top of page

గదిలో వారు ఇద్దరూ



'Gadilo Varu Iddaru' - New Telugu Story Written By Sivajyothi

Published In manatelugukathalu.com On 20/07/2024

'గదిలో వారు ఇద్దరూ' తెలుగు కథ

రచన: శివ జ్యోతి


ఒక అబ్బాయి చాలా ధనవంతుడు. అమ్మాయి మిడిల్ క్లాస్. అమ్మాయి ఇంజినీరింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది. అబ్బాయి ఆ కాలేజీని అప్పుడే కొనుక్కున్నాడు. 


అమ్మాయి కాలేజీకి వెళ్లి వస్తూ ఉంది. అబ్బాయి ఆ క్లాస్ లో చేరాడు. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని గమనిస్తూ ఉన్నాడు. అమ్మాయి అతడిని అందరిలో ఒక్కడు లా, మిగతా స్టూడెంట్స్ లానే చూస్తూ ఉంది. తనకు ఆ కాలేజీ అబ్బాయిది అని తెలీక అబ్బాయిని ప్రత్యేకంగా గమనించలేదు


అబ్బాయి ఒక రోజు హఠాత్తుగా బోర్డు దగ్గరకు వెళ్ళాడు.. లెక్చరర్ బయటకి వెళ్ళాడు. తరగతి విద్యార్థులు అతని వెంట అంతా బయటకు వెళ్లి పోయారు. 


అందరితో కలసి వెళ్లిపోతున్న పక్క అమ్మాయిని “ఎందుకు వెళ్లిపోతున్నావూ?” అని అడిగింది. 


“ఇలా వెళితే ఫీజు తగ్గిస్తాము అని అన్నారు. భయపడకు సేఫ్ గానే ఉంటా”వని చెప్పారు.. అబ్బాయి అమ్మాయి మాత్రమే ఉన్నారు. అమ్మాయీ వెళ్ళబోయింది. తలుపులు మూసుకున్నాయి. బయట నుండి తాళం పడింది. అమ్మాయి గాభరా పడింది. 


అబ్బాయి ఒక రోజా పువ్వు తెచ్చి


‘సుదూర తీరాన సంతోషాన్ని ఆకాశమంత ముంతలో పట్టి నీకిస్తా

మధుమాసం పరిమళాన్ని మల్లెలతో కలిపి పూయిస్తా

మంచ లోన మంచిమసుతో తోడుంటా

మరుజన్మ లోను నిన్నే కోరుకుంటా’నని చెప్పాడు.


 ఇద్దరూ సైలెంట్ గా ఎవరి బెంచస్లో వారు కూర్చుంటారు. ఓక నిముషం తరువాత తలుపులు తెరిచారు. లెక్చరర్ వచ్చి క్లాసులు తీసుకున్నాడు. అబ్బాయి ప్రతి క్లాస్ తర్వాత ఒక రోజా పువ్వు తెచ్చి అమ్మాయి బెంచ్ మీద పెడుతున్నాడు. 


 మరో క్లాస్ మళ్లీ అదే తంతు. కాలేజ్ క్లాస్ టైమింగ్స్ ముగిసాయి. అమ్మాయి ఇల్లు చేరింది. అమ్మ నాన్నకు చెప్పాలనుకుంది, చెప్పినా ఏమి జరుగుతుంది అని ఆలోచించింది. 


 ఇంట్లో ఆరుస్తారు, గొడవ చేస్తారు. కాలేజీ లో పెద్దగా ఎవరు లెక్క చేయరు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పట్టించుకోరు. షీ టీమ్స్ కు ఫిర్యాదు ఇస్తారు. కౌన్సెలింగ్ చేస్తారు. పరిస్థితుల్లో మార్పు వచ్చేంత పెద్ద తప్పు కాదంటారు. చివరికి తన చదువు నిలిపేసి పెళ్లి చేస్తారు. 


సంపద ఉన్న వారితో గొడవ వస్తే తామే నష్ట పోతామని, ఇదంతా ఎందుకు అని, ఆలోచించి చూద్దాం, ఏమి జరుగుతుందో అనుకుంటూ గుబులుతో గాభరా గానే కాలేజీకి వెళ్లిపోయింది. సంవత్సరం అంతా ఇలాగే గడచింది. నెక్స్ట్ సెమ్ కుడా అలాగే, తర్వాతది కుడా అంతే. 


 నాలుగు సంవత్సరములు ఇలాగే గడిచాయి. అబ్బాయి అతనయ్యాడు. అమ్మాయీ ఆమె అయింది. ఆమె అతని ఉద్దేశాలను అర్థం చేసుకుంది. 


 వీడ్కోలు పార్టీ ప్రత్యేకంగా వారిద్దరికే ఘనంగా ఏర్పటు చేసారు. మిగిలిన వారికి మరో రోజు ఏర్పాటు చేసారు. పాసౌట్ అయ్యి బయటకు వచ్చింది. మాంచి కంపెనీలో జాబ్ వచ్చింది. అమ్మయ్య అని అనుకుంటుంది. అమ్మ నాన్నలతో కళాశాలలో జరుగు విషయం చెప్పింది. సరేలేమ్మా ఐపోయిందిగా, నువ్వు ఏమి పట్టించుకోకు అని అన్నారు. 


అతడు ఆ కంపెనీని కూడా కొన్నాడు. వారాంతపు పార్టీ ఆహ్వానం పంపింది సంస్థ. మిగతా వారిని పిలుస్తారేమో అని అనుకోని వచ్చింది ఆమె. కాని మళ్లీ వారిద్దరే. మళ్లీ అదే తంతు. వారిద్దరే కలిసి పని చేస్తున్నారు. జీవితం మళ్లీ అలాగే అని మళ్లీ అనుకుంటుంది. 


 అమ్మా నాన్నకు ఈ విషయం కూడా చెప్పింది. వారు అతనితో మాట్లాడి వద్దాం అని ఆతని దగ్గరికి వెళ్ళారు. ఆతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 


 ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని అడిగారు. తనని స్పెషల్ గా ట్రీట్ చేయటం ఆమెకు కూడా నచ్చింది. అయితే ఇంత చేసిన వాడు ఒప్పుకుంటే ఏమైనా చేయగలడని కొంత భయం. 


మొండి ధైర్యం తో వద్దని అంది. చిత్రంగా, అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. మరియు కాలములో కొట్టుకుపోయాడు అని అనేంత మరుగయ్యాడు. మదిలో ఒక్కసారిగా కోటి వీణలు మోగాయి. గాలి అతని పరిమళం ఆమె వరకు మోసుకొచ్చింది అని అనిపించింది. ఒప్పుకుంది. పెళ్లి ఏర్పాట్లు చేసారు. పెళ్లి ఐపోయింది.


 గదిలో వారిద్దరూ... 

***

శివ జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం:

నా పేరు శివ జ్యోతి . నేను హైదరాబాద్ వాస్తవ్యురాలిని. నాకు రచనలపై ఉన్న ఆసక్తితో కథలు రాయడం కవితలు రాయటం మొదలు పెట్టాను . నాకు సమాజంలో జరిగే అన్యాయాలను ఆసక్తికరంగా రాయడం అంటే ఇష్టము. నా రచనలు పాఠకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.


Kommentare


bottom of page