top of page

గేటెడ్ కమ్యూనిటీ - పార్ట్ 2



'Gated Community - Part 2/2' - New Telugu Story Written By Mohana Krishna Tata 

Published In manatelugukathalu.com On 24/03/2024 

'గేటెడ్ కమ్యూనిటీ - పార్ట్ 2/2' తెలుగు పెద్ద కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


గేటెడ్ కమ్యూనిటీ లో సరళ, సరిత, శాంతి ముగ్గురు కొత్తగా ఫ్లాట్స్ కొంటారు. ఒక్కొక్కరిది ఒక భిన్నమైన మనస్తత్వం. రోజూ పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించడానికి అందరూ కలుస్తారు. ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఒక్కోకరిది ఒక్కో కథ. 


గేటెడ్ కమ్యూనిటీ - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఇక గేటెడ్ కమ్యూనిటీ పెద్దకథ చివరి భాగం చదవండి.. 


మర్నాడు.. కొంచం మబ్బుగా ఉండడం తో, స్కూల్ బస్సు కాస్త ఆలస్యం గా వచ్చింది. అందరూ బస్సు షెల్టర్ లో స్కూల్ బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. పిల్లలేమో.. గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. ఈలోపు ఒకతను.. 'హలో.. ! నా పేరు సతీష్.. నాది గ్రౌండ్ ఫ్లోర్'.. అని అందర్నీ పలకరిస్తున్నాడు. అక్కడ ఉన్నది అందరూ ఆడవారే. ఒకే కమ్యూనిటీ అవడం చేత.. మొహమాటం చేత సరిత 'నో' అనలేక.. 'హాయ్' చెప్పింది. సరళ మాత్రం నవ్వుతూ 'హాయ్' చెప్పింది. శాంతి పట్టించుకోకుండా.. తన పని చూసుకుంది. 


ఆ రోజు శాంతికి పని ఉండడం చేత ముందే వెళ్లిపోయింది.. సరళ, సరిత.. ఇద్దరూ లిఫ్ట్ దగ్గరకు వస్తున్నారు.. అప్పుడు సరిత.. 


"సరళ.. ! ఒక మాట అడుగుతాను.. ఏమీ అనుకోరుగా.. ?"

"చెప్పండి సరిత.. ! "

"మీరు చూడడానికి ఇంపుగా, అందంగా ఉంటారు.. ఇలా నైటీ తో బయటకు రావడం బాగోలేదు! చూస్తున్నారు కదా!.. మగవాళ్ళు వస్తున్నారు స్కూల్ బస్సు ఎక్కించడానికి.. మీరు ఏమో గల గలా మాట్లాడుతారు.. అందర్నీ ఆకర్షిస్తారు కూడా. ఎంత గేటెడ్ కమ్యూనిటీ అయినా, లోపల ఉండే వారు ఎలాంటి వారో తెలియదు కదండీ!"


"నిజమే!.. మీరైతే చుడీదార్ వేసుకుంటారు.. శాంతి గారు.. లక్షణంగా చీర లో వస్తారు.. మీ కంత టైం ఎలా ఉంటుందో? నాకైతే, మా అబ్బాయి తోనే సరిపోతుంది.. బట్టలు మార్చడానికి టైం ఎక్కడ నుండి వస్తుంది చెప్పండి?"


"ఏమో చెప్పాలనిపించింది.. అంతే!" 

"థాంక్స్ సరిత.. "


రోజూ, ఇలానే, ముగ్గురు కలిసి మాట్లాడుకునే వారు.. తొందరగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు.. 


"మనం ఈవెనింగ్ వాక్ కు వెళదాం, వస్తారా?.. " అని సరళ అడిగింది ఇద్దరి ఫ్రెండ్స్ ని.. 

