top of page

ఇంటికి దీపం ఇల్లాలే

#IntikiDeepamIllale, #ఇంటికిదీపంఇల్లాలే, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Intiki Deepam Illale - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 07/08/2025

ఇంటికి దీపం ఇల్లాలే - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

“ఒరేయ్ రాంబాబు, మీ ఇంటికి మన పాత స్నేహితులం పదిమంది వస్తున్నాం. ఇంకో గంటలో మీ ఇంటికి చేరుకుంటాం. నువ్వు కొద్దిగా లొకేషన్ పెడతావా బాబు? మీ ఊరు అంత పెద్దగా ఉంది” అన్నాడు లోకేష్.


“ఏమిటి? అంత సడన్‌గా వస్తున్నారు. ఏమైనా విశేషం ఉందా?” అని అడిగాడు రాంబాబు.

“మాకు హైదరాబాద్ మొత్తం తిరిగి, ఏ హోటల్ కనిపిస్తే ఆ హోటల్‌లో తిని, సినిమాలు చూసి వారం రోజులు సరదాగా గడపాలని అనుకున్నాం. నీకు తెలుసుగా, మా చేతిలో అంత సొమ్ము ఉండదు అని. అందుకే నీ సహాయంతో ఎంజాయ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంతకి మా చెల్లెలు ఎలా ఉంది?” అన్నాడు లోకేష్.


“మీ చెల్లమ్మ బాగానే ఉంది కానీ మేము టూర్‌కి వెళదాం అనుకున్నాం. పోనీ, మీ ప్రోగ్రాం వచ్చే జన్మకి పోస్ట్‌ఫోన్ చేసుకోకూడదు” అన్నాడు రాంబాబు.


“అంటే మమ్మల్ని రావద్దు అని చెప్పడమేగా! మాకు సిగ్గులేదా? వద్దన్నా రావడానికి! అయితే ఆల్రెడీ బయలుదేరిపోయాం. ఇది నీకు తప్పదు. మా చెల్లమ్మ వండక్కరలేదు. మనం హాయిగా బయట హోటల్‌లో తిందాం. నువ్వు వంకలు పెట్టక, మీ ఆవిడకు చెప్పు” అన్నాడు లోకేష్.


“ఎవ్వరు ఫోన్?” అంది రాంబాబు భార్య తాయారు.


 “నాతోపాటు చదువుకున్న స్నేహితులు మా ఊరినుంచి ఫోన్ చేసారు” అన్నాడు.


“మీరు ఏమి చదివారు అని మీతో చదివిన వాళ్లు ఉన్నారా? టెన్త్ క్లాస్ చదివి ఇనుము అమ్మే బిజినెస్ చేస్తున్నారు. ఇంతటిదానికి మీతో చదివిన స్నేహితులే కూడానా?” అంది తాయారు.


“నేను మెడిసిన్ చదదామనుకున్నాను. నేను కాలేజీ చదువులు చదివితే నీ తింగరి మొహం చూసి పెళ్లి చేసుకోను అని, మీ నాన్న తన బిజినెస్‌లో నన్ను పార్ట్నర్‌గా చేర్చుకుని నిన్ను అంటగట్టాడు”, అన్నాడు కోపంగా రాంబాబు.


“అబ్బో! టెన్త్ ఫీజు కట్టడానికే మీ నాన్న దగ్గర డబ్బులు లేవు, ఇంకా మెడిసిన్ చదివేటటా?” అంది, మొహం ఇంకా తింగరిగా పెట్టి.


“చూడు, వాళ్లు వారం రోజులు ఉండి వెళ్ళిపోతారు. నువ్వు అనవసరంగా గొడవలు చెయ్యకు. చక్కగా నాలుగు రకాల వంటలు చేసి పెట్టు. దాంతో వారం అనుకున్న వాళ్లు రెండు మూడు రోజులలో వాళ్లే వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన ఇద్దరం పొట్లాడు కోవచ్చు. నా కోసం కొద్దిగా మర్యాదగా ఉండి, వాళ్ల ముందు పరువు దక్కించు. రోజూ నీళ్ల చారు, రుచి పచి లేని కూర వండకు”, అని వేడుకున్నాడు రాంబాబు తన పెళ్లాన్ని.


“ఎందుకు ఈ దొంగ వినయం? తిడుతూ రిక్వెస్ట్ అంటారు. మీ విషయం, మీ స్నేహితుల విషయం నాకు తెలియదు. హోటల్‌కి తీసుకెళ్లి తినిపించండి”, అంది కోపంగా.


‘చచ్చాం రా నాయనా, ఇది మొండికెత్తింది! వాళ్లు ఇంకో గంటలో వచ్చేస్తారు. ఇక్కడ నేను పెద్ద వ్యాపారవేత్త అని వస్తున్నారు. చివరికి ఇంటికి వచ్చిన వాళ్లకి కాఫీ కూడా ఇవ్వలేనా? ఎలా’ అనుకుంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు.


అక్కడ దృశ్యం చూసి సిగ్గుపడ్డాడు. తాను ఎంత పొరపాటు చేసానో అనుకున్నాడు. భార్య అద్దంలో చూసుకుంటూ ఏడుస్తోంది.


