top of page

కష్టం ఎవరిది?

బాలల కథ


'Kashtam Evaridi' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah Published In manatelugukathalu.com On 02/09/2024

'కష్టం ఎవరిది?' తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పగిడాల, కుడాల గ్రామాల మధ్య దూరం ఇరవై కిలోమీటర్లు. రెండు గ్రామాలు తూర్పు పడమర దిశల్లో ఒకదాని కొకటి ఎదురెదురుగా ఉన్నాయి. పగిడాలలో ఉండే ఉదయ్, కుడాలలో ఉండే విజయ్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. ఒకర్ని ఒకరు చూసుకోంది వారికి ప్రొద్దు పోదు. 


ఉదయ్ ఉదయమే పగిడాలలో కాలినడకన బయలుదేరి పది కిలోమీటర్లు దూరం ప్రయాణించి పగిడాల కుడాల గ్రామాల సరిహద్దు చేరుకుని మిత్రుడి కోసం ఎదురు చూస్తూ వేచి ఉంటాడు. 


అదే విధంగా అదే సమయంలో కుడాలలో విజయ్ కూడా బయలుదేరి పది కిలోమీటర్లు నడిచి రెండు ఊర్ల సరిహద్దు ప్రాంతం చేరుకొని మిత్రుడిని కలుసుకుంటాడు. 


ఇద్దరు స్నేహితులు అక్కడే ఉన్న భారీ ఊడల మఱ్ఱిమాను చుట్టూ ఉన్న విశాలమైన అరుగు మీద కూర్చుని ముచ్చటించు కుంటారు. కబుర్లు చెప్పుకుంటారు

సమాజంలో వస్తున్న మార్పులపైనా, నడుస్తున్న రాజకియాలపైనా, ప్రజల్లో నైతిక విలువలు పడిపోతున్న తీరుపైనా, జనం వావివరుసలు పాటించకుండా అక్రమ సంబంధాలు సాగిస్తున్న విధానంపైనా, పెరిగిపోతున్న హింసా ప్రవృత్తిపైనా, క్షీణిస్తున్న మానవ సంబంధాలపైనా, మానవుల్లో అంతరిస్తున్న కరుణా దయా ప్రేమ అభిమానాలపైనా, పతనమవుతున్న వస్తునాణ్యతపైనా చెప్పుకొని తెగ బాధపడి పోతుంటారు. 


ఈ అన్నిటికీ కారణం మనుషుల్లో పాపభీతి, దైవభక్తి తగ్గిపోవడమే అని తేల్చి పారేస్తారు. ప్రపంచం న్యాయం ధర్మం వైపు, నీతి నిజాయితీ వైపు పయనించాలని దేవుని ప్రార్థిస్తారు. అప్పటికి సూర్యుడు పడమటి వైపుకు వాలుతాడు. 


స్నేహితులు ఇద్దరూ ఆలోచనలకు, ముచ్చట్లుకు, కబుర్లుకు ఆరోజుకి స్వస్తి చెప్పి ఇక రేపు కలుద్దామని, టాటా వీడుకోలు చెప్పుకొని స్వస్థలాలకు తిరుగు పయనమవుతారు. ఇదే వారి రోజువారీ దినచర్య. 


అలా కలిసిన ఒక రోజు ఇద్దరు స్నేహితులు తీవ్రంగా ముచ్చటించుకుంటూ, తలవేడేక్కెంతగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక చిరు వ్యాపారస్తుడు ఆ మఱ్ఱి చెట్టు అరుగు మీద మామిడి పండ్ల గంపను దింపుతాడు. అరుగుమీద కూర్చున్న బాటసారులు తలా ఒక పండు కొనుక్కొని తింటుంటారు. ఈ ఇద్దరు మిత్రులు ఉదయ్ విజయ్ కూడా ఒక పండును కొని ఇద్దరు సమానంగా కోసుకోని తింటారు.


మామిడి పండు తినగా ముట్టె (విత్తనం) మిగులుతుంది. దీనిని ఏమీ చేయాలని ఆలోచించి, ఒక నిర్ణయానికి వస్తారు. 

