అమ్మకి ఆశీస్సులు
- Dr. C S G Krishnamacharyulu
- May 2
- 2 min read
#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #AmmakiAseessulu, #అమ్మకిఆశీస్సులు, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Ammaki Aseessulu - New Telugu Poem Written By - Dr. C. S. G. Krishnamacharyulu
Published in manatelugukathalu.com on 02/05/2025
అమ్మకి ఆశీస్సులు - తెలుగు కవిత
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
తే.గీ
జన్మ నిచ్చిన శిశువును సంతసముగ
కోటి దేవతలకు మ్రొక్కి కౌగలించి,
పాలు పట్టు తల్లియె కదా భాగ్యరాశి
అద్భుతంబైన భావన అమ్మతనము.
ఆ. వె.
అడుగు వేయు బిడ్డ కండగా నిల్చును
ముద్దు పలుకులు విని మురిసిపోవు,
రామ చంద్రుని వలె రాణించ గా కోరు
అద్భుతంబు మహిళ అమ్మ తనము.
తే.గీ.
బడికి పోనొల్ల నను వాని బడికి పంపు,
ఆట పాటలు చూసి ఆనందపడును
విజయ పధమున నడిపించు వెంట నిలిచి
అమ్మ కెవ్వరు సాటిరా అవని యందు.
తే.గీ.
వయసు బిడ్డలు చెడు దారి బట్టకుండ
చెత్త యలవాట్ల వుచ్చులో చిక్క కుండ
మంచి పొరులైన ఘనత మాత దగును
అవని ప్రత్యక్ష దేవత అమ్మ కాదె!
తే.గీ.
అఖిల సంపదలిచ్చెడి యబ్ధి కన్య
సర్వ మంగళకారిణి శంభుపత్ని
సకల విద్యాప్రదాయిని శారదాంబ
అమ్మ నాశీర్వదించరె అమ్మలార!
***
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).
Beautifully written and brought back so many emotions. Thank you 🙏🏽
ఈ కవిత ఒక హృదయాన్ని తాకే మాతృవందన గీతం. భాష సులభంగా ఉంటూ భావ పరబంధం చాలా బాగుంది. చివరి పంక్తి "అమ్మ నాశీర్వదించరె అమ్మలార!" అద్భుతంగా, హృదయాన్ని తాకేలా రచించబడింది. రచయిత కి ధన్యవాదాలు.