top of page

ఇన్స్టాగ్రామ్ స్టాకర్ - పార్ట్ 2'Instagram Stalker - Part 2/3' - New Telugu Story Written By Shilpa Naik

Published In manatelugukathalu.com On 21/05/2024

'ఇన్స్టాగ్రామ్ స్టాకర్ పార్ట్ 2/3' పెద్ద కథ

రచన: శిల్పా నాయక్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ

తన ఫ్రెండ్ రష్మీ సలహా మీద ఇన్స్టాగ్రామ్ వాడటం మొదలుపెడుతుంది రాధ. సాహిల్ అనే వ్యక్తితో ఇన్స్టాలో పరిచయం పెరుగుతుంది. పరీక్షలు దగ్గరవడంతో చాటింగ్ ఆపుతుంది. ఒకరోజు సాహిల్ బస్సులో కనపడి రాధను వేధిస్తాడు. ఇక ఇన్స్టాగ్రామ్ స్టాకర్ పార్ట్ 2 చదవండి 


వంశీ గట్టిగా చెప్పడంతో సాహిల్ కూడా రాధ చేతిని వదిలేస్తాడు. చేయిని వదలగానే రాధ వెంటనే బస్సు దిగి డైరెక్ట్ గా ఎగ్జామ్ సెంటర్ వైపు వెళ్తుంది. కాసేపు చదువుకుందాం అని బుక్ ఓపెన్ చేసినా , బస్సు ఇన్సిడెంట్ గుర్తుకు రావడంతో బుక్ క్లోజ్ చేసి రష్మి కోసం ఎదురు చూస్తోంది. రాధ, వంశీ రష్మితో ఏదో మాట్లాడడం గమనిస్తుంది. కానీ అప్పుడే బెల్ రింగ్ అవ్వడంతో అందరు క్లాస్ రూమ్స్ కి వెళ్లిపోతారు. 


ఎగ్జామ్ రాస్తునంత సేపు రాధకి సాహిల్ పదే పదే గుర్తుకొస్తాడు. ఎగ్జామ్ త్వరగా కంప్లీట్ చేసి వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవరో పిలిచినట్టు అనిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. కాని వెనక ఎవరు ఉండరు. ఈసారి రాధకి ముందు వైపు ఎవరో పిలుస్తునట్టు అనిపించిండంతో భయంగా ముందుకి తిరుగుతుంది. ఎదురుగా వంశీ ఉంటాడు. వంశీ రాధతో పాటు నడుస్తూ, "ఎవరు వాడు? బస్సులో?" అని అడుగుతాడు. 


రాధ సాహిల్ గురించి మొత్తం చెప్పేస్తుంది. అదంతా విన్న వంశీ, "అలా ఎలా వాడ్ని నమ్మి గ్రౌండ్ కి వెళ్ళావ్? అక్కడ ఏదైనా జరిగి ఉంటే? ఇంస్టాగ్రామ్ లో కనిపించేదంతా నిజం కాదు. ఈరోజుతో ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయి కదా, ఈ రాత్రికే మీ ఊరికి వెళ్ళిపో. " అని చెప్తాడు. 


రాధ, "మరి ఫేర్వెల్? " అని దిగులుగా అడుగుతుంది. 


ఆ మాటకి వంశీ, "ఆ సాహిల్ కి నీ హాస్టల్, కాలేజీ, ఎగ్జామ్ డేట్, సెంటర్, బస్సు గురించి ఏం తెలియకపోయినా ఈరోజు బస్సు లో కరెక్టుగా ఎలా వచ్చాడు? ఈరోజు అందరి ముందు చేయి పట్టుకొన్న వాడు, రేపు హాస్టల్ లో ఎవ్వరు లేనప్పుడు ఏం చెయ్యడని ఏంటి గ్యారంటీ? ఈరోజే నువ్వు ఊరికి వెళ్ళిపో. " అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. 


రాధ హాస్టల్ చేరుకొని తన సామాన్లని ప్యాక్ చేసుకొని ఊరికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. రష్మి కూడా అప్పుడే రూమ్ కి వచ్చి, "వంశీ మొత్తం చెప్పాడు. తను, నేను ఇద్దరం బస్సు స్టేషన్ దాక వస్తాం" అని చెప్పి రాధ చేతిలో నుంచి బాగ్ ని తీసుకుంటుంది. 