"నాకైతే వర్క్ ఉందండి.. నేను రాలేను.. " అంది శాంతి


"మీరు వర్కింగ్ కదా.. మర్చిపోయాను.. " అంది సరళ

"నేను ఈవెనింగ్ వాక్ కు వస్తానండి.. మా పిల్లల్ని సాయంత్రం ఆడించాలి.. "


"ఓకే.. సరిత"


అలా, రోజూ సాయంత్రం.. సరళ, సరిత వాళ్ళ పిల్లలతో లోపల ఉన్న పార్క్ లో కలిసేవారు.. పిల్లలు ఆడుకునేవాళ్ళు.. "

"సరళ! ఈవెనింగ్ వాతావరణం బాగుంది కదా!.. "

"అవును సరిత.. "

"నేను బండి నేర్చుకుందాం అనుకుంటున్నాను!.. దానికన్నా ముందు సైకిల్ నేర్చుకోవాలండి. మా అబ్బాయి సైకిల్ తో రేపటి నుంచి మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను. బండి నడపడం వచ్చాక, ఇక్కడకు దగ్గర్లో మందుల షాప్ పెడదామని ఆలోచన ఉందండి. ప్రతిదానికి మొగుడు మీద ఆధారపడాల్సి వస్తోంది కదండీ" అంది సరళ


"మంచి ఆలోచన సరళ.. !"

"నీ గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు సరిత.. ? మీ ఫ్యామిలీ గురించి.. ? " అడిగింది సరళ 


"మా వారు నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. నేనంటే చాలా ఇష్టం. నేను కష్టపడితే అస్సలు చూడలేరు. అందుకే, ఇంట్లో అన్నింటికీ మెషిన్లు ఉన్నాయి. మా అత్తగారు చాలా మంచివారు. ఇంట్లో వంటపనిలో ఆవిడ చాలా హెల్ప్ చేస్తారు. మా ఆయన నాకు అన్ని జాగ్రత్తలు చెబుతారు. ఆయన చెప్పినవి వింటూ.. లైఫ్ హ్యాపీ గా గడిపేస్తున్నాను.. "


"ప్రేమించే భర్త.. సాయం చేసే అత్తగారు.. నువ్వు చాలా లక్కీ సరిత.. !"


రోజూ సతీష్ అందరితో మాటలు కలుపుతున్నాడు.. 


సరళ.. సతీష్ గురించి తన భర్త తో మాటలలో చెప్పింది.. 


"నువ్వు ఎవరికీ చనువు ఇవ్వొద్దు సరళ!" అని తన పని చూసుకున్నాడు.. సంతోష్


సరళ.. వాళ్ళ ఆయనతో ఏదో దానికి రోజు గొడవ పడుతూ ఉండేది.. ఒక సారి వర్షంలో గొడుగు మరిచిపోయినందుకు, ఇంకో సారి సన్నీ ఐడెంటిటీ కార్డు, మరో సారి లేట్ అయ్యిందని.. అందుకే, సరళ అన్ని విషయాలు సంతోష్ కు చెప్పడం మానేసింది.. 


రోజు ఇద్దరు గొడవ పడడం.. కింద ఫ్లాట్ బాల్కనీ లోంచి సతీష్ చూస్తున్నాడు.. సరళ బాల్కనీ లోంచి బయట వచ్చి సతీష్ కు 'హాయ్' చెప్పింది.. మామూలుగానే అందరితో మాట్లాడే స్వభావం ఉన్న సరళ.. 


"ఏమిటి ఈ రోజు స్కూల్ బస్సు ఎక్కించడానికి రాలేదు?"

"వర్క్ ఉంది రాలేదండి!" అన్నాడు సతీష్


ఇద్దరి బాల్కనీలు ఎదురుగా ఉంటాయి. ఇలా ఉండగా.. సరళ హస్బెండ్ ఆఫీస్ పని మీద త్రీ డేస్ క్యాంపు వెళ్ళాడు. ఈ విషయం, గట్టి గట్టిగా సరళ తన ఫ్రెండ్స్ తో చెప్పడం విన్నాడు సతీష్. ఇదే టైం అనుకోని.. సరళ బండి నేర్చుకోడానికి బయటకు వచ్చినప్పుడు కిడ్నాప్ చేసి.. దగ్గరలో ఉన్న బిల్డింగ్ లో బంధించి ఉంచాడు సతీష్. 


