'Ila' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 03/09/2024
'ఇల' తెలుగు కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
సృష్టి ఆద్యంతాల కాల చక్రాన్ని వేద పురాణేతిహా సాలు సశాస్త్రీయంగా లెక్కగట్టాయి. వేద పురాణేతిహా సాల లెక్క ప్రకారం 14 మంది మనువుల పరిపాలనా కాలం బ్రహ్మ దేవునికి పరిపూర్ణ దినము. ఒక మనువు పరిపాలనా కాలాన్ని ఒక మన్వంతరం అని అంటారు. ప్రతి మన్వంతరం 71 మహా యుగాలుగా విభజింపబ డింది.
ఒక సత్య యుగం, ఒక త్రేతా యుగం, ఒక ద్వాపర యుగం, ఒక కలియుగంలను కలిపి ఒక మహా యుగం అని అంటారు. ప్రస్తుతం మనం ఏడవ మనువు వైవస్వత మనువు కాలంలో 28 వ కలియుగంలో ఉన్నాము. వివస్వత, సంజ్ఞ ల పుత్రుడు వైవస్వత మనువు. ఇతనికి సత్య వ్రతుడు, శ్రాద్దాదేవుడు అనే పేర్లు కూడా ఉన్నాయి.
ఒకసారి సూర్య వంశానికి చెందిన వైవస్వత మనువు తన భార్య శ్రద్దాదేవితో కలిసి వేద సరస్వతీ మాత ను సందర్శించాడు. ఆ సమయంలో హంస వాహిని అయిన వేద సరస్వతీ మాత తన చేతిలోని కచ్ఛపి వీణను మైమరచి వాయిస్తుంది. ఆ వీణా నాదంలో ఉదాత్తాను దాత్తాల వాక్ దేవత లు మహదానందంతో వాగ్రూప నృత్యాలను చేస్తున్నారు.
అందులో ఇడా అనే వాక్స్వ రూపం దేదీప్యమానంగా ప్రకాసిస్తూ మంత్రోక్తం గా నర్తించడం వైవస్వత మనువు తన భార్య శ్రద్దాదేవి కళ్ళారా చూసారు. మనసార మహదానందం పొందారు. ఆ దివ్య స్వరూపం వారి మనసులో అలా నిలిచి పోయింది.
కొంత సమయానంతరం వేద సరస్వతీ మాత వీణను వాయించడం నెమ్మదిగా ఆపింది. ప్రశాంతంగా చుట్టూ ఉన్న ప్రకృతిని చూసింది. రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న వైవస్వత మనువు, శ్రద్దాదేవి ఆమె కంట పడ్డారు. వైవస్వత మను దంపతులను చూడగానే వేద సరస్వతీ వదనం వేద విజ్ఞాన తేజంతో మరింత వికసించింది. వేద సరస్వతీ మాత వైవస్వత మను దంపతులను "శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు" అని దీవించింది.
"సంతాన లేమి కారణంగానే మేము మిమ్మల్ని
ప్రత్యేకంగా దర్శించుకోవటానికి వచ్చాం మాత. అడగ కుండానే మా మనసులను కనిపెట్టి వరాలిచ్చే తల్లి వేద సరస్వతీ మాతకు వేల వేల వందనాలు. "అని రెండు చేతులు జోడించి వేద సరస్వతీ మాతతో అన్నాడు వైవస్వత మనువు.
"వైవస్వత మను దంపతులార! కాల చక్ర ధర్మం ప్రకారం మీ సంతాన లేమికి ఒక ప్రత్యేక కారణం ఉంది. నేడు ఆ కారణం అకారణంగానే తొలగిపోయింది. ఇక మీకు సంతానమే సంతానం" విజ్ఞాన చిరు దర హాసం తో అంది వేద సరస్వతీ మాత. ఆమె మాటల వెనుక ఓంకార శబ్ద స్వరాలు విజ్ఞానాత్మకంగా వినపడు తున్నాయి.
"అకారణంగా తొలగి పోయిన ఆ కారణం ఏమిటి వేద సరస్వతీ మాత?" అని హంసవాహినిని అడిగింది శ్రద్దాదేవి.
"మహోన్నత విజ్ఞాన దివ్య తేజోస్వరూపవిలాస విన్యాసం ఆ కారణం. మీరు నన్ను సందర్శించవలసిన సమయంలో సందర్శించారు. వాక్ దేవతలైన సరస్వతి, ఇడ, భారతులను మీరు సందర్శించిన పిమ్మటనే మీకు సంతాన ప్రాప్తి కలగాలన్నది మీ లలాట లిఖితం. అదే మీ సంతాన లేమికి ప్రధాన కారణం.