రాధ, "అసలు వంశీ ఎందుకు నా కోసం ఇంత కేర్ తీసుకుంటున్నాడు? అంటే మీ 4 ఇయర్స్ లో ఎప్పుడు నాతో మాట్లాడని వాడు సడెన్ గా.. " అని అడుగుతుంది. 


రష్మి, "అంటే నీకు అసలు విషయం తెలీదన్నమాట?" అని అడుగుతుంది. 


రాధ అయోమంగా తన వైపు చూస్తోంది. అప్పుడు రష్మి జరిగిందంతా రాధకి చెప్తుంది. 


"పక్కనే ఉన్న మెడికల్ కాలేజీ లో థర్డ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని ఎవరో మర్డర్ చేశారు. పోలీస్ ఎంక్వయిరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, మర్డర్ చేసింది తన ఇంస్టాగ్రామ్ బాయ్ ఫ్రెండ్ అంట. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందుకే వంశీ మాత్రమే కాదు ఆ ప్లేస్ లో మన కాలేజీ వాళ్ళు ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. "


ఆ మాటలకి రాధ మనుసులో భయం మొదలైయింది. ఇద్దరూ హాస్టల్ గేటు దగ్గర చేరుకుంటారు. అక్కడ వంశీ ఆటోలో వచ్చి, "మరో 20 మినిట్స్ లో మీ ఊరెళ్ళే బస్సు, స్టేషన్ కి వస్తుందంటా. " అంటూనే బాగ్ ని ఆటో పెట్టి ఇద్దర్నీ కూర్చుమని చెప్తాడు. ముగ్గురు బస్సు స్టేషన్ చేరుకుంటారు. అక్కడ బస్సు కూడా ఉండడం తో వంశీ, రాధ ని జాగ్రతగా బస్సు ఎక్కించి, తన కోసం వాటర్ బాటిల్, బిస్కట్స్ కొని తనకి ఇచ్చి, "ఊరుకి చేరుకోగానే రష్మికి కాల్ చెయ్. " అని సెండ్ ఆఫ్ ఇస్తాడు. 


రాధకి ఇలా హఠాతుగా ఊరెళ్ళడం అసలు నచ్చలేదు. అయినా ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకని చంపారని ఆలోచిస్తుండగా ఎవరో తన పేరుని పిలిచినట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ ఎవరు లేరు. బస్సు రాధ ఊరుని చేరుకునేసరికి రాత్రి అవుతుంది. 


తను బస్సు దిగి వెళ్తుండగా డ్రైవర్, "ఎమ్మా, నీ వాళ్ళు ఎవరూ లేరా? ఇంతా చీకట్లో ఒంటరిగా ఎలా వెళ్తావ్? కనీసం లైట్స్ కూడా లేవు. అసలే రోజులు బాగోలేదు" అని అడుగుతాడు. మొదటి నుంచి భయపడుతున్న రాధకి డ్రైవర్ మాటలకి ఇంకా భయం పెరుగుతుంది. 


రాధ, "పర్లేదు, నాకిది అలవాటే" అని చెప్పి బస్సు దిగి పక్కనే ఉన్న చిన్న గుడిలోకి వెళ్తుంది. రాధ ఊరు హైవే నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆ దారిలో ఒక స్ట్రీట్ లైట్ కూడా ఉండదు. చుట్టూ పొలాలు తప్ప ఇళ్లు వుండవు. రాధ దేవుడికి దండం పెట్టి, వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది. వాళ్ళ నాన్న కాల్ లిఫ్ట్ చెయ్యడు. ఎందుకంటే ఊర్లో అందరూ రాత్రి 9 గంటలకే నిద్రపోతారు. 


ఇప్పుడు టైం 2 అవుతుంది. రాధ, ఇంక గుడిలో కూర్చుంటే లాభం లేదని తన ఊరి వైపు ఫోన్ లో టార్చ్ ఆన్ చేసుకొని నడవడం మొదలు పెట్టింది. అలా నడుస్తూ ఉండంగా, తన పేరుని ఎవరో పిలిచినట్లు అనిపిస్తుంది. అలా అనిపించడం ఇది మూడోసారి. “మొదటిది కాలేజీలో, రెండవది బస్సులో, మళ్లీ ఇప్పుడు. అసలు ఎవ్వరు నన్ను పిలుస్తుంది" అని ఆలోచిస్తుండగా ఈసారి మాత్రం నిజంగానే ‘రాధా’ అని ఆడ గొంతు వినిపిస్తుంది. రాధ నడవడం ఆపేస్తుంది. 