"ఒరేయ్ సతీష్! నన్ను ఎందుకు ఇక్కడకు తీసుకొచ్చావు.. నువ్వు చాలా మంచివాడేమో అనుకున్నాను? నువ్వు ఇలాంటి వాడివా?.. మా ఫ్రెండ్ చెప్పినా వినలేదు.. గేటెడ్ కమ్యూనిటీ లో నీలాంటి వాళ్ళు కూడా ఉంటారని ఊహించలేదు. నీకేమిటి కావాలి? నన్ను బంధిస్తే.. ఏం వస్తుంది నీకు? నాకు పెళ్లయింది తెలుసా? మా ఆయనకు తెలిస్తే ఊరుకోరు.. "


"ఆపవే సరళ! ఎప్పుడూ లొడ లొడ వాగుతావు. నీ ఫ్రెండ్స్ చూడు.. ఎంత కూల్ గా ఉంటారో!.. శాంతి గారైతే, తన పని తాను చూసుకుంటుంది. ఇలా నువ్వు.. లొడ లొడ వాగడం వలనే నాకు నచ్చలేదు.. "


"నేను ఎక్కువ మాట్లాడితే.. నీకేంటి బాధ?" కోపంగా అంది సరళ 


"అది తెలియాలంటే.. నా స్టోరీ నీకు చెప్పాలి. ఎలాగా.. రెండు రోజుల్లో నిన్ను చంపేస్తానుగా.. నిజం చెప్పినా.. పర్వాలేదు లే.. !"


"నేను పూజ ను చాలా ఎక్కువగా ప్రేమించాను. పూజ నీలాగే.. చాలా గల గల మాట్లాడుతుంది. అందంగా ఉంటుంది. చాలా నమ్మాను నా పూజ ని. కానీ అది వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకుంది. నన్ను పట్టించుకోలేదు.. అందుకే చంపేసాను.. "


"నువ్వు చూస్తే.. పెద్ద శాడిస్ట్ లాగా ఉన్నవే.. ! కోపంగా అంది సరళ

"అవును.. శాడిస్ట్ నే.. నువ్వు ఎలా అనుకుంటే అలా.. ! అప్పటినుంచీ.. అలా గల గలా మాట్లాడే అమ్మాయిలను చూస్తే, నాకు నచ్చదు. ఇలాగే.. కిడ్నాప్ చేసి చంపేస్తాను. ఇప్పుడు నీ వంతు.. "


భార్య కనిపించడం లేదని సంతోష్ అందర్నీ అడుగుతున్నాడు. ఇంకా ఆ కమ్యూనిటీ లో సీసీటీవీ పెట్టలేదు.. అదే అడ్వాంటేజ్ అయ్యింది సతీష్ కు. రోజూ.. సరళ ఎక్కడ బండి నేర్చుకుంటుందో.. తనకి చెబుతుందని ఫ్రెండ్ సరిత చెప్పింది. సంతోష్ అక్కడకు వెళ్ళి.. ఎంక్వయిరీ చేస్తే.. కిడ్నాప్ చేసిన ప్లేస్ దొరికింది. లోపలికి వెళ్ళి.. సరళ ను తాళ్ళతో బంధించి ఉండడం చూసాడు. సంతోష్ ను చూసి, సరళ కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెంటనే కట్లు విప్పాడు సంతోష్.. 


"ఏమండీ! నన్ను ఆ సతీష్ కిడ్నాప్ చేసాడండీ!.. వాడిని చంపేయండి!.. మీ మాట విని ఉండాల్సింది.. అందుకే నాకు ఇలా జరిగింది.. "


"ఊరుకో సరళ.. నేను చూసుకుంటాను లే.. ! నిన్ను కాపాడడానికి మీ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేసారు.. " అన్నాడు సంతోష్ 


పోలీసుల సాయం తో.. సతీష్ ను ట్రేస్ చేసి.. జైలు కు పంపించారు. అప్పటినుంచి.. సరళ తన భర్త మాట వింటూ.. హ్యాపీ గా ఉంది. ఆ తరువాత, ఆ గేటెడ్ కమ్యూనిటీ లో సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ చేశారు. 


=================================================================================

  సమాప్తం

=================================================================================

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


104 views0 comments

Comments


bottom of page