మీరు ఇప్పుడు నాలోని వేద దేవతా వాక్ ను సందర్శించారు. వాక్కులతో అనుబంధించబడిన వాక్ దేవత గురించి ఋగ్వేదం, జ్ఞాన ఋక్కులతో విజ్ఞానాత్మక వర్ణన చేసింది. అలాంటి వాక్ దేవతను మీరు ఇప్పుడు సందర్శించారు. ఆ వాక్ దేవతలో మిత్రావరుణులు, ఇంద్రాగ్నులు అనే దేవతలు ఉంటారు. మిత్రావరుణులు లింగ మార్పిడి విద్యలో మంచి నైపుణ్యం కల వారు. వాక్ దేవతలైన సరస్వతి, ఇడ, భారతిల సుస్వరూపమే ఈ వేద సరస్వతి. మీరు ఈ వేద సరస్వతిని సహితం సందర్శించారు. సరస్వతి, ఇడా, భారతులను కూడా సందర్శించారు.
మీరు సరస్వతి, ఇడా, భారతులను సందర్శించిన వెంటనే మీ సంతాన లేమికి గల కారణం అలా అలా కనుమరుగై పోయింది. ఇక మీరు సౌందర్య సంతాన సాగర సందర్శనలో ఎన్నెన్నో వింతలు విడ్డూరాలు చూస్తారు" అని విజ్ఞాన తేజో వికాసంతో సరస్వతీ మాత వైవస్వత మను దంపతులను ఆశీర్వదించింది.
"నమో వాక్ దేవి.. నమో ఇడ.. నమో సరస్వతి.. నమో వేదవతి.. నమో వాణి.. నమో శారద.. నమో పుస్తి.. నమో వాగీశ్వరి.. నమో వీణాపాణి.. నమో భారతి.. నమో అష్ట వాగ్దేవి స్వరూపిణి.. నమో వాసినీ.. నమో అరుణా.. నమో కామేశ్వరీ.. నమో కౌలినీ.. నమో జయినీ.. నమో మోదినీ.. నమో విమలా.. నమో సర్వేశ్వరీ.. " అంటూ మహా భక్తి భరిత హృదయాలతో వైవస్వత మను దంపతులు వేద సరస్వతిని ప్రా ర్థించారు.
"శుద్ది చేయబడిన జ్ఞానం కు మీరు తలిదండ్రులు అవుతారు" అని వైవస్వత మను దంపతులను వేద సరస్వతీ మాత మరలా ఆశీర్వదించింది.
వేద సరస్వతీ మాత ఆశీర్వాదాలను తీసుకున్న వైవస్వత మను దంపతులు అగస్త్య మహర్షి దంపతులను కలిసారు. అగస్త్య మహర్షి ధర్మపత్ని లోపాముద్ర, వైవస్వత మనువు ధర్మపత్ని శ్రద్దాదేవిని దగ్గరకు తీసుకొని శ్రద్దాదేవి ముఖాన్ని నిశితంగా పరిశీలించింది.
"వాక్ దేవతా స్వరూపానికి తల్లివి కాబోతున్నావు. నీ జన్మ ధన్యం" అని లోపాముద్ర శ్రద్దాదేవి ని ఆశీర్వదించింది.
"యాగాగ్నిన పునీతులుకండి. సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. " అని అగస్త్య మహర్షి వైవస్వత మను దంపతులను ఆశీర్వదించాడు.
వైవస్వత మనువు అగస్త్య మహర్షి తో, "మహర్షోత్తమ! సంతాన ప్రాప్తి కి చేయవలసిన యాగం ఏమిటో మీరే సెలవివ్వండి. ఆ యాగం మీ ఆధ్వర్యంలోనే వశిష్టాది మహర్షుల నడమ జరగాలన్నది నా కోరిక. " అని అన్నాడు.
అగస్త్య మహర్షి, " వైవస్వత మను దంపతులార.. యాగానికి కావాల్సిన వస్తువులను మీ దంపతులే స్వయంగ సేకరించండి. యాగానికి కావాల్సిన ఏయే వస్తు వులను ఎలా సేకరించాలో మా ఋషులు మీకు దగ్గరుండి చెబుతారు. అలా చేయడం వలన సత్ఫలితాలు మెండుగా దండిగా ఉంటాయి" అని వైవస్వత మను దంపతులతో అన్నాడు.
