top of page

 ఇంతకీ దొంగ ఎవరు?

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #InthakeeDongaEvaru, #ఇంతకీదొంగఎవరు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


'Inthakee Donga Evaru - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 03/10/2024

'ఇంతకీ దొంగ ఎవరు?' తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



 "వదినా, ఈ కాసులపేరు ఎక్కడ చేయించేరు. డిజైన్ భలేగా ఉంది." అంటూ భారతమ్మ మెడలో ధగధగ మెరుస్తున్న బంగారు గొలుసును చూసి ముచ్చట పడింది బంధువు రమణి.


 "ఇదా, మా ఆడపడుచు దుబాయ్ నుంచి నా కోసం తెచ్చింది." గర్వంగా చెప్పింది మెడలో గొలుసు సవరించుకుంటు.


"బయటి కెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఈమద్య గొలుసు దొంగలు ఎక్కువయారు. రోడ్డు మీద నడుస్తుంటే వెనకనుంచి మోటరు సైకిలు మీద వచ్చి క్షణంలో గొలుసు తెంపుకుపోతున్నారు. మొన్న మా వీధిలో గుమ్మం ముందు ముగ్గులేస్తున్న పార్వతి గారిని ఎవరిదో అడ్రసు కావాలంటు

మోటరు సైకిలు ఆపిన ఇద్దరు కుర్రాళ్లు తలకి హెల్మెట్ పెట్టుకుని ఆవిడ మాట్లాడుతుండగానె మెడలో పుస్తెల తాడు తెంపుకు పారిపోయేరు." అంటూ పక్క వీధిలో ఉండే తాయారు భయపెట్టింది.


 "ఔనండీ, ఈమద్య బంగారు వస్తువులు పెట్టుకోవాలంటేనే భయమేస్తోంది. ఇంట్లో ఉంచుకోవాలంటె దొంగల భయం" అంటూ వంతపాడింది సరోజమ్మ.


 ఆడపడుచు కూతురు నిశ్చితార్థానికి వచ్చిన భారతమ్మ ఫంక్షను పూర్తయి భద్రంగా ఇంటికొచ్చేసరికి రాత్రయింది.


భారతమ్మ ఉదయం నుంచి ఇల్లంతా చిందర వందర చేసి చికాకు పడిపోతోంది. బీరువాలో బట్టలు బయట పడేసింది. అలమరలోని కొడుకు పుస్తకాలు నేలమీద విసిరేసింది. బెడ్ మీద పక్క బట్టలు చెల్లాచెదురు చేసేసింది. ఎంత వెతికినా రాత్రి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన నాలుగు తులాల బంగారు గొలుసు కనబడలేదు. 


నిన్ననే బేంక్ లాకర్ నుంచి ఫంక్షన్ కోసం నగలు తెచ్చింది. ఇంట్లో ఉంటే దొంగల భయం కొద్దీ బంగారు గాజులు, నాలుగు తులాల కాసులపేరు గొలుసు భద్రం కోసం బేంక్ లాకర్లో ఉంచవల్సి వచ్చింది. 


ఆడపడుచు కూతురు నిశ్ఛితార్దమని తెచ్చి రాత్రి పడుకునే ముందు తీసి చిన్న ప్లాస్టిక్ సంచిలో ఉంచి డ్రెస్సింగ్ టేబుల్ అరలో పెట్టింది. ఉదయం లేచి స్నానం చేసి మెడలో వేసుకుందామంటే ప్లాస్టిక్ కవర్తో సహా బంగారం గొలుసు కనబడక కోపంతో రంకెలేస్తోంది.


ఉదయం వాకింగుకెళ్లిన భర్త గుర్నాథం ఇంట్లో అడుగు పెడుతూనే అక్కడి వాతావరణం చూసి విస్తుపోయాడు. ట్యూషన్ కెళ్ళి వచ్చిన కొడుకు విశ్వనాథం తన పుస్తకాల సెల్ఫ్ లో పుస్తకాలు నేల మీద పడి ఉండటం చూసి ఏమైందో అర్ధం కాక అయోమయంలో పడ్డాడు. అసలు ఇంట్లో ఏమైంది తెలియక తండ్రి కొడుకులు తలలు బాదుకుంటున్నారు.


 అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టిన మొగుణ్ణి చూసి "ఏమండీ, రాత్రి డ్రెస్సింగ్ టేబుల్ అరలో పెట్టిన నా బంగారు గొలుసు చూసారా?" అంది.


 "లేదే, నేను బెడ్ మీద నుంచి లేస్తూనే బ్రష్ చేసుకుని వాకింగుకి వెళ్లేను.అప్పుడు నువ్వు బాత్రూమ్ లో ఉన్నావు. విశ్వం పెరట్లో ఉన్నాడు." సమాధానం చెప్పేడు గుర్నాథం.


 "మరేమైంది టేబుల్ మీద ఉంచిన బంగారం గొలుసు? ఏరా, విస్సూ నువ్వు చూసావా?" అసహనంగా అడిగింది.


 "లేదే, అమ్మా! నేను కూడా బ్రష్ చేసి పుస్తకాల బేగ్ తీసుకుని ట్యూషన్ కి వెళ్లేను. నీ గొలుసు సంగతి నాకు తెలవదు." అమాయకంగా సమాధానమిచ్చాడు.


 ఇంట్లోని నాలుగు తులాల బంగారు గొలుసు ఎలా మాయమైందో తెలియక అందరూ సతమతమవుతున్నారు.


