top of page

గోలీ సోడా.. జిల్ జిల్ సోడా

#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #గోలీసోడా, #జిల్జిల్సోడా, #GoliSod JILJilSoda

ree

Goli Soda JIL Jil Soda - New Telugu Article Written By Bhallamudi Nagaraju

Published In manatelugukathalu.com On 23/04/2025

గోలీ సోడా జిల్ జిల్ సోడా - తెలుగు వ్యాసం

రచన: భళ్లమూడి నాగరాజు


ఆ రోజుల్లో సోడా తాగని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో పిల్లలు, పెద్దలు, పేదలు ఇలా అందరికీ అందుబాటులో ఉండే చల్లని పానీయం. 


మూడు పైసలు, అణా, బేడ, పావలా, రూపాయి ధర పలికేది. ఆతరువాత 10 రూపాయలు ధరవరకూ ఎదిగింది. సోడా బండీ కో ప్రత్యేకత ఉండేది. అరలు అరలు గా ఉండే బండీ లో గోలీ సోడాలు రివర్స్ లో వేసుకొని, అవి చల్లగా ఉండటం కోసం తడిపిన గోనె బస్తా వేసి ఉంచేవారు. ఆకు పచ్చని గాజు సీసాలో నింపిన నీరు, గ్యాస్ తో నిండి, గుండ్రని గోలీ నీరు బయటకు రాకుండా లాక్ చేసివుండేది. 


సోడా తాగాలంటే గోలీ కొట్టాలి. గోలీ కొట్టడం ఒక కళ. ఎడమ చేత్తో ఒడుపుగా సీసాని పట్టుకొని కుడి చేతి బొటన వేలు గోలీ మీద పెట్టి కిసిక్ మని కొడితే ఆ వచ్చే సౌండే వేరబ్బా. గోలీ.. సీసాలోకి వెళ్లి, గ్యాస్ బయటకు చిన్న మంచు పొగలా రావడమే కాక చుట్టూ తుళ్ళే నీటిరేణువులు శరీరాన్ని తాకేసరికి పులకింత అయ్యేది. 


సీసాలోంచి చల్లని నీరు గొంతు దాటి కడుపులోకి వెళ్లే సరికి బ్రేవ్.. మని వచ్చే తేన్పులు సంతృప్తి నిచ్చేవి. ఆరోజుల్లో పిల్లలు కడుపు లో నొప్పి వస్తోంది అంటే చాలు గోలీ సోడా తెప్పించి పట్టేవారు. అత్తవారింటికి వచ్చిన అల్లుడు కడుపు నిండా భోజనం చేసిన వెంటనే అలా వెళ్లి ఓ సోడా తాగి వచ్చేవాడంటే నమ్మాల్సిందే. 


గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవారి పండగలు, జాతర్ల లో సోడా అమ్మకాలదే పై చేయి. గోలీ సోడా లు అంటే సినీ కవులకు భలే ఇష్టం. వీటి మీద సోడా.. సోడా ఆంధ్ర సోడా అంటూ పాటలు కూడా రాసేరు. పాత సినిమా వీధి యుద్దాల్లో సోడా సీసాలే మారణాయుధాలు. సోడా సీసాలు పైకి ఎగరేస్తూ ఇంకో సీసాతో టపీ మని కొట్టేసరికి వజ్రం ముక్కల్లా, చుర కత్తుల్లా ప్రత్యర్థి కి గుచ్చుకొనేసరికి సినిమా హాల్లో ఈలలు.. గోలలు విని పించేవి. అనేక సినిమాల్లో ఈ సీసాలాతోనే ఫైటింగ్ సీన్లు నడిచేవి. 


వీధుల్లో 144 సెక్షన్ విధించేవారంటే ముందుగా సోడా అమ్మేవార్ని తరిమి కొట్టేవారు. వేసవి వచ్చిందంటే చాలు నిమ్మ సోడా, సాల్ట్ సోడా, ఐస్ సోడా లకు భలే గిరాకీ ఉండేది. కాల ప్రవాహం లో షోడా అమ్మకాలు కనుమరుగు అయిపోయి ఇప్పుడు రూపం మార్చుకొని పునర్జన్మ ఎత్త, సోడా తల్లి మరలా మన ముందుకు వచ్చింది. 


గాజు సీసాలు మారణా యుధాలు అన్న చెడ్డ పేరు మూట కట్టుకోవడం తో ఇప్పుడు ప్లాస్టిక్ సీసాలో వచ్చింది. యువత కు ఉపాది బాట వేసింది సోడా తల్లి. 


జై గోలీ సోడా.. జై జై గోలీ సోడా 🙏

సరదాగా మీకోసం 🙏

***

భళ్లమూడి నాగరాజు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నా పేరు భళ్లమూడి నాగరాజు, రాయగడ ,ఒడిశా లో ఉంటున్నాను. ఇప్పటి వరకు 30కథలు వివిధ వార,మాస పత్రికల్లో ప్రచురితం అయ్యాయి సుమారు వంద కవితలు ప్రచురితం

コメント


bottom of page