వైవస్వత మనువు అలాగేనన్నాడు. ఋషుల సహాయం తో వైవస్వత మను దంపతులు యాగానికి కావాల్సిన "హయ్యంగ వీనం, క్షీరం, యవలు, సమిధలు, కుశం, కాశం, యవం, ధూర్వం, విశ్వామిత్రం, ఉసీరం, గో ధూమం, కుందురం, వీహ్రి, ముంజం, జుహువులు, ఉప భృత్తులు, పవిత్ర జలం" వంటి వస్తువులన్నిటి మంత్రోక్తంగా సేకరించవలసినవి సేకరించారు. మంత్రోక్తంగా తయారు చేయవలసినవి తయారు చేసారు.. వారు యాగ వస్తువులను సేకరించేటప్పుడు వారి మనసులో వాక్ దేవత ఇడా నే మెదలసాగింది.
యాగ తేజస్సులందు ప్రకాశించే మిత్రావరుణులు లింగ మార్పిడి విజ్ఞాన విద్యా చర్చలు చేసారు. సృష్టి లోని రసాయన దళ ప్రభావాల గురించి ఇద్దరూ చర్చించు కున్నారు. అలాగే లింగ మార్పిడి పై ఆసక్తి చూపించే వారి మనస్తత్వం గురించి చర్చించుకున్నారు.
అగస్త్య మహర్షి మిత్రావరుణుల కృపను ప్రధానంగా
చేసుకుని యాగం మొదలు పెట్టాడు. వశిష్టాది మహర్షు లు కూడా ఆ యాగ కార్యక్రమాదులను నిర్వహించడం లో భాగస్వాములు అయ్యారు..
అగస్త్య మహర్షి వైవస్వత మను దంపతుల వదనాన్ని పరిశీలించి అందుకు తగిన విధంగా యాగం చేయసాగాడు. యాగ సమయం లో అగస్త్య మహర్షి "వైవస్వత దంపతులారా! మీరు మగ సంతానాన్ని కోరుకుంటున్నారా? ఆడ సంతానాన్ని కోరుకుంటున్నారా?" అని వైవస్వత మను దంపతులను అడిగాడు.
వైవస్వత మనువు రాజ్య పరిపాలనకు మగసంతానమే మేలు అన్న దృష్టితో "మగసంతానం కోరుకుంటున్నాం " అని అగస్త్య మహర్షి తో అన్నాడు. భర్త మనసు ను గమనించిన శ్రద్దాదేవి భర్త మాటను బలపరిచింది.
యాగం నుండి వచ్చిన పొగలను వైవస్వత మను దంపతులు భక్తి శ్రద్ధలతో తనువు పులకించి పోయేటట్లు పీల్చారు.
కొంత కాలానికి శ్రద్దాదేవి నెల తప్పింది. పండంటి పసిపాపకు జన్మను ఇచ్చింది. పసి పాపను చూసిన వైవ స్వత మనువు, "మేం మగ సంతానాన్ని కోరితే ఆడ సంతానం కలిగిందేమిటి మహర్షి?" అని అగస్త్య మహర్షి ని అడిగాడు.
అగస్త్య మహర్షి తన దివ్య దృష్టితో విషయాన్ని గ్రహించాడు. అంత, "వైవస్వత దంపతులారా! మీరు పుత్ర సంతానము ను కోరినప్పటికి మీ భార్యాభర్తల మనసు లో వాక్ దేవత ఇడా స్వరూపమే ఉంది. నేను యాగం చేస్తున్నప్పుడు కూడా మీ భార్యాభర్తల వదనాన వాక్ దేవత ఇడా స్వరూపమే ప్రకాశిస్తుంది.. అప్పుడు నేను కూడ అప్రయత్నంగా వాక్ దేవత ఇడా స్వరూప సంబంధ మంత్రోచ్ఛారణననే చేసాను. అందుకే మీకు ఆడ సంతానం కలిగింది.
మనసులో ఒకటి పెట్టుకుని మరేదో అవసరం అనుకుంటూ మనసులోనిది కాకుండా మరొకటి కోరితే ఫలితం కూడా రెండు రకాలు గా ఉంటుంది. జరిగింది ఏదో కాల ధర్మానుసారం జరిగిపోయింది. మీరు ఈ పాపకు ఇల అని పేరు పెట్టండి. ఈ పాపలో పుంభావ సరస్వతి కూడా కనపడుతుంది. కాబట్టి కాల ధర్మానుసారం ఇల పురుషుడుగా కూడా మారతాడు" అని వైవస్వత మనువు తో అన్నాడు.