"నా వైపు తిరుగు. నీకో విషయం చెప్పాలి. " అని భీకరమైన నవ్వు వినిపిస్తుంది. 


రాధ హనుమాన్ చాలీసా చదువుతూ వెనక్కి తిరగకుండా వేగంగా నడుస్తుంది. తన వెనక గజ్జల శబ్దం కూడా వినిపించడంతో రాధ పరిగెడుతుంది. అలా పరిగెత్తుతూ ఊరి పొలిమేరని చేరుకుంటుంది. అక్కడ కాసేపు ఆగి ఊపిరి పీల్చుకుంటుంది. తన వెనక ఆ గజ్జల శబ్దం, నవ్వులు కూడా ఆగిపోతాయి. రాధ కొంచెం దూరంలో ఇళ్ళని చూస్తుంది. 


ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ మాత్రం వెలుగుతుంటాయి. రాధ చూపు పక్కనే ఉన్న మర్రి చెట్టు పైన పడుతుంది. అలా తను చూస్తూ ఉండగా, పైన వురి వేసుకుని, వేలాడుతున్న ఒక మగ మనిషి శవం తన వైపే చూస్తూ ఉండడంతో రాధ అలాగే బిగుసుకుపోతుంది. 

అరవాలనుకున్నా గొంతులో నుంచి మాటలు బైటకి రావు. అప్పుడే తన కుడి చెవిలో, "త్వరలో నువ్వు కూడా ఇలాగే చస్తావ్" అని వినిపిస్తుంది. 


రాధ తన కుడి వైపు చూస్తోంది. అక్కడ దూరంగా పోలాల మధ్యలో ఏదో ఒక ఆకారం ఎరుగుతూ, నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది. రాధ మళ్ళీ మర్రి చెట్టుని చూస్తుంది. అక్కడ శవం చూపు మాత్రం రాధనే చూస్తున్నట్టు ఉండడంతో, రాధ ఊర్లోకి వేగంగా నడుస్తుంది. ఊర్లో ఒక మనిషి కూడా మేల్కొని ఉండరు. రాధ ఊరి మధ్యలో ఉన్న తన ఇంటికి చేరుకుంటుంది. రాత్రి పడుకునే ముందు ఇంటి మెయిన్ గేట్ ని లాక్ చేసి పడుకోవడం తన తండ్రికి అలవాటు. 


లాక్ ని చూసిన రాధ, "నాన్నా! అమ్మా! నేను వచ్చాను, గేటు ఓపెన్ చెయ్, " అని అరుస్తుంది. కానీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో, రాధ ఇటు అటు చూసి మళ్ళీ అమ్మనాన్నలని పిలుస్తుంది. ఈసారి కూడా ఇంట్లో నుంచి ఎవరు ఎటువంటి రిప్లై ఇవ్వరు. 


రాధ అలా పిలుస్తూ ఉండగా దూరంగా పొలాలలో కనిపించిన ఆ ఆకారం, ఎర్రని కళ్ళతో తన వైపు మెల్లగా రావడం గమనించిన రాధ ఈసారి గట్టిగా, "నాన్నా! అమ్మా! గేటు ఓపెన్ చెయ్, అది నన్ను చంపేస్తుంది, గేటు ఓపెన్ చెయ్ నాన్నా, త్వరగా గేటు ఓపెన్ చెయ్", అని ఏడుస్తూ గేటుని గట్టిగా ఆడిస్తుంది.

=======================================================================

ఇంకా వుంది.. 

=======================================================================


శిల్పా నాయక్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

 విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

 


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు శిల్ప. నేను రచయిత్రిని అని చెప్పలేను. కానీ అప్పుడప్పుడు ఫాంటసీ, భయం కల్పించే కథలు రాస్తుంటాను. కథలు రాయడం ఇప్పుడే నేర్చుకుంటున్నా.


36 views0 comments

Comments


bottom of page