top of page

జెండా వందనం

Writer: Yasoda GottiparthiYasoda Gottiparthi

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #జెండావందనం, #JendaVandanam


Jenda Vandanam - New Telugu Poem Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 26/01/2025

జెండా వందనం - తెలుగు కవిత

రచన: యశోద గొట్టిపర్తి


భారత జాతికి గణతంత్ర దినం స్వాతంత్రోద్యమ దిగ్విజయం 

గాంధీ, నెహ్రూ, సుభాస్ బోస్ పోరాటం అమరవీరుల త్యాగఫలం 


భారతీయుల భవితవ్యం 

సిరుల నిండిన భరతభూమి

స్వేచ్ఛ పొందిన సమర భూమి లోకమందున నిలిచినదని భక్తితో భారతీయుడా పాడుకుందాం 


వేద పురాణాలు వెలసే నిచ్చట 

రామాయణ మహాభారతాలు రచించి రిచ్చట 

హిమాలయాలు ఈశ్వర, మానస సరోవరాలిచ్చట 

పాడిపంటలా పచ్చని పైరుల 

పల్లెటూర్ల పండుగలిచ్చట


పట్టణాల పారిశ్రామిక ప్రగతిచ్చట 

సకల మతాల సమాదరణ

సత్సంప్రదాయాల గౌరవమిచ్చట 

సద్గురువుల శాంతిబోధన లిచట 

దాస్య శృంఖలాల విముక్తితో 

సనాతన ధర్మమిచట 


జాత్యభిమానం పంచిన

 జాతీయ జెండా ఇచ్చట 

పర్యావరణ పరిరక్షణకై 

ప్రభుత్వ ప్రణాళిక లిచట 

ప్రపంచాగ్రగామిగా 

సదవగాహన సభలిచట 

రక్షించుకుందాం అంబేద్కర్ చేతి

లోని ఆశయ భాండాగారాన్ని


ఆకాంక్షల మహనీయుల 

మధనంలో ఉద్భవించిన జ్ఞానాన్ని 

నమ్ముకున్న నీతి సూత్రాలను 

పాటించి ప్రజాశక్తి యుతంగా

నల్దిక్కుల గర్వంగా ఎగరాలి

త్రివర్ణ జెండా మన జాతీయ జెండా


***


-యశోద గొట్టిపర్తి





 
 
 

Comments


bottom of page