వైవస్వత మను దంపతులు అగస్త్య మహర్షి మాటలను శిరసావహించారు. వశిష్ట మహర్షి ఆదేశానుసారం ఇల ను అల్లారు ముద్దుగా పెంచ సాగారు. ఇల కిలకిల నవ్వులు మిలమిల మెరిసే వేద విజ్ఞాన కళికలయ్యాయి. ఇల బుడిబుడి నడకలు విశ్వకంపనోద్భవ సుస్వరాలయ్యాయి.
ఇల ఓం అని మొదట పలికిన పిదపనే అమ్మ అత్త అనసాగింది. విశ్వ కంపనోద్భవ స్వరూపమే ఓం కారమని మాట్లాడటం మొదలు పెట్టింది. ఇల వాక్ శుద్ది ని చూచి వైవస్వత మనువే ఆశ్చర్యపోయాడు. కూతురైన ఇల దగ్గర వైవస్వత మనువు శిష్యరికం చేసాడు. వాక్ దేవత లా ప్రకాశించే ఇల, తండ్రి వైవస్వత మనువుకు అనేక పవిత్ర మంత్రములను బోధించింది. మంత్రముల మాటున ఉన్న ఉదాత్తానుదాత్త స్వర నిర్మాణముల గురించి చెప్పింది. ఆ స్వర నిర్మాణం మాటున ఉన్న మాత్రికాది గణిత నిర్మాణాల గురించి వివరించింది. గణితగుణగణ ధర్మాలు లేని కొన్ని అశుద్ద మంత్రాలు వేదాలలోకి ఎలా చొచ్చుకు వచ్చాయో చెప్పింది.
ఇల తండ్రికి, అగస్త్య, వశిష్టాది మహర్షులకు అశ్వ మేథ యాగంలో ఉన్న మంత్రాల గణిత ధర్మాల గురించి చెప్పింది. అంత, "గణితధర్మమున్న మంత్ర భరితమైన ఏ యాగమైన హింసాభరితంగ ఉండదు. కొందరు పరి పూర్ణతలేని ఋషులు స్వల్ప సాధనతో గొప్ప గొప్ప యాగాలను జరిపిస్తారు. యాగం జరిపించాలంటే ఋషి కి కావల్సింది కేవలం మంత్రోచ్ఛారణ ఒకటే కాదు. మం త్రోచ్ఛారణలోని ఉదాత్తానుదాత్తాది స్వరాల నడుమన ఉన్న గణిత తేజం, సుర తేజ సౌందర్యం చూడగల నైపుణ్యం రావాలి.
ఆపై తేజో భరిత హృదయం ఉండాలి. ఆయా దైవాంశలను నిక్షిప్తం చేసుకున్న గణితాత్మక, గు ణాత్మక మంత్రోచ్ఛారణ తెలిసి ఉండాలి. అది సరిగా అబ్బనివారు యాగాలను పలురకాల జీవ బలులకు పరిమితం చేస్తారు. అలా యాగం చేయించేవారిని భయ పూర్వక భక్తికి అలవాటు చేస్తారు.
వేదాలలో అశ్వమేధ యాగ స్వరూపం జీవ బలులతో కూడుకుని ఉంటుంది. నిజానికి వేద జ్ఞాన మూలం తెలిసినవారు ఈ బలిని సమర్థించరు. అశ్వ మేధ యాగం లో మంత్ర జలంతో శుద్ది చేయబడిన గుర్రం హయగ్రీవ స్వామి తో సమానం. అశ్వమేధ యాగం సందర్భాన అశ్వమును హింసించడమంటే విష్ణు మూర్తి ని హింసించినట్లే అవుతుంది." అంటూ ఇల అశ్వమేధ యాగం యొక్క గొప్పదనమును వివరించింది. అశ్వమేధ యాగం ప్రత్యేకతలను తెలియ చేసింది.
ఇల చెప్పిన వేద మూలాంశాలు అన్నిటినీ విన్న అగస్త్య మహర్షి, వశిష్ట మహర్షి "ఇల మగవాడైతే సశాస్త్రీయ అశ్వమేధ యాగాలు అనేకం జరుగుతాయి. వాటితో ప్రకృతి కాలుష్యం సమస్తం తొలగిపోతుంది. ఇలన పాడిపంటలు మరింత అభివృద్ధి చెందుతాయి. ప్రజలకు అన్నపానీయాలకు అసలు కొదవ ఉండదు. "అని అనుకున్నారు.
