోదు ముందు మనమున్ నెర్గంగ నుండంగ దా

తిన్నంతం దిన దిష్టి దీయు పటువున్ దిప్పేసి మాతే నమః


98.)పొద్దెక్కంగను కొడ్కు ఇంక నిదురన్ బోవంగ నుండంగ దా

గద్దించుం సుతు లెమ్ము అంటు మనసున్ గాయంబు గాకుండ నే

సద్దింకం దను సిద్ధ బర్చు సుతుడున్ సాపాటు జేయంగ దా

జిద్దింకం దలు వంగ బోవ తలియున్ చింతించు మాతే నమః


99.)కాదేదీ తన ప్రేమ కడ్డు యనుచున్ కారుణ్య భావంబు తో

బాధేదీ యన కుండ తల్లి సుతులన్ భాగ్యంగ జూస్తుండు దా

పూదేనెం దిని పించు తీపి గనగన్ పుత్రుండు గోరంగ దా

నేదేనీ అడు గంగ నీయ దలుచున్ నెయ్యంబు మాతే నమః 


100.)ఆదాయం బన లేక యుండి సుతుడున్ ఆర్జించ బూనంగ నే

ప్రాధాన్యంబును ఈయ కుండ గడుపన్ ప్రారబ్ధ మంటుండు దా

నాదాయంబును సేక రించ దలుచున్ నన్యంబు దల్వంగ కే

ఏదోరీతిన తాను తండ్రి ఇరువుర్ ఎర్గంగ మాతే నమః


101.)నందంతిం గని తల్లి ఆత్మ యనగన్ నానంద మొందంగ యా

నందంతిం దను బెంచు చుండు విధమున్ న్యాయంగ నుండంగ యా

నందంతిం దను యేది గోర నొసగున్ నందంబు గల్గంగ దా

నందంతిం గను చుండు పెర్గు టనగన్ నచ్చంగ మాతే నమః


102.)బంధంబెంతయొ బెంచు కోని సుతులన్ బాగుండ జూస్తుండు యా

బంధంబంటెను బెంచు చుండ బెరుగన్ భాగ్యంబు గానుండ యా

బంధంబంటెను గుండె నిండ తలికిన్ భద్రంగ గానంగ యా

బంధంబే నన తల్లి తండ్రి గనగన్ బాగుండ మాతే నమః


103.)పొంగారంగను కొడ్కు కోడ లనగన్ పొంగేను తల్లేను యా

బంగారంబగు జంట కంట గనగన్ భాగ్యంబు అంటుండు యే

కంగారుంగన కుండ నింట మెలగన్ కానుండు సౌఖ్యంబు దా

బంగారంబును కోడ లడ్గ కొనగన్ భావంబె మాతే నమః


104.)నానాయాతన జెందు చుండి సుతులన్ నానంద పర్చంగ దా

శానాకాలము కష్ట మొంది తనకున్ శక్తంత గోల్పోవ దా

నేనాడుం దిగు లొందబోదు తలియున్ నేమంత ధైర్యంబు దా

బోనాడం గన బోదు కొడ్కు లనగన్ పొందేను మాతే నమః


105.)ఏదేనిం బని జెప్ప చేయ నుసులన్ ఎర్గంగ తల్లేను దా

ప్రాధేయం బడ కుండ నుండి సుతుకున్ ప్రాధాన్య మీకుండు దా

బాధేనుం బడ కుండ జేయు పనులన్ బాధ్యత్వ మంటుండి దా

కాదేదంటును వీడ కుండు దలువన్ కార్యంబు మాతే నమః 


106.)ఏరంగంబున వృద్ధి లేక తనయున్ ఎర్గంగ తల్లేను దా

సారంగంబున నెన్నొ నుండు ననుచున్ సాధించు సూనుండు దా

యేరంగం బునొ నేర్పు పొందు ననుచున్ యేర్పాటు జేయంగ దా

మారంగం గని తల్లి యేను మమతన్ మాటాడు మాతే నమః


107.)బాబాలంటును నమ్మి దిర్గ సుతుకున్ భావ్యంబు గాదంటు యే

బాబాలందును మేటి లేదు అనుచున్ వారించు తల్లేను యా

బాబాలంటును దిర్గ కున్న మనకున్ భాగ్యంబె అంటుండు యా

బాబాలంటెను టక్కు లంటు మదికిన్ భావించ మాతే నమః


108.)తల్లేనుండగ మన్షి బత్కు కనగన్ తానొందు సౌఖ్యంబు యా

తల్లేనుండగ యేది లోప మనకన్ తానింక సేమంబె యా

తల్లేనుండగ తోడి చూలు తనుయున్ తండ్రింక బాగేను యా

తల్లేనుండగ ఇంటి యందు గలుగన్ ధర్మంబు మాతే నమః

        

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


Comments


bottom of page