top of page

జాతి కొఱకు..

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #జాతికొఱకు, #మృత్యువిహంగం

గాయత్రి గారి కవితలు పార్ట్ 27

Jathi Koraku - Gayathri Gari Kavithalu Part 27 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 17/06/2025

జాతి కొఱకు - గాయత్రి గారి కవితలు పార్ట్ 27 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


జాతి కొఱకు

(కవిత)


**********************************

అవనిలో కలిసి మెలిసి చేస్తున్నా మందరమావాసం.

జవజీవాలెన్నో విలసిల్లగా నద్భుత మైనదా దృశ్యం.


చెట్టు పుట్టలను నరికేయాలని నీ కెందుకీ ఆవేశం?

పెట్టెల నిండా ధనము లేదని మదిలో వ్యర్థమౌ ఆక్రోశం?


ప్రకృతిని నాశనం చేస్తే వస్తుంది నీ కెనలేని ఆయాసం.

సుకృతమైన పనులు చేయవోయి!అదేఅదే దైవాదేశం.


మించి పోయిన సమయంలో రాదు సోదరా!నీ కవకాశం.

మంచి పనులు సల్పవోయి!బద్ధకమా? ఎందుకింకాలస్యం?


జాతి కొఱకు నిలబడవోయి!కల్మషం బన్నది అదృశ్యం.

నీతి మంతుడవైతే నీ కీర్తిపతాకము తాకుతుందాకాశం.//


************************************

మృత్యువిహంగం.

(కవిత)















అదియొక మృత్యువిహంగం.

హృదయ విదారకమాదృశ్యం.


తప్పించు కోలేని నిస్సహాయత్వం.

ముప్పును కనుగొన లేని మూఢత్వం.


కాలిపోయినదా  భావి కలల సౌధం.

కోలుకోలేని బంధుమిత్రులా క్రందనం.


క్షణములో సర్వస్వం భస్మీపటలం.

కణకణమండే అగ్నికాహుతవటం.


మృత్యుదేవత కెందుకో పరిహాసం?

ప్రత్యక్ష నరకానికదే సాక్ష్యాధారం.


అమాయక విద్యార్థుల బలిదానం.

ప్రమాదాన్ని పసిగట్టలేని యంత్రాంగం.


అయ్యయ్యో!ఇదేదో జాతికి శాపం!

వ్రయ్యలయినట్టి ఆశావహధృక్పథం!


వేదాంతం వల్లిస్తూ మళ్ళీ ప్రయాణం.

ఆ దైవం మీద వేస్తాములే మన భారం.


మరల మరల జ్ఞాపకం చేసుకుంటుంటాం!

మరచి పోలేక మృతుల కంజలి ఘటిద్దాం!//



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Commenti


bottom of page