అశ్వమేధ యాగం యొక్క గొప్పదనమును తెలియ చేసిన ఇలను అగస్త్య మహర్షి, వశిష్ట మహర్షులు మిత్రావరుణుల సహాయం తో మగవానిగ మార్చారు.. మగవానిగ మారిన ఇలకు వశిష్ట మహర్షి యే సుద్యుమ్నుడు అనే పేరు పెట్టాడు.
వైవస్వత మను దంపతులు తమ కుమారుడైన సుద్యుమ్నుని చూసుకుని మహా మురిసిపోయారు. వైవస్వత మనువు ఇల సుద్యుమ్నునిగ మారిన రోజును పవిత్రరోజుగ భావించి సుద్యుమ్నునికి జన్మదిన వేడుకలను జరిపించారు. రాజ్యంలోని వీరులు, శూరులు, పరాక్రమవంతులు అందరూ సుద్యుమ్నుని జన్మదిన వేడుకలను ఘనంగ జరిపించసాగారు.
ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, పండితులు, వేదాంతులు, సరస్వతీ ఉపాసకులు, సరస్వతీ మాత భక్తులు అందరూ ఇల జన్మదిన వేడుకల ను యథావిధిగా జరుపుతూనే ఉన్నారు. ఇల జన్మదిన వేడుకలు వసంత పంచమి వేడుకల్లా ఉంటాయని ఆ వేడుకలను చూసిన వారందరూ అనుకునేవారు.
నూనూగు మీసాల నూత్న యౌవన సుద్యుమ్నుని చూసిన ఋషికాంతలు సహితం మతితప్పి రతీ దేవి మాయలో పడ్డారు. సుద్యుమ్నుని కౌగిలిలో కరిగి పోవాలని కలల మీద కలలను కనసాగారు.
తన తనువులో వాక్ దేవత ఇడా తత్వమున్నదన్న సంగతిని గ్రహించిన సుద్యుమ్నుడు యుగ ధర్మానుసారం సశాస్త్రీయంగా అనేక అశ్వమేధ యాగాలను చేసాడు. తను చేసిన అశ్వ మేథ యాగాల నుండి వచ్చిన పొగ ప్రభావం తో ప్రకృతి మాత యుగ ధర్మానుసారం పరవసిస్తూ ప్రజలకు ప్రమోదాన్ని అందించసాగింది. అలా ప్రతిష్టాన పుర ప్రజల జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఆనందంగా కొనసాగింది.
కైలాసం లో ఉండే పార్వతీ పరమేశ్వరులు లయ చక్ర స్థితిగతుల గురించి చర్చించుకున్నారు. సృష్టి స్థితులలోని వికాస విన్యాసం గురించి ముచ్చటించు కున్నారు. అనంతరం వన విహారం నిమిత్తం కుమార వనానికి వెళ్ళారు. గణపతి పుట్టుకను గుర్తు చేసుకు న్నారు. కుమార వనంలో ఉన్న శరవణ వనంలో కాసేపు ప్రశాంతంగా సంచరించారు.
అక్కడ పార్వతీ పరమే శ్వరులకు కుమార స్వామి గుర్తుకు వచ్చాడు. ఇరువురు శరవణ వనంలో ఉన్న ప్రతి రెల్లు పువ్వులోని మాతృ తేజంను, మహా సౌందర్య మగువ తేజం ను సందర్శిం చారు. "ఒక్కొక్క నేల తీరు, ఒక్కొక్క ప్రాంతం తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక ప్రాంతంలో అడుగు పెడితే గొడ్రాలు కూడ గంపెడు సంతానం తో కళకళలా డుతుంది. మరో ప్రాంతంలో అడుగు పెడితే సంతాన సిరి పుష్కలంగా ఉన్న పుణ్యవతి సహితం గొడ్రాలిగ చరిత్రకు ఎక్కుతుంది" అని పార్వతీ పరమేశ్వరులు అనుకున్నారు.
పార్వతీ మాత పరమశివునితో "నాథ, ఈ శరవణ వన అందం నానాటికి ద్విగుణీకృతం అవుతుంది. ఈ వనాన్ని చూస్తుంటే, మహర్షులు సహితం మన్మథుల య్యేటట్లు ఉన్నారు" అని అంది.
