ఇరుగు పొరుగు
- Addanki Lakshmi
- Aug 11
- 3 min read
#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #IruguPorugu, #ఇరుగుపొరుగు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Irugu Porugu - New Telugu Story Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 11/08/2025
ఇరుగు పొరుగు - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
సుజాత, రత్న ఇరుగు పొరుగువారు. భర్తలిద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తారు. ఇద్దరికీ
ఒక్కొక్క పిల్లవాడు, ఒకే వయసు వాళ్ళు.
సుజాత కొడుకు పేరు అరుణ్. రత్న కొడుకు పేరు తరుణ్.
ఇద్దరికీ ఆరేళ్ల వయసు. ఒకే స్కూల్లో చదువుతారు. ఉదయమే గేటు దగ్గరికి స్కూల్ బస్సు వస్తుంది.
సుజాత, రత్న వెళ్లి పిల్లలిద్దర్నీ బస్సులో ఎక్కిస్తారు. కనీసం ఆ గేటు దగ్గర అరగంట కబుర్లు చెప్పుకుంటారు.
సాయంత్రం మళ్ళా స్కూలు బస్సు వచ్చేసరికి వెళ్లి, వాళ్ళని ఇంటికి తెచ్చుకుంటారు.
సాయంత్రం కాలనీలో ఉన్న గార్డెన్ లోకి వెళ్లి కూర్చుంటారు ఇద్దరూ. అనేక విషయాలు కబుర్లు చెప్పుకుంటూ మంచి స్నేహంగా కలసిమెలసి ఉంటారు.
భర్తలిద్దరూ ఒకే కంపెనీ, వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహంగా ఉంటారు.
ఒకరోజు స్కూల్లో ఇంటర్వెల్లో పిల్లలు ఇద్దరు దెబ్బలాడుకున్నారు. ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకున్నారు. పుస్తకాలు చింపుకున్నారు.
టీచర్ వాళ్ళని సముదాయించి పంపింది.
ఇంటికి వచ్చి ఇద్దరూ వాళ్ళ అమ్మలతో కంప్లైంట్ చేశారు.
అంతే, అమ్మలకు కూడా కోపం వచ్చింది.
ఎవరైనా ఎదుటి పిల్లవాడు తప్పు చేశాడు అనుకుంటారు,
తన పిల్లాడు చాలా బుద్ధిమంతుడు అనుకుంటారు.
ఎందుకంటే పుస్తకాలు చింపేసుకున్నారు.
తన పుస్తకం ముందు అరుణ్ చింపాడని తరుణ్ చెప్పాడు.
తన పుస్తకం ముందర తరుణ్ చింపాడని అరుణ్ చెప్పాడు.
దాంతో తల్లులిద్దరికీ మనసులో కొంచెం ద్వేషం పుట్టింది. ఒకరి మీద ఒకరికి.
మర్నాడు స్కూల్ కెళ్లేటప్పుడు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.
పిల్లల ఇద్దరినీ స్కూలు బస్సుకి దింపేసి గబగబా వచ్చేసారు, ఎడ ముఖం పెడ ముఖం పెట్టుకుని.
వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే తరుణ్, అరుణ్ ని కొట్టి ఏడిపించాడని, ఈమె అనుకుంటుంది.
అరుణ్, తరుణ్ ని కొట్టాడని ఈమె అనుకుంటుంది. ఇద్దరికీ మనసుల్లో కోపం.
పిల్లలిద్దరూ కూడా మాట్లాడుకోవటం లేదు. ఒకళ్ళను చూసి ఒకళ్ళు కోపంగా మండిపడుతున్నారు.
సుజాత భర్త దగ్గర వాపోయింది.
"చూడండి, తరుణ్ మన పిల్లవాడి చొక్కా చింపాడు. పుస్తకాలు చింపేశాడు. చాలా అల్లరి వాడండి” అంటూ కంప్లైంట్ చేసింది, భర్త మూర్తితో,
"ఏదో పిల్లలు కొట్లాడుకుంటారు. మధ్యలో పెద్దవాళ్ళం మనం కలగ జేసుకోకూడదు. రేపొద్దున మళ్లీ వాళ్ళు మాట్లాడుకుంటారు" అంటూ ఆమెను ఓదార్చాడు.
అక్కడ రత్న కూడా భర్తకి కంప్లైంట్ చేస్తే ఆమె భర్త కూడా ఆమెకి చిన్నపిల్లల విషయంలో మనం కలగజేసుకోకూడదు. ఈరోజు కొట్లాడుకుంటారు రేపు ఆడుకుంటారు అని చెప్పాడు.
అయితే తల్లులు ఇద్దరి మనసుల్లో ఆ ద్వేషం పోలేదు.
ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొహాలు తిప్పుకుంటున్నారు.
ఎందుకంటే ఎవరి పిల్లలు అంటే వాళ్లకి ముద్దు గారం కదా. తమ పిల్లలదేం తప్పు లేదని అనుకుంటారు.
ఒక వారం రోజులు గడిచింది. ఇప్పుడు మళ్ళీ పిల్లలిద్దరూ కలిసిపోయారు. ఒకరోజు
స్కూల్ బస్సులోంచి ఇద్దరు నవ్వుకుంటూ దిగారు.
తల్లులిద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు. అప్పటికే వాళ్ళ మనసుల్లో కొంచెం పశ్చాత్తాపం మొదలైంది.
"సారీ సుజాత! పిల్లల గురించి మనం మాట్లాడుకోవడం మానేశాము" అంది రత్న.
"సారీ రత్న! నేను కూడా పిల్లల విషయంలో అనవసరంగా కలుగజేసుకుని నీతో మాట్లాడడం మానేశాను. నన్ను క్షమించు" అంది సుజాత ఆమె చేతులు పట్టుకొని.
ఇద్దరూ నిర్ణయించుకున్నారు, పిల్లల విషయంలో తాము ఎప్పుడూ కలగజేసుకోరాదని.. దానివల్ల అనవసరంగా పెద్దవాళ్ల స్నేహాలు కూడా దెబ్బతింటాయని తెలుసుకున్నారు.
సంఘంలో ఇరుగుపొరుగు అంటే స్నేహంగా ఉంటూ ఒకరి కష్టసుఖాల్లో ఒకళ్ళు పంచుకుంటూ ఉండాలి. దానివల్ల చిన్న పిల్లల్లో కూడా మంచి స్వభావాలు ఏర్పడతాయి, కలిసిమెలసి ఉండడం తెలుస్తుంది.
హామీ ఈ కథ నా స్వంతం
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,
Comments