"ఛీ! నువ్వు నేను అన్న మాటలు సీరియస్‌గా తీసుకున్నావా? చూడు, నువ్వు అందంగా ఉండబట్టే నిన్ను నేను చేసుకున్నాను. ఏదో సరదాకి అన్నాను. నిన్ను ఉక్రోషంతో ఉండేలా చేస్తే ఎలా ఉంటుంది?" అంటూ భార్యని దగ్గరకి తీసుకుంటూ అన్నాడు.


"మీరు నాకు ఏమి చెప్పినా నేను నమ్మను. నా నుంచి మీరు ఏ కోఆపరేషన్ ఆశించవద్దు," అంది భార్య కోపంగా.


ఇంతలో బయట కారు హారన్ వినిపించడంతో, "బాబోయ్! మా వాళ్లు వచ్చేశారేమో!" అనుకుంటూ బయటకు వెళ్లాడు.


 "ఏరా! మా అంతట మేమే రావాల్సిందేగా! నువ్వు ఒక్కసారైనా 'రా' అని పిలవవా?" అంటూ లోకేష్, మిగతా గ్యాంగ్ పెట్టెలు పట్టుకుని చనువుగా లోపలికి వచ్చేసి, "ఏది మా చెల్లమ్మ? నీ మీద ఆవిడకి చాలా చెప్పాలి!" అన్నాడు.


‘ఇప్పటికే చస్తున్నాను, ఇంకా మా సంసారంలో నువ్వు ఏం నిప్పులు పోస్తావులే?’ అనుకున్నాడు రాంబాబు మనసులో.


"రండి అన్నయ్యలూ! నాకు ఇంతమంది అన్నయ్యలు ఉన్నట్టు మీ స్నేహితుడు ఒక్కసారికూడా చెప్పలేదు!" అంటూ లోపలికి ఆహ్వానం పలుకుతున్న భార్య తాయారుని చూసి ఆశ్చర్యపోయాడు రాంబాబు. 


అయిదు నిమిషాల క్రితం ఏడుస్తూ ఉన్న ఆవిడ, ఇప్పుడు ఇలా నవ్వుతూ తన స్నేహితుల్ని పలకరించడం చూసి,‘ఓహో! ఈ నటన ఒక్క ఆడవాళ్లకే స్వంతం!’ అనుకున్నాడు రాంబాబు.


రోజూ కొత్త కొత్త వంటలు చేసి ఆదరకొట్టేసింది తాయారు. ఉదయం టిఫిన్ తిని స్నేహితుల్ని వెంటేసుకుని హైదరాబాద్‌లో చూడాల్సిన వింతలు చూసి, లంచ్‌కి ఇంటికి చేరుకుని భోజనం చేసి, హాయిగా గెస్ట్‌హౌస్‌లో కబుర్లు చెప్పుకుంటూ వారం రోజులు అలా గడిపేశారు రాంబాబు స్నేహితులు.


"ఈసారి వచ్చే అప్పుడు మా వదినల్ని కూడా తీసుకురండి అన్నయ్యలూ, వాళ్లకి కూడా హైదరాబాద్ మొత్తం నేను చూపిస్తాను," అంది తాయారు రాంబాబు స్నేహితులతో.


"చెల్లమ్మా! మా రాంబాబు అదృష్టవంతుడు, నీలాంటి భార్య దొరకడం పెద్ద వరం. మా అందరికి ఏ లోటూ లేకుండా నవకాయ పిండివంటలు చేసి ఆదరించావు. అదే మా వదినలు అయితే... స్వంత అత్తమామలకే రానివ్వడం లేదు, ఇక భర్తవైపు స్నేహితుల్ని రానిస్తారా? మా రాంబాబుకి పట్టిన అదృష్టం నువ్వే!" అంటూ తెగ పొగిడేశారు రాంబాబు స్నేహితులు.


"నాదేముంది అన్నయ్యగారూ! అంతా మా వారి కృషి. వారంతా మంచివాళ్లే కాబట్టే మీలాంటి మంచి స్నేహితులు వున్నారు. కొంతమంది స్నేహితులు వచ్చారు అంటే తాగడం, తందనాలు ఆడడం చేసే వాళ్లు. కానీ మీరు అందరూ ఎంతో బుద్ధిమంతులుగా వున్నారు," అంది తాయారు.


స్నేహితుల్ని ట్రైన్ ఎక్కించి, ఇంటికి వచ్చిన రాంబాబు... అదే రోజున నగల షాపుకి వెళ్లి, మంచి గోల్డ్ నెక్లెస్‌ కొనుగొని భార్యని దగ్గరకు తీసుకుని,


 "థాంక్స్ తాయారు! పరువు దక్కించావు. నీకు ఇన్ని రకాల వంటలు వచ్చునని చెప్పలేదు, చెయ్యలేదు. ఏమైనా ఇంటికి దీపం ఇల్లాలే!" అంటూ ఆమె మెడలో ఆ నెక్లెస్ వేసాడు.


"వంటలు చెయ్యడం రాక కాదు. ఇప్పటికే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా వున్నారు. మీ ఆరోగ్యం నాకు మహాభాగ్యం," అంది తాయారు భర్తవైపు ప్రేమగా చూస్తూ.


భర్త పరువు కాపాడాలి అన్నా, చెడకొట్టాలి అన్నా... ఆ ఇంటి ఇల్లాలే.


                              శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree












Comments


bottom of page