పార్వతీ మాత మాటలను విన్న పరమశివుడు చిరుదరహాసం తో "దేవీ.. అలా అయితే మనుషుల సంఖ్య తగ్గి మన్మథుల సంఖ్య పెరుగుతుంది. ఈ శరవణ వనం కళే మారిపోతుంది. కాబట్టి ఈ శరవణ వనంలో నేను తప్ప ఏ మగవాడు అడుగు పెట్టిన మగువగా మారిపోతాడు. జన్మతో వచ్చిన జ్ఞానం ను తప్ప గతాన్ని మరిచి పోతాడు. మహా మహర్షుల ప్రభావం తో అతడు గతం ను గుర్తు చేసుకొనవచ్చును. ఈ చిత్రవిచిత్ర వరశక్తిని నేను ఈ శరవణ వనానికి ఇస్తున్నాను. " అని అన్నాడు.
"శరవణ వనానికి మీరిచ్చిన వర శక్తి అమోఘం. " అని పరమశివునితో పార్వతీ మాత అంది. ఈ విషయం తెలిసిన ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు సురనర యక్షగందర్వకిన్నెర కింపురుషాదులైన మగవారు ఆ వనం వైపు కన్నెత్తి చూడటం కూడా మానేసారు.
శరవణ వనం గురించి తెలిసిన కొందరు కుసంస్కార పండితులు శరవణ వనంలో సంచరించే పార్వతీ పరమేశ్వరుల నగ్న క్రీడలకు భంగం కలుగుతుంది అని పర మేశ్వరుడు శరవణ వనానికి ఆ వరశక్తిని ఇచ్చాడని ప్రచారం చేసారు.
కుసంస్కార పండితుల మీద పార్వతీ మాత ఆగ్రహించి వారిని భస్మం చేయాలనుకుంది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ మాతను శాంతింప చేసి, "దేవీ.. తమ పాండిత్యంతో పుడమిని వికాసవంతం చేసే పండితులే కాదు, పుడమిని విషతుల్యం చేయాలనుకునే పండితులుకూడ పుడమిన ఉంటారు. వారి ఉన్మాద చేష్టలు, ఉన్మాద మంత్రాలు కూడా వేదాలకు ఎక్కుతాయి. వాటిని గమనించి, వాటికి దూరంగా ఉన్నవాడే నిజమైన వేద పండితుడు.
కామక్రోధాత్మక కథలు, పాండిత్యం యాగాలు ఎంత వేగంగా పుడతాయో అంత వేగంగా కనుమరుగై పోతాయి. అంతా కాల పురుషుడే చూసు కుంటాడు. " అని అన్నాడు.
అనేక అశ్వమేధ యాగాలు చేసిన సుద్యుమ్నుడు ఒకసారి విశ్వ సంచారం చేస్తూ పొగరుబోతు అయిన ఒక యక్షునితో యుద్దానికి సిద్దపడ్డాడు. సుద్యుమ్నుని ముందు యక్షుని మాయలు పనిచేయలేదు. అది గమనించిన యక్షుని భార్య తన భర్తను రక్షించుకోవడానికి జింక రూపం ధరించింది. జింక రూపంలో ఉన్న క్షుని భార్య సుద్యుమ్నుని ముందుకు వచ్చింది. యక్షు డు కాలికి బుద్ది చెప్పాడు.
సుద్యుమ్నుడు పలు రంగుల్లో ప్రకాసిస్తున్న జింకను పట్టుకోవాలని ప్రయత్నించాడు. జింక సుద్యు మ్నునికి దొరకకుండా కుమారవనం వైపుకు పరుగులు తీసింది. సుద్యుమ్నుడు జింకను తరుముకుంటూ అశ్వం మీదనే కుమార వనంలో ఉన్న శరవణ వనానికి వచ్చాడు.
సుద్యుమ్నుడు అశ్వంతో శరవణ వనంలోకి ప్రవేశించి నంతనే ఇల గా మారిపోయాడు. అశ్వం తన మీద ఉన్న ఇలను చూసి పెద్దగా సకిలించింది. ఇల అశ్వం మీదనుండి కిందకు దిగింది.
శరవణ వనం మొత్తం చూసింది. శరవణ వన శోభలో ప్రకాశిస్తున్న షణ్ముఖుని ఋగ్వేద సూక్తులతో స్తుతించింది. ఇల సూక్తులను విన్న అశ్వం ఆనందంతో హయ గ్రీవ నృత్యం చేసింది.
ఇల కుమార వనం మొత్తం దర్శించింది. అక్కడి అర్థనారీశ్వర తేజాన్ని అవగతం చేసుకుంది. అశ్వం ఇలను అనుసరించింది.
