నాన్నకి పెళ్ళిచూపులు
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #NannakiPellichupulu, #నాన్నకిపెళ్ళిచూపులు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Nannaki Pellichupulu - Telugu Comedy Story Written By Mohana Krishna Tata Published in manatelugukathalu.com on 12/03/2026
నాన్నకి పెళ్ళిచూపులు - తెలుగు హాస్య కథ
రచన: తాత మోహనకృష్ణ
"మన ఇంటికి ఒక ఆడదిక్కు రావాలి..పనులు చేసుకోలేకపోతున్నాను...పైగా ఒకటే కలలు కూడాను" అన్నాడు తండ్రి పరమేశం
"ఇన్నాళ్ళకి ఇంట్లో కొడుకు పెళ్ళి చెయ్యాలని ఆలోచన వచ్చినందుకు సంతోషం నాన్న!"
"పెళ్ళి నీకు కాదు...నాకు"
"ఇప్పుడా..? ఈ వయసులోనా...?"
"పెళ్ళి ఎప్పుడు చేసుకున్నా పెళ్ళనే అంటారు..అవసరం మరి"
"ఇదేదో అమ్మపోయినప్పుడే చేసుకోవచ్చుగా"
"అప్పట్లో నీ కోసం చేసుకోలేదు..ఇప్పుడా తప్పేటట్టులేదు"
"ఎందుకో?"
"నీకా ఉద్యోగ్యం సద్యోగం లేదు..నీకు పెళ్లి అయి, కోడలు వచ్చేలోపు... నేను పెళ్ళి చేసుకుంటే, ఇంట్లో వండిపెట్టడానికి, నా పనులు చూడడానికి ఒక మనిషి ఉంటుందిగా! నువ్వు ఇంకో సంవత్సరం ఉద్యోగం లేకుండా ఇలాగే ఉంటె, నీకు ఒక చిన్న తమ్ముడుని కూడా కని ఇస్తాను..ఆడుకోవడానికి.."
"అబ్బా...ఛ"
"అందుకే పెళ్ళిచూపులకు వెళ్తున్నా..నువ్వూ రా..నువ్వు నాకు పోటీ కాదులే.."
"గుట్టుగా పెళ్ళి చేసుకోకుండా...పెళ్ళిచూపు లెందుకో ఈ వయసులో"
"వయసు..వయసు అనకు...నాకు పదహారుకే పెళ్లైంది...నాది పెద్ద వయసేమి కాదు రా...నాకూ మళ్ళీ అన్ని ముచ్చట్లు కావాలి"
"దసరా బుల్లోడు లాగ ఉంటె అలాగే అనిపిస్తుంది మరి"
"నీకు నేను నాన్న అన్న మాటే గానీ...నా జుట్టు మెరవలేదు, చూడడానికి నీకు అన్నయ్యలాగ ఉంటానని బయట టాక్..తెలుసా?"
"అవును మరి! పదహారేళ్ళకే పెళ్ళి చేసుకుంటే, మరి యంగ్ గా ఉండరా? మాకు ముప్పయి దాటేస్తున్నా..ఇంకా మా పెళ్ళి ఊసే లేదుగా"
"అవును మరి...మా టైం లో అంతే"
"ఏమైనా అంటే, జాబ్ వచ్చిన తర్వాత పెళ్ళి అంటారు..మీకేమో అప్పట్లో మేనరికం రెడీగా ఉంది. పెద్దావిడ బకెట్ కిక్ చెయ్యడానికి రెడీ గా ఉందని..అడగకుండానే పదహారేళ్ళకే పెళ్ళి చేసేసారుగా మీకు. వన్ ఇయర్ లో నన్ను కనేసారు. మాకు అంత అదృష్టం లేదు కదా మరి!"
మర్నాడు పెళ్ళిచూపులలో...