"మన ఇద్దరి స్నేహానికి గుర్తుగా ఈ విత్తును భూమిలో పాతిపెట్టి పెంచుదాం. రోజు ఇద్దరం చెరొక కడవ నీళ్ళు మోసుకొచ్చి చెట్టుకు పోస్తాం. కాపుకొచ్చిన తరువాత ఫలసాయాన్ని ఇద్దరం సమానంగా పంచుకుందామని ఒక ఒప్పందానికి వస్తారు. అనుకున్న విధంగానే విత్తనాన్ని అక్కడే ఒక మంచి చోట పాతిపెట్టి, పాదుచేసి, నీళ్ళు పోసి పెంచుతారు. ప్రతి రోజూ ఇద్దరూ ఉదయమే చెరొక కడవ నీళ్ళు భుజానికి ఎత్తుకుని బయలుదేరి వచ్చి పాదులో పోసి చాలినంత సేపు మాట్లాడుకొని తిరుగు ప్రయాణం అవుతుంటారు. 


నాటిన మామిడి విత్తనం మోసువేసి, మొక్కై, మారాకువేసి, మానై, పూత పూసి మామిడిచెట్టు కాయలు కాస్తుంది. ఉదయ్ విజయ్ లు మామిడి చెట్టు చుట్టూ అరుగు కట్టి, తెచ్చిన నీళ్ళు చెట్టుకు పోసి, తెచ్చుకున్న అన్నం ఆ అరుగు మీద కూర్చుని తిని, కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని, కొద్దిసేపు మామిడి చెట్టు అరుగు మీద పడుకొని, సేద తీర్చుకొని ఎవడి ఊరికి వాడు పోయేవాళ్ళు. 


మామిడి కాయలు మాగి పండ్లైన తరువాత పండ్లను సమపాళ్లలో పంచుకొని సొమ్ము చేసుకొని ఆదాయం పొందుతారు. ఇందులో కష్టం ఆదాయం అన్ని సమానంగా పంచుకోవడంలో ఇద్దరికీ ఎటువంటి తాకరాదు, వివాదం రాలేదు. ఇలా ఎన్నో సంవత్సరాలు సాగింది సాగుతూనే ఉంది. ఆ మామిడిచెట్టు వారిద్దరి స్నేహానికి తార్కాణంగా అలా నిలిచిపోయింది. 

ఈ ఇద్దరి స్నేహితుల కథను, అక్కడే మఱ్ఱి చెట్టు అరుగు మీద ఎప్పటి నుంచో నివాసం ఉంటూ ఈ ఇద్దరినీ గమనిస్తున్న ఒక సాధువు, అదే అరుగుపై కుర్చున్న బాటసారులకు వీరి ఉదంతం చెప్పి "చెట్టు పోషణలో గాని, ఫలసాయంలో గాని ఇద్దరికీ సమానమే అయినప్పటికీ అందులో ఒకరికి కష్టం ఎక్కువ ఉంది. అది ఆ స్నేహితులకు కూడా తెలియదు. అదేదో మీరు చెప్పండి చూద్దాం! " అన్నాడు సాధువు బాటసారులతో. 


కథంతా విన్న బాటసారులు, ఎక్కువ కష్టం ఎవరికో అంతుపట్టక ఆసక్తిగా సాధువును చూశారు. "అన్నింట్లో సమానమైనప్పుడు కష్టం ఎవరికి ఎక్కువో అంతుపట్టడం లే..దు. మీరే చెప్పండి స్వామి" అని సాధువును కుతూహలంగా అడిగారు బాటసారులు. 


"సరే నేనే చెప్పుతాను వినండీ!. ఉదయ్ తూర్పు దిక్కు నుంచి ఉదయాన్నే బయలుదేరి ఇక్కడికి వస్తాడు. అతనికి సూర్యుని ఎండ వీపుకు మాత్రమే తగులుతోంది. మళ్లీ తిరిగి వెళ్ళెప్పుడు సూర్యుడు పరమటివైపు ఉంటాడు కాబట్టి ఉదయ్ కి ఎండ మళ్లీ వీపుకే తగులుతోంది. అది పెద్దగా బాధనిపించదు. కానీ విజయ్ ది అలాకాదు. ఉదయం బయలుదేరే టప్పుడు సూర్యుడు తూర్పు దిక్కున ఉండడం వలన అతని ముఖంమీద ఎండ పడుతుంది. తిరిగి బయలుదేరే టప్పుడు సూర్యుడు పరమటి దశన ఉండడం వలన విజయ్ కి మళ్లీ ముఖం మీదనే ఎండ పడుతుంది. ఇది చాలా బాధాకరం. కాబట్టి కష్టం విజయ్ ది " తెల్సి చెప్పాడు సాధువు. 


విన్న బాటసారులు నిగూఢంగా ఉన్న కష్టాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. 

 

 ---------- 

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.

62 views1 comment

1件のコメント



@ramaraopalla

• 26 minutes ago

Nice

いいね!
bottom of page