ఇల అశ్వం మీద కుమార వనం నుండి చంద్ర వనం వచ్చింది. అక్కడ చంద్రుని కుమారుడు బుధుడు
తపస్సు చేసుకుంటున్నాడు. బుధుడు ఇలను చూసాడు.
ఇల అందమును చూడగానే బుధుని మనసులోని తపో తేజం కరిగి పోయింది. మన్మధుడు బుధుని ఆవహించాడు. అంత బుధుడు ఇల అశ్వము ముందు నిలబడ్డాడు.
"మానినీ మణి.. ఇలలో నీ అంత అందగత్తె మరొకరు లేరన్నది అక్షర సత్యం. ముఖ్యంగా నీ అందంలో జ్ఞాన తేజం జ్ఞానవంతంగ వెలుగుతుంది. నీలాంటి జ్ఞాన తేజ అందగత్తె ఇలలోనే కాదు పదునాలుగు లోకాలలో ఎక్కడా ఉండదన్నది నిజం నిజం నిజం. ఇంతకీ నీ పేరేమిటి?" అని బుధుడు ఇలను అడిగాడు.
ఇల గుర్రం దిగి బుధుని ఆపాదమస్తకం ఒకసారి పరిశీలించింది. " తపోధన.. ప్రస్తుతం నా పేరేమిటో నాకే గుర్తు రావడం లేదు. నేనైతే ఈ ప్రదేశానికి చెందిన దానిని కాదు. నేనిక్కడకు ఎలా వచ్చానో నాకు అసలు జ్ఞాపకం రావడం లేదు. నన్నేదో మాయావలయం ఆవరించింది అని నాకు అనిపిస్తోంది. ఇంతకీ తమరెవరు?" అని ఇల బుధుని అడిగింది.
"నా పేరు బుధుడు. తారాశశాంకాల తనయుడుని. నా తలిదండ్రుల వివాహ విధానం తలచుకుని ఇప్పటికీ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. నన్ను చూసి సహ్యం గాని రీతిలో నవ్వుకుంటున్నారు. వారి నవ్వును ఎదుర్కొనే శక్తి నాకు లేదు. అందుకే నేను ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకుంటున్నాను. అదిసరే నువ్వు కొంత కాలం ఇక్కడే ఉండు. ఇక్కడకు ఎందుకు వచ్చావో ఎలా వచ్చావో నెమ్మదిగా గుర్తు చేసుకో. " అని బుధుడు ఇలతో అన్నాడు.
ఇలకు బుధుని మాటలు నచ్చాయి. బుధునితో ఇల అలాగే అంది. బుధుడు ఇలకు ప్రత్యేక పర్ణశాలను ఏ ర్పాటు చేసాడు.
ఇల తన గతాన్ని మరిచిపోయింది కానీ పుట్టుక తో వచ్చిన జ్ఞానంను మాత్రం మరిచిపోలేదు. ఇల పఠించే ఋగ్వేద మంత్రాల ఉదాత్తానుదాత్త స్వరాల గణిత చక్రాలు బుధుని మనసును ఆకర్షించాయి. ఇల ఖాళీ సమయంలో తన దగ్గర ఉన్న గుర్రం దగ్గరకు వెళ్ళి దానిని పరిశీలించేది. అలా తను అక్కడకు ఎలా వచ్చింది తెలుసుకోవడానికి ప్రయత్నించేది.
ఒకనాడు ఆ ప్రాంతంలో రాళ్ళ వర్షం కురిసింది. ఇల తన ఋగ్వేద పఠనంతో రాళ్ళ వర్షాన్ని ఆపగలిగింది. ఇల ఋగ్వేద పఠన ప్రభావం తో బుధుని తలమీద పడబోతున్న కొండరాయి ముక్కలు ముక్కలయ్యింది. అయితే ఆమె ఎంత ఆలోచించినా ఆమె గతం ఆమెకు గుర్తుకు రాలేదు.
ఇలా కొంత కాలం గడిచిపోయింది. ఇలాబుధులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అక్కడ ఉన్న మహర్షుల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి పురూరవుడు అని పేరు పెట్టారు.
ఒకనాడు వశిష్ట మహర్షి ఇలాబుధులు ఉన్న ప్రాంతమునకు వచ్చాడు. ఇల వశిష్ట మహర్షి ని గుర్తు పట్టింది. వశిష్ట మహర్షి తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు.
