top of page
Original.png

గౌరవం తక్కువే

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #గౌరవంతక్కువే, #GouravamTakkuve, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Gouravam Takkuve - New Telugu Poem Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 02/05/2025

గౌరవం తక్కువే తెలుగు కవిత

రచన: తాత మోహనకృష్ణ


సమాజంలో వృద్ధులు..

ఎంతో అనుభవజ్ఞులు


నేటి యువత..

ఆదర్శంగా ఉండాల్సిన యువత..

ప్రేమ పేరుతో జంటగా షికార్లు చేసెదరు

ఎంతో సమయాన్ని వృధా చేసెదరు


కానీ...


వయసులో పెద్దవారితో మాట్లాడాలంటే ఎందుకో కష్టం..

ప్రేమతో వారిని పలకరించడం ఎందుకో కష్టం

వృద్ధులతో మాట్లాడడం టైం వేస్ట్ అని భావిస్తారు..

వాళ్ళమాటలు చాదస్తమని కొట్టిపడేస్తారు

కనీసం బస్సులో లేచి సీట్ ఇవ్వడానికీ ఇష్టపడరు


వృద్ధులు ఎవరైనా సరే..

ఇంట్లో వారైనా సరే..

బయట వారైనా సరే..

ఎవరైనా యువతకు ఒక్కటే!

వృద్ధులకు ఇస్తున్న గౌరవం తక్కువే!


********



-తాత మోహనకృష్ణ



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page