"అమ్మాయి రెడీ అవుతోంది, వస్తుంది...ఈలోపు ఆ స్వీట్స్ టేస్ట్ చెయ్యండి"
"నాన్నా! స్వీట్స్ తీసుకోండి...లేకపోతే షుగర్ ఉందని అనుమానం వస్తుంది జాగ్రత్తా" అంటూ కొడుకు స్వీట్స్ తెగ లాగించేస్తున్నాడు
"నేనూ తింటాను.." అంటూ స్వీట్స్ ఒక పట్టు పట్టాడు పరమేశం
"ఇద్దరూ అన్నదమ్ముల్లా ఉన్నారే! పెళ్ళికొడుకు ఎవరో?" అంది పెళ్ళికూతురు దామిని కిటికీ లోంచి చూస్తూ
"నాకూ తికమకగా ఉందే" అంది లేఖ
"ఇందులో నాకు కాబోయే అల్లుడు ఎవరో కాస్త చెబుతారా?" అడిగాడు దామిని తండ్రి
"నేను పెళ్ళికొడుకుని. వీడే మా అబ్బాయి" అని పరిచయం చేసాడు పరమేశం
"నాకు మటుకు వాళ్ళ అబ్బాయి బాగా నచ్చాడే" అంది లేఖ
దామిని, లేఖ ఇద్దరు మంచి ఫ్రెండ్స్.
"మీ అమ్మాయి ఇంతవరకు పెళ్ళి ఎందుకు చేసుకోలేదో?"
"మా అమ్మాయి మ్యాథ్స్ లో వీక్...ఇంటర్ లో లెక్కల పరీక్ష పాసవడానికి ఐదేళ్ళు పట్టింది..డిగ్రీ లో ఒక పదేళ్ళు. అలా..అలా ముప్పయి దాటేసాయి"
పెళ్ళికూతురు వస్తుంది..
"నేను పెళ్ళికొడుకుతో విడిగా మాట్లాడాలి" అంది దామిని..
నేను మీకు నచ్చానా?"
"నచ్చారు...మీకేం తక్కువ? ఏజ్ ఎక్కువైన సినిమా హీరోయిన్ లాగ ఉన్నారు..అంత మాటకు వస్తే, సినిమా వాళ్ళు అంతా మీకన్నా లేట్ గా పెళ్ళి చేసుకుంటారు...అలా చూస్తే, మీది చైల్డ్ మ్యారేజ్ కిందే లెక్క"
"చమత్కారులే...!" నవ్వుతూ అంది దామిని
"మరి నేను నచ్చానా?"
"ఏజ్ ఎక్కువ అనుకుంటా...! బాగానే మేనేజ్ చేస్తున్నారు...రంగు అదీ వేసుకుని..ఓకే. ఏమైనా హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉన్నాయా?"
"షుగర్ ఉందండి...ఎవరికీ చెప్పకండీ...! అదీ మంచిదే లెండి..! షుగర్, స్వీట్స్ ఖర్చు తగ్గుతుంది."
"జోకులు బాగానే వేస్తున్నారు..మీ ఆవిడ ఎలా పోయింది పాపం?"
"అదొక శ్యాడ్ స్టొరీ లెండి...చెప్పనా?"
"పెద్దగా వద్దు..కొంచం షార్ట్ లో చెప్పండి"
"మా ఆవిడకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, ఒక రోజు స్వీట్స్ కొనడానికి వెళ్ళింది...కొన్న తర్వాత ఆ స్వీట్స్ లో షుగర్ తక్కువ ఉందని షాప్ వాడితో గొడవ పడింది. అంతే..! హార్ట్ ఎటాక్..అక్కడే పోయింది. మా ఆవిడకి నివాళిగా షుగర్ తినడం మానేసాను...మళ్ళీ మన ఈ స్వీట్ మొమెంట్ లో తింటున్నా అంతే!"
"మీరు..మీ కామెడీ నాకు బాగా నచ్చాయి" అంది దామిని
"మాకు పెళ్ళి ఇష్టమే, కానీ మీ అబ్బాయికి మా అమ్మాయి ఫ్రెండ్ లేఖ కి ఇచ్చి చెయ్యాలి. ఇద్దరు ఒకే ఇంటికి వెళ్తామని తెగ మొక్కుకున్నారంటా" అన్నాడు దామిని తండ్రి
"చూసావా నాన్నా! నేనే గెలిచాను. నా పెళ్ళి ఓకే అయితేనే, నీ పెళ్ళి ఓకే అయ్యింది.."
"శుభం" అనుకున్నారంతా
కథ సమాప్తం.
***********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ





Comments