 ఉదయం నుంచి ఇంటికి ఎవరెవరు వచ్చారో వాకబు చేస్తే పనిమనిషి రాములమ్మ ఊరెళుతున్నాను ఈరోజు పన్లోకి రానని చెప్పి వెళ్లిందట. పాలబ్బాయి గుమ్మంలో కొచ్చి గిన్నెలో పాలు పోసి పోయినాడు.


 కూరలమ్మి తోటకూర కట్ట ఇచ్చి వెళ్లింది. ఎవరూ ఇంట్లోకి వచ్చిన ఆనవాళ్లు లేవు. మరి బంగారు గొలుసు ఎలా మాయమైంది అంతుబట్టడం లేదు. చివరకు పోలీసు స్టేషన్లో కంప్లైంటు ఇవ్వవల్సి వచ్చింది.


పోలీసు సబినస్పెక్టరు సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగి గుర్నాథం ఇంటికి వచ్చి ఎంక్వయరీ మొదలెట్టారు.


 బంగారు వస్తువు ఎప్పుడు ఎక్కడ పెట్టింది, ఉదయం నుంచి ఎవరెవరు వచ్చింది వాకబు చేసారు. మరొకసారి ఇంట్లో పప్పులడబ్బాలు, పోపులగిన్నెలు కిచెన్ సామాన్లు దగ్గరుండి వెతికినా ఫలితం లేకపోయింది.


పనిమనిషి రాములమ్మను పిలిచి గట్టిగా భయపెట్టినా తనకేమీ తెలియదని, అసలు తను ఇంట్లోకే రాలేదని వీధి గుమ్మం నుంచే చెప్పి వెళ్లేనని గోడు వెళ్లబోసుకుంది.


కూరలమ్మి, పాలబ్బాయిని పిలిచి గదమాయించినా వాళ్లు కూడా తమకే పాపం తెలియదని గొల్లు మన్నారు. ఇనస్పెక్టరు ఎన్ని విధాల ప్రయత్నించినా అసలు దొంగలెవరో తేల్చలేకపోయారు. మళ్లీ ఇల్లంతా క్షుణ్ణంగా వెతికినా పోయిన బంగారు గొలుసు జాడ లేదు. సాద్యమైనంత తొందరలో దొంగను పట్టుకోడానికి ప్రయత్నిస్తానని చెప్పి వెళ్లాడు పోలీసు ఇనస్పెక్టరు.


మూడురోజులు గడిచిపోయాయి. బంగారు గొలుసు జాడ తెలియలేదు. రోజూ ఇల్లంతా వెతుకుతూనే ఉన్నారు.


ఇంతలో కిచెన్ నుంచి మురుగునీరు వెళ్లే డ్రైనేజి పైపు బ్లాక్ అయి గిన్నెలు కంచాలు కడిగిన వేస్టు వాటరు పోక షింక్ నిండిపోతుండటంతో గుర్నాథం డ్రైనేజి పైపులు క్లీన్ చేసే పనివాళ్లను పిలిచి దగ్గరుండి డ్రైనేజి పైపును శుభ్రం చేయిస్తున్నారు. కొంతసేపటికి పనివాళ్లు డ్రైనేజి పైపు నుంచి అడ్డుగా ఉన్న ఒక ప్లాస్టిక్ సంచిని పైకి లాగారు. వెంటనే అడ్డంకి తొలిగి మురుగు నీరు జోరుగా వప్రవహించి డ్రైనేజి పైపు క్లియర్ అయింది.


వెంటనే గుర్నాథం ఆ ప్లాస్టిక్ సంచిని విప్పించి పరిశీలించగా కనబడకుండా పోయిన బంగారు గొలుసు బయట పడింది. ఈ సంగతి తెల్సి భారతమ్మ ఆనందానికి అంతులేక పోయింది. ఇంతకీ ఆ వస్తువు డ్రైనేజి పైపులో కెలా వెళ్లిందని తర్జనభర్జన జరిగింది.


 చివరకు పరిశీలనలో తేలిందేమంటే భారతమ్మ రాత్రి పడుకోబోయే ముందు తన బంగారు గొలుసు ప్లాస్టిక్ సంచిలో ఉంచి డ్రస్సింగ్ టేబుల్ అరలో పెడదామనుకుని మతిమరపుతో కిచెన్లో ఫ్రిజ్ మీద పెట్టింది. అక్కడ కొడుకు విశ్వం కోసం ఉంచిన బజ్జీలు కూడా ఉన్నాయి.


 కిచెన్ డ్రైనేజి పైపులో నివాశముండే పందికొక్కు ఎలకలు రాత్రిళ్లు ఎంగిలి మెతుకుల కోసం పైకొచ్చి అందుబాటులో ఉండేవి లాక్కుపోతాయి. అలాగే ఫ్రిజ్ మీదున్న బజ్జీలతో పాటు బంగారు నగున్న ప్లాస్టిక్ సంచిని కూడా డ్రైనేజి పైపులోకి లాక్కుపోయాయి. అందువల్ల మురుగునీరు పోక నిండిపోయింది. డ్రైనేజి శుభ్రం చేసే పనివాళ్ల ద్వారా బంగారునగ బయట పడింది.


 భారతమ్మ తను బంగారు గొలుసున్న ప్లాస్టిక్ సంచిని డ్రెస్సింగ్ టేబుల్ అరలో పెట్టినట్టు భ్రమలో ఉంది. చివరకు బంగారు గొలుసు దొంగ పందికొక్కు ఎలకగా నిర్దారణ జరిగింది. బంగారు నగ ఎలా మాయమైందో తెలియక  తల బాదుకుంటున్న సబినస్పెరుకు ఈ విషయం తెల్సి తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.


 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

   కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comentários


bottom of page