వశిష్ట మహర్షి బుధునికి ఇల ఎవరో సమస్తం వివరించి చెప్పాడు. వైవస్వత మను దంపతులను, అగస్త్యాది మహర్షులను అక్కడికి రప్పించాడు.
అగస్త్య మహర్షి మిత్రావరుణుల సహకారంతో, పార్వతీపరమేశ్వరుల కృపతో ఇలను సుద్యుమ్నునిగ మార్చాడు. సుద్యుమ్నుడుగ మారిన ఇల బుధుని, తన కుమారుడు పురూరవుని గుర్తు పట్టలేక పోయింది.
బుధుడు అగస్త్య మహర్షికి నమస్కారం చేసి, , " మహర్షోత్తమ! ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో మీరే సెల వివ్వాలి. " అని అన్నాడు.
బుధుని మాటలను విన్న అగస్త్య మహర్షి, " శశాంక పుత్ర బుధ! ఇల స్త్రీగానే పుట్టింది. ఆమె తనువు స్త్రీత్వం లోనే దేదీప్యమానంగా విజ్ఞానవంతంగ ప్రకాశిస్తుంది. ఆమె తలిదండ్రుల చిరుకోరిక కారణంగా ఇల సుద్యుమ్నుడుగా లింగ మార్పిడి కి గురయ్యింది.
ఇల వాక్ దేవత ఇడా స్వరూపం. ఇడా స్వరూపంలో సరస్వతీ తేజం, పుంభావ సరస్వతీ తేజం రెండూ ఉంటాయి. అందుకే ఇల సుద్యుమ్నునిగా కూడా కొంత కాలం ఉండగలిగింది.
ఇల ఇకపై ఇలగానే ఉం టుంది. చంద్రవంశ బీజ తేజంగా యశసిస్తుంది. " అని పార్వతీపరమేశ్వరులను పూజించి, మిత్రావరుణుల సహాయంతో అగస్త్య మహర్షి సుద్యుమ్నుని ఇల గా మార్చాడు.
ఇల అక్కడ ఉన్న వారందరిని చూసింది. అందరికి నమస్కరించింది. కుమారుని దగ్గరకు తీసుకుంది. బుధుని సమీపించింది..
అప్పుడే అక్కడకు వచ్చిన నారద మహర్షి ఇల కు నవాక్షర మంత్రం ను నేర్పాడు. ఇల నవాక్షర మంత్రాన్ని శాస్త్రోక్తంగా పఠించింది. అప్పుడు మిత్రవరుణ ఇంద్రాగ్నుల తేజం వధూపీఠ ద్వజం మీద వెలుగొందాయి. ఇల ఆ తేజంలో నిలిచి వాక్ దేవత ఇడా గా అందరికి దర్శనం ఇచ్చింది. ఆపై వాక్ దేవత ఇడా ఇల గా అందరి ముందు నిలిచింది.
ఇల సరస్వతీ నది ఒడ్డున పవిత్ర ప్రదేశాన్ని ఎన్నుకుంది. అక్కడ నియమబద్ధంగా, ఆచార బద్దంగా అనేక యాగాలను మహర్షులతో చేయించింది. యాగంలో పా ల్గొన్న వారందరికీ తనే స్వయంగా భోజనం చేసి పెట్టింది.
ఒకనాడు యాగమునకు కావల్సిన నెయ్యి సకాలంలో మహర్షులకు అందలేదు. అప్పుడు ఇల వాక్ దేవత ఇడా గా మారి నెయ్యి కారుతున్న పాదాలతో గోబృందం నడుమ నిలబడింది . మహర్షులు ఋగ్వేద మంత్రోక్తులతో ఇడ పాదాల నుండి కారుతున్న నేతిని యాగం నిమిత్తం స్వీకరించారు . ఆపై "ఓం ఇల్లాయ నమః"అంటూ మహర్షులు ఇల ను స్తుతించారు.
అలా ఇల ఘృతపది అయ్యింది. ఇల యాగాలు చేయించిన ప్రదేశాన్ని అందరూ ఇలా భూమి అని పిలవసాగా
రు.
వైవస్వత మను దంపతుల, మహర్షుల సూర్యచంద్రాది దేవతల ఆశీస్సులతో ఇలాబుధులు అన్యోన్యంగా జీవించారు. వారికి పురూరవునితో పాటు, ఉత్కళ, గయ, వినతాశ్వ అనే పేర్లుగల కుమారులు కూడా కలిగారు.
శుభం భూయాత్
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
Комментарии